ఆరేసుకోబోయి పారేసుకున్నాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"ఆరేసుకోబోయి పారేసుకున్నాను"
రచయితవేటూరి సుందరరామమూర్తి
సంగీతంకె.వి.మహదేవన్
సాహిత్యంవేటూరి సుందరరామమూర్తి
ప్రచురణఅడవి రాముడు (1977)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పి.సుశీల
చిత్రంలో ప్రదర్శించినవారుఎన్.టి.రామారావు, జయప్రద

ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. హరీ హరీ హరీ హరీ అనే పాట ఎన్. టి. రామారావు, జయప్రద నటించిన అడవిరాముడు సినిమా లోనిది.[1] ఈ పాటలో ఎన్.టి.ఆర్-జయప్రదల నడుమ వచ్చే రొమాంటిక్ డ్యూయెట్ అప్పట్లో పెద్ద సెన్సేషన్. మహదేవన్ కమర్షియల్ మూవీస్ కి అదిరిపోయే మ్యూజిక్ ఇస్తారు అన్నది ఈ సినిమా ద్వారా రుజువు అయింది. [2] ఈ పాట సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మంత్రముగ్దులైపోయారు. ఆ పాటకు ఎన్టీఆర్ అభిమానులు తెరపై డబ్బులు విసిరే వారంటే ఆ పాట ఏస్థాయిలో హిట్టయిందో అర్ధం చేసుకోవచ్చు.[3]

నేపథ్యం

[మార్చు]

అప్పట్లో ఆ పాట ఎంత ప్రజాదరణ పొందిందంటే, ఈ పాటని కోటి రూపాయల పాట అనేవారు. ఇప్పటికీ ఈ పాటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.[4] వేటూరి సుందరరామమూర్తి వాస్తవంగా ఈ పాటను ” అరెరెరెరెరె .. ఆరేసుకోబోయి పారేసుకున్నాను …” అని రాసారు. కె.వి.మహదేవన్ ఇక ఈ పాట రచన చూసి , “ఇలా అరెరెరెరె .. తో మొదలుపెడితే బాగోదు. దాన్ని కాస్తా హరి, హరి క్రింద మార్చి, ఆరేసుకొబోయి పారేసుకున్నాను తరవాత పెడితే బాగుంటుంది” అన్నారు. అలా ఆ పాట కంపోజింగ్‌ చేసారు. [5]

సుందరరామమూర్తి రాసిన తొలి ఫుల్ మాస్ సాంగ్ ఇది. 'ద‌స‌రా బుల్లోడు' సినిమాలోని "అరెరె ఎట్టాగో ఉంటాది ఓల‌మ్మీ.." పాట త‌ర‌హాలో "అరెరె ఆరేసుకోబోయి.." అంటూ పాట చేస్తే బాగుంటుంద‌ని నిర్మాత‌ల్లో ఒక‌రైన నెక్కంటి స‌త్య‌నారాయ‌ణ అతనికి సూచించారు. "అలా చేయ‌కూడ‌దు.. అరెరెరెల‌ని చివ‌రికి పెట్టి చేయాలి." అని క‌చ్చితంగా చెప్పాడతను.

ఎన్టీఆర్‌, జ‌య‌ప్ర‌ద జంట‌పై చిత్రీక‌రించిన ఆ పాట సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో దాన్ని 'కోటి రూపాయ‌ల పాట' అని పిలిచేవారు. వాడ‌వాడ‌లా ఆ పాట మోగిపోయింది. కేవ‌లం ఆ పాట కోస‌మే ప‌దే ప‌దే 'అడ‌వి రాముడు'ను చూసిన వాళ్లున్నారంటే న‌మ్మాలి.[6]

పాటలో కొంత భాగం

[మార్చు]

పల్లవి:
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..
నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి చలి చలి ఆఁహ్... చలి చలి
ఆరేసుకోవాల నారేసుకున్నావు హరి హరి హరి హరి
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ..
నాకు ఉడుకెక్కి పోతోంది హరి హరి హరి హరి హరి హరి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరీ హరి
చరణం 1:
నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ
నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకోనీ తొలిపొంగుల
ఆఆఆ నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ
నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకోనీ తొలిపొంగుల
నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి
హా.. నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి
నీ జంట నా చేతి చలి మంట కావాలి
నీవింక కవ్వించకే కాగిపోవాలి
నీ కౌగిలింతలోనే దాగిపోవాలి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..
నాకు ఉడుకెక్కి పోతోంది హరి హరి హరి హరి హరి హరి

అడవిరాముడు (2004) సినిమాలో...

[మార్చు]

ఈ పాటను అదే టైటిల్ తో ప్రభాస్ హీరోగా రూపొందిన ‘అడవి రాముడు’ చిత్రంలో ఆర్తి అగర్వాల్ చేత అదే స్థాయి రొమాన్స్ ను రిపీట్ చేయడానికి బి.గోపాల్ ప్రయత్నించినప్పటికీ.. ఫలితం దక్కలేదు.[7]

మూలాలు

[మార్చు]
  1. shivagopalsangu. "Aaresukoboyi Paresukunnanu Song Lyrics - Telugu, English, Meaning - Adavi Ramudu". Song Lyrics Collection, Music Knowledge, Indian Films, Love Song Lyrics (in ఇంగ్లీష్). Retrieved 2022-06-06.
  2. "ఎన్టీవోడి స్టైల్‌కు యూత్ ప‌డిపోయిన సినిమా ఏదో తెలుసా...! - Telugu Lives". Telugu Lives - Telugu Latest News (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-29. Retrieved 2022-06-06.
  3. "తెరపై డబ్బులు విసిరిన ఎన్టీఆర్-రాఘవేంద్రరావు సినిమా ఇదే." indiaherald.com. Retrieved 2022-06-06.
  4. "యూత్ కి విపరీతంగా నచ్చిన ఎన్టీఆర్ సినిమా ఎదో తెలుసా ? ఆ సినిమాతో యూత్ ఐకాన్ అయ్యారు !". Manam News (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-05-01. Retrieved 2022-06-06.
  5. "తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-06-06.
  6. "'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' పాట వెనుక క‌థ‌!". Teluguone (in english). 2022-06-06. Archived from the original on 2021-07-26. Retrieved 2022-06-06.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  7. Focus, Filmy (2018-11-28). "ఎన్.టి.ఆర్ బయోపిక్ కి గ్లామర్ ను అద్దిన హన్సిక - Filmy Focus" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-06-06.

బాహ్య లంకెలు

[మార్చు]