జెట్ ఎయిర్వేస్
| ||||
స్థాపితము | 1 ఏప్రిల్ 1992 | |||
---|---|---|---|---|
కార్యకలాపాల ప్రారంభం | 5 మే 1993 | |||
Ceased operations | 2019 ఏప్రిల్ 17 (2022 లో మరల ప్రారంభం కానుంది) | |||
Hubs | ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూఢిల్లీ | |||
Secondary hubs |
| |||
దృష్టి సారించిన నగరాలు | ముంబై, చెన్నై, కోల్‌కత, న్యూఢిల్లీ | |||
m:en:Frequent-flyer program | ఇంటర్ మైల్స్[3][4] | |||
Fleet size | 8 | |||
ప్రధాన కార్యాలయము | Delhi NCR, India[5] | |||
కీలక వ్యక్తులు |
| |||
ఆదాయము | ₹252 బిలియను (US$3.2 billion) (FY 2017–18)[7] | |||
లాభం | ₹−6.3 బిలియను (US$−79 million) (FY 2017–18)[7] | |||
ఉద్యోగులు | 16,015 (2017)[8] |
జెట్ ఎయిర్‌వేస్ ఒక వెలుగు వెలిగిన భారతీయ అంతర్జాతీయ విమానయాన సంస్థ. దీని ప్రధాన కేంద్రం ఢిల్లీ లో ఉండగా ముంబయిలో శిక్షణ అభివృద్ధి కేంద్రం ఉండేది. ఇది భారతదేశంలో ఇండిగో తర్వాత రెండో అతి పెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా 74 స్థావరాల నుంచి మొత్తం 300 విమానాలను ఈ సంస్థ నడిపించేది. ద్వితీయ శ్రేణి స్థావరాలు ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరులో ఉండేవి.[9]
1992 ఏప్రిల్ లో పరిమిత బాధ్యత వ్యాపారసంస్థ (LLC) గా ఈ సంస్థ ప్రారంభమైంది. 1993 లో తన ఎయిర్ టాక్సీ కార్యకలాపాలు ప్రారంభించింది. 1995 నుంచి పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. 2004 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు కూడా ప్రారంభించింది. 2005 లో పబ్లిక్ మార్కెట్ లో ప్రవేశించింది. 2007 లో ఎయిర్ సహారాను స్వంతం చేసుకుంది. దీని ప్రధాన పోటీదారులైన స్పైస్ జెట్, ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థలు టికెట్ల ధరలు తగ్గించడంతో ఇది కూడా ధరలు తగ్గించవలసి వచ్చింది. దాంతో ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొన్నది. 2017 అక్టోబరు నాటికి ఇది ఇండిగో కంటే వెనకబడి 17.8% మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పతనం దిశగా సాగి 2019లో దివాలా తీసింది.[10] విస్తారా ఎయిర్ లైన్ స్థాపనకు ముందుగా ఎయిర్ ఇండియాతో పాటు ఇది ఒక్కటే భారతదేశం కేంద్రంగా నడిచిన పూర్తిస్థాయి సేవల విమానయాన సంస్థ. 2019 ఏప్రిల్ నాటికి దీని కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే 2022 లో మళ్ళీ ప్రారంభం కావచ్చునని వార్తలు వచ్చాయి.[11]
చరిత్ర
[మార్చు]జెట్ ఎయిర్ వేస్ 1993 ఏప్రిల్ 1న ఎయిర్ టాక్సీ కార్యకలాపాలను ప్రారంభించింది. మలేషియా ఎయిర్ లైన్స్ నుంచి నాలుగు బోయింగ్ 737-300 అద్దె విమానాలు తీసుకుని జెట్ ఏయిర్ వేస్ తన వాణిజ్య కార్యకలాపాలను 1993 మే 5 నాడు ప్రారంభించింది. అప్పటికే భారత్ లోని విదేశీ విమాన సంస్థలకు అమ్మకాలు, మార్కెటింగ్ సేవలను అందిస్తోన్న జెట్ ఏయిర్ (ప్రయివేట్) లిమిటెడ్ సంస్థకు యజమానిగా ఉన్న నరేష్ గోయల్ జెట్ ఏయిర్ వేస్ ను స్థాపించారు. దేశీయ మార్కెట్ ను 1993 మధ్య కాలంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఏకఛత్రాధిపత్యం వహిస్తోన్న రోజులవి. 1995 జనవరి 14 నుంచి ఈ సంస్థకు షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్ హోదా లభించింది.[6][12]
