ఆస్టిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Austin, Texas
City of Austin
Downtown skyline as seen from Lady Bird Lake
Downtown skyline as seen from Lady Bird Lake
ముద్దుపేరు(ర్లు): 
Live Music Capital of the World, Silicon Hills[1]
Location in the state of Texas
Location in the state of Texas
దేశం United States
Stateటెక్సస్ Texas
CountiesTravis
Williamson
Hays
Settled1835
IncorporatedDecember 27, 1839
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంCouncil–manager
 • MayorLee Leffingwell
 • City ManagerMarc Ott
విస్తీర్ణం
 • State Capital251.50 చ. మై (651.38 కి.మీ2)
 • భూమి251.50 చ. మై (651.4 కి.మీ2)
 • నీరు6.91 చ. మై (17.90 కి.మీ2)
 • మెట్రో ప్రాంతం
4,285.70 చ. మై (11,099.91 కి.మీ2)
సముద్రమట్టం నుండి ఎత్తు
489 అ. (149 మీ)
జనాభా వివరాలు
(2011)[2]
 • State Capital820,611 (13th)
 • సాంద్రత3,262.86/చ. మై. (1,259.80/కి.మీ2)
 • మెట్రో ప్రాంతం
17,16,291 (35th)
కాలమానంUTC-6 (CST)
 • వేసవికాలం (DST)UTC-5 (CDT)
పిన్‌కోడ్
78701-78705, 78708-78739, 78741-78742, 78744-78769
ప్రాంతీయ ఫోన్ కోడ్512
FIPS code48-05000[3]
GNIS feature ID1384879[4]
జాలస్థలిwww.austintexas.gov

ప్రవేశిక[మార్చు]

ఆస్టిన్ యు.ఎస్ రాష్టం టెక్సస్ రాజధాని, ట్రావిస్ కౌంటీ స్థానం. టెక్సస్ రాష్ట్ర కేంద్ర స్థానంలో నైరుతి అమెరికా తూర్పు తీరంలో ఉంది. ఆస్టిన్ నగరం జనసాంద్రతలో అమెరికా సంయుక్త రాష్ట్రాల ముఖ్య నగరాలలో 13వ స్థానంలోనూ టెక్సస్ రాష్టంలో 4వ స్థానంలోనూ ఉంది. 2000 నుండి 20006 మధ్య కాలంలో త్వరితగతిలో అభివృద్ధి చెందుదున్న నగరాలలో ఇది దేశంలో మూడవ స్థానంలో ఉంది. 2011 గణాంకాలను అనుసరించి ఆస్టిన్ జనసంఖ్య 820,611. ఆస్టిన్-రౌండ్ రాక్-శాన్ మార్కోస్ ప్రధాన ప్రదేశంలో ఆస్టిన్ సంకృతిక, వాణిజ్య కేంద్రంగా విలసిల్లుతుంది. 2011 గణాంకాలను అనుసరించి ఈ మొత్తం ప్రదేశ జనసంఖ్య 1,783,519. ఈ నగరం యు.ఎస్ మహానగరాలలో 34వ అతిపెద్ద నగరంగా అలాగే టెక్సస్ నగరంలో 4వ అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది.

1830-1838 లో నావికులు ఆస్టిన్ మధ్య ప్రదేశంలో కొలర్డో నదీతీరంలో ఒప్పంద రూపంలో ప్రదేశాలను ఏర్పరచుకుని నివసించ సాగారు. తరువాత 1837 లో రిపబ్లిక్ ఆఫ్ టెక్సస్ అధ్యక్షుడు మిరాబెయు.బి లామార్ బఫెల్లో హంటింగ్ (బర్రెల వేట) సాహస యాత్ర సందర్భంలో ఈ ప్రదేశానికి విజయం చేసిన తరువాత ఆయన రిపబ్లిక్ రాజధానిగా హ్యూస్టన్ నగరాన్ని ప్రతిపాదించాడు. 1839 లో కొలర్డో నది ఉత్తర తీరంలో టెక్సస్ తిరిగి ప్రస్తుత ఎన్ డబ్ల్యూ. రిచర్డ్స్ కాంగ్రెస్ అవెన్యూ వంతెన వద్ద స్థాపించబడి తరువాత ఈ ప్రదేశం అధికారికంగా రిపబ్లిక్ కొత్త రాజధానిగా ఎన్నుకొనబడింది (ఇది ఈ రిపబ్లిక్ ఏడవ, చివరి ప్రదేశం). అలాగే వాటర్‍లూ పేరుతో విలీనం చేయబడింది. కొంచెం కాలంలోనే ఆ పేరు ఫాదర్ ఆఫ్ టెక్సస్, రిపబ్లిక్ మొదటి రాష్ట్రీయ కార్యదర్శి అయిన స్టీఫెన్ ఎఫ్. ఆస్టిన్ ను గౌరవిస్తూ ఆస్టిన్ గా మార్చబడింది.

