Jump to content

ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా

వికీపీడియా నుండి
ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా
ఆర్డర్ చిహ్నాలు , రెండవ తరగతి (పైన) మొదటి తరగతి, 1939 కు ముందు (కింద)
TypeOrder of merit
Awarded forసుదీర్ఘ కాలపు విశ్వసనీయమౌన గౌరవప్రదమైన సేవ
అందజేసినవారుబ్రిటిషు రాచరికం
Eligibilityవైస్రాయి కముషను పొందిన బ్రిటిషు భారత సైన్యం లోని ఆఫీసర్లు, భారత రాష్ట్రాల సైన్యాల్లోని, సర్హద్దు దళాల్లోని, సైనిక పోలీసు లోని భారతీయ అధికారులు
Post-nominalsOBI
Status1947 తర్వాత ఇవ్వలేదు
Established1837 ఏప్రిల్ 17

Ribbon 1837–1838

Ribbon 1838–1939

First Class ribbon 1939–1947

Second Class ribbon 1939–1947
Precedence
Next (higher)రాయల్ రెడ్ క్రాస్
Next (lower)కైసర్-ఇ-హింద్ మెడల్[1]
1939 నుండి ప్రెజెంటేషన్ కేస్‌తో 1 వ తరగతి డిజైన్ ఇన్‌సిన్యా ప్రదానం చేయబడింది

ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనేది "సుదీర్ఘమైన, విశ్వసనీయమైన, గౌరవప్రదమైన సేవ" చేసిన వారికి ఇచ్చేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ 1837 లో స్థాపించిన మెరిట్ ఆర్డర్. [2] సిపాయీల తిరుగుబాటు తర్వాత కంపెనీ అధికారాలను తొలగించారు. 1859 ఈ ఆర్డర్‌ను బ్రిటిష్ పురస్కార వ్యవస్థలో చేర్చారు. 1947 తరువాత ఈ ఆర్డర్ వాడుకలో లేదు.

శాసనం

[మార్చు]

భారతీయ సైన్యంలో వైస్రాయ్ నియమించిన అధికారులలో (అంటే స్థానిక భారతీయుడు) సుదీర్ఘమైన, విశ్వసనీయమైన, గౌరవప్రదమైన సేవ చేసిన వారి కోసం భారతదేశ వైస్రాయ్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాను ప్రదానం చేస్తారు. ఒక నిర్దిష్ట దండయాత్రలో విశిష్ట సేవలు చేసినవారికి ఈ ఆర్డర్ ప్రదానం చేయబడగా, 20 నుండి 30 సంవత్సరాల పాటు సేవ చేసిన అధికారులకు దీన్ని తరచుగా ఇచ్చేవారు

స్థాపన

[మార్చు]

1837 ఏప్రిల్ లో మొదటిసారిగా లార్డ్ విలియం బెంటింక్ ఆదేశించినప్పుడు, ఆర్డర్ ఈస్టిండియా కంపెనీ సైనిక దళాలలో పనిచేసే భారతీయ అధికారులకు గుర్తింపును ఇచ్చేందుకు గాను దీన్ని ఉద్దేశించారు. "స్థానిక అధికారులకు" తమ ఉద్యోగాల్లో పురోగతి సీనియారిటీ ద్వారా వచ్చేది. దీంతో ఈ ప్రమోషన్లు నెమ్మదిగా వచ్చేవి. 1 వ తరగతి ఆర్డర్‌ను 100 మంది సుబేదార్‌లు, రిసల్‌దార్‌లకు (సీనియర్ భారతీయ అధికారి ర్యాంకులు) సర్దార్ బహదూర్ బిరుదును ప్రదానం చేసేవారు. వారికి రోజుకు రెండు రూపాయల మేర జీతం పెరుగుతుంది. 2 వ తరగతికి నియామకాలు, ఏ ర్యాంకైనా ఉన్న 100 మంది భారతీయ అధికారులకు ఇచ్చేవారు. వారికి బహదూర్ బిరుదుతో పాటు, తక్కువ వేతన పెంపు లభించేది. 1856 లో కలకత్తా రివ్యూలో ప్రచురించబడిన ఒక కథనంలో హెన్రీ లారెన్స్, ఈ ఆర్డర్ "వాస్తవంగా వృద్ధాప్య బహుమతి" గా మారిందని అభిప్రాయపడ్డాడు.

