ఆత్మారాం భెండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆత్మారాం భెండే ప్రముఖ రంగస్థల కళాకారుడు. ఆయన సినిమాల్లోనూ నటించాడు. అంతేకాక పలు సినిమాలలో దర్శకునిగా, నిర్మాతగా పనిచేసారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన మే 7 1923మహారాష్ట్రలో జన్మించారు.[1] ఆయన ముంబై లోని వీరమాత జిజాబాయి టెక్నలాజికల్ ఇనిస్టిట్యూట్ లో ఇంజనీరింగ్ చదివారు.భెండే ఇండియన్ నేషనల్ థియేటరు నుండి తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. దూరదర్శన్ లో అనేక లఘు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మరాఠీ చిత్రాలతో పాటు హిందీ, ఇంగ్లీషు సినీ పరిశ్రమలలో కూడా పనిచేసాడు. ఆరు దశాబ్దాలుగా మరాఠీ రంసస్థలంపై తన నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన వందలాది మరాఠీ నాటకాలకు నటునిగా, దర్శకునిగా పనిచేసారు. అనేక టెలివిజన్ షోలలోనూ, వాణిజ్య ప్రకటనలలోనూ కనిపిస్తున్న ఈ నటుడు 1954-60 లలో మరాఠీ నాట్యపరిషత్ కు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన డా.ఆశా భెండే అనబడే లిల్లీ ఎజెకిల్ ను వివాహం చేసుకున్నారు. ఆమె ప్రముఖ ఇండియన్ జెవిష్ కవి నిస్సిమ్ ఎజెకీల్ యొక్క సోదరి. ఆమె 2010 లో మరణించారు. వారికి ఒక కుమారుడులో భెండే. ఆయన కూడా మరాఠీ నటుడే. ఆయన కూడా 2014 ఏప్రిల్ లో మరణించారు.[2]

అవార్దులు

[మార్చు]

ఆత్మారాం భెండేకు నటాచార్య ప్రభాకర్, పజాశేఖర్, రంగభూమి జీవన సాఫల్య పురస్కారం, నాట్యదర్పణ, శంకరరావ్ ఘుణేకర్, నాట్యభూషణ్, చింతామణిరావు కొల్హాట్కర్, నట సామ్రాట్, నానాసాహెబ్ షాటక్, 2006-07లో మహారాష్ట్ర ప్రభుత్వంవారి రాజ్య సాంస్కృతిక పురస్కారం లభించాయి.[3]

మరణం

[మార్చు]

ఆయన పూణె లోని రత్నామెమోరియల్ హాస్పటల్ లో తన 93వ యేట ఫిబ్రవరి 6 2015 న మరణించారు.[4]

మూలాలు

[మార్చు]
  1. Actor Atmaram Bhende no more
  2. "Veteran theatre artist Atmaram Bhende passes away". SHOUMOJIT BANERJEE. The Hindu. Retrieved 7 February 2015.
  3. "నటుడు ఆత్మారాం భెండే కన్నుమూత". సాక్షి. Retrieved 7 February 2015.
  4. "Veteran actor Atmaram Bhende passes away". The Times of India. 7 February 2015. Retrieved 7 February 2015.

ఇతర లింకులు

[మార్చు]