అల్యూమినియం పొటాషియం సల్ఫేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్యూమినియం పొటాషియం సల్ఫేట్
Aluminium potassium sulfate
పేర్లు
IUPAC నామము
Aluminium potassium sulfate dodecahydrate[1]
ఇతర పేర్లు
Potassium alum
Potash alum
Alum-(K)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10043-67-1]
పబ్ కెమ్ 24856
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:86463
SMILES [O-]S(=O)(=O)[O-].[O-]S(=O)(=O)[O-].[Al+3].[K+]
  • InChI=1S/Al.K.2H2O4S/c;;2*1-5(2,3)4/h;;2*(H2,1,2,3,4)/q+3;+1;;/p-4

ధర్మములు
KAl(SO4)2·12H2O
మోలార్ ద్రవ్యరాశి 474.3884 g/mol
స్వరూపం white small crystals
వాసన watery metallic
సాంద్రత 1.725 g/cm3
ద్రవీభవన స్థానం 92–93 °C (198–199 °F; 365–366 K)
బాష్పీభవన స్థానం 200 °C (392 °F; 473 K)
14.00 g/100 mL (20 °C)
36.80 g/100 mL (50 °C)
ద్రావణీయత insoluble in acetone
వక్రీభవన గుణకం (nD) 1.4564
ప్రమాదాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ లేదా పొటాషియం అల్యూమినియంసల్ఫేట్ ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం. ఈ సంయోగ పదార్థం పొటాషియం, అల్యూమినియం, సల్ఫర్, ఆక్సిజన్ మూలకాల సంయోగము వలన ఏర్పడినది. అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ రసాయన సంకేత పదం KAl (SO4) 2. అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ సాధారణంగా 12 జలాణువులు (dodecahydrate) కల్గిన దొడేకా హైడ్రేట్ అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ (KAl (SO4) 2•12H2O) లభిస్తుంది. 12 జలాణువులు కల్గిన సజల/నార్ద్ర అల్యూమినియం పొటాషియం సల్ఫేట్‌ను ఆలం (Alum/పటిక) అంటారు. అల్యూమినియం పొటాషియం సల్ఫేట్/పటికను నీటిని శుద్ధీకరణ చెయ్యుటకు, తోళ్ళను పదును పెట్టుటకు, రంగుల అద్దకం,[2] అగ్నినిరోధక దుస్తుల తయారీ,, బేకింగ్ పౌడర్‌లలో ఉపయోగిస్తారు. అలాగే సౌందర్యసామాగ్రిలైన డియోరెంట్లులలో, ఆప్టర్ షేవ్ లోషన్ గా ఉపయోగిస్తారు.[3]

ఇతర పేర్లు[మార్చు]

పొటాషియం ఆలం, పొటాష్ ఆలం, ఆలం (K),, పొటాషియం అల్యూమినియంసల్ఫేట్

భౌతిక లక్షణాలు[మార్చు]

అల్యూమినియం పొటాషియం సల్ఫేట్/ పోటాష్ ఆలం తెల్లని స్పటికరూపంలో లభించును. ఒకరకమైన లోహ వాసన కల్గి ఉంది.అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ అణుభారం 474.3884 గ్రాములు /మోల్.25 °C వద్ద పోటాష్ ఆలం సాంద్రత 1.725 గ్రాములు/సెం.మీ3. పోటాష్ ఆలం ద్రవీభవన స్థానం 92 to 93 °C (198 to 199 °F; 365 to 366K) .పోటాష్ ఆలం బాష్పీభవన స్థానం 200 °C (392 °F;473K) .పోటాష్ ఆలం నీటిలో కరుగుతుంది. 100 మి.లీ నీటిలో 20 °C వద్ద 14.0 గ్రాములు, 50 °C వద్ద గ్రాముల పోటాష్ ఆలం కరుగుతుంది. పోటాష్ ఆలం అసిటోన్ లో కరుగదు. అల్యూమినియం పొటాషియం సల్ఫేట్/ పోటాష్ ఆలం వక్రీభవన సూచిక 1.4564 .

