అల్లూరి కృష్ణం రాజు
అల్లూరి కృష్ణంరాజు రాజోలు శాసనసభ నియోజకవర్గం నకు ప్రాతినిథ్యం వహించిన శాసనసభ్యుడు. అతను 2004 నుంచి 2009 వరకు రాజోలు నుంచి శాసనసభ్యుడిగా పనిచేశాడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]అతను 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీకి చెందిన అల్లూరి వెంకట సూర్యనారాయణరాజు చేతిలో ఓడిపోయాడు. అయితే 2004లో మళ్లీ పోటీ చేసి సూర్యనారాయణరాజుపై విజయం సాధించాడు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అతని భార్య మల్లేశ్వరి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యురాలిగా పనిచేస్తున్నది. అతను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. 2009 ఎన్నికల్లో తన అనుచరుడు ప్రస్తుత ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలుపొందేలా చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.[2]
అతనికి శ్రీనివాస్ రాజు అనే కుమారుడు, కృష్ణకుమారి, విజయ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి కుమారుడు వ్యాపార, పరిశ్రమల రంగంలో పనిచేస్తున్నాడు. కృష్ణంరాజు స్థానిక ఎ.ఎఫ్.టి.డి విద్యాసంస్థకు రెండు దశాబ్దాలుగా చైర్మన్‌గా పనిచేశాడు. కొన్నేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వృద్ధాప్య వ్యాధితో 2023 జూలై 12న మరణించాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Andhra Pradesh Assembly Election Results in 2004". Elections in India. Retrieved 2023-07-15.
- ↑ "వైసీపీలో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు కన్నుమూత". Samayam Telugu. Retrieved 2023-07-15.
- ↑ "Former Razole MLA Alluri Krishnam Raju passes away". ap7am.com (in ఇంగ్లీష్). 2023-07-13. Retrieved 2023-07-15.