ఆసిఫ్ మసూద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆసిఫ్ మసూద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సయ్యద్ ఆసిఫ్ మసూద్ షా
పుట్టిన తేదీ23 January 1946 (1946-01-23) (age 78)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 57)1969 ఫిబ్రవరి 21 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1977 జనవరి 1 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 2)1973 ఫిబ్రవరి 11 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1976 అక్టోబరు 16 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 16 7
చేసిన పరుగులు 93 10
బ్యాటింగు సగటు 10.33 5.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 30* 6
వేసిన బంతులు 3,038 402
వికెట్లు 38 5
బౌలింగు సగటు 41.26 46.79
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/111 2/9
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 1/–
మూలం: ESPNCricinfo, 2017 ఫిబ్రవరి 4

సయ్యద్ ఆసిఫ్ మసూద్ షా (జననం 1946, జనవరి 23) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]1969 నుండి 1977 వరకు 16 టెస్ట్ మ్యాచ్‌లు, 7 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.

జననం[మార్చు]

సయ్యద్ ఆసిఫ్ మసూద్ షా 1946, జనవరి 23న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు. లాహోర్‌లోని ఇస్లామియా కాలేజీలో చదువుకున్నాడు.

క్రికెట్ రంగం[మార్చు]

1971లో బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 111 పరుగులకు 5, 49కి 4 వికెట్లు తీసుకున్నాడు.[2] దీంతో 1971–72లో ఆస్ట్రేలియాలోని రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టుకు ఎంపికయ్యాడు.

విరమణ తరువాత[మార్చు]

1977లో క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. యుకెలో వివాహం చేసుకున్న తర్వాత, ఆసిఫ్ మసూద్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్త ఎదిగాడు. మొదట ట్రావెల్ ఏజెన్సీని, తరువాత బరీ, లంకాషైర్‌లో పోస్టాఫీసును కలిగి ఉన్నాడు.[3] ప్రస్తుతం తన భార్య, నలుగురు పిల్లలతో బరీలో నివసిస్తున్నాడు.

మూలాలు[మార్చు]

  1. "Asif Masood". ESPcricinfo. Retrieved 2020-07-13.
  2. "Full Scorecard of Pakistan vs England 1st Test 1971". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2020-07-13.
  3. "Stamps not stumps". Lancashire Telegraph (in ఇంగ్లీష్). 22 May 1997. Retrieved 2020-07-13.