అక్షాంశ రేఖాంశాలు: 27°52′39″N 96°21′33″E / 27.87750°N 96.35917°E / 27.87750; 96.35917

అహల్య స్థాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అహల్య స్థాన్
అహల్య స్థాన్ లోని రామాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:బీహార్
భౌగోళికాంశాలు:27°52′39″N 96°21′33″E / 27.87750°N 96.35917°E / 27.87750; 96.35917

అహల్య స్థాన్ (అహల్య స్థాన్ లేదా అహల్య ఆస్థాన్ అని కూడా పిలుస్తారు) భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని దర్భంగా నగరంలో దక్షిణ అహియారీ వద్ద ఉన్న ఒక హిందూ దేవాలయం.[1]

స్థల పురాణం

[మార్చు]

రామాయణం ప్రకారం, రాముడు, లక్ష్మణుడు తన యజ్ఞాన్ని రక్షించడానికి బ్రహ్మర్షి విశ్వామిత్రుడితో అడవికి వెళ్లారు. దారిలో వారికి ఓ నిర్జన ప్రదేశం ఎదురైంది. రాముడు ఆ స్థలం గురించి అడిగినప్పుడు, విశ్వామిత్రుడు గౌతమ మహర్షి భార్య సతీ అహల్య కథను చెప్పాడు. మహర్షి తన భార్యతో ఇక్కడే ఉంటూ తపస్సు చేసేవాడని, ఒకరోజు గౌతమ ఋషి ఆశ్రమం నుండి బయటకు వెళ్ళినప్పుడు, ఇంద్రుడు గౌతమ ఋషి వేషంలో వచ్చాడని, అహల్య అసలు ఆ వ్యక్తి ఎవరో తెలియక ఇంద్రుని కోరికకు లొంగిపోయిందని, ఈ విషయం గౌతమ మహర్షికి తెలిసి తన భార్యను ఈ ప్రదేశంలో రాయిలా పడుకోమని శపించాడని, ఆమె తప్పుని తెలుసుకొని వేడుకున్నప్పుడు, మళ్ళీ మహర్షి "రాముడు ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు, మీరు మీ సాధారణ స్థితికి తిరిగి వస్తారు." అని రాముడితో చెప్పాడు. తర్వాత రాముడిని ఆశ్రమంలోకి వెళ్ళమని చెప్పాడు. రాముని తేజస్సు ఆ ప్రదేశాన్ని ప్రకాశవంతం చేయగానే, అహల్య తన శరీరంతో లేచి నిలబడి రాముడిని ప్రార్థించింది. అహల్య గౌతమ మహర్షి భార్య అయినందున, రాముడు, లక్ష్మణులు ఆమెకు నమస్కరించారు.[2]

ఆలయం

[మార్చు]

ఒకప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమం ఉన్న ప్రదేశం అహల్య స్థాన్. ప్రస్తుత నిర్మాణ రూపంలో ఉన్న ఈ ఆలయం 1662, 1682 మధ్య మహారాజా ఛత్ర సింగ్, మహారాజా రుద్ర సింగ్ పాలనలో నిర్మించబడింది. భారతదేశంలోనే తొలి రామ్ జానకి దేవాలయం కూడా ఇదే. ఆలయం చక్కటి నమూనాలు, కళ, ప్రాచీన భారతీయ వాస్తుశిల్పాలతో అందంగా తయారు చేయబడింది. మందిరం లోపల, ప్రధాన పూజా వస్తువుగా రాముడి భార్య సీతాదేవి పాద ముద్రలు ఉన్నాయని చెప్పబడిన ఒక చదునైన రాయి ఉంది.[3][4]

పండుగలు

[మార్చు]

ఆలయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. రామనవమి ఉత్సవాలను ఇక్కడ చైత్ర మాసం (మార్చి ముగింపు - ఏప్రిల్ ప్రారంభం)లో, వివాహ పంచమి ఆగ్రహాయణంలో ఘనంగా జరుపుకుంటారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Ahalya Sthan". Archived from the original on 15 February 2022. Retrieved 19 February 2022.
  2. "Ahalya Sthan - Hindu temple in Jaynagar, India". Archived from the original on 15 February 2022. Retrieved 19 February 2022.
  3. "Ahilya Asthan". Archived from the original on 15 February 2022. Retrieved 19 February 2022.
  4. 4.0 4.1 "Darbhanga And Its Ramayana Connection". Archived from the original on 15 February 2022. Retrieved 19 February 2022.