అశోక గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశోక గుప్తా
অশোকা গুপ্ত
జననంనవంబరు 1912
మరణం8 జూలై 2008
జాతీయతఇండియన్
వృత్తిసామాజిక కార్యకర్త
జీవిత భాగస్వామిసైబల్ కుమార్ గుప్తా
పిల్లలుపార్థ సారథి గుప్తా
శకుంతల దాస్‌గుప్తా
కస్తూరి గుప్తా మీనన్
బిశాఖ ఎగాన్ [1]
తల్లిదండ్రులుకిరణ్ చంద్ర సేన్
జ్యోతిర్మయి దేవి

అశోక గుప్తా (బెంగాలీ: অশোকা গুপ্ত; 1912 నవంబరు - 2008 జూలై 8) ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు. సామాజిక కార్యకర్త. ఆమె మహిళా సేవా సమితి వ్యవస్థాపకురాలు. అఖిల భారత మహిళా సదస్సు సభ్యురాలు. ఇండియన్ సొసైటీ ఫర్ స్పాన్సర్షిప్ అండ్ అడాప్షన్[2] అధ్యక్షురాలు. నోఖాలి మారణహోమం సమయంలో ఆమె సహాయక చర్యలలో పాల్గొన్నది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అశోక్ గుప్తా జ్యోతిర్మయి దేవి, కిరణ్ చంద్ర సేన్ దంపతులకు గల ఆరుగురు సంతానంలో నాల్గవ సంతానంగా, రెండవ కుమార్తెగా జన్మించింది. ఆమె ఆరేళ్ల వయసులో తండ్రి మరణించాడు. కుటుంబ పోషణ తల్లిపై పడింది. గుప్తా కోల్‌కతాలోని సెయింట్ మార్గరెట్ పాఠశాలలో చదివి మెట్రిక్యులేషన్ పరీక్షలో బాలికలలో మొదటి స్థానంలో నిలిచింది. బెథ్యూన్ కాలేజీ నుండి గణితశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసింది. ఇరవై సంవత్సరాల వయస్సులో ఆమె సైబల్ గుప్త అనే ఐసిఎస్ అధికారిని వివాహం చేసుకుంది.

సామాజిక సేవ

[మార్చు]

అఖిల భారత మహిళా సదస్సులో గుప్తా 1936లో సభ్యురాలు అయ్యారు. ఆమె వఐడబ్ల్యుసి విస్తరణలో, వివిధ సంక్షేమ సంస్థల ఏర్పాటులో చురుకుగా పాల్గొన్నారు. 1943వ సంవత్సరం బెంగాల్ కరువు సమయంలో, ఆమె బంకురాలో సహాయక చర్యలలో పాల్గొంది. 1945లో భర్తతో పాటు చిట్టగాంగ్‌కు బదిలీపై వెళ్ళారు. ఆ పై సంవత్సరం నోఖాలీ మారణహోమం సమయంలో, ఆమె ఎఐడబ్ల్యుసి చిట్టగాంగ్ శాఖ తరపున సహాయక సిబ్బంది బృందానికి నాయకత్వం వహించింది. విభజన తర్వాత, ఆమె తన భర్తతో కలిసి కోల్‌కతాకు వెళ్లింది.

విభజన తరువాత, అశోక గుప్తా శరణార్థుల పునరావాసం, పిల్లల అక్షరాస్యత, గ్రామీణ మహిళలు, గిరిజనుల అభ్యున్నతిలో నిమగ్నమైంది. ఆమె 1955 నుండి 1959 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ సలహా మండలికి అధ్యక్షురాలిగా ఉన్నారు. 1959 లో బిప్ధన్ చంద్ర రాయ్, దుర్గాబాయ్ దేశ్ ముఖ్ సూచన మేరకు గుప్తా కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. 1964 లో గుప్తా బెంగాలీ హిందూ శరణార్థులు, దండకారణ్యంలోని ఇతర శిబిరాల మధ్య సహాయక చర్యలలో పాల్గొన్నారు. ఆమె 1956 నుండి 1967 వరకు స్టేట్ కమిషనర్ (గైడ్స్) గా, 1968 నుండి 1974 వరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు.

ఆమె 1948 నుండి 1953 వరకు కలకత్తా విశ్వవిద్యాలయం సెనేట్‌లో ఫెలోగా ఉన్నారు. 1956 నుండి విశ్వభారతి విశ్వవిద్యాలయానికి చెందిన పల్లి సంగతన్ విభాగ్‌లో అసోసియేట్ గా ఉన్నారు. ఆమె విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి సభ్యురాలిగా 1965 నుంచి 1973 వరకు కొనసాగారు.

అవార్డులు

[మార్చు]

2007లో డి.లిట్ అవార్డ్, అలాగే మహిళలు, పిల్లల కోసం ఆమె చేసిన కృషికి గుర్తింపుగా జమ్నాలాల్ బజాజ్ అవార్డు[3] కూడా లభించింది.

ప్రచురణలు

[మార్చు]
  • నోఖాలి దుర్జోగర్ డైన్

మూలాలు

[మార్చు]
  1. Ashoka Gupta (2005). Gupta Ashoka: In the Path of Service: A memoir of a Social Worker. ISBN 9788185604565. Retrieved October 6, 2019.
  2. Sood, Saroj. "From the Desk of Founder Secretary Mrs. Saroj Sood". Indian Society for Sponsorship and Adoption. Archived from the original on 2 April 2012. Retrieved 18 September 2011.
  3. "Jamnanal Bajaj Award". Jamnanal Bajaj Foundation. 2015. Retrieved 13 October 2015.[permanent dead link]