Jump to content

ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం

వికీపీడియా నుండి

ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం ఒక సందేశాత్మకమైన తెలుగు సినిమా పాట. దీనిని అనుబంధం (సినిమా) (1984) కోసం ఆచార్య ఆత్రేయ రచించగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. చక్రవర్తి సుమనోహరమైన సంగీతాన్ని అందించారు. ఈ పాటలో అక్కినేని నాగేశ్వరరావు, ప్రభాకర రెడ్డి నటించారు.

సంక్షిప్తంగా పాట

[మార్చు]

పల్లవి:
ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం
ఆరోజులు మునుముందిక రావేమిరా
లేదురా ఆ సుఖం రాదురా ఆ గతం ఏమిటో జీవితం
గోడలు దూకిన రోజులు
మోకాలికి తగిలిన దెబ్బలు
చీకటిలో పిల్లనుకొని
ఒరే... పక్కనే పెళ్ళికావలసిన పిల్లలున్నార్రా
నేర్చుకుంటార్రా...

చరణం1:
నేను మారలేదు నువ్వు మారలేదు
కాలం మారిపోతే నేరం మనదేమి కాదు
ఈ నేల ఆ నింగి ఆలాగె వున్నా
ఈ గాలి మోస్తుంది మన గాధలెన్నో
నెమరేసుకుందాము ఆ రోజులు
భ్రమలాగ వుంటాయి ఆ లీలలు
ఆ మనసులు ఆ మమతలు ఏమాయెరా
ఒరే రాస్కెల్ జ్ఞాపకముందిరా కాలేజిలో క్లాస్ రూములో
ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే
ఆ పాప యెడమ కాలి చెప్పు తీసుకొని
ఒరే ఉండరా ఊరుకోరా పిల్లలు వింటారు
వింటే వింటార్రా పిల్లల పిల్లలకు పిట్టకథలుగా చెప్పుకుంటారు. || ఆనాటి ||

చరణం2:
మనసే ఇచ్చినాను మరణం తెచ్చినాను
చితిలో చూసినాను చిచ్చై మండినాను
నా గుండె మంటింక ఆరేదికాదు
నేనుండి తనువెళ్ళి బ్రతుకింక లేదు
తన శాపమే నాకు తగిలిందిరా
రే పసిపాపలే లేని ఇల్లాయెరా
ఈ కన్నుల కన్నీటికి తుదియేదిరా
ఒరే ఒరే ఏమిట్రా పసిపాపలాగా ఛ ఛ ఊరుకో
ఒరే ఈ కన్నీళ్లకు తుది ఎక్కడ్రా
కర్చీఫ్ తో తుడిచేటమేరా || ఆనాటి ||

సాహిత్యం-అనుబంధాలు

[మార్చు]

ఈ పాట ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కలిసి పాడుకుంటారు. ఒకరు తనబాధల్ని చెప్పుకొంటుండగా మరొకరు తనను ఓదార్చుతారు. మారిపోతున్న కాలాన్ని దిగజారిపోతున్న అనుబంధాల్ని వారి చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకొంటారు. పాటలాగా కాకుండా హృదయాన్ని తాకుతూ ప్రవహిస్తున్న నదిలా సాగుతుంది ఈ గీతం. ఇందులో బాలు గానం, చక్రవర్తి సంగీతం అద్భుతం.

బయటి లింకులు

[మార్చు]