Jump to content

ఆల్ సెయింట్స్ చర్చి, హైదరాబాదు

అక్షాంశ రేఖాంశాలు: 17°23′35″N 78°28′23″E / 17.393°N 78.473°E / 17.393; 78.473
వికీపీడియా నుండి
ఆల్ సెయింట్స్ చర్చి
Provinceసికింద్రాబాదు
ప్రదేశం
ప్రదేశంతిరుమలగిరి, సికింద్రాబాదు , తెలంగాణ
దేశంభారతదేశం
భౌగోళిక అంశాలు17°23′35″N 78°28′23″E / 17.393°N 78.473°E / 17.393; 78.473

ఆల్ సెయింట్స్ చర్చి సికింద్రాబాదులోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న క్రైస్తవ ప్రార్థనామందిరం.[1] 1947లో దక్షిణ భారతదేశపు చర్చీల సమూహంలో చేర్చబడిన ఈ చర్చీ, దక్షిణ భారతదేశంలోని చర్చీలలో ప్రత్యేకమైనది.

చరిత్ర

[మార్చు]

సికింద్రాబాదులోని బ్రిటీష్ కంటోన్మెంటుకు సేవలు అందించడంకోసం 1860లో ఆల్ సెయింట్స్ చర్చి నిర్మించబడింది. ఇది మొట్టమొదటి శాశ్వత నిర్మాణంగా చెప్పవచ్చు.[2][3][4]

నిర్మాణం

[మార్చు]

ఆల్ సెయింట్స్ చర్చి గోతిక్ శైలీలో నిర్మించబడింది. దూరం నుండి చూసినా కూడా ఆకర్షణీయంగా కనిపించేలా ఉన్న ఈ చర్చి తిరుమలగిరి ప్రాంతంలో నిర్మించబడిన తొలి క్రైస్తవ ప్రార్థనా మందిరం. చర్చిలో ఉన్న అద్దాలపై రంగులతో క్రీస్తు చిత్రాలు చిత్రించబడ్డాయి.

రాయల్ ఆర్టిలరీ యొక్క లెఫ్టినెంట్ ఎడ్వర్డ్ డాసన్ జ్ఞాపకార్థంగా అంకితంచేసిన 1884నాటి గాజు కిటికి ఉంది. సికిందరాబాదులో నివసించిన అనేకమంది బ్రిటీష్ అధికారులను సంబంధించిన పదహారు స్మారక చిహ్నాలు చర్చి యొక్క గోడలపై ఏర్పాటుచేయబడ్డాయి. ఇది ఇంటాక్ హెరిటేజ్ అవార్డును అందుకుంది.

రాణి సందర్శన

[మార్చు]

1983లో రాణి ఎలిజబెత్ II చర్చిని సందర్శనకు వచ్చింది.[5][6][7] అదేసమయంలో సమీపంలోవున్న బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చిని కూడా సందర్శించి, బిషప్ విక్టర్ ప్రేమసాగర్ ఆధ్వర్యంలో ప్రిన్స్ ఫిలిప్ తో కలిసి 36వ వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంది.[8]

మూలాలు

[మార్చు]
  1. సెయింట్ జార్జి చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 44
  2. The Hindu Newspaper. 17 August 2006 Edition.
  3. hyrjm. "The Hindu : Saving sentinels from decay". hindu.com. Archived from the original on 23 జూన్ 2003. Retrieved 30 March 2019.
  4. "Google Groups". bbs.keyhole.com. Retrieved 30 March 2019.[permanent dead link]
  5. సాక్షి, ఫీచర్స్ (25 December 2014). "క్రిస్టియన్ మిషనరీలు 100 plus". మల్లాది కృష్ణానంద్. Archived from the original on 26 March 2019. Retrieved 1 April 2019.
  6. chakrapani. "One of the oldest edifices in Secunderabad - Architecture Photos - Chakra'View'..." cp.aminus3.com. Retrieved 30 March 2019.
  7. Lodi News-Sentinel, 21 Nov 1983.
  8. "Welcome to Holy Trinity Church Bolarum". htcbolarum.org. Archived from the original on 3 అక్టోబరు 2013. Retrieved 30 మార్చి 2019.