ఆల్డస్ హక్స్‌లీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆల్డస్ హక్స్‌లీ
Monochrome portrait of Aldous Huxley sitting on a table, facing slightly downwards.
ఆల్డస్_హక్స్‌లీ, 1954
పుట్టిన తేదీ, స్థలంAldous Leonard Huxley
(1894-07-26)1894 జూలై 26
Godalming, England
మరణం1963 నవంబరు 22(1963-11-22) (వయసు 69)
Los Angeles, California, US
సమాధి స్థానంCompton, Guildford, England
వృత్తిWriter, novelist
విద్యEton College
పూర్వవిద్యార్థిBalliol College, University of Oxford
గుర్తింపునిచ్చిన రచనలు
జీవిత భాగస్వామిజీవిత భాగస్వాములు
 • Maria Nys
  (m. 1919⁠–⁠1955)
 • (m. 1956⁠–⁠1963)

సంతకం

జీవిత విశేషాలు[మార్చు]

హక్స్‌లీ 1894 లో జన్మించాడు. హక్స్‌లీ గొప్ప వంశంలో జన్మిచాడు.థామస్ హక్స్‌లీ-శాస్త్రజ్ఞడు-ఈయన తాత; ఈయన అన్నగారు జ్యూలియస్ హక్స్‌లీ ప్రసిద్ధ శాస్త్రజ్ఞడు.తల్లివైపు మాత్యూ ఆర్నాల్డ్ సంతతివారు. 1946 నుండి-48 వరకూ యునెస్కో సంస్థ డైరెక్తర్ జనరల్ గా పనిచేశాడు. హక్స్‌లీ ఈటన్, ఆక్స్‌ఫర్డ్ కళాశాలల్లో విద్యపూర్తి చేసి, వైద్యం చదివాడు. కాని, కంటిజబ్బు వల్ల ప్రాక్టీస్ చెయ్యలేదు. 1919లో మారియానైస్ అనే బెల్జియన్ కన్యను వివాహ మాడాడు. అధినేయ&మ్ పత్రికలో పనిచేశాడు.మరికొంతకాలం నాటకాల విమర్శకుడిగా పనిచేశాడు.1923 నుండి 1930 వరకు ఇటలీలో ఉన్నాడు.1947 నుండి కాలిఫోర్నియాలో ఉండిపోయాడు.1963 నవంబరులో కాన్సర్ వ్యాధికి గురై చనిపోయాడు.

రచనలు[మార్చు]

హక్స్‌లీ మొదటి నవల క్రోం ఎల్లో (Chrome-Yellow)-చివరిది "ది ఐలెండ్" (The Island). క్రోం ఎల్లో వ్రాసినప్పుడు ఆయన వయస్సు 27. ది ఐలెండ్-పరదేశీయుల పాలననుండి విముక్తిపొంది, స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్న ఒక ప్రాక్ ఎట్లా అభివృద్ధి చెందుతున్నదీ, దాన్ని చూసిన పాశ్చ్యాత్తులు, ఆ ఆదర్శ సమాజం నుండి నేర్చుకోవలసినవీ హక్స్‌లీ 65 ఏటలో వ్రాసిన ఈనవలలో చిత్రిత మైనాయి. ఆయన శక్తులు వార్ధ్యక్యంలో సన్నగిల్లలేదు. పరిశీలనాశక్తి, ఆశయాల విమర్శ, గంభీరమైన భావాలను, నిర్మొహమాటంగా, స్ఫుటంగా తేలికగా వితర్కించటం, సున్నితమైన హాస్యం, పైకి పెద్ద కబుర్లు చెప్పి, ప్రవర్తనలో నిజాయితీ కనబర్చని వ్యక్తులని వ్యంగ్యంగా హేళన చెయ్యటం, అసాధ్యమైన ఆదర్శాల గాలిబుడగకి కంత పెట్టడం-ఆత్మవికాసాన్ని పెంపొందించాలన్న తృష్ణ-ఈ రెండు నవలల్లోనూ మిగతా నవలలోకి మల్లే సమంగా కనబడతాయి. మిగత నవలలో పోకడలు క్రోం ఎల్లోలో దర్శన మిస్తాయి. దాంట్లో కొన్ని వాక్యాలు: మనం అనుభవించే ప్రతి దానికీ ఆదర్శంతో కూడుకున్న కారణాలు వెదకాలి. ఏదో కథ అల్లి, దాన్ని సత్యం తోను మంచితనంతోనూ ముడిపెట్టితే గాని సౌందర్యాన్ని ఆస్వాదించలేము. అరాజకమైన మహా గందరగోళంతో నిండిన జీవితంలో ఒక క్రమాన్ని వెదకి చూసిన ప్రక్రియనే "కళ"గా స్వీకరిస్తాయి.త్రాగుడు, సెక్సు, ప్రేమ-వీటిల్లో ఆనందం ఉన్నా, అనందాన్ని అనంతంతో ఐక్యం అనడంగా సిద్ధాంతీకరిస్తాము. శక్తి స్వరూపిణి-స్త్రీ ద్వారా పరమాత్మని తెలుసుకోవాలి.

