Jump to content

అసోం విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
(అస్సాం విశ్వవిద్యాలయం నుండి దారిమార్పు చెందింది)
Assam University
అస్సాం విశ్వవిద్యాలయం
అస్సాం విశ్వవిద్యాలయం యొక్క ముద్ర
రకంప్రభుత్వ
స్థాపితం1994 (30 సంవత్సరాల క్రితం) (1994)
ఛాన్సలర్గుల్జార్[1]
వైస్ ఛాన్సలర్దిలీప్ చంద్ర నాథ్[2]
స్థానంసిల్చర్, అస్సాం, భారతదేశం
కాంపస్గ్రామీణ
అనుబంధాలుయుజిసి

అస్సాం విశ్వవిద్యాలయం (అస్సాం యూనివర్శిటీ) (Assam University) అనేది భారతదేశంలోని అస్సాంలోని సిల్చార్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం. కచార్ జిల్లా కేంద్రం సిల్చర్ నగరాని 20 కి.మీ దూరంలో దొర్గాకున వద్ద ఈ విశ్వవిద్యాలయం ఉంది.[3] అస్సాం గవర్నర్ చీఫ్ రెక్టర్ గుల్జార్ ఛాన్సలర్ గా, భారత రాష్ట్రపతి విశ్వవిద్యాలయ సందర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇది నాక్ కమిటీ చేత 'బి+' గ్రేడ్‌ గుర్తింపు పొందింది. ఈ విశ్వవిద్యాలయంలో మానవశాస్త్రం, భాషాశాస్త్రం, పర్యావరణశాస్త్రం, సమాచారశాస్త్రం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, సాంఘీకశాస్త్రం, న్యాయశాస్త్రం, సాంకేతికశాస్త్రం, మేనేజ్‌మెంట్ స్టడీస్‌ వంటి పదహారు పీఠాలు ఉన్నాయి. ఈ పదహారు పీఠాల కింద 42 శాఖలు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ఐదు జిల్లాల్లో 72 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం తరువాత అస్సాం విశ్వవిద్యాలయం రెండవ కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఇవి కెండూ 1994లో స్థాపించబడ్డాయి.

చరిత్ర

[మార్చు]

బరాక్ లోయలో ప్రజల పోరాట చరిత్ర ఈ అస్సాం విశ్వవిద్యాలయ చరిత్ర. అస్సాం దక్షిణభాగంలో జరిగిన భాషా ఉద్యమం ద్వారా ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయింది. విశ్వవిద్యాలయం ముందు ద్వారం దగ్గర నిర్మించిన షాహీద్ మినార్ 1961లో చారిత్రక భాషా ఉద్యమ అమరవీరుల త్యాగాలను గుర్తుచేస్తుంది.

ప్రాంగణం

[మార్చు]

విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్ 600 ఎకరాల (2.4 కిమీ 2) విస్తీర్ణంలో, సిల్చర్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఇరోంగ్మారా సమీపంలోని దొర్గాకునలో ఉంది. విశ్వవిద్యాలయపు రెండవ క్యాంపస్ 90 ఎకరాల విస్తీర్ణంలో అస్సాం తూర్పు కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలోని డిపు ప్రాంతంలో ఉంది.

ర్యాంకింగ్

[మార్చు]

2020 నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) మొత్తం విభాగంలో అస్సాం విశ్వవిద్యాలయం 101-150 బ్యాండ్‌లో స్థానం పొందింది.

అనుబంధ కళాశాలు

[మార్చు]

దక్షిణ అస్సాంలోని 5 జిల్లాలైన కచార్, కరీంగంజ్, హైలకండి, దిమా హసాయో, కర్బి ఆంగ్లాంగ్ జిల్లాల్లోని అన్ని కళాశాలలు ఈ విశ్వవిద్యాలయ పరిధిలోకి వస్తాయి.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Lyricist-writer Gulzar appointed chancellor of Assam University". India Today. Mumbai. 30 April 2013. Retrieved 30 April 2013.
  2. "Assam University". Archived from the original on 23 ఏప్రిల్ 2014. Retrieved 24 మే 2016.
  3. Assam University, Official website
  4. "Directorate of Higher Education, Assam - Provincialised Colleges affiliated to Assam University". Dheassam.gov.in. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 10 ఆగస్టు 2020.
  5. "List of Provincialised Colleges affiliated to Assam University, Silchar". Silchartoday.com. 2012-12-19. Archived from the original on 2018-07-02. Retrieved 2020-08-10.

ఇతర లంకెలు

[మార్చు]