ఆల్బర్ట్ కామూ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆల్బర్ట్ కామూ
Albert Camus, gagnant de prix Nobel, portrait en buste, posé au bureau, faisant face à gauche, cigarette de tabagisme.jpg
Portrait from New York World-Telegram and the Sun Newspaper Photograph Collection, 1957
జననం (1913-11-07)7 నవంబరు 1913
డ్రీన్, ఎల్ టరెఫ్, ఫ్రెంచ్ అల్జీరియ
మరణం జనవరి 4, 1960(1960-01-04) (వయసు 46)
విల్లెబ్లెవిన్, యెన్నె, బర్గండీ, ఫ్రాన్స్
యుగం 20వ శతాబ్దపు తత్వ శాస్త్రం
ప్రాంతం పశ్చిమ తత్వ శాస్త్రం
తత్వ శాస్త్ర పాఠశాలలు అసంగతవాదం
ప్రధాన అభిరుచులు నీతి శాస్త్రము, మానవత్వం, న్యాయం, ప్రేమ, రాజనీతి

ఆల్బర్ట్ కామూ (7 నవంబరు 1913 – 4 జనవరి 1960) ఫ్రెంచి వలసరాజ్యమైన అల్జీరియాలో జన్మించిన నోబెల్ బహుమతి పొందిన రచయిత, తత్త్వవేత్త. ఇతని ఆలోచనలు అసంగతవాదం అనే సరి కొత్త తత్వ సిధ్ధాంత పుట్టుకకు ప్రేరణనిచ్చాయి. అతను “The Rebel” అన్నవ్యాసంలో చెప్పుకున్నట్టుగా, తనజీవితాన్ని “వ్యక్తి స్వేచ్ఛగురించి లోతుగా పరిశీలిస్తూనే, nihilism ని వ్యతిరేకించడానికే సరిపోయింది”. (nihilism తార్కికంగా జీవితానికి ఏదో ఒక గమ్యం,లక్ష్యం ఉన్నాయన్న ప్రతిపాదనని ఖండిస్తుంది). సాంకేతిక విజ్ఞాన అభివృధ్ధిని ఆరాథనాభావంతో చూడడానికి అతను పూర్తి వ్యతిరేకి. అతనికి ఏ రకమైన తాత్త్విక ముద్రలూ ఇష్టం లేదు.

బాల్యం[మార్చు]

ఆల్బర్ట్ కామూ నవంబర్ 7, 1913 లో అప్పటి ఫ్రెంచ్-అల్జీరియా లోని డ్రీన్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. అతని తల్లి స్పానిష్ వారసత్వానికి చెందిన స్త్రీ. ఆమె పాక్షికంగా చెవిటిది. ఒక పేద వ్యవసాయ పనివాడుగా ఉన్న కామూ తండ్రి లూసియిన్ మొదటి ప్రపంచ యుధ్ధ సమయంలో జరిగిన మార్నే పోరాటంలో పాల్గొని యుధ్ధంలో మరణించాడు.బాల్యంలో కామూ చాలా పేదరికాన్ని అనుభవించాడు.

చదువు[మార్చు]

మాధ్యమిక విద్య ముగిశాక కామూ ఉన్నత విద్యాభ్యాసం కోసం అల్జైర్స్ విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడ చదువుతుండగా ఫుట్ బాల్ క్రీడలో చురుగ్గా పాల్గొని గోల్ కీపర్ గా కూడా వ్యవహరించాడు. కానీ తర్వాత క్షయ వ్యాధి సోకడంతో క్రమంగా ఆటలో పాల్గొనడం తగ్గించాడు. అవసరమయిన ఖర్చుల కోసం ప్రైవేట్ ట్యూటర్, కార్ల విడి భాగాల క్లర్కు లాంటి చిన్న ఉద్యోగాలు చేస్తూ 1935 లో తత్వశాస్త్రంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ (BA) పూర్తి చేశాడు. ఆ తర్వాత మే 1936 లో తత్వ శాస్త్రంలో పోస్టు గ్రాడ్య్యేషన్ డిగ్రీ (MA) కోసం Plotinus, Neo-Platonism and Christian Thought అనే విషయాల మీద థీసిస్ సమర్పించాడు.

రచనలు[మార్చు]

కామూ అసంగతవాదం (అబ్సర్డిటీ) "జీవిత పరమార్థం తెలుసు కోవాలని, తెలుసుకునేందుకు ప్రయత్నించి, తెలుసుకునేందుకు ఏమీలేదని నిర్ధారించుకుని, అయినా తెలుసుకునే ప్రయత్నం కొనసాగిస్తున్న" పద్ధతిని ప్రతిపాదిస్తుంది. అసంగతవాదం అంటే ఏమిటో ఆల్బర్ట్ కామూ తన ‘మిత్ ఆఫ్ సిసిఫస్ ‘ వ్యాసంలో విస్తృతంగా చర్చించాడు.

నవలలు[మార్చు]

 • The Stranger (అపరిచితుడు) (1942)
 • The Plague (ప్లేగు వ్యాధి) (1947)
 • The Fall (పతనం) (1956)
 • A Happy Death (ఆనంద మరణం) (1936–1938 లో రాయబడిన ఈ నవల కామూ మరణానంతరం 1971 లో ప్రచురితమయ్యింది)
 • The First Man (మొదటి మనిషి) (అసంపూర్ణమయిన ఈ నవల కూడా మరణానంతరం 1995 లో ప్రచురితమయ్యింది)

కథలు[మార్చు]

 • Exile and the Kingdom (బహిష్కరణ మరియు రాజ్యం) (కథా సంకలనం) (1957)
 • The Adulterous (వేశ్య)
 • The Renegade or a Confused Spirit (తిరుగుబాటుదారు)
 • The Silent Men (నిశ్శబ్ద మనుషులు)
 • The Guest (అతిధి)
 • Jonas or the Artist at Work (కళాకారుడు పనిలో ఉన్నాడు)
 • The Growing Stone (పెరిగే శిల)

ఇవే కాక ఇంకా పలు పుస్తకాలు, నాటకాలు, వ్యాసాలు కూడా రాశాడు. యండమూరి వీరేంద్రనాధ్ రాసిన ప్రసిధ్ధ నవల 'అంతర్ముఖం' కామూ నవల The Stranger కి అనుసరణ

వ్యక్తిగత జీవితం[మార్చు]

కామూ మరణించే నాటికి అతనికి భార్య మరియు కవలలయిన ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

మరణం[మార్చు]

జనవరి 4, 1960 న నలభయ్యారేళ్ళ వయసులో కామూ ఒక కారు ప్రమాదంలో మరణించాడు. చనిపోయిన రోజు అతని కోటు జేబులో ఒక రైలు టిక్కెట్ ఉంది. ఆ రోజు అతను భార్యా పిల్లలతో రైలు ప్రయాణం చెయ్య వలసి ఉంది కానీ చివరి నిమిషంలో ఒక పబ్లిషరుతో కారులో ప్రయాణించవలసి వచ్చి ఆ రైలు ప్రయాణం రద్దు చేసుకున్నాడు.

రుడ్యార్డ్ కిప్లింగ్ తర్వాత అతి చిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన రెండవ రచయిత ఆల్బర్ట్ కామూ.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]