ఆర్. బిందు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్. బిందు
ఆర్. బిందు


ఉన్నత విద్య , సామాజిక న్యాయ మంత్రి, కేరళ ప్రభుత్వం
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
20 మే 2021
ముందు
  • కె. టి. జలీల్
    (ఉన్నత విద్యాశాఖ మంత్రి)
  • కె. కె. శైలజ
    (సామాజిక న్యాయ శాఖ మంత్రి)

కేరళ శాసనసభ సభ్యురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021
ముందు కె.యు. అరుణన్
నియోజకవర్గం ఇరింజలకుడ

త్రిసూర్ మేయర్
పదవీ కాలం
7 అక్టోబరు 2005 – 6 అక్టోబరు 2010
ముందు జోస్ కట్టుక్కరన్
తరువాత ఐ.పి. పాల్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
జీవిత భాగస్వామి ఎ. విజయరాఘవన్
సంతానం ఎ. హరికృష్ణన్
పూర్వ విద్యార్థి
  • జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ
  • కాలికట్ విశ్వవిద్యాలయం
  • శ్రీ కేరళ వర్మ కళాశాల, త్రిస్సూర్
  • సెయింట్. జోసెఫ్ కళాశాల, ఇరింజలకుడా

ఆర్. బిందు  ఒక భారతీయ రాజకీయవేత్త.  కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)కి చెందిన ఆమె కేరళ ప్రభుత్వంలో ఉన్నత విద్య, సామాజిక న్యాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.[1]

జీవితం తొలి దశలో[మార్చు]

ఆమె 1967లో ఎన్ రాధాకృష్ణన్, కె.కె.శాంతకుమారి దంపతులకు జన్మించింది. ఆమె తన విద్యను ఇరింజలకుడ బాలికల ఉన్నత పాఠశాల, ఇరింజలకుడ సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో పూర్తి చేసింది. కాలికట్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ లలో ఆమె ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని, ఎంఫిల్, పిహెచ్‌డి పట్టాలను పొందింది. విద్యార్థి రాజకీయాల ద్వారా బిందు సామాజిక కార్యకలాపాల్లో ప్రవేశించింది.[2]

కెరీర్[మార్చు]

త్రిస్సూర్‌లోని శ్రీ కేరళ వర్మ కళాశాలలో బిందు వైస్ ప్రిన్సిపాల్, ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా ఉన్నారు. ఆమె కాలికట్ విశ్వవిద్యాలయం సెనేట్, సిండికేట్ సభ్యురాలు.[3] ఆమె ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (AIDWA) కేంద్ర కమిటీ సభ్యురాలు. ఆర్. బిందు మొదట కేరళలోని త్రిస్సూర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్.[4][5][6] ఆమె త్రిస్సూర్ నుండి మొదటి మహిళా మంత్రి.[7] ఇరింజలకుడ నియోజకవర్గం నుంచి తొలి మహిళా ఎమ్మెల్యే కూడా.

బిందు మాజీ పార్లమెంటేరియన్, సి.పి.ఐ (ఎమ్) కేరళ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎ. విజయరాఘవన్‌ను వివాహం చేసుకున్నారు.

ఉదారత[మార్చు]

త్రిసూర్ జిల్లా ఇరింజలకుడ ప్రాంతంలో కిడ్నీ మార్పిడి వైద్య సహాయ కమిటీ సమావేశానికి 2022 జూలై 11న ప్రతినిధిగా హాజరైన ఆర్ బిందు కిడ్నీ మార్పిడి చేయించుకోవాల్సిన వివేక్ ప్రభాకర్ అనే 27 ఏళ్ల యువకుడి దీనస్థితిని చూసి చలించిపోయారు. అతనికి శస్త్రచికిత్స కోసమని వెంటనే తన మణికట్టు నుండి బంగారు గాజుని తీసి మొదటి విరాళంగా ఇచ్చింది.[8]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-21. Retrieved 2022-07-12.
  2. "R Bindu: Oneindia". oneindia.com. Retrieved 12 April 2022.
  3. T. Ramavarman (Mar 11, 2021). "Kerala elections: R Bindu denies allegations against her candidature | Kerala Election News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-27.
  4. "Meet the 11 women MLAs who will join the Kerala Assembly". Haritha John. The NewsMinute. 4 May 2021. Retrieved 7 May 2021.
  5. "Lalur residents to block road". The Hindu. 13 January 2010. Archived from the original on 18 January 2010. Retrieved 13 February 2010.
  6. "Veena George to replace KK Shailaja as Kerala health minister; here's list of new ministers and portfolios". Times Now. 19 May 2021. Retrieved 19 May 2021.
  7. "Thrissur gets its first woman minister". The Hindu (in Indian English). Special Correspondent. 2021-05-20. ISSN 0971-751X. Retrieved 2021-10-27.{{cite news}}: CS1 maint: others (link)
  8. "Kerala: చికిత్స కోసం తన చేతి బంగారు గాజులు ఇచ్చిన మంత్రి". web.archive.org. 2022-07-12. Archived from the original on 2022-07-12. Retrieved 2022-07-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)