1923లో హక్స్‌లీ రెండవ నవల ఏంటిక్ హె (Antic Hay) వెలువడింది.1928లో పాయింట్ కవుంటర్ పాయింట్ (Point Counter Point) వెలువడింది. 1932లో బ్రేవ్ న్యూ వరల్డ్ (Brave New World) అన్న నవలతో యూరోపియన్ సహితీరంగంలో హక్స్‌లీ ప్రముఖ రచయితగా ఖ్యాతి పొందాడు.1932 నాటికి అంతర్జాతీయ రచయితగా స్థిరపడిపోయాడు.ఏకొత్త గ్రంధం వెలువడినా, అందులో హక్స్‌లీ భావలను పేర్కొని ఖండించడమో, ఆమోదించడమో జరగవలసిందే.

హక్స్‌లీ నవలలన్నీ నిజానికి వ్యాసాలే. కొద్ది మార్పులు చేస్తే, నవల వ్యాస సంపుటంగా తయారవుతవుతుంది.

1932 తర్వాత హక్స్‌లీ పరమార్ధ చింతనలో పడి తత్త్వజ్ఞడు అయ్యాడు.విజ్ఞానశాస్త్రానికి అతీతమైన జీవిత రహస్యం ఒకటుందనీ, దాన్ని తెలుసుకోవడానికి భక్తి జ్ఞానయోగ వైరాగ్యం తప్ప మరో లేదనీ హేతువాదులు కూడా గ్రహించసాగారు. హక్స్‌లీ వేదాలు, గీత, బౌద్ద తత్త్వం శ్రద్ధగా చదవడమే కాకుండా అవి చెప్పిన వాటిని తన నిత్య జీవితంలో అనుకరించసాగాడు. ఆయనలో వచ్చిన ఈమార్పు 1932లో వచ్చిన నవలలోన్ను, వ్యాసాల్లోనూ కనబడుతుంది. అన్ని తత్త్వాల్లోను సారాంశాన్ని మహాపురుషుల నిర్వచనాలపై వ్యాక్యానంతో "పెర్నియల్ ఫిలాసఫీ" (Perennial Philosophy) అనే గ్రంథాన్ని వ్రాశాడు. 1939లో ఆయన వ్రాసిన "ఆఫ్టర్ మెని ఎ సమ్మర్" అను నవలలో ఆయన చెప్పిన పాఠం "అన్నింటికీ అహం శత్రువు" అన్నది.

