అవసరాల రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అవసరాల రామారావు, రాజమండ్రికి చెందిన న్యాయవాది, భారతీయ జనసంఘ్ పార్టీ అధ్యక్షుడు.[1] [2]ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు. 1958లో ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి ఏర్పడినప్పుడు సర్కారు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు.

1961లో లక్నో సమావేశంలో జనసంఘ్ తొలిసారిగా దక్షిణాదికి చెందిన వ్యక్తి, అవసరాల రామరావును అధ్యక్షుడిగా ఎన్నుకున్నది. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా, దక్షిణాదిన జనసంఘ్ విస్తరణకు రామారావు పెద్దగా దోహదపడలేదు. 1961 నవంబరులో, జనసంఘ్ రామారావు అధ్యక్షతన మూడవ సార్వత్రిక ఎన్నికలలో పార్టీ యొక్క వ్యూహాన్ని ఖరారు చేయటానికి బెనారస్లో సమావేశమైంది. రామారావు నేతృత్వంలో జనసంఘ్ 1962 సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసింది. ఆ ఎన్నికల్లో రామారావు రాజమండ్రి నియోజకవర్గం నుండి లోక్‌సభకు పోటీచేసి, చిత్తుగా ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]