అలుగుబెల్లి నర్సిరెడ్డి
అలుగుబెల్లి నర్సిరెడ్డి | |||
| |||
శాసనసభ మండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 2019- ప్రస్తుతం | |||
నియోజకవర్గం | నల్లగొండ – ఖమ్మం – వరంగల్ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చెర్లగూడ, శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా | 1960 ఆగస్టు 25||
రాజకీయ పార్టీ | యూటీఎఫ్ | ||
తల్లిదండ్రులు | నారాయణరెడ్డి, భాగ్యమ్మ | ||
జీవిత భాగస్వామి | నాగమణి | ||
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె | ||
నివాసం | పెద్ద అంబర్‌పేట్, హయాత్‌నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా |
అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, నల్లగొండ – ఖమ్మం – వరంగల్ జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యుడు.[1][2] ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు.
జీవిత విషయాలు
[మార్చు]నర్సిరెడ్డి 1960, ఆగస్టు 25న నారాయణరెడ్డి, భాగ్యమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలంలోని చెర్లగూడలో జన్మించాడు.[3] ఎంఏ, బిఎడ్ పూర్తిచేసిన నర్సిరెడ్డి ఉపధ్యాయ వృత్తిని చేపట్టి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశాడు.[4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]నర్సిరెడ్డికి నాగమణితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.
రాజకీయ విశేషాలు
[మార్చు]2019లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో నల్లగొండ – ఖమ్మం – వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి యూటీఎఫ్ అభ్యర్థిగా పోటీచేసి మొదటి ప్రాధాన్యత ఓట్లలో 8,976 ఓట్లు రాగా, రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం 9,021 ఓట్లతో గెలుపొందాడు.[5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ "శాసన మండలికి కొత్త సభ్యుల ఎన్నిక | Telangana Magazine". magazine.telangana.gov.in. Retrieved 2021-08-04.
- ↑ "MLC Results 2019: Narsi Reddy elected to Telangana council; Raghu Varma wins from North Andhra Teachers' seat | India News". www.timesnownews.com. Retrieved 2021-08-04.
- ↑ "Alugubelli Narsi Reddy | MLC | Nalgonda | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-06-30. Retrieved 2021-08-04.
- ↑ తెలంగాణ శాసనమండలి, ఎమ్మెల్సీలు (4 August 2021). "Members Information - Telangana-Legislature". telanganalegislature.org.in. Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
- ↑ "Narsi Reddy elected to council, defeats sitting MLC". Business Standard (in ఇంగ్లీష్). Retrieved 2021-08-04.
- ↑ https://telanganatoday.com/utf-candidate-wins-warangal-khammam-nalgonda-teachers-constituency/amp
- ↑ "UTF candidate wins Warangal-Khammam-Nalgonda Teachers' constituency". archive.telanganatoday.com. Retrieved 2021-08-04.[permanent dead link]