19వ శతాబ్దం నుండి టెక్సస్ రాష్ట్ర రాజధానిగా రాజ్యాంగ భవనాలు, టెక్సస్ విశ్వవిద్యాలం (యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్)వంటి నిర్మాణాల కారణంగా నగరం త్వరిత గతిలో అభివృద్ధి చెందింది. గొప్ప అణిచివేత తరువాత లభించిన లాలనలా 1880 నాటికి ఆస్టిన్ నగరం తిరిగి కూడుకొని అభివృద్ధి పధంలో అడుగు పెట్టడమే కాక సాంకేతిక, వ్యాపార కేంద్రంగా అభివృద్ధిని సాధించింది. నగరంలో అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్, ఏపిల్, గూగుల్, ఐబిఎమ్, ఇంటెల్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, 3ఎమ్,, హోల్ ఫూడ్స్ మార్కెట్ వంటి ఫార్చ్యూన్ 500 చెందిన సంస్థలు ఈ నగరంలో తమ ప్రధాన కార్యాలయాలు లేక ప్రాంతీయ కార్యాలయాలు కలిగి ఉన్నాయి. ఆస్టిన్ శివార్లలో ఉన్న రౌండ్ రాక్ లో డెల్ సంస్థ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం ఉంది.

ఆస్టిన్ వాసులను ఆస్టినైట్స్ అని పిలుస్తుంటారు. వారు ప్రభుత్వోద్యోగులు, విశ్వవిద్యాలయ సిబ్బంది, చట్టం అమలు సిబ్బంది, రాజకీయ సిబ్బంది, విదేశీ, దేశీయ కళాశాల విద్యార్థులు, ఉన్నత సాంకేతిక ఉద్యోగులు, వ్యాపారులు వంటి వైవిధ్యం కలిగిన మిశ్రమ కలయికగా ఉంటారు. నగరం సాంకేతిక సంస్థల యొక్క అభివృద్ధి కేంద్రాలకు పుట్టిల్లుగా ఉంది. 1990లో ఇది సిలికాన్ హిల్స్ అనే హాస్యనామం (నిక్ నేం)ను స్వీకరించింది. ఎలాగైతేనేం ప్రస్తుత ఆస్టిన్ నగరానికి ప్రత్యక్ష సంగీత రాజధాని (ది లైవ్ మ్యూజిక్ కాపిటల్) అధికారిక నినాదంతో ప్రోత్సాహాన్ని అందించింది. పరిశీలనకు పలు సంగీత కారులు ప్రత్యక్ష ప్రసార వేదికలు ఈ ప్రదేశంలో ఉన్నాయి. సమీప కాలంగా ఆస్టిన్ నగర సరి హద్దులలో సుదీర్ఘకాలంగా జరుపబడుతున్న పి బి ఎస్ టి.వి TV కచేరీలు నిర్వహిస్తుంది. కొంరు ఆస్టినైట్స్ అనధికారికంగా కీప్ ఆస్టిన్ వైర్డ్ (ఆస్టిన్‍ను అదృష్టంగా ఉంచండి ) అన్న నినాదాన్ని స్వీకరించారు. 1800 ఆఖరి దశలో ఆస్టిన్ నగరం ఊదా కిరీటం (వైలెట్ క్రౌన్) అనే మారు పేరును తెచ్చుకుంది. శీతా కాలంలో సూర్యోదయం కాగానే కొండలు ఊదా రంగుతో మెరిసి పోతూ భావోద్రేకాన్ని కలిగిస్తాయి. అన్ని బహింరంగ ప్రదేశాలలోను, భవనాలలోను, రెస్టారెంట్లలోనూ పొగ త్రాగడం మీద కఠినమైన చట్టలు అమలులో ఉన్న కారణంగా ఆస్టిన్ నగరం క్లీన్ ఎయిర్ స్టీ (వాయుకాలుష్య రహిత నగరం) గా పేరు తెచ్చుకుంది.

నామ చరిత్ర[మార్చు]

1835-1836 మధ్య సమయంలో టేక్సాస్ సాగించిన స్వాతంత్ర్య పోరాటంలో విజయం సాధించి మెక్సికో నుండి స్వాతంత్ర్యం సాధించించది. టేక్సాస్ స్వతంత్ర కౌటీగా అవతరించి స్వంత రాజ్యాంగ స్థాపన చేసి తన స్వంత అధ్యక్షుడిని, కాంగ్రెస్‍ను, పాలనా వ్యవస్థని ఏర్పాటు చేసుకుంది. 1839 కాంగ్రెస్ టెక్సాస్ స్టీఫెన్ అస్టిన్ పేరుతో రాజధాని నగరం నిర్మించడానికి అనువైన ప్రదేశాన్ని కోరుతూ ఒక కమిషన్ రూపొందించారు. కొత్తగా రూపొందిన రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ రెండవ అధ్యక్షుడు మిరాబ్యూ బి.లేమర్ కొండలు జలప్రవాహాలు, ప్రశాంత వాతావరణం కలిగిన వాటర్లూ ప్రాంతాన్ని పర్శీలించమని కమిషన్‍కు ప్రతిపాదించాడు. వాటర్‍లూ ప్రాంతం రాజధాని నగరానికి ఎన్నిక చేయబడి ఆస్టిన్ అని నామకరణం చేయబడింది. ఆస్టిన్ అనే పేరు అగస్టిన్ అనే పదం నుండి వచ్చిందని భావిస్తున్నారు. దీనికి మూల పదం మహావీరుడైన అగస్టస్‍దని భావిస్తున్నరు. ఉత్తర మెక్సికో, రెడ్ రివర్ నుండి, శాంటా ఫీ, గాల్వ్స్టన్ సముద్ర అఖాత మార్గాలు ఈ ప్రాంతాన్ని వాణిజ్యానికి అనుకూల ప్రదేశంగా మార్చాయి. కొలరడోకు తీసుకు పోయే చిషోల్ం ట్రెయిల్ ఉన్నది ఆస్టిన్ నగరంలోనే.

