Jump to content

అస్రా నోమనీ

వికీపీడియా నుండి
అస్రా నోమనీ
2016లో యునైటెడ్ స్టేట్స్ హౌస్ కమిటీ ఆన్ హోంల్యాండ్ సెక్యూరిటీలో పాల్గొన్న అస్రా నోమనీ
జననం
అస్రా కురతులైన్ నోమనీ

1965 (age 58–59)
జాతీయతఅమెరికన్
విద్యాసంస్థపశ్చిమ వర్జీనియా విశ్వవిద్యాలయం (బిఎ), అమెరికన్ విశ్వవిద్యాలయం (ఎం.ఎ)
వృత్తిపాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త, ప్రొఫెసర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
లిబరల్ ముస్లిం సామాజిక కార్యకర్త
పిల్లలుషిబిలీ డనీల్ నోమనీ
తల్లిదండ్రులుజాఫర్ నోమనీ
బంధువులుషిబిలీ నోమనీ

అస్రా కురతులైన్ నోమనీ (జననం 1965), భారత్ కు చెందిన ప్రముఖ అమెరికన్ సామాజిక కార్యకర్త, రచయిత్రి, ప్రొఫెసర్. జార్జిటౌన్ విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో ప్రొఫెసర్ గా పనిచేసింది. ఆస్రా, వాల్ స్ట్రీట్ జర్నల్ లో పనిచేసిన పాత్రికేయుడు డేనియల్ పెరల్ ను కిడ్నాప్ చేసి, హత్య చేసిన సంఘటనపై ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ ప్రాజెక్టు అయిన పెరల్ ప్రాజెక్ట్ కు కో-డైరెక్టర్ గా చేసింది. డేనియల్ పెరల్ ఒకప్పుడు ఆస్రాకు కొలీగ్.[1][2]

నోమనీ స్టాండింగ్ ఎలోన్ ఇన్ మక్కా:ఏన్ అమెరికన్ ఉమెన్స్ స్ట్రగుల్ ఫర్ ది సోల్ ఆఫ్ ఇస్లాం , తాంత్రిక:ట్రావెలింగ్ ది రోడ్ ఆఫ్ డివైన్ లవ్ అని రెండు పుస్తకాలు రాసింది. ఆమె "ఇస్లామిక్ బిల్ ఆఫ్ రైట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ది బెడ్ రూమ్", "ఇస్లామిక్ బిల్ ఆఫ్ రైట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ది మాస్క్", "99 ప్రిసెప్ట్స్ ఫర్ ఓపెనింగ్ హార్ట్స్, మైండ్స్ అండ్ డోర్స్ ఇన్ ది ముస్లిం వరల్డ్" వంటి వ్యాసాలు కూడా రాసింది.

అమెరికా దేశవ్యాప్తంగా, పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ లో ప్రసారమైన అమెరికా ఎట్ ఎ క్రాస్ రోడ్స్ అనే డాక్యుమెంటరీలో ఈమె గురించి ది మాస్క్ ఇన్ మార్గన్ టౌన్ అనే భాగంలో ప్రసారమైంది.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఆస్రా, భారతదేశంలోని బొంబాయి (ప్రస్తుతం ముంబై)లో 1965లో జన్మించింది.[3] ఆమె నాలుగవ ఏట, తన అన్నయ్యతో కలసి న్యూజెర్సీలోని న్యూ బ్రన్స్ విక్ లో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయింది.[3] ఆ సమయంలో ఆమె తండ్రి, జాఫర్ నోమనీ రట్గెర్స్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చదువుకుంటున్నాడు. ఆస్రా పదేళ్ళప్పుడు వారి కుటుంబం పశ్చిమ వర్జీనియాలోని మార్గన్ టౌన్ కు మారిపోయింది. అక్కడ ఆమె తండ్రి న్యూట్రీషిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసేవాడు. ఆమె తండ్రి రంజాన్ సమయంలో చేసే ఉపవాసాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి పరిశోధన చేశాడు. అంతేకాక, న్యూజెర్సీలోనూ, పశ్చిమ వర్జీనియాలోనూ మసీదులను నిర్వహించేవాడు. తాంత్రిక , స్టాండింగ్ ఎలోన్ ఇన్ మక్కా పుస్తకాలలో తన గురించి, సమకాలీన కాలంలోని ముస్లిం పండుతుడు షిబ్లీ నోబినీ వారసురాలిని అని చెప్పుకుంది. షిబ్లీ మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర రాసినవాడిగా సుప్రసిద్ధుడు. 1989లో వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయం నుంచి లిబరల్ అధ్యయన విభాగంలో బి.ఎ చదివింది. 1990లో అంతర్జాతీయ కమ్యూనికేషన్స్ విభాగంలో అమెరికన్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ పూర్తి చేసింది.

కెరీర్

[మార్చు]

ఆస్రా వాల్ స్ట్రీట్ జర్నల్ లో కరెస్పాండెంట్ గా పనినేసింది.[3] ది వాషింగ్టన్ పోస్ట్, ది న్యూయార్క్ టైమ్స్, స్లేట్, ది అమెరికన్ ప్రోస్పెక్ట్, టైమ్ వంటి మ్యాగజైన్లలో కూడా రాసింది ఆమె. పాకిస్థాన్ లో సెలన్.కాంకు కరెస్పాండెంట్ గా కూడా చేసింది. ఆమె రాసిన వ్యాసాలు పీపుల్ మ్యాగజైన్, స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ ఫర్ ఉమెన్, కాస్మోపాలిటన్, ఉమెన్స్ హెల్త్ వంటి పత్రికల్లో కూడా ప్రచురితమయ్యాయి. నేషనల్ రిపబ్లిక్ రేడియోలో కూడా కామెంటరీ ఇచ్చింది.

మూలాలు

[మార్చు]
  1. "GU Class to Investigate Murder of WSJ Reporter". Georgetown University. Archived from the original on 2009-02-14. Retrieved 2018-05-21.
  2. "Project Pearl: The Bravest Class in Town". Marie Claire. Archived from the original on 9 February 2009. Retrieved 2009-03-02.
  3. 3.0 3.1 3.2 "Biography". AsraNomani.com. Archived from the original on 31 జనవరి 2017. Retrieved 18 January 2017.

బయటి లంకెలు

[మార్చు]