ఆంధ్ర హరిజన్
Jump to navigation
Jump to search
రకం | వారపత్రిక |
---|---|
రూపం తీరు | టాబ్లాయిడ్ |
ప్రచురణకర్త | వినయాశ్రమము |
సంపాదకులు | గొల్లపూడి సీతారామశాస్త్రి |
భాష | తెలుగు |
కేంద్రం | కావూరు |
ప్రముఖ గాంధేయవాది గొల్లపూడి సీతారామశాస్త్రి (స్వామి సీతారాం) కావూరులోనున్న వినయాశ్రమం నుండి నడిపిన వారపత్రిక ఆంధ్ర హరిజన్. ఈ పత్రిక 1946లో ప్రారంభమైంది. ఈ పత్రికలో గాంధీమహాత్ముని బోధనలు, గాంధేయవాదము, హరిజనోద్ధరణ, సత్యాగ్రహము, ప్రకృతివైద్యము, మద్యపాన నిషేధము, అస్పృశ్యతా నివారణ, ఖాదీ ఉద్యమము మొదలైన వాటికి సంబంధించిన వార్తలతో పాటు రాజకీయ వార్తలు ప్రచురింపబడేవి.