మలి చరిత్ర

[మార్చు]

1939 సెప్టెంబరులో భారత రాష్ట్రాల దళాలు, సరిహద్దు దళాలు, మిలిటరీ పోలీసులలో పనిచేసే స్థానిక అధికారులను కూడా ఈ ఆర్డరు అర్హుల్లో చేరుస్తూ విస్తరించారు. [3] 1944 జనవరిలో మరింతగా విస్తరిస్తూ రాయల్ ఇండియన్ నేవీ, హాంకాంగ్‌ అండ్ సింగపూర్ రాయల్ ఆర్టిలరీల్లో పనిచేసే స్థానిక అధికారులు, భారతీయ వారెంట్ ఆఫీసర్‌లనూ చేరుస్తూ విస్తరించారు. అలాగే విదేశీ అధికారులను ఆర్డర్ గౌరవ సభ్యులుగా నియమించబడతారు. [4]

స్వరూపం

[మార్చు]

ఆర్డర్‌ను రెండు తరగతులలో ప్రదానం చేసారు. రెండింటినీ రిబ్బనుతో మెడలో ధరించేవారు: [5]మొదటి తరగతి. బ్యాడ్జిలో 1.7 అంగుళాలు (43 mమీ.) వ్యాసంలో బంగారు నక్షత్రం, బంగారు కిరణాలతో కూడి ఉంటుంది. మధ్యలో ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే పదాలు లేత నీలం ఎనామెల్ నేపథ్యంలో ఉండే సింహం బిమ్మ చుట్టూ ఉంటాయి. దాని చుట్టూ లారెల్ పుష్పగుచ్ఛము ఉంటుంది. దానిపై కిరీటం ఉంటుంది. పదాల వెనుక ఉన్న ఎనామెల్, మొదట్లో ముదురు నీలం రంగులో ఉండేది. 1939 లో దాన్ని సింహం వెనుక కనిపించే లేత నీలం రంగులోకి మార్చబడింది. [5] మొదటి తరగతి గ్రహీతలు సర్దార్ బహదూర్ (వీరోచిత నాయకుడు) అనే బిరుదును ఉపయోగించడానికి అర్హులు. [3]రెండవ తరగతి బ్యాడ్జి కొద్దిగా చిన్న బంగారు నక్షత్రంతో (1.5 అంగుళాలు (38 mమీ.) వ్యాసం), మొదటి తరగతి లాంటి డిజైన్ తోటే, కానీ కిరీటం లేకుండా, ముదురు నీలం సెంటర్ ఎనామెల్‌తోఉండేది. రెండవ తరగతి గ్రహీతలు బహుదూర్ (హీరో) అనే బిరుదుకు అర్హులు. [3]

రెండు తరగతుల గ్రహీతలు తమ పేరు తరువాత OBI అని పెట్టుకోవచ్చు. [3]

తొలుత ప్రదానం చేసిన ఆర్డర్లన్నీ రెండవ తరగతిలోనే ఇచ్చారు. మొదటి తరగతి ఆర్డర్ ప్రదానాలు, అప్పటికే రెండవ తరగతి ఆర్డరు పొందిన సభ్యులకే ఇచ్చేవారు. [2]

రిబ్బన్ తొలుత ఆకాశ నీలం రంగులో ఉండేది. 1838 లో భారతీయ సైనికులు ఎక్కువగా తలకు రాసుకునే నూనెలో తడిసి రిబ్బను రంగు మారుతున్నట్లు గుర్తించి దాన్ని ముదురు ఎరుపు రంగులోకి మార్చారు. 1939 సెప్టెంబరు నుండి మొదటి తరగతి రిబ్బను ముదురు ఎరుపు రిబ్బనుకు మధ్యలో రెండు సన్నని లేత నీలిరంగు గీతలను చేర్చారు. రెండవ తరగతికి రిబ్బను మధ్యలో ఒక లేత నీలం రంగు గీతను చేర్చారు. [2]

గ్రహీతలు

[మార్చు]

ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాకు నియమించబడిన వ్యక్తుల అసంపూర్ణ జాబితా ఇది:

