ఆల్కహాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Functional group of an alcohol molecule. The carbon atom is bound to hydrogen atoms and may bind to other carbon atom(s) to form a carbon chain. Methanol, an alcohol with a single carbon atom, is pictured. Ethanol, which is drinking alcohol, has two carbon atoms.

రసాయన శాస్త్రం ప్రకారం, ఆల్కహాలు (Alcohol) అనగా హైడ్రాక్సిల్ గ్రూపు, ఆల్కైల్ గ్రూపులోని కర్బన అణువుతో సంబంధమైన కర్బన సమ్మేళనాలు. దీని సాధారణ ఫార్ములా CnH2n+1OH.

ఆల్కహాలుల లో ప్రధానమైనది ఈథైల్ ఆల్కహాలు లేదా ఎతల్‍ ఆల్కహాలు. దీనిని మోటారు వాహనాలలో ఇంధనంగా ఉపయోగిస్తారు. అందుకే దీనిని 'పవర్ ఆల్కహాలు'గా కూడా పిలుస్తారు. ఆల్కహాలిక్ పానీయాలు అన్నీ కూడా దీనితోనే తయారుచేస్తారు.

ప్రయోజనాలు[మార్చు]

Total recorded alcohol per capita consumption (15+), in litres of pure alcohol[1]
  • కొన్ని ఆల్కహాలులని, ముఖ్యంగా ఇథనాల్ (ఎతనాల్‍) మరియు మిథనాల్ (మెతనాల్‍) వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తున్నారు.
  • ఆల్కహాల్‍ని పరిశ్రమలలోనూ, శాస్త్రీయ ప్రయోగశాల పరీక్షలలోనూ మాత్రమే కాకుండా ద్రావణి (Solvent) గా కూడ ఉపయోగిస్తున్నారు. కొన్ని వైద్య సంబంధమైన మందులు, పరిమళ ద్రవ్యాలు మరియు వెనీలా వంటి పదార్ధాలకు ద్రావకంగా ఉపయోగిస్తున్నారు.
  • ఇథనాల్ క్రిమి సంహారకంగా చర్మం మీద సూదిమందు (injections) ఇచ్చే ముందు కొన్ని సార్లు అయొడిన్ తో కలిపి ఉపయోగిస్తారు. ఇథనాల్ కలిపిన సబ్బులు తయారుచేస్తున్నారు.
  • ఆల్కహాల్ సంగ్రహాలయాలలో కొన్ని శరీరభాగాల్ని నిలవచేయడానికి ఉపయోగిస్తున్నారు.

సాధారణ నామం[మార్చు]

 రసాయన ఫార్ములా   IUPAC Name   సాధారణ నామం 
Monohydric alcohols
CH3OH మిథనాల్ Wood alcohol
C2H5OH ఇథనాల్ ఆల్కహాల్
C3H7OH ఐసోప్రొపైల్ ఆల్కహాల్ Rubbing alcohol
C4H9OH బుటనాల్ బుటైల్ ఆల్కహాల్
C5H11OH పెంటనాల్ అమైల్ ఆల్కహాల్
C16H33OH Hexadecan-1-ol సెటైల్ ఆల్కహాల్
Polyhydric alcohols
C2H4(OH)2 Ethane-1,2-diol ఇథిలీన్ గ్లైకాల్
C3H6(OH)2 Propane-1,2-diol ప్రొపిలీన్ గ్లైకాల్
C3H5(OH)3 Propane-1,2,3-triol గ్లిజరాల్
C4H6(OH)4 Butane-1,2,3,4-tetraol ఎరిథ్రిటాల్, Threitol
C5H7(OH)5 Pentane-1,2,3,4,5-pentol Xylitol
C6H8(OH)6 Hexane-1,2,3,4,5,6-hexol మానిటాల్, Sorbitol
C7H9(OH)7 Heptane-1,2,3,4,5,6,7-heptol Volemitol
Unsaturated aliphatic alcohols
C3H5OH Prop-2-ene-1-ol Allyl alcohol
C10H17OH 3,7-Dimethylocta-2,6-dien-1-ol Geraniol
C3H3OH Prop-2-in-1-ol Propargyl alcohol
Alicyclic alcohols
C6H6(OH)6 Cyclohexane-1,2,3,4,5,6-hexol Inositol
C10H19OH 2 - (2-propyl)-5-methyl-cyclohexane-1-ol మెంథాల్

ఉత్పత్తి[మార్చు]

పారిశ్రామికంగా[మార్చు]

ఆల్కహాలు పరిశ్రమలలో వివిధ పద్ధతులలో తయారుచేయవచ్చును:

  • కిణ్వనప్రక్రియ (Fermentation) ద్వారా పిండి పదార్ధాలను జలవిశ్లేషణం (Hydrolysis) ద్వారా విడగొట్టిన చక్కెరల నుండి తయారుచేసిన గ్లూకోజ్ పై ఈస్ట్ ను నిర్ధిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉపయోగించి తయారుచేస్తారు.
  • ముడి చమురు (crude oil) లోని ఇథిలీన్ లేదా ఇతర ఆల్కీనులను విడగొట్టి హైడ్రేషన్ ద్వారా ఇథనాల్ ను తయారుచేస్తారు. ఈ చర్యకు ఫాస్ఫారిక్ ఆమ్లం ఉత్ప్రేరకంగా అధిక ఉష్ణోగ్రత మరియు పీడనం వద్ద జరిపిస్తారు.
  • మిథనాల్ ను కార్బన్ డై ఆక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువును విలీనం చేసి దానికి రాగి, జింక్ ఆక్సైడ్ మరియు అల్యూమినియం ఆక్సైడ్ లను ఉత్ప్రేరకాలుగా 250 °C ఉష్ణోగ్రత వద్ద అధిక పీడనం ఉపయోగించి తయారుచేస్తారు.

అంతర్గతంగా[మార్చు]

ఎప్పుడూ మద్యం సేవించకపోయినా మానవులందరిలో కొంత ఆల్కహాల్ అంతర్గతంగా (Endogenous ethanol production) తయారౌతుంది. మన శరీరంలో పేగులలోని కొన్ని బాక్టీరియా ఆహారం నుండి కిణ్వనం (Fermentation) ద్వారా శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి. దీని ద్వారా ఇథనాల్ వ్యర్ధ పదార్ధంగా తయారై రక్తంలో ప్రవేశిస్తుంది. ఈ ఆల్కహాల్ ను మనం పరీక్షల వలన గుర్తించవచ్చును.

ఆల్కహాల్ సేవిస్తే వచ్చే ఆరోగ్యసమస్యలు[మార్చు]

ఆల్కహాల్ సేవించడం వలన వచ్చే నష్టాలు అన్ని ఇన్ని కావు.మద్యం సేవిస్తే అప్పటికప్పుడు ఉత్తేజం కలుగుతుందే గాని కొంతకాలం తర్వాత దానికి బానిస అవుతారు.ఇది సేవిస్తే ముఖ్యంగా కాలేయం పాడైపోతుంది.

వనరులు[మార్చు]

  • వేమూరి వేంకటేశ్వరరావు, ఉత్తర ఆల్కహాలీయం, (Alcohol, part 2), భారతి, Bharathi, 65(8): 39-44, August 1988.
  • వేమూరి వేంకటేశ్వరరావు, ఆల్కహాలు, (Alcohol), భారతి, Bharathi, 65(3):16-21, March 1988.

మూలాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=ఆల్కహాలు&oldid=1371006" నుండి వెలికితీశారు