Jump to content

ఆకాశ ఎయిర్

వికీపీడియా నుండి
ఆకాశ ఎయిర్
IATA
QP[1]
ICAO
AKJ
Callsign
AKASA AIR
స్థాపితముడిసెంబరు 2021; 3 సంవత్సరాల క్రితం (2021-12)
కార్యకలాపాల ప్రారంభం7 ఆగస్టు 2022 (2022-08-07)
Hubs
  • ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం[2]
కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం[2]
Fleet size20
మాతృసంస్థఎస్.ఎన్.వి ఏవియేషన్ ప్రై. లి.
ప్రధాన కార్యాలయముముంబై, మహారాష్ట్ర, భారతదేశం[3]
కీలక వ్యక్తులువినయ్ దూబే (ఆర్గనైజేషనల్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ & సీఇఒ)[4]
ఆదిత్య ఘోష్ (సహ వ్యవస్థాపకుడు)[4]
ఆకాశ ఎయిర్ మొదటి బోయింగ్ 737-8 విమానం, VT-YAAగా నమోదు చేయబడింది

ఆకాశ ఎయిర్ (ఆంగ్లం: Akasa Air) ఇది ఎస్.ఎన్.వి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాండ్.[5] మహారాష్ట్రలోని ముంబైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న భారతీయ తక్కువ-ధర[6] విమానయాన సంస్థ. దీనిని భారతీయ బిలియనీర్ రాకేష్ జున్‌జున్‌వాలా స్థాపించాడు.[7][8] ఈ విమానయాన సంస్థ కంపెనీ తొలి విమానం (బోయింగ్ 737 మాక్స్) 2022 ఆగస్టు 7న ప్రయాణికులతో ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు చేరింది. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దృశ్యమాధ్యమ పద్ధతిలో ఈ విమానాన్ని ప్రారంభించాడు.[9] ఈ సందర్భంగా అకాశ ఎయిర్ సంస్థ సీఈఓ వినయ్ దూబే మాట్లాడుతూ 2022 సంవత్సరం చివరి నాటికి 18 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటామని, అలాగే ఏడాదికి 12-14 ఎయిర్‌క్రాఫ్ట్‌లను జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నాడు. అకాశ ఎయిర్ రాబోయే 5 సంవత్సరాలలో దాదాపు 72 విమానాలకు విస్తరిస్తుందని ఆయన అన్నాడు.[10] ఆకాశ ఎయిర్ విమానయాన సంస్థ ద్వారా ప్రారంభంలో మెట్రో నగరాల నుండి టైర్-2, టైర్-3 నగరాలకు సేవలను అందిస్తామని, త్వరలోనే దేశంలోని అన్నీ ప్రధాన నగరాలకు కూడా విమానాలను నడుపుతామని ఆయన పేర్కొన్నాడు.[11][12]

చరిత్ర

[మార్చు]

2021 మార్చిలో జెట్ ఎయిర్‌వేస్, గోఫస్ట్ మాజీ సి.ఇ.ఒ వినయ్ దూబే, గోఫస్ట్ మాజీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్, ఫ్లైట్ ఆపరేషన్స్ హెడ్ నిఖిల్ వేద్‌లతో కలిసి భారతదేశంలో కొత్త తక్కువ-ధర క్యారియర్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేసారు.[13][14] 2021 జూలైలో భారత బిలియనీర్ వ్యాపారి రాకేష్ జున్‌జున్‌వాలా క్యారియర్‌లో 40 శాతం వాటా కోసం $35 మిలియన్లు పెట్టుబడి పెట్టారు.[15][16] ఇది 2021 అక్టోబరులో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందింది.[17][18]

గమ్యస్థానాలు

[మార్చు]

2022 జులై 22న అకాశ ఎయిర్ తన మొదటి గమ్యస్థానాలను ప్రకటించింది. వాటి కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఈ విమానయాన సంస్థ మొదటి వాణిజ్య విమానం 2022 ఆగస్టు 7న అహ్మదాబాద్, ముంబైల మధ్య జరిగింది.[19] ఈ విమానాలు వారానికోసారి ఉంటాయి.[20]