చరిత్ర[మార్చు]

క్రీ.పూ 9200 నుండి అస్టిన్‍లోని ట్రావిస్ కౌంటీ, విలియంస్ కౌంటీలో మానవులు నివసించి ఉండవచ్చు. సా.శ. 9200 కాలంలో హిమయుగానికి (ప్లెయిస్టోసిన్)చెందిన మానవులు క్లోవ్ సంస్కృతితో సంబంఉందని భావిస్తున్న వారు ఇక్కడ నివసించినట్లు భావిస్తున్నారు. ఈ ప్రదేశంలో లభించిన ఆధారాలను జార్జ్ టౌన్, మిడ్వే ప్రాంతంలో పురాతన మానవులు నివసించినట్లు భావిస్తున్నారు.

ఐరోపా నుండి వలసదారులు ఈ ప్రదేశానికి చేరుకున్న సమయంలో ట్రాంక్వా గిరిజనులు నివసించిన ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశం గుండా కొమాంచ్, లిపిన్ అపాచెస్ ప్రయాణించారని భావిస్తున్నారు. స్పానిష్ సాహసయాత్రికులైన ఎస్పినోస్-ఆలివర్స్-అక్విరే వంటివారు ఈ ప్రాంతంలో శతాబ్ధాల కాలం ప్రయాణం చేసారు. కొన్ని సమయాలలో వారిలో కొంతమంది ఇక్కడ శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్నారు. కొలరాడో నదికి దక్షిణతీరంలో 1730లో తూర్పు టెక్ష్సాస్ నుండి వచ్చిన మూడు మిషనరీలు సంఘటితమై ఒక మిషనరీ స్థాపన చేసారు. అదే ప్రస్తుతం ఆస్టిన్లో ఉన్న "జిల్కర్ పాక్". ఆ మిషన్ ఈ ప్రాంతంలో ఏడు మాసాల కాలం మాత్రమే కొనసాగి తరువాత శాన్ అంటోనియో చేరుకుని అక్కడ తిరిగి మూడు మిషనరీలుగా చీలిపోయింది. సాహసయాత్రలకు అనుకూలంగా 18వ శతాబ్దం మధ్య కాలంలో కొలరాడో నదీ తీరంలో శాన్ స్కేవియర్ మిషన్ స్థాపించబడింది. అదే ప్రస్తుత మిలం కౌంటీ. 19వ శతాబధ ఆరంభంలో స్పెయిన్ నిర్మించిన కోటలే ప్రస్తుత బెస్ట్రాప్, శాన్ మార్కోస్. మెక్సికోకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వలసదారుల మధ్య టెక్సాసుకు తరలి వెళ్ళారు. ఈ ప్రాంత అభివృద్ధి స్థానిక అమెరికన్లతో జరిగిన యిద్ధాల కారణంగా స్తంభించింది.

లేమర్ ఎడివిన్ వాలర్‍ను ఈ గ్రామాన్ని పరిశోధన చేసి రాజధాని నగర నిర్మాణానికి ప్లాన్ తయారు చేయమడానికి నియమించాడు. షాల్ క్రీక్, వాలర్ క్రీక్ నడుమ కొలరడో నదీ సమీపంలో ఉన్న 640 చదరపు ఎకరాల భూమిని రాజధాని నగర నిర్మాణానికి ఎన్నిక చెయ్యబడింది. 14 అంతస్తుల వెడల్పైన వీధులతో కూడిన ఉత్తర -దక్షిణ భూభాగాలను కలిపే రహదార్లు, కాంగ్రెస్ అవెన్యూ, నదిప్రబహించే ప్రధాన మైదానము ప్రాంతాలలో టెక్సాస్ రాష్ట్ర సరికొత్త రాజధాని నగర నిర్మాణం రూపొందించబడింది. కొలరాడో 8వ వీధిలో తాత్కాలిక ఒక అంతస్తు కలిగిన రాజధాని నిర్మించబడింది. 1839 ఆగస్టు 1వ తేదీన 306 లాట్స్ నుండి 217 చట్టం కార్యరూపం దాల్చింది. తరువాత వాలర్ పరిశోధించి విశాలమైన వీధులతో డౌన్ టౌన్ నిర్మాణానికి పునాదులు వేసాడు.

1840 లో టెక్సాస్ ఆటవీశాఖ అధికారులు, కామంచెస్ల మధ్య వరుస పోరాటాలు చోటు చేసుకున్నాయి. ఈ పోరాటాలు కౌంసిల్ హౌస్ ఫైట్, ది బాటిల్ ఆఫ్ ప్లం క్రీక్ గా పేర్కొనబడ్డాయి. ఫలితంగా చివరికి ఈ పోరాటాలు కామంచెస్లను పడమటి భూభాగాలకు తరలి వెళ్ళేలా చేయడంతో ఈ పోరాటాలు ఒక ముగింపుకు వచ్చయి. ఈ ప్రాంతంలో త్వరగా వలసలు విస్తరించాయి. 1840లో ట్రావిష్ కౌంటీ స్థాపించబడింది. తరువాత రెండు దశాబ్ధాలలో పరిసర కౌటీల అభివృద్ధి కొనసాహింది.

