ఆల్డిహైడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Formaldehyde
An aldehyde.
-R is the group attached to the aldehyde group.

ఆల్డిహైడ్ లేదా ఆల్డిహైడు (सुव्युद) ఒక రసాయన కుటుంబం పేరు. ఈ కుటుంబంలో ఉన్న సభ్య పదార్థాల్ప పేర్లు అన్నింటికీ చివర ఆల్డిహైడ్ అనే తోక కనిపించవచ్చు. ఈ కుటుంబంలో ఉన్న సభ్య పదార్థాల నిర్మాణక్రమం (structurel formula) లో గట్టి పోలిక కనిపిస్తుంది; అనగా ప్రతి పదార్థపు నిర్మాణక్రమం లోనూ కార్బొనైల్ గుంపు కకనిపిస్తుంది. దీనినే ఫార్మైల్ (फोर्मिल) లేదా మిథనైల్ (मीथेनोइल) గ్రూపు అని కూడా పిలుస్తారు. ఈ క్రియాత్మక సమూహము (functional group) లో కర్బనం అణువు, ఉదజని అణువు, ఆక్సిజన్ అణువులతో జంట బంధం (O=CH-) కలిగివుంటాయి. సాధారణీకరించిన ఈ నిర్మాణక్రమాన్ని బొమ్మలో చూడవచ్చు. బొమ్మలో అనేది క్రియాత్మక సమూహముని సూచిస్తుంది.

ఆల్డిహైడ్ (aldehyde) కథ మెతేన్ (methane) తో మొదలు పెడితే సులభంగా అర్థం అవుతుంది. ఒక మెతేను బణువు (molecule) నిర్మాణక్రమంలో మధ్య ఒక కర్బనం అణువు, చుట్టూ నాలుగు ఉదజని అణువులు ఉన్నాయి. ఈ నాలుగింటిలో ఒక ఉదజని అణువుని తొలగించి, దాని స్థానంలో ఒక హైడ్రాక్సిల్ గుంపుని, అనగా “ఒ-ఎచ్” (-OH) ని, ప్రవేశపెడితే మెతల్ ఆల్కహాలు (methyl alcohol) వస్తుంది. ఇలా కాకుండా, ఒక మెతేను బణువులో ఉన్న రెండు ఉదజని అణువులని తొలగించి, వాటి స్థానంలో ఒకే ఒక ఆమ్లజని అణువుని ప్రవేశపెట్టవచ్చు. అప్పుడు కర్బనానికీ, ఆమ్లజనికీ మధ్య జంట బంధం ఉంటుంది. ఇలా వచ్చిన పదార్థాన్ని ఇంగ్లీషులో “ఫారాాల్డిహైడ్” (formaldehyde) అంటారు. ఈ ఫారాాల్డిహైడ్ నిర్మాణక్రమం బొమ్మలో చూడవచ్చు.

ఫారాాల్డిహైడ్ నిర్మాణక్రమం మరొక కోణం గుండా కూడా చూడవచ్చు. మెతల్ ఆల్కహాలులో ఉన్న రెండు ఉదజని అణువులని తీసేయగా మిగిలినది ఫారాాల్డిహైడ్. ఇలా ఒక పదార్థం నుండి ఉదజని అణువులని తీసివేసే పద్ధతిని ఇంగ్లీషులో “డీ హైడ్రాజినేషన్” (dehydrogenation) అంటారు. కనుక రెండు ఉదజని అణువులని తీసివేయగా మిగిలిన ఆల్కహాలు “డీ హైడ్రాజినేటెడ్ ఆల్కహాల్” (dehydrogenated alcohol) అని కాని, “ఆల్కహాల్ డీ హైడ్రాజినేటెడ్” (alcohol dehydrogenated) అని కాని అంటారు. ఈ రెండవ ప్రయోగం లోని మొదటి మాట లోని మొదటి రెండు ఇంగ్లీషు అక్షరాలు, రెండవ మాట లోని మొదటి ఐదు అక్షరాలు తీస్తుకుంటే “ఆల్డిహైడ్” (aldehyd) అనే కొత్త మాట వచ్చిందికద! దీని చివర “ఇ” (e) చేర్చితే వాడుకలో ఉన్న వర్ణక్రమం వస్తుంది. ఇంగ్లీషులో వర్ణక్రమానికీ, ఉచ్చారణకీ మధ్య పొంతన ఉండదు. విటమిన్ (vitamin) అనే మాట తయారు చేసినపుుడు మాట చివర ఉన్న “ఇ” తీసేశారు. ఇక్కడ మాట చివర “ఇ” ప్రవేశపెట్టేరు. దీని వెనక వ్యాకరణ సూత్రం ఏదీ లేదు. ఈ సందర్భంలో జినీవా ఒపుందం ఏమంటోందో చూద్దాం.

