Jump to content

ఎ. విజయరాఘవన్

వికీపీడియా నుండి
ఎ. విజయరాఘవన్
ఎ. విజయరాఘవన్


కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పొలిట్ బ్యూరో సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
20 నవంబరు 2020 (2020-11-20)
ముందు కొడియేరి బాలకృష్ణన్

అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022

పదవీ కాలం
1989 – 1991
ముందు వి.ఎస్. విజయరాఘవన్
తరువాత వి.ఎస్. విజయరాఘవన్
నియోజకవర్గం పాలక్కాడ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ సీపీఎం
జీవిత భాగస్వామి ఆర్. బిందు
పూర్వ విద్యార్థి ప్రభుత్వ న్యాయ కళాశాల, కోజికోడ్
మూలం [1]

అలంపాడన్ విజయరాఘవన్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1998 నుండి 2010 వరకు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, 1989లో పాలక్కాడ్ నుండి ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

వివాహం

[మార్చు]

విజయరాఘవన్ సీపీఎం నాయకురాలైన ప్రొఫెసర్ ఆర్. బిందును వివాహం చేసుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అలంపాడన్ విజయరాఘవన్ విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా పని చేసి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా, జూన్ 2018లో ఎల్‌డిఎఫ్ కన్వీనర్‌గా, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశాడు. విజయరాఘవన్ 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పాలక్కాడ్ నుందని సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వి. ఎస్. విజయరాఘవన్ పై 1,286 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

విజయరాఘవన్ 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయి 1998 నుండి 2010 వరకు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వి. కె. శ్రీకందన్ చేతిలో 75283 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (1 April 2024). "A triangular fight for supremacy in Palakkad" (in Indian English). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  2. The New Indian Express (14 November 2020). "A Vijayaraghavan: How a simple man is betrayed by freudian slips" (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  3. TimelineDaily (23 February 2024). "A Vijayaraghavan: CPI(M)'s Candidate For Palakkad" (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Palakkad". Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.