మొదటి తరగతి

[మార్చు]
  • సర్దార్ బహదూర్ మేజర్ జనరల్ బక్షిష్ సింగ్ OBI 1 వ తరగతి 14 జూన్ 1912 (మిలిటరీ సెక్రటరీ పాటియాలా). [6]
  • గౌరవ కెప్టెన్ ముహమ్మద్ ఖాన్, OBI (1 వ తరగతి), 10 వ బలూచ్ రెజిమెంట్.
  • సుబేదార్ మేజర్ బహదూర్ ముల్తానీ రామ్, OBI (ఫస్ట్ క్లాస్) 1920, IDSM, ఫైజాబాద్ కంటోన్మెంట్ (రాయల్ ఆర్మీ), WW1 పార్టిసిపెంట్.
  • సర్దార్ బహదూర్ ఉంజూర్ తివారీ, 1 వ బెంగాల్ స్థానిక పదాతిదళం. భారత తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ దళాల కోసం గూఢచర్యం చేశారు. [7]
  • కల్నల్ రావు బహదూర్ ఠాకూర్ బాలు సింగ్ జీ ఇందర్‌పురా, OBI, IDSM (1 వ తరగతి)
    కల్నల్ రావు బహదూర్ బాలు సింగ్ OBI IDSM
  • నవాబ్ మీర్ హషిమ్ అలీ ఖాన్, కల్నల్ హహ్సిం నవాజ్ జంగ్, OBI SB, (1 వ తరగతి 1897). [8]
  • మొహ్రా రాజ్‌గన్ యొక్క సర్దార్ బహదూర్ లెఫ్టినెంట్ రాజా పైండా ఖాన్ OBI, 1/14 పంజాబ్ రెజిమెంట్.
  • సర్దార్ బహదూర్ రాజా జియోరాజ్ సింగ్, సండ్వా, CBE, OBI, బికనీర్ స్టేట్ ఫోర్సెస్‌లో మేజర్ జనరల్, సభ్యుడు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, బికనీర్ స్టేట్, రాజ్‌పుతానా. [9]
  • సర్దార్ బహదూర్ కెప్టెన్ రాజా ఫిరోజ్ ఖాన్ గోర్హా రాజ్‌గన్, OBI, ఫ్రాంటియర్ ఫోర్స్ రైఫిల్స్. [10]
  • ఖాన్ బహదూర్ జనరల్ ఫతే నసీబ్ ఖాన్ OBI 1 వ తరగతి 17 జనవరి 1929 ( అల్వార్ స్టేట్ ఫోర్సెస్). [11]
  • గౌరవ కెప్టెన్ సర్దార్ బహదూర్ భోలా సింగ్ గులియా, OBI (1 వ తరగతి), బద్లి, ఇండియన్ సర్వే రెజిమెంట్, హర్యానా, ఇండియా. [12] 
  • సుబదార్ మేజర్, గౌరవ కెప్టెన్ సర్దార్ బహదూర్ గఫూర్ ఖాన్ OBI, IDSM ఆలస్యంగా 4/15 పంజాబ్ రెజిమెంట్. [13]
  • సుబేదార్ మేజర్, గౌరవ లెఫ్టినెంట్ సర్దార్ బహదూర్ పెహల్వాన్ ఖాన్ MBE, OBI, కాంస్య స్టార్ పతకం . [14]
  • సర్దార్ బహదూర్ టికు [15] [16] సింగ్ థాపా, OBI, [17] KPM, CM, కమాండ్‌లో 2 వ, గూర్ఖా మిలిటరీ పోలీస్.
  • 'సర్దార్ బహౌదూర్' గౌరవ కెప్టెన్ భక్షి జగత్ సింగ్, OBI (1 వ తరగతి); 1857 లో 5 వ బెంగాల్ అశ్వికదళంలో చేరాడు, 'భూటాన్ యుద్ధంలో' పాల్గొన్నాడు, ఆపై ఆఫ్ఘనిస్తాన్‌లో గూఢచారిగా పనిచేశాడు, విలువైన మ్యాప్‌లు, స్కెచ్‌లను అందించాడు; 16 వ బెంగాల్ అశ్వికదళం నుండి పదవీ విరమణ.

