Jump to content

ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు (కృష్ణపట్నం)

వికీపీడియా నుండి

ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు నెల్లూరూ జిల్లాకు చెందిన కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారుచేసిన ఔషథం. ఈ మందు కరోనా వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడుతుందని ప్రజలు భావిస్తున్నారు. అతను కరోనా వ్యాధి నిర్మూలన కొరకు వివిధ రకాల మందులను తయారుచేసాడు. ఆ మందులలో కొన్ని కరోనా పొజిటివ్ వచ్చే రోగులకు, మరికొన్ని కరోనా వ్యాధి సోకకుండా ఉండేందుకు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాడు. కరోనా వ్యాధిని కట్టడి చేస్తున్నట్లు భావిస్తున్న ఈ మందును తయారుచేసిన ఆనంద్ కుటుంబం ఆయుర్వేద ఔషధాలను తయారుచేసే నేపథ్యం ఉంది. అతను డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతపై మక్కువ ఎక్కువ ఉండటం వల్ల వెంకటయ్య స్వామి శిష్యుడు గురవయ్య స్వామి దగ్గర శిష్యరికం కూడా చేశాడు. ఆ సమయంలో ఆయుర్వేద మందులపై పట్టు సాధించాడు. ఆయుర్వేదంలో తనకున్న అనుభవంతో కరోనాను కట్టడి చేసే మందును తయారు చేసి ముందుగా కృష్ణపట్నం గ్రామ ప్రజలకు ముందుగా అందించాడు. [1] [2][3]


మందు తయారీ

[మార్చు]

ఈ ఆయుర్వేదం మందు తయారీలో ఉపయోగిస్తున్నవి తిప్పతీగ,లవంగాలు, వేపాకు,మామిడి చిగురు, నేరేడు ఆకు, పిప్పింటాకు, బుడబుడసాకు,తాటిబెల్లం, పట్ట, తేనె, నేల ఉసిరి, కొండ పల్లేరుకాయలు, జాజికాయ వంటివి వాడుతున్నారు.[4]

మందు పంపిణీ

[మార్చు]

ఈ మందు 5 రకాల మందులను పంపిణీ చేస్తున్నాడు.కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచడానికి ఒక మందు, క‌రోనా వచ్చిన నాలుగు రకాల మందులను పంపిణీ చేస్తున్నాడు.కరోనా రాకుండా ‘పీ’ రకం మందును, కోవిడ్‌ వచ్చిన వారికి పీ, ఎఫ్, ఎల్, కే రకాలను ఇస్తున్నారు.

  • పీ మందు: ఈ మందు కరోనా ఉన్నవారు, లేనివారు వాడవచ్చు. ఈ మందులో తెల్ల జిల్లేడు, నేరేడు ఇగురు, వేప ఇగురు,మారేడు ఇగురు, దేవర్‌ దంగిలే, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, ఫిరంగి చెక్క పొడి వంటివి వాడుతున్నారు.
  • ఎల్‌ మందు: ఈ మందు పాజిటివ్‌ ఉన్న వారికే ఇస్తునారు. ఈ మందులో నేల ఉసిరి, గుంట గలగర ఆకులు ఒక బకెట్, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనె వంటివి వాడుతున్నారు.
  • ఎఫ్‌: ఈ మందు పాజిటివ్‌ ఉన్న వారికే ఇస్తునారు.ఈ మందులో పుప్పింటి ఆకు,నల్ల జీలకర్ర, పసుపు,మిరియాలు, పసుపు, పిప్పళ్లు, జాజికాయ, తేనెలను ఆన్నింటిని కలిపి చూర్ణంగా ఇస్తున్నారు.
  • కే: ఈ మందు పాజిటివ్‌ ఉన్న వారికే ఇస్తునారు.ఇందులో పెద్ద పల్లేరు కాయలు మిరియాలు, పసుపు, పిప్పళ్ల చెక్క,నల్ల జీలకర్ర, పట్టా, జాజికాయ, తేనెలను ఆన్నింటిని కలిపి చూర్ణంగా ఇస్తున్నారు.
  • ఐ:ఆక్సిజన్‌ 95% తగ్గిన వారికి కంటిలో డ్రాప్స్‌ వేస్తున్నారు. తేనె, ముళ్ల వంకాయ గుజ్జు, తోక మిరియాలను వినియోగిస్తారు. పల్స్‌ తీవ్రను బట్టి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క డ్రాప్‌ వేయాలి.[5][6]

మందు పంపిణీ నిలిపివేత

[మార్చు]

ఈ మందుకు పూర్తి స్థాయి అధ్యయనం చేయాల్సిన నేపథ్యంలో మందు పంపిణీని అధికారులు నిలిపివేశారు.మందు శాస్త్రీయతపై సందేహాల నేపథ్యంలో నివృత్తి చేసేందుకు వైద్య బృందాలు రంగంలో దిగాయి. పూర్తి స్థాయి అధ్యయనం తరువాతే అనుతిచ్చేందుకు తాత్కాలికంగా మందు పంపిణీని నిలిపివేశారు. దీనిపై ఆయుష్ కమీషనర్ రాములు ఆధ్వర్యాన అధ్యయనం కొనసాగుతోంది.

Tv9 ఇంటర్వ్యూ

[మార్చు]

Tv9 Telugu ఛానల్ ఇంటర్వ్యూ లో రజినీకాంత్ వెల్లలచెరువు ఆనందయ్య మందు ఒక నాటు మందు అని చర్చ చేయడం కాంట్రవర్సీ కి దారి తీసింది. [1] [2][3] Archived 2023-06-14 at the Wayback Machine[4] Archived 2023-06-14 at the Wayback Machine

మూలాలు

[మార్చు]
  1. May 21, Ujwal Bommakanti / TNN / Updated:; 2021; Ist, 15:26. "Hundreds line up for 'mystery medicine' to cure Covid-19 in Nellore | Vijayawada News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-22. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. "కృష్ణపట్నం: కరోనా ఆయుర్వేద మందు కోసం తోపులాట, పోలీసుల లాఠీఛార్జి". BBC News తెలుగు. Retrieved 2021-05-22.
  3. Correspondent, Special (2021-05-19). "Ayurvedic 'cure' for COVID draws large crowds in Nellore". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-05-22.
  4. "ఆనందయ్య కరోనా మందు ఎఫెక్ట్: ఆస్పత్రి వార్డు ఖాళీ, తల్లి వారసత్వమే." Asianet News Network Pvt Ltd. Retrieved 2021-05-21.
  5. "కరోనాకు ఆనందయ్య మందు!". Sakshi. 2021-05-22. Retrieved 2021-05-22.
  6. "కృష్ణపట్నం ఆయుర్వేద మందు కోసం పోటెత్తిన జనం". ETV Bharat News (in ఇంగ్లీష్). Retrieved 2021-05-22.