అహ్సాస్ చన్నా
అహ్సాస్ చన్నా (జననం 1999 ఆగస్టు 5) భారతీయ నటి. ఆమె ప్రధానంగా హిందీ చలనచిత్రాలు, టెలీవిజన్ ధారావాహికలలో నటిస్తుంది. బాలనటిగా, ఆమె వాస్తు శాస్త్ర (2004), కభీ అల్విదా నా కెహనా (2006)[1], మై ఫ్రెండ్ గణేశా (2007), ఫూంక్ (2008) వంటి చిత్రాలలో నటించింది. టీవీ సీరియళ్లలోనూ బాలనటిగా చేసింది. యుక్తవయసులో, ఆమె దేవన్ కే దేవ్.. మహదేవ్, ఓయే జస్సీ, ఎంటీవీ ఫనాహ్.[2] వంటి టెలివిజన్ షోలలో నటించింది.[3]
రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వాస్తు శాస్త్ర తెలుగులోకి మర్రి చెట్టుగా అనువదించబడింది. ఈ చిత్రాన్ని సౌరబ్ నారంగ్ దర్శకత్వం వహించగా అహ్సాస్ చన్నాతో పాటు పీయా రాయ్ చౌదరి, సుస్మితా సేన్, జె. డి. చక్రవర్తి నటించారు.[4]
కోటా ఫ్యాక్టరీతో వెబ్ సిరీస్‌లో నటించడం మొదలుపెట్టింది. గర్ల్స్‌ప్లెయినింగ్ సిరీస్ తో మరింత గుర్తింపుపొందింది.[5]
డబ్‌స్మాష్ చేయడంలో దిట్ట అయిన ఆమె మ్యూజికల్లీ వీడియోస్‌కు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె టీనేజ్ పిల్లలు ఎదుర్కొనే సమస్యల మీద డియర్ టీనేజ్ మి అనే పాడ్‌కాస్ట్ చానెల్‌ను కూడా నిర్వహిస్తోంది.
బాల్యం
[మార్చు]ఆమె పంజాబీ సినిమా ప్రొడ్యూసర్ ఇక్బాల్ బహదూర్ సింగ్ చన్నా, టెలివిజన్ నటి కుల్‌బిర్ బహదూర్ సింగ్ చన్నా దంపతులకు పంజాబ్‌లోని జలంధర్లో 1999 ఆగస్టు 5న జన్మించింది.[6] ముంబైలో విద్యాభ్యాసం చేసింది.[7]
కెరీర్
[మార్చు]నటనా వాతావరణంలోనే పుట్టి పెరగిన ఆమె నాలుగో ఏటనే సినీరంగ ప్రవేశం చేసింది.[8] వాస్తు శాస్త్ర, కభీ అల్విద నా కెహనా, మై ఫ్రెండ్ గణేశా వంటి పలు చిత్రాల్లో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. ఆమె బాలనటిగా ఎక్కువగా అబ్బాయి పాత్రలనే పోషించింది.[9][10][11]
మోడలింగ్‌లోనూ ఉన్న ఆసక్తితో వాళ్లమ్మతో కలసి ఆమె గీతాంజలి ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌వాక్ చేసింది.
ఆమె భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వివిధ వెబ్ షోలు, స్కెచ్‌లు మొదలైన వాటిలో చురుకుగా వ్యవహరిస్తోంది.
మూలాలు
[మార్చు]- ↑ "Meet the Girl Who Played SRK's Son in 'Kabhi Alvida Na Kehna'". 1 March 2016. Archived from the original on 11 August 2017. Retrieved 3 August 2017.
- ↑ Sharma, Mandvi (20 August 2008). "Short & sweet: Ahsaas Channa". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 13 May 2022. Retrieved 13 May 2022.
- ↑ IANS (27 April 2017). "Girls should speak out against sexual molestation, says Ahsaas Channa". Business Standard. Archived from the original on 4 August 2017. Retrieved 1 November 2020.
- ↑ "JD Chakravarthy calls RGV a master of horror films". 3 October 2012. Archived from the original on 15 జూలై 2014. Retrieved 15 జూలై 2023.
- ↑ "My Friend Ganesha Child Artist Ahsaas Channa Then And Now, Know Rare Facts - Sakshi". web.archive.org. 2023-07-15. Archived from the original on 2023-07-15. Retrieved 2023-07-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "HOT! This is how Shah Rukh Khan's son from Kabhi Alvida Naa Kehna looks like now". Bollywood Hungama. 4 August 2017. Archived from the original on 28 August 2019. Retrieved 28 August 2019.
- ↑ TVF's AHSAAS CHANNA | Interview | from Kota Factory, Girlsplaining, Girls Hostel (in ఇంగ్లీష్), jaby koay, 27 August 2019, archived from the original on 11 October 2020, retrieved 28 August 2019,
At 3:33 (about Mumbai birth); 6:40 onwards about parents hailing from Jalandhar
- ↑ "Father sends..." The Times of India. 8 October 2005. Archived from the original on 13 March 2016. Retrieved 18 March 2016.
- ↑ "Cute Boy In 'My Friend Ganesha' Turned A Pretty Young Girl". ABP Live. 10 March 2016. Archived from the original on 16 July 2016. Retrieved 6 July 2016.
- ↑ "Gender Bender". India Today. 23 July 2007. Archived from the original on 28 March 2016. Retrieved 1 November 2020.
- ↑ "I always knew I'd become an actress: Phoonk star Ahsaas Channa". NDTV. 23 January 2013. Archived from the original on 4 August 2017. Retrieved 1 November 2020.