జెట్ తన అంతర్జాతీయ కార్యకలాపాలను 2004 మార్చి లో చెన్నై నుంచి కొలంబోకు ప్రారంభించింది. నరేష్ గోయల్ చేతిలో జెట్ ఎయిర్ వేస్ వాటా 80 శాతం ఉన్నప్పటికీ ఇది బాంబే స్టాక్ ఎక్సెంజీలో ఇది నమోదైంది. ఈ సంస్థలో 2011 మార్చి 31 నాటికి 13,177 ఉద్యోగులు పనిచేసేవారు. దేశీయ రంగంలో పేరెన్నికగల వాటిలో జెట్ఎయిర్ వేస్ వారానికి ముంబయి నుంచి న్యూఢిల్లీకి వారానికి 95 విమానాలు, న్యూఢిల్లీ నుంచి ముంబయికి 81, బెంగళూరు నుంచి ముంబయికి 56 ముంబయి నుంచి చెన్నైకి 48 నిమానాలను నడిపించేది. ప్రత్యేక సందర్భాల్లో బెంగళూరు నుంచి రాజ్ కోట్, రాయ్ పూర్ నుంచి భోపాల్, జైపూర్ నుంచి న్యూఢిల్లీకి కూడా విమానాలు నడిపించేవారు. అంతర్జాతీయ రంగంలో కూడా జెట్ ఎయిర్ వేస్ ముంబయి నుంచి దుబాయ్, ముంబయి నుంచి అబూదాబీ, హైదారాబాద్ నుంచి అబుదాబీ, న్యూఢిల్లీ నుంచి ఖాట్మండు, చెన్నై నుంచి అబుదాబీ, చెన్నై నుంచి అబుదాబీ మార్గాల్లో విమానాలు నడిచేవి
గమ్యాలు
[మార్చు]జెట్ ఎయిర్ వేస్ దేశీయంగా 47 గమ్య స్థానాలకు, అంతర్జాతీయంగా ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాల్లోని 19 దేశాల్లో గల 22 స్థానాలకు విమానాలు నడిపేది.[13] తక్కువ దూరం గల విదేశీ గమ్య స్థానాలకు కొత్త తరానికి చెందిన బోయింగ్ 737విమానాలను వినియోగించేది.. ATR 72-500 విమానాలను ఎక్కువగా దేశీయ మార్గాల్లో ఉపయోగించేవారు. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఎయిర్ బస్ A330-200, బోయింగ్ 777-300ER విమానాలు ఉపయోగించేవారు. ముంబయి-ప్యారీస్ మార్గాల్లో ఎయిర్ బస్ A330 రకం విమానాలను కూడా 2014 ఏడాది మధ్యంతరం నుంచి ఉపయోగించేవారు.
విమానాలు
[మార్చు]ఈ సంస్థ ఆర్థిక సమస్యలతో 2021 లో కార్యకలాపాలు నిలిపివేసే నాటికి ఈ కింది విమానాలు దాని ఆధీనంలో ఉండేవి.[14][15][16][17]
విమానం | సేవా స్థితి | ఆర్డర్లు | ప్రయాణికులు | గమనికలు | |||
---|---|---|---|---|---|---|---|
F | J | Y | Total | ||||
బోయింగ్ 737-800 | 2 | — | — | 12 | 156 | 168 | 30 కి పైగా స్పైస్ జెట్ స్వంతం చేసుకుంది, 9 విస్తారా స్వంతం చేసుకుంది. |
బోయింగ్ 737-900 | 1 | — | — | 28 | 138 | 166 | |
బోయింగ్ 777-300ER | 5 | — | 8 | 30 | 308 | 346 | All aircraft to be refurbished with new interiors after restart[18] |
బోయింగ్ 787-9 | — | 10[19] | TBA | ||||
Total | 8 | 10 |
దివాలా, సేవల విరమణ
[మార్చు]నవంబర్ 2018 నాటికి, పెరుగుతున్న నష్టాల కారణంగా జెట్ ఎయిర్‌వేస్ ప్రతికూల ఆర్థిక దృక్పథాన్ని కలిగి ఉన్నట్లు నివేదించబడింది. మార్చి 2019లో జెట్ ఎయిర్‌వేస్ విమానాలలో దాదాపు నాల్గవ వంతు అద్దెలు చెల్లించకపోవటంతో నిలిచిపోయాయి. [20] 25 మార్చి 2019న, నరేష్ గోయల్ , అతని భార్య అనిత గోయల్ డైరెక్టర్ల బోర్డు నుండి వైదొలిగారు.
