Jump to content

అశోక్ కుమార్ సింగ్

వికీపీడియా నుండి
అశోక్ కుమార్ సింగ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు సుధాకర్ సింగ్
నియోజకవర్గం రామ్‌గఢ్

పదవీ కాలం
2015 – 2020
ముందు అంబికా యాదవ్
తరువాత సుధాకర్ సింగ్
నియోజకవర్గం రామ్‌గఢ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

అశోక్ కుమార్ సింగ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2015, 2024లో రామ్‌గఢ్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అశోక్ కుమార్ సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2015 బీహార్ శాసనసభ ఎన్నికలలో రామ్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ అభ్యర్థి అంబికా సింగ్‌పై 8011 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2020 బీహార్ శాసనసభ ఎన్నికలలో ఆర్‌జేడీ అభ్యర్థి సుధాకర్ సింగ్ చేతిలో 189 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[2]

అశోక్ కుమార్ సింగ్ రామ్‌గఢ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన సుధాకర్ సింగ్ రామ్‌గఢ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ నియోజకవర్గానికి 2024లో నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్‌పై 1362 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] అశోక్ కుమార్ సింగ్ 62257 ఓట్లు సాధించగా, సతీష్ కుమార్ సింగ్ యాదవ్‌ 60895 ఓట్లు సాధించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. CNBCTV18 (23 November 2024). "Bypoll Election Full Winners List 2024: Check state-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The Times of India (20 October 2024). "BJP names its candidates for Ramgarh, Tarari". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  3. The New Indian Express (23 November 2024). "Bihar bypolls: NDA wins all four seats, PK's Jan Suraaj Party fails to open its account" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  4. The Hindu (23 November 2024). "NDA wins all four seats in Bihar bypolls; Prashant Kishor's party fails to make a mark in debut" (in Indian English). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  5. Election Commision of India (23 November 2024). "Ramgarh Assembly Constituency By Poll Result 2024". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.