Jump to content

అహానా కృష్ణ

వికీపీడియా నుండి
అహానా కృష్ణ
తిరువనంతపురంలో అహానా కృష్ణ
జననం
అహానా కృష్ణ కుమార్

(1995-10-13) 1995 అక్టోబరు 13 (వయసు 29)
విద్యాసంస్థMICA ఇన్‌స్టిట్యూట్ అహ్మదాబాద్
వృత్తి
  • నటి
  • గాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు2014 – ప్రస్తుతం
తల్లిదండ్రులుకృష్ణ కుమార్, సింధు కృష్ణ

అహానా కృష్ణ (జననం 1995 అక్టోబరు 13) భారతీయ నటి. ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో, వాణిజ్య ప్రకటనలలో నటిస్తుంది. ఆమె 2014లో ఫర్హాన్ ఫాసిల్ సరసన రాజీవ్ రవి దర్శకత్వంలో వచ్చిన న్జాన్ స్టీవ్ లోపెజ్ చిత్రంలో ప్రధాన కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసింది.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

నటుడు కృష్ణ కుమార్, సింధు కృష్ణ దంపతుల నలుగురు కుమార్తెలలో అహానా మొదటి సంతానం.[1] ఆమె తిరువనంతపురంలోని హోలీ ఏంజెల్స్ I.S.C స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత చెన్నైలోని MOP వైష్ణవ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి విజువల్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. ఆమె అహ్మదాబాద్‌లోని MICA నుండి అడ్వర్టైజింగ్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్‌లో ఆన్‌లైన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసింది.

కెరీర్

[మార్చు]

2014లో న్జాన్ స్టీవ్ లోపెజ్‌తో ఆమె అరంగేట్రం చేసింది.[2] ఆమె 2017లో నివిన్ పౌలీతో కలిసి అల్తాఫ్ దర్శకత్వం వహించిన నందుకలుడే నాటిల్ ఒరిదవేళలో నటించింది.[3]

2019లో ఆమె రొమాంటిక్ డ్రామా లూకాలో టోవినో థామస్‌తో కలిసి నటించింది.[4][5] ఈ చిత్రం విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగానూ విజయవంతమైంది. అదే సంవత్సరం ఆమె శంకర్ రామకృష్ణన్ పతినెట్టం పడిలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రం తెలుగులో గ్యాంగ్స్ ఆఫ్ 18గా విడుదలైంది.[6]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "అంధాధున్‌ రీమేక్‌.. వివాదంపై నటి స్పందన". web.archive.org. 2023-02-27. Archived from the original on 2023-02-27. Retrieved 2023-02-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Living a dream - The Hindu
  3. "Ahaana Krishna: I initially said no to Nivin Pauly's Njandukalude Nattil Oridavela". Pink Villa. 30 August 2017. Archived from the original on 17 May 2021. Retrieved 17 May 2021.
  4. "Tovino to romance Ahaana Krishna in Luca". New Indian Express. 18 September 2017. Retrieved 20 March 2018.
  5. "Ahaana to star with Tovino in Luca". Deccan Chronicle. 18 September 2017. Retrieved 20 March 2018.
  6. "Gangs Of 18: పాఠశాల రోజుల్లోకి..." web.archive.org. 2023-02-27. Archived from the original on 2023-02-27. Retrieved 2023-02-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)