ఏప్రిల్ 5న, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బకాయిలు చెల్లించలేదని విమానయాన సంస్థకు ఇంధన సరఫరాను నిలిపివేసింది. [21] ఏప్రిల్ 17న, రుణదాతలు రూ. 4 బిలియన్ల అత్యవసర నిధిని తిరస్కరించడంతో ఎయిర్‌లైన్ అన్ని విమాన కార్యకలాపాలను నిలిపివేసింది. [22] ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) లో సభ్యత్వం కోల్పోయింది. [23] జూన్ 17న, ఎతిహాద్ ఎయిర్‌వేస్, హిందూజా గ్రూప్ నుండి ఎటువంటి ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలు రాకపోవడంతో, జెట్ ఎయిర్‌వేస్ రుణదాతలు $1.2 బిలయన్ల అప్పును వసూలు చేయుటకు దివాలా ప్రక్రియ ప్రారంభించడానికి కంపెనీని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆశ్రయించటానికి నిర్ణయించుకున్నారు.[24] [25]
ఇద్దరు రుణదాతలకు చెల్లింపులు జరపనందున నెదర్లాండ్స్‌లో దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్నందున, NCLAT (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్) అంతర్జాతీయ పరిధిలో దివాలా ప్రక్రియను అనుమతించింది, "డచ్ ట్రస్టీ (అడ్మినిస్ట్రేటర్)" "భారత పరిష్కార వృత్తిపరుడు" సహకరించుకుంటారని పేర్కొంది." [26]
2020 ప్రారంభంలో, ఎన్సో గ్రూప్, రష్యన్ ఫార్ ఈస్ట్ డెవలప్‌మెంట్ ఫండ్‌తో దాని రుణదాతల కమిటీ (CoC) నుండి దానిలో నియంత్రణ వాటాను కొనుగోలు చేయడానికి చర్చలలో పాల్గొంది. చర్చలు విఫలమయ్యాయి. [27] [28]
పునఃప్రారంభ ప్రక్రియ
[మార్చు]వ్యాపారియైన మురారి లాల్ జలాన్, శ్రేణి భూమి, సాంకేతికాల వ్యాపారాలలో అనుభవమున్న ఫ్లోరియన్ ఫ్రిట్ష్ స్థాపించిన ఫ్రిట్ష్ గ్రూప్‌లోని కాల్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ ప్రతిపాదనను రుణదాతలు ఆమోదించగా, జెట్ ఎయిర్‌వేస్ FY 2022-23 మొదటి త్రైమాసికంలో విమానాలను తిరిగి ప్రారంభించనుంది.[29] 22 జూన్ 2021న, కల్రాక్-జలాన్ కన్సార్టియం ప్రతిపాదించిన తీర్మానాన్ని NCLT ఆమోదించింది.[30] జెట్ ఎయిర్‌వేస్‌కు విమానాశ్రయ స్లాట్‌లను కేటాయించడానికి ఎన్‌సిఎల్‌టి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు 90 రోజుల గడువు ఉత్తర్వును మౌఖికంగా ఇచ్చింది. [31] రెండవ దశ జెట్ ఎయిర్‌వేస్ ఆరు విమానాలతో పూర్తి సేవల దేశీయ విమానయాన సంస్థగా 2022 వేసవిలో ప్రారంభం కానుంది. [32]
వివాదాలు
[మార్చు]ట్రేడ్ మార్క్ వివాదం