హక్స్‌లీ ప్రాక పశ్చిమదేశాలు పర్యటిస్తూ 1926లో ఇండియాలో కొన్ని ముఖ్యపట్టణాలను సందర్శించి,తన అనుభవాలను "ద జెస్టింగ్ పైలేట్" (The Jesting Pilate) అనే యాత్ర గ్రంథంలో పొందుపరిచాడు. తాను సందర్శించిన స్థలాల వర్ణించడంలో కంటే మనుషుల్ని వారి నడవికలని వర్ణించడంలో ఈ రచన ప్రబలంగా ప్రకటితమవుతుంది. సెకెండ్ క్లాస్ పెట్టెలో లాహోర్ వెళుతుండగా ఒక బైరాగి తన పెట్టెలో ప్రయాణం చేస్తాడు. అతను గమనించిన వాటిని ఈవిధంగా వ్రాస్తాడు : ఆయన భక్తుడే కావొచ్చు, యోగే కావచ్చు. కాని ఆమురుకి దుస్తులు, ఆవాసనా భరించలేకపోయాను. ఆయనతో ఉన్న అనుచరులు కూడా వాసనొచ్చేశారు. అతి శుభ్రతని టాల్స్స్తాయి అధిక్షేపించాడు. అతిశుభ్రత ఒక తెగకి చిహ్నంట.డబ్బున్నవాళ్లకే అంత శుభ్రంగా ఉండటం సాధ్యంట. కాయకష్టం చేసి పొట్ట పోసుకునేవాడు వాసనెయ్యడం తప్పదు. పని ప్రార్థనతో సమం. పనంటె వాసన, కాబట్టి వాసన ప్రార్థనతో సమం." తాజమహల్ అతి ఖరీదైన కట్టడం అందుకే ఆతనికి నచ్చలేదట.

హక్స్‌లీ భారత సంస్కృతి పట్ల చాల ఆసక్తి చూపారు. ఎన్నో పరిశోధనలు జరిపారు. కాని, ఆయనకి "హాలివుడ్ యోగి" అనే బిరుదు సంపాందించిపెట్టిన ఈపరిశోధనలు ఆయన కీర్తికి ముఖ్యకారణాలుగా పరిగణింపబడవు.

మొత్తానికి 12 నవలల్లు, రెండు జీవిత చరిత్రలు, 5 కథల సంపుటాలు, మూడు యాత్రా గ్రంథాలు, గేయ సంపుటాలు కాకుండా హక్స్‌లీ 15 పైగా వ్యాససంపుటాలు ప్రచురించాడు. హక్స్‌లీ వ్రాసినన్ని వ్యాసాలు మరేరచియితా వ్రాసాడనుకోవచ్చును. మానవుడు ఆలోచింపదగ్గ ప్రతి విషయం గురుంచీ వ్రాశాడు- మతం, రాజకీయాలు, విద్య, న్యాయశాస్త్రం, సాహిత్యం, చిత్ర లేఖనం, సంగీతం, శిల్పం, జీవశాస్త్రం, ఖగోళశాస్త్రం, పట్టణ నిర్మాణం, వైద్యం, నీతిశాస్త్రం, ప్రభుత్వ నిర్వహణ, దుస్తులు, తిండి, సినిమాలు, నాటకాలు, నృత్యాలు, మానవుడి ఆచారాలు, చరిత్ర, మానసికశాస్త్రం, బూతు, దయ్యాలు, గోళ్ళుగిల్లుకోవడం, పిల్లలు, ఎలికలు, కామసూత్రాలు ఇలా పేజీలెన్నయినా నింపుకోవచ్చును.