జినీవా ఒప్పందం

[మార్చు]

ఆల్కహాలు జాతి పేర్లు “ఓల్” (-ol) శబ్దంతో అంతం అవాలనే నిబంధన లాగనే ఆల్డిహైడ్ జాతి పదార్థాలు “ఆల్” (-al) శబ్దంతో అంతం అవాలని జినీవా ఒపుందం ఆదేశంచింది. ఫారాాల్డిహైడ్ కి మెతేన్ తల్లి వంటిది కనుక ఫార్మాల్డిహైడ్ ని “మెతనాల్” (methanal) అనమన్నారు. మెతల్ ఆల్కహాలుని “మెతనోల్” (methanol) అని అనమన్నారు జినీవా వారు. ఈ రెండు మాటల వర్ణక్రమాలలోనూ, ఉచ్చారణలోనూ అత్యల్పమైన తేడా ఉంది; ఉచ్చారణ దోషం లేకుండా ఉచ్చరించాలి, శ్రవణ దోషం లేకుండా వినాలి.

ఆల్డిహైడు కి తెలుగు పేరు

[మార్చు]

అచ్చుతో తాంతం అయే భాష కనుక తెలుగుని "అజంతం" అంటారు. అదే ధోరణిలో ఆల్కహాలు జాతికి, ఆల్డిహైడ్ జాతికి తెలుగులో పేర్లు పెట్టవచ్చు.

  • ఆల్కహాలు కుటుంబంలోని పేర్లు "ఒల్" శబ్దంతో అంతం అవాలి కనుక ఆల్కహాలు “ఒలంతం" అవుతుంది. అప్పుడు ఇంగ్లీషులో alcohol అని "ol" చివర వచ్చేటట్లు రాయాలి. తెలుగులో రాసేటప్పుడు "ఆల్కహోల్" అవుతుంది.
  • ఆల్డిహైడ్ కుటుంబంలోని పేర్లు "ఆల్" శబ్దంతో అంతం అవాలి కనుక మతనాల్“ అలంతం" అవుతుంది. అప్పుడు ఇంగ్లీషులో methnal అని "al" చివర వచ్చేటట్లు రాయాలి. తెలుగులో రాసేటప్పుడు "మెతనాల్" అవుతుంది.

ఈ పద్ధతిలో పాత పేరున్న ఫార్మాల్డిహైడ్ ఇప్పుడు మెతనాల్ గా మారింది. లేటిన్ లో “ఫార్మైకా” (formica) అంటే చీమ.సంస్కృతంలో చీమని పిపీలికం అంటారు. కనుక formic acid పిపీలికామ్లం అవుతుంది. అప్పుడు ఫార్మాల్డిహైడ్ పిపీలికాలంతం అవుతుంది.

ఉదాహరణలు

మూలాలు

[మార్చు]

వేమూరి వేంకటేశ్వరరావు, నిత్యజీవితంలో రసాయన శాస్త్రం, కినిగే ప్రచురణ, kinige.com