అశ్విన్ మహేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. అశ్విన్ మహేశ్
జాతీయతభారతీయడు
విద్యపి. హెచ్ డి
విద్యాసంస్థవిద్యామందిర్ సీనియర్ సెకండరీ పాఠశాల, సెయింట్ జోసెఫ్ కాలేజ్, బెంగళూర్, డి ఎం యెస్ పాండిచ్చేరి విశ్వవిద్యాలయం
వృత్తిసామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పట్టాణ అభివృద్ధి
రాజకీయ పార్టీలోక్ సత్తా పార్టీ
ఉద్యమంIndia Against Corruption
జీవిత భాగస్వామిSapana Rawat
పిల్లలుAditi and Mahiti.
పురస్కారాలుAshoka Fellow (2009)

అశ్విన్ మహేశ్ ఒక రాజకీయ నాయకుడు,[1] మాజీ ఖగోళవేత్త,[2] మాజీ నాసా శాస్త్రవేత్త[3][4][5] లోక్ సత్తా పార్టీ నాయకులు.[6] ప్రస్తుతం లోక్ సత్తా పార్టీ "జాతీయ కార్యాచరణ సమితి"లో సభ్యులుగా ఉన్నారు. ఆయన Bangalore Political Action Committee (BPAC) కి వ్యవస్థాపక సభ్యుడు కూడా. 2009 లో ఆయనకు "అశోకా ఫెలోషిప్" లభించింది.[7]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అశ్విన్ మహేశ్ చదువు బెంగళూరులోని 'ఆర్మీ హై స్కూల్', చెన్నై లోని 'విద్యా మందిర్ సెకండరీ స్కూల్' లలో జరిగింది. తర్వాత 'సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సు' లో భౌతిక శాస్త్రం చదివారు. ఆ తర్వాత పాండిచ్చేరి విశ్వవిద్యాలయం నుండి యం.బి.ఎ చేసారు. వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయంలో ఖగోళశాస్త్రం లో ఎమ్మెస్ చేసారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లో వాతావరణ శాస్త్రంలో పీ.హెచ్.డీ చేసారు.

వృత్తి[మార్చు]

నాసాలో రీసెర్చ్ ఫాకల్టీగా పనిచేసారు. ఆయన ఒక నక్షత్రాన్ని కనుగొన్నారు. 'the companion to LkHα 234' అని దానికి నామకరణం చేసారు. ఒక దశాబ్దం పాటు వాతావరణ శాస్త్రవేత్తగా అంటార్కిటికా ఖండంలో మేఘాలను, మంచునూ అధ్యయనం చేసారు.

అమెరికా నుండి తిరిగి వచ్చాక ఆయన బెంగళూరు ఐ.ఐ.యం, ఐ.ఐ.ఎస్.సి లలో పరిశోధకుడిగానే కాక కర్నాటక ప్రభుత్వ అర్బన్ అఫైర్స్ ఆఫీస్ లో అర్బన్ రీసెర్చ్ స్ట్రాటజిస్ట్ గా ఉన్నారు[4][8] 1998 లో ఆయన ఇండియా టుగెదర్ అనే అంతర్జాల పత్రికకు సహ వ్యవస్థాపకులు. అశ్విన్ బెంగళూర్ లో జరిగిన ఎన్నో పట్టణ అభివృద్ధి కార్యకరమాలకు మూలకారకుడు. ట్రాఫిక్ నిర్వహణ పరిష్కారాలు, చెరువులను కాపాడటం లాంటివి వాటిలో ఉన్నాయి. బెంగళూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ టాస్క్ ఫోర్సు ఎజెండాలో ఆయన పాత్ర ఉంది.[7]

రాజకీయం[మార్చు]

  • Corruption Saaku అనే సంస్థలో ప్రధాన పాత్ర వహించారు. తర్వాత India Against Corruption యొక్క డిమాండ్ ఐన కర్ణాటకలో జనలోక్‌పాల్ బిల్ కోసం ఎంతో కృషి చేసారు.[9]
  • Wired UK యొక్క "The Smart List 2012: ప్రపంచాన్ని మార్చే 50మంది" అనే దానిలో చోటు సంపాదించుకున్నారు.[1]
  • 2012లో కర్నాటక శాసన మండలి ఎన్నికలలో పోటీ చేసారు. ఈ ఎన్నికల సమయంలో ప్రజలను వోటర్లగా నమోదు చేయించడం కోసం 'మిస్స్‌డ్ కాల్' ప్రచారం చేసారు, తద్వారా 15,000 మంది వోటర్లుగా నమోదయ్యారు.
  • 2013లో కర్నాటక శాసన సభ ఎన్నికలలో బొమ్మనహళ్లి నియోజకవర్గం నుండి పోటీ చేసారు.[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Saswati Mukherjee (16 February 2012). "Ashwin Mahesh makes it to Smart List". The Times of India. Archived from the original on 2012-04-22. Retrieved 2015-05-30.
  2. Manasi Paresh Kumar (19 May 2012). "Astronomer documents urban past". Bangalore Mirror.
  3. "Give a 'missed call' to register yourself as a voter". Bangalore Mirror. 10 April 2012.
  4. 4.0 4.1 4.2 "Young professionals seek to change face of India's politics". The National UAE. 5 May 2013.
  5. "Bangalore's New Agenda Setters". News Laundry. 3 May 2013.
  6. "Lok Satta Party's debut in Karnataka not without gains". The Hindu. 9 May 2013.
  7. 7.0 7.1 "Ashoka Fellows : Ashwin Mahesh". Archived from the original on 2011-12-22. Retrieved 2015-05-30.
  8. "Dr. Ashwin Mahesh". B-PAC. Archived from the original on 2013-05-22. Retrieved 2015-05-30.
  9. Arunkumar B H (28 August 2011). "Spirit uncorrupted by disability". Bangalore Mirror.

ఇతర లింకులు[మార్చు]

  1. http://ashwinmahesh.in/
  2. http://indiatoday.intoday.in/story/bpac-karnataka-polls-lok-satta-candidates/1/270189.html
  3. http://www.deccanchronicle.com/130509/news-politics/article/karnataka-polls-new-voters-old-politics-wins