[మార్చు]జెట్ ఎయిర్‌వేస్ జూన్ 2005లో బ్రస్సెల్స్ మీదుగా నెవార్క్‌కు సేవలను ప్రారంభించాలని భావించారు. మార్చి 2005లో, విమానయాన సంస్థ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కు దరఖాస్తును సమర్పించింది; అయితే, బెథెస్డా, మేరీల్యాండ్‌లో ఉన్న US రిజిస్టర్డ్ కంపెనీ జెట్ ఎయిర్‌వేస్ ఇంక్ అనే సంస్థ CEO, నాన్సీ హెకర్‌మాన్, ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన, ఇంకా జెట్ ఎయిర్ వేస్ సంస్థకు ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ ఈ దరఖాస్తును వ్యతిరేకించారు. జెట్ ఎయిర్‌వేస్ ఈ ఆరోపణలను తిప్పికొట్టింది. ఇది కేవలం ప్రచారం కోసమే చేసిందని పక్కకు పెట్టింది.[33]
భద్రత
[మార్చు]హీత్రూ విమానాశ్రయంలో జెట్ ఎయిర్ వేస్ తరపున సెక్యూరిటీ ఏజెంట్‌గా పనిచేస్తున్న ఒప్పంద కార్మికుడైన అస్మిన్ తారిక్, 2006 ఆగస్టు 10న మూడు వేర్వేరు US ఎయిర్‌లైన్స్‌కు చెందిన అనేక అట్లాంటిక్ విమానాలను పేల్చివేయడానికి విఫలమైన ఉగ్రవాద కుట్రలో చిక్కుకున్నాడు.[34] తదనంతరం, UK, సింగపూర్ ప్రభుత్వాలు జెట్ ఎయిర్‌వేస్‌పై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి భద్రతా సంబంధిత సమాచారాన్ని అభ్యర్థించాయి; దాంతో యుఎస్‌కి వెళ్లేందుకు క్లియరెన్స్ మరింత ఆలస్యం అయింది.[34] US స్టేట్ డిపార్ట్‌మెంట్ 2006 నవంబర్ 15న అమెరికాకు వెళ్లేందుకు విమానయాన సంస్థకు అనుమతి ఇచ్చింది.[35]
2014 ఆగస్టులో, 280 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం ముంబై నుండి బ్రస్సెల్స్‌కు వెళ్లే మార్గంలో 5,000 అడుగుల (1,500 మీ) ప్రయాణం మధ్యలో అకస్మాత్తుగా కిందికి దింపిన కారణంగా జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఇద్దరు పైలట్లు తాత్కాలికంగా విధులకు దూరమయ్యారు.[36]
వినియోగదారుల సేవా లోపాలు
[మార్చు]2016 డిసెంబర్ 2న, భోపాల్ నుండి ముంబైకి వెళ్లే జెట్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ 9W7083 ముంబైకి బయలుదేరిన పెద్ద ప్రయాణీకుల బృందం మొత్తాన్ని బుక్ చేశారు. ఒక రాజకీయ నాయకుడి వివాహ వేడుక కి సంబంధించి, వారి పార్టీకి చెందిన అదనపు సభ్యులకు వసతి కల్పించడానికి క్యాబిన్ సిబ్బంది సాధారణ ప్రయాణికులను దింపడానికి బలవంతం చేయడానికి ప్రయత్నించారని ఇతర ప్రయాణీకుల నుండి ఆరోపణలు వచ్చాయి. కానీ ఎయిర్‌లైన్ మాత్రం తమ బుకింగ్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం కారణంగా ఓవర్‌బుకింగ్‌కు దారితీసిందని పేర్కొంది.[37]
అవినీతి
