అల్లాబక్షి బేగ్ షేక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అల్లా బక్షి బేగ్ షేక్‌ ప్రముఖ రంగస్థల రచయిత, నటుడు,

బాల్యము

[మార్చు]

అల్లా బక్షి బేగ్ షేక్‌ గుంటూరు జిల్లా బాపట్లలో 1952 సెప్టెంబర్ 12న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ మస్తాన్‌ బీ, ఖాశిం బేగ్. చదువు: బి.ఏ.

వృత్తి

[మార్చు]

జర్నలిస్ట్‌, నాటక రచయిత, నటుడు. కలంపేరు ఆనంద బక్షి. డా|| కొర్రపాటి గంగాధార రావు, కె.యస్‌టి శాయిల ప్రేరణ, ప్రోత్సాహంతో 1978 నుండి నాటకాలు రాయడం, నటించడం, ఆరంభించారు.

రచనా వ్యాసంగము

[మార్చు]

1980లో తొలిసారిగా రాసిన 'సంఘర్షణ' (నాటకం) 1983 ఆగస్టు 2న 16 భాషల్లోకి అనువాద మై ఆకాశ వాణిద్వారా జాతీయ నాటకంగా ప్రసారమైంది. కవితలు, వ్యాసాలు, కథానికలు వివిధ పత్రికలలో ప్రచురితం. కవితల్లో స్నేహదీపం, ఎవరు దేవుడు? గుర్తింపు తెచ్చాయి. 1994లో రాసిన 'కార్మికులారా ఏకంకండి' నాటకం ప్రజాదారణ పొందింది. తీరం చేరని కెరటాలు, ఛైర్మన్‌ చంద్రయ్య ఉత్తమ నాటికలుగా ఎంపికయ్యాయి. 23 రేడియో నాటికలు, 8 నాటకాలు రాశారు. అన్ని ప్రదర్శనలు, ప్రసారం అయ్యాయి.

పురస్కారాలు

[మార్చు]

వీరు ఉత్తమ రచయితగా, నటుడిగా పలు విజయాలను నమోదు చేసుకున్నారు. నటుడిగా, నాటక రచయితగా సాహితీ-సాంస్కృతిక సంస్థలచే సత్కరించ బడ్డాడు.

లక్ష్యము

[మార్చు]

సామాజిక రుగ్మతలకు పరిష్కారాలు చూపడం వీరి లక్ష్యము.

మూలాలు

[మార్చు]

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 43