అల్యూమినియం పొటాషియం సల్ఫేట్/పొటాషియం ఆలం చదునైన అంచులున్నఅష్టభుజాకృతి స్పటికసౌష్టవం కల్గిఉన్నది.లిట్మస్ పేపరును పోటాష్ ఆలం కషాయము (astringent) ఎరుపు రంగుకు మార్చును.ఎరుపుగా మరే వరకు వేడిచేసిన గుల్లతనంకలిగిన, నలిస్తే చూర్ణము అయ్యేరూపం కలిగిన ‘’’కాల్చినపటిక’’’ ఏర్పడును. 92°C(198°F) వరకు వేడిచేసిన, అణువులో ఉన్న స్పటికజలంలోద్రవీకరణ చెంది కరిగిపోతుంది. ‘’’తటస్థ ఆలం’’’ను పొందుటకై సోడియం బై కార్బోనేట్ ను పోటాష్ ఆలం ద్రవానికి ఎక్కువ ప్రమాణంలో చేర్చినఅల్యుమిన అపక్షేపముగా వేరుపడును.

ఖనిజరూప లభ్యత[మార్చు]

సల్ఫైడ్ ఖనిజాలు, పొటాషియం కలిగిన ఖనిజాలు ఆక్సీకరణచెందటం వలనఏర్పడును. గతంలోఅగ్ని సల్ఫర్ కలిగిన అగ్నిపర్వత సేడిమేంటలు వనరు అయిన అలునైట్ (alunite) [4] నుండి అల్యూమినియం పొటాషియం సల్ఫేట్‌ను ఉత్పత్తి చేసేవారు. ఈ ఖనిజ ప్రాంతాలను, ఇటలీఆరిజోనా, పిలిప్పిన్స్, శాంతాక్రజ్ కంట్రీలలో గుర్తించారు.

ఉపయోగాలు[మార్చు]

రసాయన పరిశ్రమలలో[మార్చు]

  • తోళ్ళపరిశ్రమలలో తోళ్ళను పదును చెయ్యుటకు ఉపయోగిస్తారు.
  • అద్దకపు రంగులలోవర్ణాకర్షణి, వర్ణస్థాపకముగా ఉపయోగిస్తారు
  • ద్రవాలలోని మడ్డి/ కలుషమైనపదార్థాలను (turbid) లను తొలగించుటకు, సరస్సులో నీటిలోని కలిషిత పదార్థాలను అవక్షేపితము చెయ్యుటకు ఉపయోగిస్తారు.[5]
  • వస్త్ర ఉత్పత్తులలో అగ్ని నిరోదినిగా (fire retardant) ఉపయోగిస్తారు.

వైద్యపరమైన వినియోగం[మార్చు]

  • కండరాలను కుంచింపజేసే ఔషధం (astringent) /రక్తస్రావావరోధకమైన మందు (styptic), కుళ్ళిపోకుండ చేసెడుఅంటిసెప్టిక్ (antiseptic) గా ఉపయోగిస్తారు.
  • శరీర దుర్వాసనునకు కారణమైన బాక్టీరియా పెరుగుదల నివారించుట వలన స్వాభావిక దుర్వాసన నివారిణి (natural deodorant) గా పనిచేయును.[3]
  • గడ్డం చేసిన తరువాత ముఖానికి పూయు ధావనౌషధము (lotion) గా ఉపయోగిస్తారు.
  • తెగటం వలన కలిగిన చిన్నగాయలవలన కలుగు రక్త స్రావాన్ని ఆపుటకు, అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ ఉపయోగిస్తారు.
  • ఆయుర్వేదంలో పితకారిగా ఉపయోగిస్తారు.
  • చైనా సంప్రదాయ వైద్యంలో మింగ్ ఫాన్ (ming fan) అంటారు.[6]

వంటలలో[మార్చు]

  • ఎక్కువ ఉష్ణోగ్రత వరకు వేడి చెయ్యు ఆహార పదార్థాలలో బేకింగ్ పౌడర్ తో పాటు అదనంగా రెండవ లివేనింగ్ పేజ్ గా వాడెదరు.

విషప్రభావ లక్షణాలు[మార్చు]

చర్మాన్ని తాకినపుడు స్వల్పంగా ఇరిటేసన్ కల్గించును.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. "Aluminium potassium sulfate dodecahydrate". ChemExper. Retrieved 2013-04-19.
  2. http://www.britannica.com/EBchecked/topic/17885/alum
  3. 3.0 3.1 Helmenstine, Anne Marie. "What is Alum?". About.com. Archived from the original on 2013-04-14. Retrieved 2013-04-19.
  4. Bottomley (2010) p. 35
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-21. Retrieved 2015-10-27.
  6. http://tcm.health-info.org/Herbology.Materia.Medica/mingfan-properties.htm Archived 2008-09-20 at the Wayback Machine Uses of Alum in Traditional Chinese Medicine