దాట్ల సత్యనారాయణ రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాట్ల సత్యనారాయణ రాజు
దాట్ల సత్యనారాయణ రాజు

దాట్ల సత్యనారాయణ రాజు


పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గము రాజమండ్రి లోక సభ నియోజక వర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఆగష్టు 28 1904
పోడూరు, పశ్చిమ గోదావరి జిల్లా
మరణం 1973
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సంతానము 4; ఒక కుమారుడు , ముగ్గురు కుమార్తెలు
మతం హిందూ
వెబ్‌సైటు [1]
పోడూరు ప్రధాన రహదారిపై కల కల్నల్ రాజు విగ్రహము

కల్నల్ డి.యస్.రాజుగా ప్రసిద్దుడైన దాట్ల సత్యనారాయణ రాజు ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మరియు భారత పార్లమెంట్ సభ్యుడు.

జననం[మార్చు]

పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు గ్రామం ఈయన జన్మస్థలం. ఈయన 1904, ఆగష్టు 28 న జన్మించాడు.

బాల్యము-విద్యాభ్యాసము[మార్చు]

ఈయన తలిదండ్రులు దాట్ల రామఛంద్రరాజు, అచ్చయ్యమ్మ. ఈయన ప్రాథమిక, ఉన్నత విద్యలు స్వగ్రామమైన పోడూరు లోనే పూర్తి అయినవి. తదనంతరం 1924 లో విశాఖపట్టణం లో ఆంధ్ర వైద్య కళాశాల మొదటి బాచ్ ఎమ్.బి.,బి.యస్.లో చేరి 1929 లో విద్య పూర్తి చేసుకొని అదే సంవత్సరము లండన్ లో ప్రసిద్ధి చెందిన రాయల్ కాలేజీలో మొదట ఫిజీషియన్ గా ఉత్తీర్ణుడైన తరువాత ఇటలీ లో వి.యన్.ఐ లో టి.బి. స్పెషలైజ్ చేసాడు.

తదనంతరం ఎల్,ఆర్,సి,పి,యమ్,ఆర్,సి,యస్ ఇంగ్లండులో పూర్తి చేసి తదనంతరం ఆర్,సి,సి,పి మేజర్ ఐ యమ్ యస్ రిటైర్డు ఎక్ష్ కల్నల్ ఐ ఎన్ ఏ డైరెక్టర్ మరియు కన్సల్టింగ్ ఫిజీషియన్ గా 1932 లో స్వదేశానికి తిరిగి వచ్చాడు. తదనంతరం కొంతకాలం పోడూరు లోనే ప్రాక్టీసు చేసి 1934 లో ఇండియన్ మెడికల్ సర్వీసులో ఉధ్యోగము చేపట్టినాడు. ఈయన భారత సైన్యంలో 1934 నుండి 1945 వరకు మేజర్ గా ఉన్నాడు.

ఆయన కాకినాడ లో గల మెడికల్ ఎడ్యుకేషన్ సొసైటీకి వ్యవస్థాపక అధ్యక్షుడు.1958 లో కాకినాడ లో గల రంగరాయ మెడికల్ కళాశాల ఈయన ఆధ్వర్యంలో స్థాపించబడింది. ఈ కాలేజి ప్రధాన లక్ష్యం వైద్య విద్యను అభివృద్ధిచేయుట, వైద్య పరిశోధనలు చేయుట మరియు స్వచ్ఛందంగా వైద్య సహాయాలు చేయుట. ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఈ కాలేజీ స్థాపనకు 5 లక్షల రూపాయలు విరాళంగా యిచ్చిరి. ఆయన అభ్యర్థనపై ఈ కళాశాల పేరును పెండ్యాల రంగారావు, జమీందారు మరియు ముళ్లపూడి వెంకట రాయుడు మెమోరియల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ గా మార్చబడింది.[1]

ఆయన 2వ, 3వ, 4వ, లోక సభకు రాజమండ్రి నియోజకవర్గం నుండి 1957,1962 మరియు 1967 లలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైనాడు. ఆయన 1962-64లో డిప్యూటీ వైద్య మంత్రిగా, 1964-66 లో రక్షణ శాఖలో డిప్యూటీ మంత్రిగా ఉన్నాడు.

మరణం[మార్చు]

ఈయన 1973 లో మరణించాడు.

సూచికలు[మార్చు]

  1. "Rangaraya Medical College - Kakinada Information". మూలం నుండి 2013-03-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-05-21. Cite web requires |website= (help)

ఇతర లింకులు[మార్చు]