ఆదర్శవంతుడు
Appearance
ఆదర్శవంతుడు (1989 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, రాధ, జగ్గయ్య |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
గీతరచన | ఆత్రేయ |
నిర్మాణ సంస్థ | మహీజా ఫిలిమ్స్ |
భాష | తెలుగు |
ఆదర్శవంతుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1989లో విడుదలైన తెలుగు సినిమా. మహీజా ఫిల్మ్ పతాకం పై సి హెచ్. ప్రకాష్ రావు నిర్మించిన ఈ చిత్రం లో అక్కినేని నాగేశ్వరరావు, రాధ, శ్యామల గౌరి, జగ్గయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరు రాజేశ్వరరావు అందించారు.
నటీనటులు
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు
- రాధ
- శ్యామల గౌరి
- జగ్గయ్య
- గొల్లపూడి మారుతీరావు
- అంజలీదేవి
- అత్తిలి లక్ష్మి
- నూతన్ ప్రసాద్
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: కొడి రామకృష్ణ
సంగీతం.సాలూరి రాజేశ్వరరావు
నిర్మాత: సి.హెచ్.ప్రకాష్ రావు
నిర్మాణ సంస్థ: మహీజా ఫిలింస్
సాహిత్యం:ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎం.రమేష్ .
విడుదల:07:12:1989.
పాటలు
[మార్చు]- ఏమిటో అవుతోంది ఎట్టాగో ఉంటోంది ఈడొచ్చి మీద - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- జీవితమంటే జీవించడమే జీవిస్తే అది నందనమే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
- నీలి నీలి నింగిలో చీకట్లు చీకటైన నేలపై వెన్నెల్లు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం
- పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ ( శ్లోకం ) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- పుట్టి పెరిగేది భూమిపైన గిట్టి కలిసేది మట్టిలోన - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
- పేదలేని రోజు మహారాజు లేని రోజు అది లోకమంతా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)