హక్స్‌లీ సాహిత్యం గురించి వ్రాసిన వ్యాసాలలో విషాదము-సంపూర్ణ సత్యము అన్నది గొప్ప వ్యాసము. గ్రీకు పౌరాణిక గాథ-హోమర్ వ్రాసిన "ఓడిస్సి" (Odessey) లో ఒక సన్నివేశాన్ని వర్ణిస్తాడు హక్స్‌లీ. సిల్లా అనే రక్కసుడు ఒడిసియస్ అనుచరులలో 6గుర్ని చంపుతాడు.మిగిలినవారు వెనక్కి మరలుతారు. చనిపోయిన అనుచరులను తల్చుకొని వారెల్లా శోకించారో వర్ణిస్తాడు హోమర్. ఆకలి దప్పికలు తీర్చుకొన్నాక చనిపోయిన మిత్రులను గూర్చి దుఃఖించి మధ్యలోనే అలానే నిద్రపోతాడు. దానిపై హక్స్‌లీ వ్యాఖ్యానం "ఎంత దుఃఖం వచ్చినా మనిషి తినాలి, త్రాగాలి అని హోమర్ కి తెలుసు! కడుపు నిండాక-దుఃఖించడానికి మానవుడు సిద్ధం. పరిపూర్ణతం తెలిసిన మహారచయిత హోమర్. హక్స్‌లీ లారెన్స్ గురుంచి వ్రాసింది మరిక గొప్ప వ్యాసం. లారెన్స్ రచలనని బూతు పురాణం క్రింద జమకట్టి, వాటిని నిషేధించి అతన్ని దుయ్యబెట్టిన మొదటి రోజుల్లో లారెన్స్ ప్రతిభని కనుక్కొని, అతని రచనలలో విశిష్టతని పదిమందికీ తెలియజేసీ, ఉత్తమ సాహిత్య విలువల ప్రతిపాదనకి పూనుకొన్న వ్యక్తులలో ప్రథముడు హక్స్‌లీ.

హక్స్‌లీ మాటల్లో[మార్చు]

 • సఫలమైన ఆదర్శాల గురుంచి: తమాషా! మనం అడిగింది ప్రాప్తిస్తుంది.కాని, చిత్రం! చేతికొచ్చేవరకూ మనం ఆదిగిందేమిటో మనకే తెలియదు.
 • ఏకాంతం గురుంచి: వంటిగా యావజ్జీవ కారాగారం అనుభవించటం అన్నమాట మన జీవితం. నిజంగా మనం ఇతరులకి ఏమీ చెప్పుకోలేము. మన ఉద్రేకాల సారం, భావాల పుట్టు పూర్వోత్తరాలు బైటపడక, ఆత్మ అనబడే తాళం వేసిన కొట్టు గదిలో భద్రంగా ఉండిపోతాయి.
 • అనుభవం గురుంచి: మనకి జరిగిందల్లా అనుభవం అనుకోకూడదు. జరిగిందాన్ని ఏవిధంగా వాడుకున్నామో అదే అనుభవం.
 • విజ్ఞానాన్ని గురుంచి: తెలుసుకోవడం యిష్టంలేదు గనుకనే ఆవిషయం తెలియదు.
 • అజ్ఞానం గురుంచి: జ్ఞాన సముపార్జనలో ఎంత ఆనందం ఉందో, అజ్ఞానంలో కూడా అంతా ఉంది.
 • స్వేచ్ఛ గురుంచి: పరిస్థితులను ధిక్కరించాలంటే వెర్రిపనులు చేయాలి. అల్లా చేయడం ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని ప్రతిపాదించటం అన్నమాట. బుద్ధిశాలి ఎంతో దూరం ప్రయాణంచేసి, తనకి తెలుసుకున్న సత్యాలనే మళ్ళా తెలుసుకుంటాడు. చివరికి పరోక్ష జ్ఞానం ద్వారా బుద్ధిహీనుడు చేరుకున్న శిఖరానికే చేరుకుంటాడు.
 • పనిని గురుంచి: అందరి మంచివారికి మల్లె నాకూ పని అంటే తల నొప్పి.


1940 తరువాత సాగిన హక్స్‌లీ రచనలు ఎక్కువగా తత్త్వ పరిశీలనతో ఇంతకు మునుపు కన్నా ఎక్కువగా ఉంటాయి.మానవాభ్యుదయానికి కృషిచేసిన హక్స్‌లీ చివరివరకూ నిండు మానవుడిగా వర్దిల్లాడు.

మూలాలు[మార్చు]

 • 1964 భారతి మాస పత్రిక-వ్యాసకర్త బుచ్చిబాబు