Jump to content

అల్సూర్ సరస్సు

వికీపీడియా నుండి
అల్సూర్ సరస్సు
హలాసురు సరస్సు
అల్సూర్ సరస్సు is located in Karnataka
అల్సూర్ సరస్సు
అల్సూర్ సరస్సు
ప్రదేశంబెంగళూరు, కర్ణాటక
అక్షాంశ,రేఖాంశాలు12°58′53.3″N 77°37′9.17″E / 12.981472°N 77.6192139°E / 12.981472; 77.6192139
రకంనిల్వ నీరు
సరస్సులోకి ప్రవాహంవర్షపు నీరు, సిటీ డ్రైనేజీ
వెలుపలికి ప్రవాహంనాలా
పరీవాహక విస్తీర్ణం1.5 కి.మీ2 (0.6 చ. మై.)
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం50 హె. (123.6 ఎకరం)
సరాసరి లోతు19 అ. (5.8 మీ.)
గరిష్ట లోతు58 అ. (18 మీ.)
ఉపరితల ఎత్తు931 మీ. (3,054.5 అ.)

కర్ణాటకలో గల బెంగుళూరులోని అతి పెద్ద సరస్సులలో ఒకటైన అల్సూర్ సరస్సు నగరానికి తూర్పు వైపున ఉంది. దీనిని హలాసురు సరస్సు అనికూడా అంటారు. ఇది మహాత్మాగాంధీ రోడ్డుకు దగ్గరగా ఉన్న హలాసురు అనే ప్రాంతంలో ఉంది. ఈ ఊరు పేరు మీదుగా దానికి ఈ పేరు వచ్చింది. ఇది 50 హెక్టార్లలో (123.6 ఎకరాలు) విస్తీర్ణంలో విస్తరించి, అనేక ద్వీపాలను కలిగి ఉంది.[1][2]

చరిత్ర

[మార్చు]

ఈ సరస్సు కెంపే గౌడ కాలం నాటిదని చరిత్ర చెబుతుంది. నాటి సరస్సును అప్పటి బెంగళూరు కమిషనర్ సర్ లెవిన్ బెంతమ్ బౌరింగ్ సృష్టించారు. సరస్సులో కొంత భాగాన్ని మద్రాస్ ఇంజనీర్ గ్రూప్, మిగిలిన భాగాన్ని బ్రూహత్ బెంగళూరు మహానగర సంస్థలు పరిరక్షిస్తున్నాయి.[3]

విస్తీర్ణం

[మార్చు]

1.5 చదరపు కిమీల (0.6 చదరపు మైళ్ళు) పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉన్న ఈ సరస్సును మూడు డ్రెయిన్ల ద్వారా వివిధ ప్రదేశాల నుండి పర్యవేక్షిస్తున్నారు; మొదటి డ్రెయిన్ మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ (MEG) సెంటర్ (ఆర్మీకి చెందినది), రెండవ డ్రెయిన్ జీవనహళ్లి నుండి, మూడవ డ్రెయిన్ దొడ్డిగుంట నుండి ఉన్నాయి. కట్టారియమ్మ తోట, గోదండప్ప తోట, మునివెంకట్టప్ప తోట, ముత్తమ్మ తోట, మునియమ్మ తోట, కెంపురాయన గార్డెన్, న్యూ కార్పొరేషన్ కాలనీ ఈ ప్రాంతాలన్నీ సరస్సు నుండి 1 కిమీ (0.6 మైళ్ళు) దూరంలో ఉన్నాయి.[4][5][2]

అభివృద్ధి

[మార్చు]

ఈ కింది నియమాలను సరస్సు తక్షణ పునరుద్ధరణ కోసం నియమించారు.[4][5][2]

  • సరస్సు ఆక్రమణలను ఆపాలి.
  • సరస్సు చుట్టూ మురికి నీటిని తీసివేసి, సరస్సులోకి ప్రవహించే నీటిని ముందే శుద్ధి చేయాలి.
  • చేపలు, నీటి మొక్కలను పెంచాలి.

మూలాలు

[మార్చు]
  1. B. L. Rice (February 2001). Gazetteer of Mysore. p. 71. ISBN 9788120609778. Retrieved 2017-02-23.
  2. 2.0 2.1 2.2 "Halasuru Lake: Clogged lung space". 2009-02-02. Archived from the original on 2009-02-02. Retrieved 2017-02-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "STATUS OF ULSOOR LAKE WATER QUALITY BETWEEN 1996-97". Ces.iisc.ernet.in. Retrieved 2017-02-23.
  4. 4.0 4.1 "Ulsoor Lake restoration on schedule". The Hindu. 18 April 2003. Archived from the original on 30 July 2003. Retrieved 11 November 2018.
  5. 5.0 5.1 "3. Study Area". Wgbis.ces.iisc.ernet.in. Retrieved 2017-02-23.