రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాజమండ్రి లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°0′36″N 81°48′0″E మార్చు
పటం

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గ రూపురేఖలు బాగా మారిపోయాయి. పునర్వ్యవస్థీకరణకు పూర్వమున్న బూరుగుపూడి, కడియం, రామచంద్రాపురం ఆలమూరు శాసనసభా నియోజకవర్గములు తొలిగిపోయి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అదనంగా రెండు శాసనసభా నియోజకవర్గములు వచ్చిచేరాయి. దీనితో జిల్లాకు చెందిన 4 శాసనసభా నియోజకవర్గములు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 3 శాసనసభా నియోజకవర్గములు మొత్తం 7 శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి.

శాసనసభా నియోజకవర్గాలు

[మార్చు]
  1. అనపర్తి: ఇది తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలలో విస్తరించివుంది.
  2. కొవ్వూరు
  3. గోపాలపురం (SC): ఇది తూర్పు గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలలో విస్తరించివుంది.
  4. నిడదవోలు
  5. రాజమండ్రి గ్రామీణ
  6. రాజమండ్రి సిటీ
  7. రాజానగరం

నియోజకవర్గపు గణాంకాలు

[మార్చు]
  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 17,87,158 [1]
  • ఓటర్ల సంఖ్య: 11,77, 031.
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 20.11%, 0.77%.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]

మూలం:[2][3]

సంవత్సరం విజేత పార్టీ
2019 మార్గాని భరత్‌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
2014 మాగంటి మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ
2009 ఉండవల్లి అరుణ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
2004
1999 యస్.బి.పి.బి.కె. సత్యనారాయణ రావు భారతీయ జనతా పార్టీ
1998 గిరజాల వెంకటస్వామి నాయుడు
1996 చిట్టూరి రవీంద్ర భారత జాతీయ కాంగ్రెస్
1991 కేవీఆర్ చౌదరి తెలుగుదేశం పార్టీ
1989 జూలూరి జమున భారత జాతీయ కాంగ్రెస్
1984 చుండ్రు శ్రీ హరి రావు తెలుగుదేశం పార్టీ
1980 యస్.బి.పి.పట్టాభి రామారావు భారత జాతీయ కాంగ్రెస్
1977
1971
1967 డి.ఎస్.రాజు
1962
1957
1952 కానేటి మోహనరావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
నల్లా రెడ్డి నాయుడు సోషలిస్టు పార్టీ

2004 ఎన్నికలు

[మార్చు]
2004 ఎన్నికలలో విజేత,సమీప ప్రత్యర్థుల ఓట్ల వివరాలు
అభ్యర్థి పేరు (పార్టీ) పొందిన ఓట్లు
ఉండవిల్లి అరుణకుమార్ (కాంగ్రెస్)
  
413,927
కంటిపూడి సర్వారాయుడు (బి.జె.పి)
  
265,107
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున మురళీమోహన్ పోటిచేస్తున్నాడు.[4] కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీలో ఉన్నాడు.[5]

2009 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం

  ఉండవిల్లి అరుణ కుమార్ (35.12%)
  మురళీ మోహన్ (34.91%)
  కృష్ణంరాజు (24.90%)
  ఇతరులు (5.07%)
భారత సాధారణ ఎన్నికలు,2004:రాజమండ్రి
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ ఉండవిల్లి అరుణకుమార్ 3,57,449 35.12
తెలుగుదేశం పార్టీ మురళీమోహన్ 3,55,302 34.91
ప్రజా రాజ్యం పార్టీ కృష్ణంరాజు 2,53,437 24.90
లోక్ సత్తా పార్టీ డా.పాలడుగు చంద్రమౌళి 13,418 1.32
భారతీయ జనతా పార్టీ సోము వీర్రాజు 7,123 0.70
బహుజన సమాజ్ పార్టీ వజ్రపు కోటేశ్వరరావు 5,805 0.57
మెజారిటీ 2,147
మొత్తం పోలైన ఓట్లు
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing

2014 ఎన్నికలు

[మార్చు]
భారత సార్వత్రిక ఎన్నికలు, 2014: రాజమండ్రి
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ మాగంటి మురళీమోహన్ 630,573 54.62
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ బొడ్డు వెంకటరమన చౌదరి[6] 463,139 40.12
భారత జాతీయ కాంగ్రెస్ గుర్గేష్ కందుల 21,243 1.84
Jai Samaikyandhra Party ముళ్ళపూడి సత్యనారాయణ 11,718 1.02
BSP మర్రి బాబ్జీ 6,079 0.53
NOTA None of the Above 7,456 0.65
మెజారిటీ 1,67,434 14.50
మొత్తం పోలైన ఓట్లు 1,154,381 81.22 +0.50
తెదేపా gain from INC Swing

మూలాలు

[మార్చు]
  1. సాక్షి దినపత్రిక
  2. EENADU (13 May 2024). "రాజమహేంద్రవరం". Archived from the original on 13 May 2024. Retrieved 13 May 2024.
  3. Prajasakti (24 March 2024). "చైతన్య ఝురి.. రాజమహేంద్రి ఎంపీ బరి." Archived from the original on 13 May 2024. Retrieved 13 May 2024.
  4. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
  5. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  6. Sakshi (18 April 2014). "బరిలో విద్యాధికులు". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.