కొత్తరాజధాని నగరం వర్ధ్హల్లింది. అయినప్పటికీ లేమర్ రాజకీయ శత్రువు శాం హ్యూస్టన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న నెపంతో మెక్సికన్ సైన్యాన్ని శాన్ అంటానియో మీద దాడి చేయడానికి వాడుకున్నాడు. ఆస్టిన్ నగరాన్ని నిర్జనమైన సుదూర ప్రదేశాల వరకు విస్తరించాలన్న లేమర్ నిర్ణయానికి వ్యతిరేకంగా శాం హ్యూస్టన్ తీవ్రపోరాటం కొనసాగించాడు. హ్యూస్టన్ నుండి ప్రభుత్వ పరమైన వ్యాపారల నిమిత్తం ప్రయాణించిన స్త్రీ పురుషులను ఈ పోరాటాలు తీవ్రంగా నిరాశకు గురి చేసాయి. 1840 నాటికి ఇక్కడి నుండి వెళ్ళిన వారు తిరిగి రావడంతో జనసంఖ్య 856కి చేరుకుంది. ఇక్కడ నివసిస్తున్న నల్లజాతీయుల సంఖ్య 176కి చేరింది. ఆస్టిన్ నగరాన్ని ఇంకా తమ భూభాగంగానే భావిస్తున్న ఇండియన్, మెక్సికన్‍లు శాంహ్యూస్టన్ మద్దతుతో ఈ నగరం మీద దాడులకు పాల్పడవచ్చన్న భీతి మాత్రం ప్రజల మనసులో మిగిలి పోయింది. మొదటి, రెండవ రిపబ్లిక్ టెక్సాస్ అధ్యక్షులు 1841లో రాజధాని నగరాన్ని హ్యూస్టన్ నగరానికి మార్చారు. టెక్సాసస్‍లో మెక్సికన్ సైన్యాల బెదిరింపులు అధికం కావడమే ఇందుకు ప్రధాన కారణం. కానీ ఆస్టిన్ ప్రజలు ప్రభుత్వం తమకు తామే తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించ లేక పోయారు. తరువాతి కాలంలో ఇది ఆర్చివ్ యుద్ధంగా వర్ణించబడింది. డాక్యుమెంట్లు మాత్రం ఆస్టిన్ నగరంలో ఉంచి రాజధానిని మాత్రం తాత్కాలికంగా హ్యూస్టన్ కు తరలించబడింది. ఆస్టిన్ జనసంఖ్య 1840 అంతా కనిష్ఠస్థాయికి దిగజారింది. 1845 రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ నాగువ అధ్యక్షుడైన ఆంసన్ జోంస్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజధాని తిరిగి ఆస్టిన్‍కి చేర్చబడింది. తరువాత ఆస్టిన్‍కు సెనెట్ సీటు ఇవ్వడం రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ సంయుక్త రాష్ట్రాలలో విలీనంకావడం కార్యరూపందాల్చాయి.

1840 లో ట్రావిస్ కౌంటీ 38% ప్రజలు బానిసలే. 1861 అంతర్యుద్ధం ఉదృతమైన తరువాత టెక్సాస్ ఓటర్లు సెషానికి వ్యతిరేకంగా ఓటు వేసారు. ఏది ఏమైప్పిటికీ యుద్ధం ఉదృతరూపం దాల్చింది. యూనియన్ సైన్యం టెక్సాస్ మీద దాడి చేయవచ్చన్న భయం అధికమైంది. కాంఫిడరేట్ సన్యానికి ఆస్టిన్ వందల కొలది మనుషులను సరఫరా చేసింది. ఆస్టిన్ లోని గాల్వ్స్టన్ వద్ద యూనియన్ జనరల్ " గార్డ్సన్ గ్రాంజర్ " ప్రజలను " జూంటీంత్ "సమైక్యం చేసిన సందర్భంలో విముక్తి ప్రకటన చేసిన తరువాత ఆస్టిన్ జనసంఖ్య నాటకీయంగా అధికమైంది. నాల్లజాతి ప్రజలు వీట్ విల్లే, ప్లెజెంట్ హిల్ , క్లార్క్స్ విల్లెలను స్థాపించి సమూహాలుగా ఏర్పడ్డారు. ఈ ప్రదేశాలు మిసిసపి పడమటి ప్రాంతంలో పురాతన ఆఫ్రికన్-అమెరికన్లు యుద్ధానంతరం స్థాపించిన వలస ప్రాంతాలుగా గుర్తించబడుతున్నాయి. 1870 నాటికి ఆస్టిన్లో నివసిస్తున్న నల్లజాతీయుల సంఖ్య 36.5% నికి చేరుకుంది. యుద్ధానంతర కాలంలో అస్టిన్ నగరంలో నాటకీయంగా జనసంఖ్య , ఆర్ధికం అభివృద్ధి చెందాయి. 1871లో హ్యూస్టన్ టెక్సాస్ సెంట్రల్ రైల్‍వే స్థాపనతో ఆస్టిన్ ప్రఖ్యాత వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం శక్తివంగా పత్తి , పశువులను రవాణా చేయసాగింది. మిసిసిపి, కనాస్ , టెక్స్సస్ మార్గం మూసివేయబడింది. చిషోం పశువుల కాపర్లకు ఆస్టిన్ దక్షిణ ప్రాంతపు చివరి మజిలీ కనుక ఇక్కడి నుండి పశువులు ఉత్తర ప్రాంతాలకు రవాణా చెయ్యబడ్డాయి. ఇక్కడ ఉత్పత్తి చేయబడే పంటలలో కాటన్ ఒకటి. ఇక్కడ ఉత్పత్తు చేయబడే పత్తిని ఇక్కడే బేల్స్ చేసి రవాణాకు సిద్ధం చేసి ఎగుమతి చేయబడసాగింది. డౌన్ టౌన్ సమీపంలో స్థాపించబడిన జిన్నింగ్ మిల్లులలో పత్తి నుండి గింజలను వేరు చేసి బేల్స్ తయారు చేయబడతాయి. 1870లో ఈ ప్రాంతాలలో ఇతర రైలు మార్గాల నిర్మాణం జరిగిన తరువాత ఆస్టిన్ వాణిజ్యపరంగా ప్రాంతీయ సమూహాలలో కొంత ప్రాముఖ్యతను కోల్పోయింది. అదనంగా ఆస్టిన్ తూర్పు ప్రాంతాలు పశువులు ఉత్పత్తి , పత్తి ఉత్పత్తిని ఆస్టిన్ నుండి తీసుకున్నాయి. విశాలమైన బ్లాక్ లాండ్ మైదానాలు సారవంతమైన భూములు కలిగిన హిట్టో , టేలర్ ప్రాంతాలు పత్తి , గడ్డి పెరగడానికి అనుకూలంగా ఉండడమే ఇందుకు కారణం.

