ఆంధ్ర విదుషీమణులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రచయత ఆండ్ర శేషగిరిరావు

ఆంధ్ర విదుషీమణులు ఆండ్ర శేషగిరిరావు రచించిన పుస్తకం.[1] ఈ పుస్తకం 1950లో అచ్చయ్యింది.

ఈ గ్రంథము రెండు భాగములు. మొదటి భాగమున సంస్కృతమున తమ వాగ్విలాసము చూపిన ఆధ్ర విదుషీమణుల జీవితములు వివరించబడినవి. రెండవ భాగమున ఆంధ్రమున తమ వాగ్విలాసము చూపిన విదుషీమణుల జీవితములు పొందుపరచబడినవి. ఈ జీవిత గాథలలో కొన్ని 1930 ప్రాంతమున వివిధ పత్రికలలో ప్రచురించబడినవి. ఈ మొదటి భాగము లోని శాతవాహనులరాణి రూపవాణి ప్రత్యేక సంచిక యందును, "నాచి" భారతి పత్రిక యందును, "రామభద్రాంబ", "మధురవాణి", " లకుమాదేవి" అనునవి గృహలక్ష్మి పత్రిక యందు ప్రచురితములు.

కాల క్రమమున పరిశీలలలో తెలియవచ్చిన అనేక నూతన అంశములు ఈ గ్రంథంలో చేర్చడం జరిగింది. ఈ రచనయందు శ్రేవేదము వేంకట కృష్ణ శర్మ తోడ్పడినట్లు గ్రంథకర్త పుస్తకం ముందు మాటలో తెలియజేసారు.

విశేషాలు

[మార్చు]

ఆంధ్రుల చరిత్రలో ప్రఖ్యాతి పొందిన విదుషీమణుల గురించి ఈ పుస్తకాన్ని రచించారు. ఎనిమిదిమంది ప్రతిభాశాలులైన తెలుగుస్త్రీల గురించిన వివరాలతో వ్యాసరచన చేసారు. రెండువేల యేళ్ళనాటి శాతవాహన రాజ్యపు రాణి నుంచి మొదలుకొని రెండు శతాబ్దాల నాటి నాట్యవేత్త లకుమాదేవి వరకూ పలువురి జీవిత విశేషాలు, ప్రతిభా వ్యుత్పత్తులు వ్యాసాల్లో చిత్రీకరించారు.[2]

పుస్తకంలో స్త్రీలు

[మార్చు]
  1. శాతవాహనుల రాణి
  2. నాచి
  3. గంగాదేవి
  4. తుక్కాదేవి
  5. తిరుమలాంబ
  6. రామభద్రాంబ
  7. మధురవాణి
  8. లకుమాదేవి

ఆంధ్రదేశానికి మొదటి చక్రవర్తి శాతవాహనుడు. ఆయన్ను శాలివాహనుడు అని కూడా అంటారు. శాతవాహనుడి తర్వాత ఆయన వంశం వారు ఆంధ్రదేశాన్ని చాలా కాలం పాలించారు.శాతవాహనుని రాణి గొప్ప తెలివితేటలు కలిగిన మహిళ. శాతవాహనుడు గొప్ప కవి, పండితుడు. కాని ఆయన కవి, పండితుడు అయ్యాడంటే కారణం అతని రాణి.

"నాచి" సా.శ ఏడవ శతాబ్దానికి చెందిన విదుషీమణి. ఏలేశ్వరోపాధ్యాయులవారి సంతానం. తండ్రి అసమాన ప్రోత్సాహం తోడై అనతికాలంలోనే నాచి గొప్ప విద్వాంసురాలిగా పేరు తెచ్చుకుంది.

మూలాలు

[మార్చు]
  1. "విధివంచిత కాదు, విద్యాసమన్విత 'నాచి' | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2021-05-02.
  2. "ఆంధ్ర విదుషీమణులు by ఆండ్ర శేషగిరిరావు". books.readingbharat.com. Archived from the original on 2021-05-02. Retrieved 2021-05-02.

ఇతర పఠనాలు

[మార్చు]