కానేటి మోహనరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కానేటి మోహనరావు
కానేటి మోహనరావు


పదవీ కాలం
1952-57
తరువాత దాట్ల సత్యనారాయణ రాజు
నియోజకవర్గం రాజమండ్రి

వ్యక్తిగత వివరాలు

జననం (1928-12-12) 1928 డిసెంబరు 12 (వయసు 95)
దిండి, తూర్పు గోదావరి జిల్లా
మరణం జూన్ 14, 2014
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ
జీవిత భాగస్వామి సూర్యకాంతమ్మ
సంతానం 2; 1 కుమారుడు, 1 కుమార్తె
మతం నాస్తికుడు
వెబ్‌సైటు [1]

కానేటి మోహనరావు (డిసెంబర్ 12, 1928- జూన్ 14, 2014) కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి 1952 సంవత్సరంలో 1వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.[1]

ఇతడు 1925 డిసెంబరు 12 తేదీన తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు మండలానికి చెందిన దిండి గ్రామంలో జన్మించారు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం దిండి గ్రామంలోను, ఆ తర్వాత సఖినేటిపల్లి, నర్సాపూర్ లలో జరిగింది. ఇతడు సూర్యకాంతమ్మను వివాహం చేసుకోగా వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలిగారు.

వీరు 1937 నుండి తాలూకా, జిల్లా కమ్యూనిస్ఠు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని వ్యవసాయ కూలీల ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. నిజాం పరిపాలనను వ్యతిరేకించినందుకు 1942 నుండి 1945 మధ్య రాజోలు, అమలాపురం, రాజమండ్రి, రామచంద్రపురం, ఏలూరులలో కఠిన కారాగార శిక్షను అనుభవించారు. కడలూరు జైలులో ఇతనితో పాటు నీలం సంజీవరెడ్డి కూడా శిక్ష అనుభవించారు. 1952లో చైనాలో జరిగిన ప్రపంచ శాంతి సమావేశాలకు హాజరయ్యారు. 1962లో కమ్యూనిస్ట్‌ పార్టీ చీలిపోవడంతో 8వేల ఓట్లతో ఓడపోయారు. అలాగే 1967లో కూడా ఓటమిపాలయ్యాను. వీరు కానేటి వరహాలరావును తన రాజకీయ గురువుగా పేర్కొన్నారు.

తొలి పార్లమెంటు వజ్రోత్సవాల నేపథ్యంలో 2012 లో వీరిని భారత ప్రభుత్వం సన్మానించింది.[2]

ప్రస్తుతం కాకినాడ దగ్గర్లోని మట్లపాలెం గ్రామం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలోనున్న చిన్నపల్లెలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.

మూలాలు[మార్చు]