రెండవ తరగతి

[మార్చు]
  • రిసల్దార్ నాదిర్ అలీ ఖాన్, బాంబ రాజ్‌పుత్, 9 వ హాడ్సన్ హార్స్. [18]
  • సుబేదార్, గౌరవ కెప్టెన్ బహదూర్ ఇనాయత్ ఉల్లా అస్మీ, OBI (2 వ తరగతి), 10 బలూచ్ రెజిమెంట్. [19] 
  • సుబేదార్-మేజర్ బహదూర్ జగీందర్ సింగ్, OBI (2 వ తరగతి), IOM (2 వ తరగతి). [20]
  • సుబేదార్ మేజర్, గౌరవ లెఫ్టినెంట్ రామ్ సింగ్ కైలా, బహదూర్, IOM, OBI, 15 వ లూథియానా సిక్కులు (1887-1916), 82 వ పంజాబీలు (1916–21). ఛాగ్రా కోటల్ (తీరా, NWFP, పాకిస్తాన్) వద్ద శౌర్యం కోసం IOM. [21]
  • కమాండెంట్ సర్దార్ బహదూర్ నారాయణ్ సింగ్ హుండల్, OBI 2 వ తరగతి, కపుర్తలా స్టేట్ ఫోర్సెస్. [22]
  • 9 వ హాడ్సన్ హార్స్ యొక్క రిసల్దార్ మీర్ డాడ్ ఖాన్ తారిన్. 

మూలాలు

[మార్చు]
  1. ORDER OF WEAR, Website of the UK government: Directgov, date accessed 4 January 2018.
  2. 2.0 2.1 2.2 H. Taprell Dorling (1956). Ribbons and Medals. A. H. Baldwin & Son, London. p. 42. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Dorling" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 3.2 3.3 "London Gazette, 26 Sept 1939, page 6511". Retrieved 4 January 2018. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "LG" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "London Gazette, 21 January 1944, page 434". Retrieved 4 January 2018.
  5. 5.0 5.1 John W. Mussell, (2015). Medal Yearbook 2015. Token Publishing Limited, Honiton, Devon. p. 88.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
  6. Army Headquarters, India (6 February 2012). Indian Army List January 1919 — Volume 3. ISBN 9781781502594.
  7. Field Marshal Lord Roberts, Forty-one Years in India 1897. Note, page 208.
  8. Various (15 March 2007). Hyderabad State List of Leading Officials, Nobles and Personages. Potter Press. p. 4. ISBN 978-1-4067-3137-8.
  9. Singh, Raja Jeoraj. "SUPPLEMENT TO THE LONDON GAZETTE, I JANUARY, 1941" (PDF). thegazette.co.uk.
  10. Army Headquarters, India (3 February 2012). Indian Army List January 1919 — Volume 2. ISBN 9781781502570.
  11. Various (15 March 2007). Alwar State List of Leading Officials, Nobles and Personages. Potter Press. p. 4. ISBN 978-1-4067-3137-8.
  12. 33 Years record of unbroken service (1911–1944). Served in both world wars. Madras War Review journal. 21 January 1944.
  13. "The London Gazette". 20 November 1936. p. 7495.
  14. Condon, W.E.H. (1962). The Frontier Force Regiment. Gale & Polden. p. 574.
  15. "File:Sardar Bahadur Tiku Singh Thapa, OBI, KPM, CM, 2nd in Command, Gurkha Military Police.jpg – Wikimedia Commons". commons.wikimedia.org (in ఇంగ్లీష్). 14 August 2020. Retrieved 14 August 2020.
  16. Thapa, Tiku (February 1937). "Sardar Bahadur" (PDF). Edinburgh Gazette. Retrieved 14 August 2020.
  17. iarchive:in.ernet.dli.2015.169153
  18. The award of the OBI to him was gazetted in August 1897, as he was one of a special contingent that went to London to present a Guard of Honour to Queen Victoria, on the occasion of her Diamond Jubilee. Naval and Army Illustrated August 1897; also see Indian Army Lists, 1902, 1911
  19. Captain Bahadur Inayat Ullah Asmi, OBI served in two World Wars, as Subedar and Captain (King's Commission); he died in 1947 in Lahore.
  20. Subedar-Major Bahadur Jagindar Singh, OBI "" O'Dwyer, Michael Francis (1918). War Speeches. Lahore, Punjab: Superintendent Government Printing. p. 129. his conspicuous gallantry in action on 17 November 1914 when with a party of Sappers under the command of a British Officer he was always to the fore and led his men with great determination into the enemy's trenches. Subedar-Major Jagindar Singh, Saini Sikh of Kheri Salabatpur in Bupar, gained the 2nd Class Order of Merit at the battle of Loos in Belgium for striking leadership and conspicuous bravery in action after most of his company and all but one British Officer in his regiment had been killed or wounded. This officer was also awarded the 2nd Class of the Order of British India for distinguished conduct in the field.
  21. vide GGO No. 430 of 1898. OBI vide Gazette of India No. 872 of 1917.
  22. "The Gazette of India, 1903, January-June". 6 October 1903 – via Internet Archive.