1881 సెప్టెంబర్ ఆస్టిన్ ప్రభుత్వపాఠశాలలు వారి తరగతులను ప్రారంభించాయి. అదే సంవత్సరం టిల్‍స్టోన్ కాలేజ్ , నార్మల్ ఇంస్టిట్యూట్ (ఇప్పుడు హ్యూస్టన్-హిల్టన్ విశ్వవిద్యాలయం) తమ ద్వారాలను తెరిచాయి. 1883లో ఆస్టిన్‍లో ఉన్న "యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్" తమ మొదటి తరగతులను ప్రారంభించింది. ఈ విశ్వవిద్యాలయం తమ విద్యాబోధను నాలుగు సంవత్సరాల ముందే " ఒరిజనల్ వుడన్ స్టేట్ కాపిటల్‍లో జరుపుతున్నది. 1888లో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న రాజధాని భవనంలో రాజ్యాంగ కార్యకలాపాలు ఆరంభం అయ్యయి. ఈ భవనం ప్రపంచం లోని అతి పెద్ద భవనాలలో ఏడవ స్థానం సంపాదించుకున్నది. 19వ శతాబ్దంలో ఆస్టిన్ నగరం తన పూర్వపు స్థితి కంటే మూడు రెట్లు అధికంగా విస్తరించబడింది. కొలరాడో నది మీద నిర్మించబడిన మొదటి గ్రానైట్ వంతెన నిర్మాణం తరువాత " న్యూ స్ట్రీట్ కార్ లైన్", " న్యూ మూన్ టవర్" కావలసిన విద్యుత్ సరఫరా చేయబడింది. 1909 ఏప్రిల్ 6న దురదృష్ట వశాత్తు మొదటి వంతెన వరదలకు కొట్టుకు పోయింది. 1920-1930 మధ్య కాలంలో ఆస్టిన్ ప్రభుత్వ భవన అభివృద్ధి, నగర సౌందర్య అభివృద్ధి మీద దృష్టి సారించింది. ఈ ప్రణాళిక వలన నగరంలో ప్రజోపకర నిర్మాణాలు, ఉద్యానవనాలు నిర్మాణాలు వృద్ధి చెందాయి. అదనంగా రాష్ట్ర లెజిస్లేచర్ కొలరాడో నది దిగువ ప్రాంతాల వరకు విస్తరించింది. కొలరాడో నదీ మీద నిర్మించబడిన వంతెనల వలన ఆస్టిన్ వద్ద హైలాండ్ లేక్స్ కూడా రూపుదిద్దుకున్నాయి. మిగిలిన టెక్సాస్ నగరాల కంటే అధికంగా ఆస్టిన్ నగరానికి పబ్లిక్ వర్క్స్ ఆడ్మినిస్ట్రేషన్ నిధులు లభ్యం కావడంతో ఈ బృహత్తర ప్రణాళికలు కార్యరాందాల్చాయి.

1940లో కొలరాడో నది మీద నిర్మించబడి నాశనమైన గ్రానైట్ ఆనకట్ట హాలో కాంక్రీట్ వంతెనగా పునర్నిర్మించబడింది. ఈ ఆంస్కట్ట వలన ఏర్పడిన సరసుకు మెక్ డోనాల్డ్ లేక్ ఆని పేరుపెట్టారు. (ఇప్పుడది ఆస్టిన్ లేక్ ) అని పిలువబడుతుంది. ఈ ఆనకట్ట అప్పటి నుండి వరదలకు తట్టుకుని బలంగా నిలిచింది. అదనంగా బృహత్తరమైన " ఫ్లడ్ కంట్రోల్ లేక్" (వరదలను అదుపు చేయు) రూపకల్పన చేయడానికి " మాంస్‍ఫీల్డ్ ఆనకట్ట " ఆస్టిన్ ఎగువ ప్రవాహం మీద ఎల్ సి ఆర్ ఏ వారి చేత నిర్మించబడింది. 20వ శతాబ్దం ఆరంభంలో చమురు పరిశ్రమ అభివృద్ధి చెందిన కారణంగా ఈశాన్య టెక్సాస్, ఉత్తర టెక్సాస్ అద్భుతంగా ఆర్థికంగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి ఉప్పెన 1880-1920 మధ్యకాలంలో ఆస్టిన్ నగరాన్ని సంయుకత రాష్ట్రాలలో నాలుగవ స్థానం నుండి పదవ స్థానానికి చేర్చింది.

