ఆర్.ఆర్.కేశవమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్.ఆర్.కేశవమూర్తి
R.R.KeshavamurthyPic.jpg
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంఆర్.ఆర్.కేశవమూర్తి
జననం(1913-05-27)1913 మే 27
రుద్రపట్టణ, హసన్ జిల్లా, కర్ణాటక
మరణం2006 అక్టోబరు 23(2006-10-23) (వయస్సు 93)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాయులీన విద్వాంసుడు
వాయిద్యాలువయోలిన్

ఆర్.ఆర్.కేశవమూర్తి (1913-2006) ఒక భారతీయ వాయులీన విద్వాంసుడు.

విశేషాలు[మార్చు]

ఇతడు కర్ణాటక రాష్ట్రం, హసన్ జిల్లా రుద్రపట్టణ గ్రామంలో 1913, మే 27వ తేదీన రామస్వామయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తాత వెంకటరామయ్య వాగ్గేయకారుడు. ఇతడు వాయులీన విద్వాంసుడైన తన తండ్రి రామస్వామయ్య వద్ద మొదట సంగీతం నేర్చుకున్నాడు. తరువాత బిడారం కృష్ణప్ప వద్ద శిక్షణ పొందాడు. ఇతడు గాత్రంలోను, వయోలిన్ వాద్యంలోను సమానమైన నైపుణ్యం సాధించాడు. తిరుమకూడలు చౌడయ్య కనిపెట్టిన ఏడుతీగల వయోలిన్ ఉపయోగించడంలో పేరు గడించాడు. ఇతడు కన్నడ, తెలుగు, తమిళం, సంస్కృతం, హిందీ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు.

ఇతడు 1934లో బెంగళూరులో స్థిరపడి తన గురువు పేరిట "గానవిశారద బిడారం కృష్ణప్ప స్మారక సంగీత విద్యాలయా"న్ని స్థాపించి వందలాది మంది శిష్యులను విద్వాంసులుగా తయారు చేశాడు. ఇతని శిష్యులలో టి.రుక్మిణి, భువనేశ్వరయ్య, ఎం.ఎస్.కృష్ణవేణి, అనూర్ రామకృష్ణ,[1]మీనాక్షి రవి, జ్యోత్స్న శ్రీకాంత్, మైసూర్ సంజీవకుమార్[2], నళినమోహన్, జ్యోత్స్న మంజునాథ్, నిఖిల్ జోషి, నాగరత్న సదాశివ మొదలైన వారున్నారు. ఇతడు కన్నడ భాషలో సంగీత సంబంధమైన అనేక గ్రంథాలు రచించాడు. వాటిలో "బాలశిక్ష", "వాగ్గేయకారర కృతిగళు", "భారతీయ వాగ్గేయకారరు", "రాగలక్షణ మత్తు రాగకోశ", "లక్ష్య లక్షణ పద్ధతి", "సంగీత లక్ష్య విజ్ఞాన", "హిందుస్తానీ సంగీత రాగకోశ", "మేళరాగమాలిక" మొదలైనవి ఉన్నాయి. వయోలిన్ గురించి అనేక పత్రాలు సమర్పించాడు.[3]

పురస్కారాలు, బిరుదులు[మార్చు]

 • వీణ శేషణ్ణ స్మారక పురస్కారం
 • 199లో కనక పురందర ప్రశస్తి[4]
 • సంగీత నాటక అకాడమీ అవార్డు[5]
 • సంగీత సాహిత్య శిరోమణి
 • సంగీత విద్యాసాగర
 • సంగీత శాస్త్ర ప్రవీణ
 • సంగీత కళారత్న
 • నాద భీష్మ విద్వాన్
 • కర్ణాటక కళాతిలక
 • లయ కళానిపుణ
 • సంగీత కళాప్రపూర్ణ

మరణం[మార్చు]

ఇతడు 2006 అక్టోబరు 23న తన 93వ యేట మరణించాడు.

మూలాలు[మార్చు]

 1. "R.R. Keshava Murthy passes away". The Hindu. 25 October 2006. Archived from the original on 24 నవంబర్ 2006. Retrieved 4 December 2010. Check date values in: |archive-date= (help)
 2. herald, deccan. "Jyotsna Srikanth". Deccanherald. Retrieved 11 July 2011.
 3. Swarasindhu. "RR Keshavamurthy". Web Research and Articles. Swarasindhu. Archived from the original on 21 March 2012. Retrieved 11 July 2011.
 4. "Kanaka Purandara Award Winners p521" (PDF). Karnataka Handbook 2010. Government of Karnataka. Archived from the original (PDF) on 8 October 2011. Retrieved 4 December 2010.
 5. "Sangeet Natak Akademi Puraskar (Akademi Awards)". Sangeet Natak Akademi. Archived from the original on 17 February 2012. Retrieved 4 December 2010.