[మార్చు]2016లో, ఈ సంస్థ దక్షిణాఫ్రికాలో జరిగిన గుప్తా కుటుంబ వివాదంలో చిక్కుకుంది. సౌత్ ఆఫ్రికన్ ఎయిర్‌వేస్ వారి భారతదేశ మార్గాన్ని విడిచిపెట్టడానికి ఏర్పాట్లు చేయడానికి అంగీకరించినట్లయితే, అప్పుడు జెట్ ఎయిర్‌వేస్ దానిని కొనుగోలు చేయవచ్చనీ అలా చేస్తే జెట్ ఎయిర్ వేస్ కుటుంబ సభ్యులు, ఆమెకు అధ్యక్షుడు జాకబ్ జుమా తరఫున మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ పదవి వచ్చేలా చూస్తామని చెప్పినట్లు మాజీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఎంపీ వైట్జీ మెంటార్ ఆరోపించారు.[38][39][40]
మాఫియాతో సంబంధాలు
[మార్చు]2001 డిసెంబర్ 12న, భారతీయ గూఢచార సంస్థలైన రా, ఐబి భారత హోం మంత్రిత్వ శాఖకు పంపించిన నివేదికలో దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, ఇంకా భారతీయ అండర్ వరల్డ్‌లోని ఇతర ముఠాలతో జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక లావాదేవీలకు అడపాదడపా సంబంధాలు కలిగి ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ సమాచారం మీడియాకు లీక్ అయింది.[41][42] పార్లమెంటు కార్యకలాపాలు నిలిచిపోయాయి.[42] తదనంతరం 2016లో, జెట్ ఎయిర్‌వేస్‌కు ప్రారంభ పెట్టుబడి ఐల్ ఆఫ్ మ్యాన్ నుండి డొల్ల కంపెనీల ద్వారా వచ్చిందనీ, భారతీయ అండర్ వరల్డ్ ద్వారా భారీగా నిధులు సమకూరినట్లు నివేదికలు వెలువడ్డాయి.[43] ఇది ఎ ఫీస్ట్ ఆఫ్ వల్చర్స్ అనే పుస్తకంలో వివరంగా నమోదు చేయబడింది.[44]
ప్రత్యేక రంగులు
[మార్చు]1993–2007
[మార్చు]1993 నుంచి 2007 వరకు జెట్ ఎయిర్ వేస్ విమానానికి నెవీ బ్లూ, పలచని ఊదా (లైట్ గ్రే), క్రోమ్ ఎల్లో రంగులు వాడేవారు. విమానం పైన, అడుగు భాగంలో పలచని ఊదా, ఎగురుతున్న సూర్యుని లోగోను నెవీ బ్లూ బ్యాక్ గ్రౌండ్ లో ముద్రించేవారు.
2007–2021
[మార్చు]జెట్ ఎయిర్ వేస్ యొక్క ప్రస్తుతం ఉపయోగిస్తున్న రంగులు 2007 లో పరిచయం చేశారు. చిక్కటి నీలిరంగు, బంగారు వర్ణంతో కలయికతో జెట్ ఎయిర్ వేస్ విమానాలను పాత మోడల్ లాగానే "ఎగురుతున్న సూర్యుడు "లోగో ముద్రించారు.[45]
సేవలు
[మార్చు]ప్రయాణీకులకోసం నాణ్యమైన విమానాశ్రయ లాంజ్ లు, కోచ్, బస్సు సౌకర్యం, వెబ్ చెకిన్ వంటి ఆన్ గ్రౌండ్ సేవలను అందించింది. రుచి, నాణ్యమైన భోజనంతో పాటు సుస్వర సంగీతం, సుప్రసిద్ధ సినిమాల వంటి వినోద సౌకర్యాలు కల్పించింది. సౌకర్యవంతమైన సీట్లవల్ల ఎలాంటి అలసట లేకుండానే తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని గమ్యస్థానం చేరుకునే సౌకర్యం ఉంది. విమానంలో సహాయక సిబ్బంది కావాల్సిన సదుపాయాలు, సహాయం అందించడం పాటు ప్రయాణికులతో పాటు వారివెంట తీసుకెళ్లే జంతువుల (పెట్స్) కు కూడా మందులు అందుబాటులో ఉంచేవారు. తరుచూ జెట్ ఎయిర్ లైన్స్ విమానాల్లో ప్రయాణించే వారికి జెట్ ప్రివిలేజ్ లో భాగస్వామ్యం ద్వారా మరిన్ని బోనస్ లు, సదుపాయాలు కల్పించేవారు.
