అస్లాం ఖోఖర్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | లాహోర్, బ్రిటీష్ పంజాబ్, బ్రిటిష్ ఇండియా | 1920 జనవరి 5|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2011 జనవరి 22 లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | (వయసు 91)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | అన్వర్ హుస్సేన్ (బంధువు) | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు | 1954 జూలై 1 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2017 జూన్ 12 |
మహ్మద్ అస్లాం ఖోఖర్ (1920, జనవరి 5 – 2011 జనవరి 22) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1954లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.[1]
జీవిత చరిత్ర
[మార్చు]ఖోఖర్ 1920, జనవరి 5న పంజాబ్‌లోని లాహోర్‌లో జన్మించాడు. ఇతను అన్వర్ హుస్సేన్ ఖోఖర్ బంధువు.[2]
క్రికెట్ రంగం
[మార్చు]ఖోఖర్ 1938-39, 1963-64 మధ్య 45 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ఆడాడు. పాకిస్తాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మొట్టమొదటి సెంచరీని సాధించాడు.[3] 1947 డిసెంబరులో సింధ్‌పై పంజాబ్ తరపున బ్యాటింగ్ చేశాడు.[4] ఇంగ్లాండ్‌లో జరిగిన రెండో టెస్టులో 16, 18 స్కోరుతో తొమ్మిదో నంబర్‌లో బ్యాటింగ్ చేశాడు.[5] 1970లలో 3 టెస్టులకు అంపైర్‌గా కూడా పనిచేశాడు.
మరణం
[మార్చు]2011 జనవరి 22 న దీర్ఘకాల అనారోగ్యంతో లాహోర్ ఆసుపత్రిలో మరణించాడు. మరణానికి ముందు, పాకిస్థాన్‌లో జీవించి ఉన్న అతి పెద్ద టెస్ట్ క్రికెటర్ గా ఉండేవాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Aslam Khokhar Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
- ↑ "Cricketing Dynasties: The Twenty Two Families of Pakistan Test Cricket – Part 4 | Sports | thenews.com.pk". www.thenews.com.pk.
- ↑ "Pakistan's oldest Test cricketer dies". ESPNcricinfo. 22 January 2011. Retrieved 22 January 2011.
- ↑ "The Home of CricketArchive". cricketarchive.com.
- ↑ "The Home of CricketArchive". cricketarchive.com.
- ↑ "Mohammad Aslam Khokar Dies". CricketWorld4u.com. Archived from the original on 2012-05-14. Retrieved 2013-03-05.