20 శతాబ్ధపు మధ్యకాలానికి ఆస్టొన్ టెక్సాస్ రాష్ట్ర మహానగరాలలో ఒకటిగా అవతరించింది. 1970 లో ఆస్టిన్ జనాభా గణాంకాలు ఆస్టిన్ లో 14.5% హిస్పానిక్‍లు, 11.9% నలాజాతి వారు, 73% హిస్పానిక్కులు కాని శ్వేతజాతీయులు ఉన్నారని తెలియజేస్తున్నాయి. 20 శతాబ్ధపు చివరి సమయానికి ఆస్టిన్ ఉన్నత సాంకేతిక కేంద్రంగా అవతరించింది. ఆస్టిన్ నగరంలో " యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ " ప్రధాన విశ్వవిద్యాలయంగా మారింది.

1970 నాటికి ప్రాంతీయ కళాకారులు ఆస్టిన్ నగరాన్ని జాతీయ సంగీత కేంద్రంగా చేసారు. విల్లీ నెల్సన్ యొక్క " అస్లీప్ ఎట్ ది వీల్", స్టెవి రే వాఘన్ వంటి గాయకులు " "ఐకానిక్ మ్యూజిక్ వీనస్ ", " ది ఆర్మిడెలో వరల్డ్ హెడ్‍క్వార్టర్స్ వంటి సంగీత వేదికలు ఆస్టిన్ నగరాన్ని సంగీత కేంద్రంగా మర్చాయి. ఆస్టిన్ నగర పరిమితిలో దీర్ఘకాంగా చిత్రీకరించబడుతున్న దూరదర్శన్ కార్యక్రమం " ఓవర్ టైం ", ఇట్స్ నేం సేక్ ఆస్టిన్ సిటీ లిమిట్ ఫెస్టివల్ , సౌత్ బై సౌత్ వెస్ట్ సంగీత ఉత్సవం నగరాన్ని సంగీత పరిశ్రమగా బలోపేతం చేసింది.

వాతావరణం[మార్చు]

ఆస్టిన్ నగరంలో ఆర్ద్ర ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది. వేసవి అధిక వేడితో అలాగే స్వల్పమైన చలితో శీతాకాలు ఉంటాయి. ఆస్టిన్ నగరంలో సవంత్సరానికి సరాసరి సూర్యరశ్మితో ప్రకాశించే రోజులు 2,650 అంటే సంవత్సరం 60.3% ప్రకశాంతమైన పగటి వెలుగు ఉంటుంది.

ఆస్టిన్ నగరంలో వేసవి దినాలు సాధారణంగ వేడిగా ఉంటాయి. జూలై-ఆగస్ట్ సరాసరి ఉష్ణోగ్రతలు 90s °ఫారెన్‌హీట్ (34–36 °సెంటీగ్రేడ్). సంవత్సరానికి సరాసరి 116 రోజుల వేసవి రోజులు ఉష్ణోగ్రత 100s °ఫారెన్‌హీట్ (37.8 °సెంటీగ్రేడ్ ) కలిగి ఉంటాయి. 2000 సెప్టెంబర్ 5 , 2011 ఆగస్ట్ 28 అత్యధిక ఉష్ణోగ్రత 112 °ఫార్స్న్‌హీట్ (44 °సెంటీగ్రేడ్).ఆస్టిన్ నగరంలో శీతాకాలాలు స్వల్పమైన చలితో పొడివాతావరణం కలిగి ఉంటుంది. సవత్సరంలో సరాసరి 88 శీతాకాల రోజులు అలాగే సరాసరి ఉష్ణోగ్రత 45°ఫారెన్‌హీట్(7.2 °సెంటీగ్రేడ్) ఉంటుంది. అలాగే 13 రోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు గడ్డకట్టించే హిమపాతంతో ఉంటుంది. 1949 జనవరి 31 న అత్యల్ప ఉష్ణోగ్రతగా -2°ఫార్వ్ంహీట్ (-19 °సెంటీగ్రేడ్) నమోదైంది. ప్రతి రెండు సంవత్సరానికి ఒక సారి నగరంలో మంచుతుఫాను తాకిడితో రోడ్లను 24-48 గంటలపాటు గడ్డకట్టిస్తుంది. ఆస్టిన్ నగరంలో 3-అంగుళాల హిమపాతం అరుదుగా సంభవిస్తుంది. 1985 కురిసిన హిమపాతం ఆస్టిన్ నగాన్ని స్థభింపజేసింది.

కరువు[మార్చు]

1950 తరువాత 2010 అక్టోబర్ 2011 సెప్టెంబర్ మద్యకాలంలో ఆస్టిన్ నగరంలో వర్షపాతం అత్యల్పంగా ఉంటూ వచ్చింది. ఆస్టిన్ నగరంలో సాధారణ ఉష్ణోగ్రతకంటే నీటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే పసిఫిక్ వాతావరణం ఉంటుంది. దినేషనల్ ఓషన్ , అట్మోస్ఫరిక్ అడ్మినిస్ట్రేషన్ అధికారి డాక్టర్ బ్రౌన్ " ఈ విధమైన కరువు భవిష్యత్తులో అధికరించవచ్చు అలాగే వెచ్చని, పొడి వాతావరణం నెలకొంటుంది " అని అభిప్రాయపడ్డాడు.