అవార్డులు
[మార్చు]- బిజినెస్ ట్రావెల్స్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉత్తమ ప్రథమ శ్రేణి సేవలు అందించిన వారికిచ్చే “ఉత్తమ వాణిజ్య ట్రావెల్”అవార్డులు
- ఉత్తమ వాణిజ్య తరగతి, ఉత్తమ ఎకానమి తరగతి కింద బిజినెస్ ట్రావెల్ ఆవార్డులు
- 2006, 2007 సంవత్సరాలకు గానూ ఉత్తమ కార్యక్రమాల ఫ్రెడ్డీ అవార్డులు
- 2009 లో టఫీ అందించిన భారత్ నుంచి ఉత్తమ ఈస్ట్ బౌండ్ ఎయిర్ లైన్ అవార్డు, ఉత్తమ భారత దేశీయ ఎయిర్ లైన్ అవార్డు.
- లండన్ లోని బిజినెస్ ట్రావెల్ వారి ఉత్తమ భారతీయ ఎయిర్ లైన్ అవార్డులతో పాటు ఎన్నో దేశీయ, అంతర్జాతీయ అవార్డులు.
సంఘటనలు ప్రమాదాలు
[మార్చు]- 2007 జూలై 1 నాడు జెట్ ఎయిర్ వేస్ విమానం 3307, ATR 72-212A భోపాల్ - ఇండోర్ మార్గంలో ఎగురుతుండగా తుఫాను కారణంగా ప్రమాదంలో చిక్కుకుంది. ఆ సమయంలో విమానంలో 45 మంది ప్రయాణికులు, 4గురు విమాన సిబ్బంది ఉన్నప్పటికీ ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. విమానంలోని కొంతభాగం దెబ్బతినడంతో దీన్ని మరమ్మతుల కోసం పంపించారు.[46]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Jet Airways". ch-aviation. Archived from the original on 5 ఆగస్టు 2017. Retrieved 2 ఆగస్టు 2017.
- ↑ "JO 7340.2G Contractions" (PDF). Federal Aviation Administration. 2 ఆగస్టు 2017. pp. 3–1–17. Archived (PDF) from the original on 11 జూన్ 2017. Retrieved 2 ఆగస్టు 2017.
- ↑ Kundu, Rhik (2019-11-14). "Seven month after Jet's grounding, JetPrivilege renamed InterMiles". Livemint (in ఇంగ్లీష్). Mint. Retrieved 2019-11-17.
- ↑ "Jet Airways' frequent flier programme JetPrivilege is now InterMiles. The benefits and riders, explained". cnbctv18.com (in అమెరికన్ ఇంగ్లీష్). 15 November 2019. Retrieved 2019-11-17.
- ↑ "Airline Membership". IATA. Retrieved 12 June 2011.[dead link]
- ↑ 6.0 6.1 Company history, Jet airways. The Economic Times (Report). Archived from the original on 3 January 2016. Retrieved 25 March 2016.
- ↑ 7.0 7.1 "Audited Financial Year Results for the Financial Year ended 31st March 2018" (PDF). JetAirways. Archived from the original (PDF) on 14 జూన్ 2018. Retrieved 10 May 2018.
- ↑ Jet Airways Annual Report 2017 (PDF) (Report). Jet Airways. Archived from the original (PDF) on 22 December 2015. Retrieved 19 December 2017.
- ↑ "Fact Sheet". Jet Airways. 9 December 2010. Archived from the original on 22 January 2015.
- ↑ "NCLT admits lenders' move for bankruptcy proceedings against Jet Airways". 20 June 2019.
- ↑ "Jet Airways to start ops early 2022 after revalidation of AOP". 18 December 2022. Archived from the original on 2022-03-08.
- ↑ "India raises status of air taxi operators". Flightglobal. 21 September 1994. Retrieved 16 February 2019.
- ↑ "Our Network". Jet Airways. 16 November 2012. Archived from the original on 22 January 2015.
- ↑ "Nearly 70 Percent of Jet Airways' Fleet Grounded as Airline Suspends International Operations". airlinegeeks.con. Retrieved 17 April 2019.
- ↑ "Fleet Information". Jet Airways. Archived from the original on 20 March 2016. Retrieved 5 September 2018.
- ↑ "Customer Orders". Boeing. Retrieved 7 October 2012.
- ↑ "Jet Airways Fleet". planespotters.net. Retrieved 14 May 2019.