దేశం (రాష్ట్రం) నగరం విమానాశ్రయం కార్యాచరణ తేది మూలం
భారతదేశం (గుజరాత్) అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం 2022 ఆగస్టు 7 [21]
భారతదేశం (కర్ణాటక) బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 2022 ఆగస్టు 13 [22]
భారతదేశం (కేరళ) కొచ్చి కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం 2022 ఆగస్టు 13 [23]
భారతదేశం (మహారాష్ట్ర) ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 2022 ఆగస్టు 7 [24]
భారతదేశం (తమిళనాడు) చెన్నై చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం 2022 సెప్టెంబరు 15 [25]

మూలాలు

[మార్చు]
  1. "Akasa Air announces IATA code 'QP'". Zee News. Retrieved 2022-05-17.
  2. 2.0 2.1 "Why Akasa Air chose Mumbai and Bengaluru for its inaugural flights". Moneycontrol. 2022-07-22. Retrieved 2022-07-23.
  3. url=https://www.akasaair.com/contact-us Archived 2022-09-20 at the Wayback Machine
  4. 4.0 4.1 "Akasa Air Executive Comittee". Akasa Air. Archived from the original on 2022-07-16. Retrieved 2022-07-20.
  5. "Akasa Air Orders 72 Fuel-Efficient 737 MAX Airplanes to Launch Service in Fast-Growing Indian Market". MediaRoom. Retrieved 2022-02-21.
  6. "Akasa Air not ultra low cost; will seek nod to fly international routes next summer: Vinay Dube". www.msn.com. Retrieved 2022-01-12.
  7. "Rakesh Jhunjhunwala-promoted Akasa Air's Holding Company SNV Aviation Registered Using Vinay Dubey's Address". Moneycontrol. 2021-08-04. Retrieved 2021-08-06.
  8. "Rakesh Jhunjhunwala-promoted Akasa Air Gets No-objection Certificate From Civil Aviation Ministry, DGCA: Reports". Moneycontrol. 2021-08-04. Retrieved 2021-08-06.
  9. "Akasa Air: ఆకాశ ఎయిర్‌ కార్యకలాపాలు ప్రారంభం". web.archive.org. 2022-08-08. Archived from the original on 2022-08-08. Retrieved 2022-08-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. "Akasa Air plans to launch first flight in June". www.siasat.com. Retrieved 26 March 2022.
  11. "Akasa Air eyes June launch". www.telegraphindia.com. Retrieved 26 March 2022.
  12. "Indian Indian budget airline Akasa plans first commercial flight in June". www.economictimes.indiatimes.com. Retrieved 26 March 2022.
  13. "Jet Airways' ex-CEO Is Reportedly Looking To Start Another Airline". Simple Flying (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-03-19. Retrieved 2021-11-17.
  14. "Vinay Dube, ex-CEO of Jet Airways and GoAir, plans to launch new domestic airline by end of 2021-India News , Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2021-03-18. Retrieved 2021-11-17.
  15. "Rakesh Jhunjhunwala Airline's $9 Billion Order For Boeing 737s". NDTV.com. Retrieved 2021-11-17.
  16. Shukla, Tarun. "Akasa Air's take-off: with the Big Bull in cockpit, the low-cost airline has no room for mistakes". The Economic Times. Retrieved 2021-11-17.
  17. Sharma, Anu (2021-08-04). "Rakesh Jhunjhunwala's Akasa Air gets NOC from Aviation Ministry, aims flight take off by 2021 end". CNBCTV18. Retrieved 2021-08-06.
  18. "Rakesh Jhunjhunwala's Akasa Air gets NOC from Ministry of Civil Aviation". www.timesnownews.com. Retrieved 13 October 2021.
  19. "Akasa Air ticket sales opens, India's newest airline set to fly". www.hindustantimes.com. Retrieved 22 July 2022.
  20. "India's newest budget carrier Akasa begins commercial operations". Reuters (in ఇంగ్లీష్). 2022-08-07. Retrieved 2022-08-07.
  21. "Akasa Air Network". Akasa Air. Retrieved 22 జూలై 2022.
  22. @CNBCTV18Live (July 14, 2022). "Bengaluru to be the first hub of Akasa Air" (Tweet) – via Twitter.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  23. "Akasa Air Network". Akasa Air. Retrieved 22 జూలై 2022.
  24. "Why Akasa Air chose Mumbai and Bengaluru for its inaugural flights". www.moneycontrol.com. Retrieved 27 జూలై 2022.
  25. "Akasa Air Network". Akasa Air. Retrieved 22 జూలై 2022.