Jump to content

అహుకుంటికలు

వికీపీడియా నుండి

దాదాపు 400 పైచిలుకు ఏళ్లకిందట శ్రీలంకకు చేరిన తెలుగు వాళ్ళలో తెలుగు గిరిజనులును శ్రీలంకలో వీరిని అహుకుంటికలుగా, అహికుంతక, కురవర్, కొరల, విదనేరచ్చిగా పిలుస్తారు. సంచార జీవనం గడిపే ఈ గిరిజనులు పాములు, కోతులు ఆడిస్తూ, జోతిష్యం చెప్పే వీరు శ్రీలంకలో విలక్షణంగా కనిపిస్తారు. నిరుపేదలైన వీరు వారం రోజులకు మించి ఎక్కడా స్థిరంగా ఉండరు. వీరు ప్రాధానంగా బౌద్ధ, క్రైస్థవ మతము అనుసరిస్థారు .[1] ప్రస్తుతం శ్రీలంకలో కొన్ని తెలుగు జిప్సీ కుటుంబాలున్నాయి. ఉత్తర మధ్య రాష్ట్రంలోని అనురాధపురం జిల్లాలోని తముత్తేగమ, వాయువ్య రాష్ట్రంలోని పుత్తళం ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబో తదితర చోట్ల కూడా పాముల్ని ఆడిస్తూ అక్కడక్కడా కనిపిస్తారు.
వీరు చెప్పే జ్యోతిష్యం అంటే శ్రీలంక సింహళీయులకు బాగా గురి. సంచార సమయాల్లోనూ ఎక్కువ మంది కలిసి ఉండటానికే ఇష్టపడతారు.[2]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-01-28. Retrieved 2016-09-18.
  2. https://www.youtube.com/watch?v=D4WPe0j6TJY