ప్రభుత్వం[మార్చు]

ఆస్టిన్ ప్రస్థుతం ప్రజలచేత ఎన్నిక చేయబడిన 7 సభ్యుల సిటీకౌంసిల్ చేత నిర్వహించబడుతుంది (6 కౌంసిల్ సభ్యులు , మేయర్). మేనేజర్-కౌంసిల్ పురపాలక పాలనా విధానం అనుసరించి కౌంసిల్‌కు సహాయంగా సిటీ మేనేజర్ నియమించబడతాడు. 2012 నవంబర్ 6 తీర్పు అనుసరించి కౌంసిల్-మేయర్ సభ్యులు మెజారిటీ మద్దతుతో ఎన్నుకొనబడతారు. 2014 నూతన విధానం 10 ఏకసభ్య డిస్ట్రిక్ , సిటీ మేయర్ ప్రజలచేత ఎన్నుకొనబడతారు.

ఆస్టిన్ మునుపు సిటీ హాల్ వెస్ట్ 128 8వ వీధిలో ఉన్నది. ఆంటోనీ ప్రిడాక్ , కొటేరా నెగ్రెటె & రీడ్ ఆర్కిటెక్ట్ కొత్త సిటీహాల్ భవనరూపకల్పన చేసారు. సిటీహాల్ నిర్మాణంలో రిసైకిల్ చేయబడిన వస్తువులను వాడడమే కాక గ్యారేజుకు సూర్యశక్తిని వాడుకునే ఏర్పాటు చేసారు. వెస్ట్ 301 రెండవ వీధి వద్ద 2004 నవంబర్ కొత్త సిటీహాల్ తెరవబడింది. ప్రస్థుత మేయర్ ఆస్టిన్ లీ లిఫింగ్‌వెల్ రెండవ విడత పాలన 2015 నాటికి ముగింపుకు వచ్చింది.

ఆస్టిన్ నగరరంలో చట్టం అమలు బాధ్యతను " ది ఆస్టిన్ పోలీస్ డిపార్ట్మెంట్ " వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ భవనాల రక్షణ బాధ్యతలను " టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ " వహిస్తుంది. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఆధ్వర్యంలో ది యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ పోలీస్ రక్షణ బాధ్యత వహిస్తుంది. నగరపరిమితిలో అగ్నిప్రమాదాల రక్షణ బాధ్యతను ఆస్టిన్ ఫైర్ డిపార్ట్మెంట్ వహిస్తుంది. నగరపరిసరాలను భౌగోళికంగా 12 ప్రతేక సర్వీస్ డిస్ట్రికులుగా విభజించి అగ్నిప్రమాదాల నుండి రక్షించే బాధ్యతను రీహనల్ ఫైర్ డిపార్ట్మెంట్ వహిస్తుంది. రాష్ట్ర , ఫెడరల్ ప్రభుత్వాలు కలిసి ప్రజలకు అత్యవసర వైద్యసేవలను అందిస్తున్నాయి.

ఆస్టిన్ నగరంలోని ది ఆస్టిన్ డిస్ట్రిక్ కార్యాలయాన్ని ది టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాంస్ పోర్టేషన్ నిర్వహిస్తుంది. ది టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ (టి.డి.సి)ఆస్టిన్ నగర ఆస్టిన్ 1 ఆస్టిన్ 2 డిస్ట్రిక్ పరోల్ కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి.

రాజకీయాలు[మార్చు]

పర్యావరణ ఉద్యమం[మార్చు]

ఆస్టిన్ నగర రాజకీయ ఉద్యమాలలో ప్రధానమైనది పర్యావరణోద్యమం. ఇది పరిసరప్రాంతాలలోని కంసర్వేషనిస్ట్ ఉద్యమానికి సమాంతరంగా వ్యాపించింది. పర్యవసానంగా ప్రస్థుతం " సెంస్ ఆఫ్ ప్లేస్ " , ఆస్టిన్ జీవననాణ్యత సంరక్షణ ఉద్యమం కొనసాగుతుంది. పర్యావరణ ఉద్యమాలు అధికంగా ఆస్టిన్ సెంస్ అఫ్ ప్లేస్ సరక్షణ గురించిన చర్చలకు గురి ఔతుంటాయి.

భౌగోళికం[మార్చు]

అస్టిన్ నగరం టెక్సాస్ మధ్యభాగంలో హ్యూస్టన్ నగరానికి ఈశాన్యంలో ఇంటర్‍స్టేట్ 35 పక్కన ఉపస్థితమై ఉంది. అస్టిన్ డల్లాస్ నగరానికి దక్షిణంలో 160 మైళ్ళదూరంలో ఉంది. ఈ నగరం సముద్రమట్టానికి 425-1000 ఎత్తులో వైధ్యం కలిగిన ఎత్తుపల్లాలు కలిగి ఉంటుంది. 2010 గణాంకాలను అనుసరించి నగర మొత్త వైశాల్యం 271.8 చదరపు మైళ్ళు. నగరం వైశాల్యంలో జలభాగం 6.9 చదరపు మైళ్ళు.

