Jump to content

అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

వికీపీడియా నుండి
(అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి
అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
ముందు చాడ వెంకట్ రెడ్డి
తరువాత వోడితల సతీష్ కుమార్
నియోజకవర్గం హుస్నాబాద్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1956
ములుకనూర్, భీమదేవరపల్లి మండలం, హనుమకొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ

అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో హుస్నాబాద్ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి తొలిసారి ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి పై వి.ల‌క్ష్మీకాంత రావు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి 2014లో తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి వోడితల సతీష్ కుమార్ చేతిలో ఓడిపోయాడు. ఆయనకు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా సిపిఐకి టికెట్ కేటాయించడంతో పోటీ చేసే అవకాశం రాలేదు. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రస్తుతం ముల్కనూర్‌ సహకార బ్యాంకు ఛైర్మన్‌గా ఉన్నాడు.[3] అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి 2019 ఏప్రిల్ 4న హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (25 September 2021). "రైతు బిడ్డకు సాక్షి పురస్కారం." Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
  2. "Andhra Pradesh Legislative Assembly". web.archive.org. 2008-03-14. Archived from the original on 2008-03-14. Retrieved 2022-04-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Andhra Jyothy (6 June 2021). "ఎకరాకు రూ.35 వేల రుణం" (in ఇంగ్లీష్). Retrieved 21 April 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)