ఆర్.ఎస్. గవై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్.ఎస్. గవై
ఆర్.ఎస్. గవై


పదవీ కాలం
2008 జూలై 11 (2008-07-11) – 7 సెప్టెంబరు 2011 (2011-09-07)

పదవీ కాలం
2006 జూలై 13 (2006-07-13) – 12 ఆగస్టు 2006 (2006-08-12)

పదవీ కాలం
2006 జూన్ 22 (2006-06-22) – 9 జూలై 2008 (2008-07-09)

పదవీ కాలం
2000 ఏప్రిల్ 3 (2000-04-03) – 2 ఏప్రిల్ 2006 (2006-04-02)

పదవీ కాలం
1998 మార్చి 10 (1998-03-10) – 26 ఏప్రిల్ 1999 (1999-04-26)
నియోజకవర్గం అమరావతి

మహారాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
1986 డిసెంబరు 22 (1986-12-22) – 20 డిసెంబరు 1988 (1988-12-20)
పదవీ కాలం
1990 డిసెంబరు 20 (1990-12-20) – 17 జూలై 1991 (1991-07-17)

మహారాష్ట్ర శాసనమండలి చైర్మన్
పదవీ కాలం
1978 (1978) – 1982 (1982)

మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్
పదవీ కాలం
1968 (1968) – 1978 (1978)

వ్యక్తిగత వివరాలు

జననం (1929-10-30)1929 అక్టోబరు 30
దారాపూర్, అమరావతి జిల్లా, మహారాష్ట్ర, బ్రిటిష్ ఇండియా
మరణం 2015 జూలై 25(2015-07-25) (వయసు 85)
నాగ్‌పూర్, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవై)
తల్లిదండ్రులు సూర్యభాన్ గవాయ్, సరుబాయి గవాయి
జీవిత భాగస్వామి కమలా గవై
సంతానం కుమారులు భూషణ్ గవాయ్, రాజేంద్ర, కుమార్తె కీర్తి
నివాసం కుమారులు భూషణ్ గవాయ్ (బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి)[5], రాజేంద్ర (రాజకీయ నాయకుడు) & కుమార్తె కీర్తి
పూర్వ విద్యార్థి నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు, అంబేద్కరిస్టు సామాజిక కార్యకర్త

రామకృష్ణ సూర్యభాన్ గవాయ్ (30 అక్టోబర్ 1929 - 25 జూలై 2015) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవై) స్థాపకుడు. ఆయన మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా, లోక్‌సభ & రాజ్యసభ సభ్యుడిగా, బీహార్, సిక్కిం, కేరళ రాష్ట్రల గవర్నర్‌గా పని చేశాడు.[1] ఆర్.ఎస్. గవై నాగ్‌పూర్‌లోని దీక్షాభూమి స్మారక్ సమితికి ఛైర్మన్‌గా పని చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ఆర్.ఎస్. గవై బాబాసాహెబ్ అంబేద్కర్ సన్నిహితుడు. ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ తరపున 1964 నుండి 1994 వరకు మహారాష్ట్ర శాసనమండలిలో, 1968 నుండి 1978 వరకు శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా, 1978 నుండి 1984 వరకు ఛైర్మన్‌గా, 1986 నుండి 1988 వరకు శాసన మండలి ప్రతిపక్ష నేతగా వివిధ హోదాల్లో పని చేశాడు.[2] ఆయన 1998లో జరిగిన 12వ లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి నియోజకవర్గం నుండి పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆర్.ఎస్. గవై 22 జూన్ 2006 నుండి 9 జులై 2008 బీహార్ గవర్నర్‌గా, 13 జులై 2006 నుండి 12 ఆగష్టు 2006 సిక్కిం గవర్నర్‌గా, 11 జులై 2008 నుండి 7 సెప్టెంబర్ 2011 వరకు కేరళ గవర్నర్‌గా పని చేశాడు.

మరణం[మార్చు]

ఆర్.ఎస్. గవై బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతూ నెల రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 25 జులై 2015న మరణించాడు.[3] ఆయన అంత్యక్రియలు అమరావతి జిల్లా దర్యాపూర్‌లోని ఆయన స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.[4] ఆర్.ఎస్. గవైకు భార్య కమలతాయ్, కుమారులు భూషణ్ గవాయ్ (బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి)[5], రాజేంద్ర (రాజకీయ నాయకుడు) & కుమార్తె కీర్తి ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "R.S. Gavai is new Kerala Governor", The Hindu, 27 June 2008.
  2. List of the Leaders of the Opposition of the Maharashtra Legislative Council
  3. The Hindu (25 July 2015). "RPI leader R.S. Gavai dead" (in Indian English). Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
  4. The Times of India (27 July 2015). "RS Gavai cremated with state honours". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
  5. The Indian Express (21 July 2023). "Who was R S Gavai, Justice B R Gavai's father whom the judge mentioned before Rahul Gandhi hearing?" (in ఇంగ్లీష్). Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.

బాహ్య లంకెలు[మార్చు]