Jump to content

ఆరాంఘర్ ఫ్లైఓవర్

వికీపీడియా నుండి

ఆరాంఘర్ హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారుల్లో ఒకటి. ఆరాంఘర్ నుంచి జూపార్క్‌ వరకు నూతనంగా ఈ ఫ్లైఓవర్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను 2023 మార్చి నెలాఖరులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించగా నిధుల కొరత, సర్వీసు రోడ్డు భూసేకరణ ఆలస్యం కావడంతో చివరిగా 2025 డిసెంబర్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లైఓవర్​ను ప్రారంభించాడు.[1][2]

జూపార్కు- ఆరాంఘర్‌ ప్లైఓవర్​కు దివంగత ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్‌ ప్రకటించగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు.[3][4]

నిర్మాణ వివరాలు

[మార్చు]

ఆరాంఘర్ నుంచి జూపార్క్‌ వరకు ప్రారంభమయ్యే ఈ ఫ్లైఓవర్ ను 24 మీటర్ల వెడల్పుతో 6 లేన్లలో 4.08 కిలోమీటర్ల పొడవుతో 636.8 కోట్లతో[5] స్టాటిజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ) సౌజన్యంతో 2018లో నిర్మాణాన్ని ప్రారంభించారు.[6] ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వస్తే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లే వారితోపాటు మహబూబ్‌నగర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి, జూపార్క్‌కు వచ్చే సందర్శకులకు, పాతబస్తీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం సులభతరం అవుతుంది.

పనుల పరిశీలన

[మార్చు]

ఆరాంఘర్ నుండి జూపార్క్ వరకు 4.08 కిలోమీటర్ల నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్ 2022 జనవరి 20న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే్‌షకుమార్‌, జీహెచ్ఎంసీ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించాడు.[7][8]

ప్రారంభోత్సవం

[మార్చు]

ఆరాంఘర్‌ - జూపార్కు ప్లైఓవర్​కు 2021లో శంకుస్థాపన చేయగా, 2025 డిసెంబర్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లైఓవర్​ను ప్రారంభించాడు.[9] ఈ ఫ్లైఓవర్‌ కోసం ప్రభుత్వం రూ.799 కోట్లు ఖర్చుచేసింది. ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్ నగరంలోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత అత్యంత పొడవైనది.[10] ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖామంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్, మీర్జా రహమత్ బేగ్, మీర్ అమీర్ అలీఖాన్, మేయర్ గద్వాల్ విజలయక్ష్మీ, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[11]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (20 January 2022). "2023 మార్చిలోపు ఆరాంఘర్‌- జూపార్క్‌ పైవంతెన". Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
  2. Andhrajyothy (20 January 2022). "2023 మార్చిలోగా ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లై ఓవర్‌". Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
  3. "CM launches four kilometre flyover between Zoo Park and Aramghar" (in Indian English). The Hindu. 6 January 2025. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
  4. "ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లై ఓవర్‌కు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేరు". 6 January 2025. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
  5. The Hans India (16 September 2021). "New 4-km long flyover to dot Zoo Park-Aram Ghar stretch" (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2021. Retrieved 21 January 2022.
  6. The Times of India (20 January 2018). "Two flyovers in the pipeline to fix traffic woes, ensure hassle-free ride to airport" (in ఇంగ్లీష్). Archived from the original on 22 January 2018. Retrieved 21 January 2022.
  7. Namasthe Telangana (19 January 2022). "మార్చిలోగా ఆరాంఘర్‌ ఫ్లై ఓవర్‌." Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
  8. Sakshi (20 January 2022). "సాహోరే.. వారధులు! పాతబస్తీకే మణిహారాలు". Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
  9. "పాతబస్తీ కాదు.. ఇదే అసలైన నగరం". 7 January 2025. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
  10. "రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ ప్రారంభం." Andhrajyothy. 6 January 2025. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
  11. "రాజీ పడం.. మోదీతో కొట్లాడతాం!". Andhrajyothy. 7 January 2025. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.