- ↑ "Jet Airways plans to scrap first class in its Boeing 777 planes". The Economic Times. Retrieved 23 November 2017.
- ↑ "Boeing, Jet Airways Announce Order for 10 787 Dreamliners". Boeing. Retrieved 2 January 2007.
- ↑ flightglobal.com 8 March 2019
- ↑ "Indian Oil Corporation stops fuel supply to Jet Airways". The Times of India. Retrieved 5 April 2019.
- ↑ Chowdhury, Anirban (17 April 2019). "Jet Airways to suspend all operations from tonight". The Economic Times. Retrieved 17 April 2019.
- ↑ "Airlines body IATA suspends Jet Airways from clearing house membership". theweek.in.
- ↑ Gopakumar, Gopika (17 June 2019). "Banks give up on Jet Airways' revival, choose to send it to bankruptcy court". Mint. Retrieved 17 June 2019.
- ↑ "Jet Airways' lenders start insolvency proceedings". cityam. 17 June 2019. Retrieved 17 June 2019.
- ↑ "Jet Airways First Indian Company To Face Cross-Border Insolvency: Report". NDTV Profit.
- ↑ "Beleaguered Jet gets another EOI; CoC extends deadline for resolution plan". Business Standard India. 18 February 2020.
- ↑ "Jet lenders extend deadline till March 9 for bid submission".
- ↑ Balachandran, Manu (21 October 2020). "From Ranchi to Tashkent via Dubai: The mysterious man gearing up to fly Jet Airways". Forbes India. Retrieved 24 November 2020.
- ↑ DelhiJune 22, India Today Web Desk New; June 22, 2021UPDATED; Ist, 2021 14:15. "Jet Airways revival plan gets approval, shares hit 5% upper circuit". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-06-22.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Kalrock-Jalan cleared to restart Jet". The Hindu (in Indian English). Special Correspondent. 2021-06-22. ISSN 0971-751X. Retrieved 2021-06-25.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ Dec 17, Saurabh Sinha / TNN / Updated; 2021; Ist, 21:41. "'Jet-2 to resume domestic flights next summer with 6 planes' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-01-04.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Jet Air to take legal action against US company". Rediff.com. 6 June 2005. Archived from the original on 5 April 2016. Retrieved 25 March 2016.
- ↑ 34.0 34.1 "UK seeks information on Jet Airways". The Economic Times. 19 August 2006. Retrieved 25 March 2016.
- ↑ Sharma, Praveen (16 November 2006). "Jet gets green signal for US flight". DNA. Retrieved 25 March 2016.
- ↑ "Jet Airways plane plunges 1500 meters over Turkey". News.com. 15 August 2014. Archived from the original on 16 August 2014. Retrieved 16 August 2014.
- ↑ "Jet airways apologises for flight delay". Sify. 2 December 2016. Archived from the original on 20 December 2016. Retrieved 3 December 2016.
- ↑ "'Zuma said it's OK Ntombazana,' says former ANC MP Vytjie Mentor". Times Live. 18 March 2016. Archived from the original on 20 April 2016. Retrieved 13 April 2016.
- ↑ "Vytjie Mentor: I can prove Zuma was with me in the Gupta house". Rand Daily Mail. 17 March 2016. Archived from the original on 22 April 2016. Retrieved 10 April 2016.
- ↑ "Guptas use Waterkloof airforce base as private landing strip". eNCA. 30 April 2013. Archived from the original on 16 February 2016. Retrieved 9 February 2016.
- ↑ "Jet airways got dubious Dubai funds". The Times of India. Retrieved 15 November 2018.
- ↑ 42.0 42.1 Joseph, Josy (2 October 2016). A Feast of Vultures—The Hidden Business of Democracy in India. Mumbai: Harper Collins.
- ↑ "A jet propelled by Don Ibrahim". Outlook India. 16 June 2016. Retrieved 15 November 2018.
- ↑ Joseph, Josy. "A feast of vultures". afeastofvultures.com. Official website. Archived from the original on 15 అక్టోబరు 2018. Retrieved 15 November 2018.
- ↑ "Jet Airways sports new look". Business Standard. 1 April 2007.
- ↑ "Aviation Safety Network Accident Description". Aviation Safety Network. 5 September 2013.