కొలరాడో నదీతీరంలో ఉన్న ఆస్టిన్ నగరం పరిమితిలో మానవ నిర్మిత సరసులు మూడు ఉన్నాయి. లేడీ బర్డ్ లేక్ (సాధారణంగా ఇది "టౌన్ లేక్ " అని పిలువబడుతుంది), "లేక్ అస్టిన్" (ఈ రెండు సరసులు కొలరాడో ఆనకట్ట నిర్మించడం వలన ఏర్పడ్డాయి), డెకర్ పవర్ ప్లాంటును చల్లబరచడానికి అవసరమైన నీటి కొరకు నిర్మించబడిన " లేక్ వాల్టర్ ఈ.లాంగ్ " సరసూ నగర పరిమితిలోనే ఉన్నాయి. మాన్ ఫీల్డ్ ఆనకట్ట, ఫూట్ ఆఫ్ లేక్ ట్రావిస్‍లు కూడా నగరపరిమితులలో ఉన్నాయి. లేడీ బర్డ్ లేక్, లేక్ ఆస్టిన్, లేక్ ట్రావిస్ సరసులు కొలరాడో నదీ తీరంలో ఉన్నాయి. ఫలితంగా తూర్పు ప్రాంతం చదరంగా బురద, మెత్తటి మట్టి కలిగిన చిత్తడి నేలలతో ఉంటుంది. నగరానికి పశ్చిమ ప్రాంతం మాత్రం టెక్సాస్ హిల్ల్ కౌంటీ నుండి కొండల వరుసలతో ఏటవాలుగా ఉంటుంది. తేలికైన మట్టితో కప్పబడిన లైం స్టోంస్ వరదలకు పిడుగులతో కూడిన వర్షాలకు కారణం ఔతుంది. దీనిని నియంత్రించడానికి హైడ్రో పవర్ ఉతపత్తి చేయడానికి దిగివ కొలరాడో నది అధారిటీ వరుసగా టెక్సాస్ హై లాండ్ లేక్స్ వంటి ఆనకట్టల నిర్మాణం చేపట్టింది. సరసులు బోటింగ్, ఈత, ఇతర జలసంబంధ మానసిక ఉల్లాసానికి సరసుల వెంట ఉన్న ఉద్యానవనాలు, సరసుతీర విహారలు వంటి వినోదాలను అందిస్తున్నాయి.

ఆస్టిన్ నగరాన్ని పర్యావరణ పరంగా నాలుగు విభాగాలుగా విభజించ వచ్చు." టెంపరేట్-హాట్- గ్రీన్ " ఒయాసిసులు అత్యధికమైన వైవిధ్యవాతావరణం కలిగిన ఎడారి, ఉష్ణమండల భూములు, జలవాతావరణం వంటివి వీటిలో కొన్ని. ఈ ప్రాంతం పర్యావరణ పరంగా చాలా వైవిధ్యం కలిగి ఉంది. ఈ ప్రాంతం జీవవైవిధ్యం, వృక్షవైవిధ్యం కలిగి ఉండి పలు రకాల జంతుజాలం, వృక్షజాలం కలిగి ఉంది. ప్రత్యేకంగా ఈ ప్రాంతం పలురకాల అడవిపూలు వసంతకాలమంతా వికసిస్తూ ఉంటాయి. ప్రసిద్ధి చెందిన బ్లూబానెట్స్, కొంత మంది వారి స్వంత ప్రయత్నంగా నాటిన " లేడీ బర్డ్" వంటివి ఉన్నాయి. గత అధ్యక్షుడైన జాన్‍సన్ భార్య లిండన్ జాన్‍సన్ చేత ఇలా పూల తోటలు పెంచబడ్డాయి.

ఆస్టిన్ లోని ప్రబలమైన ఆకర్షణ " మౌంట్ బన్నెల్". ఈ పర్వతం సముద్రట్టానికి 780 అడుగుల ఎత్తు ఉంటుంది. సహజ లైంస్టోంస్ ఉన్న ఈ పర్వతం కొలరాడో నది నుండి అందంగా కనిపిస్తుంది. కొలరాడో నది మీద ఈ పర్వత దృశ్యాలను చూడడానికి 200 అడుగుల ఎత్తులో పర్వత శిఖరానికి దిగువన ఒక అబ్జర్వేషన్ పాయింట్ ఉంది. ఆస్టిన్ నగర తూర్పు ప్రాంతం సన్నని ఇసుక తిన్నెలు, జారుడు బంకమట్టి కలిగి ఉంటుంది. కొన్ని బంకమట్టి నేలలు ముడుచుకోవడం- విస్తరించడం వంటి కారణాలతో పనిచేయడానికి ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తుంది. ఆస్టిన్ భూమి బంకమట్టి నేలలు, స్వల్పంగా ఆల్కలైన్, కాలిషియం కార్బొనేట్ రహిత భీములను కలిగి ఉంది.

ఆర్ధిక రంగం[మార్చు]

అస్టిన్-రౌండ్-శాన్ మార్కోస్ (ఎం.ఎస్.ఎ) సంస్థకు మూలస్థానం అస్టిన్ నగరమే. 2010 లో అస్టిన్-రౌండ్-శాన్ మార్కోస్ ఆదాయం 86 బిలియన్లు. అస్టిన్ హైటెక్‌కు సంస్థకు ప్రధాన కేంద్రమని భావిస్తున్నారు. అస్టిన్ లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుండి ప్రతిసంవత్సరం వేలకొలది విద్యార్థులు ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగాలలో ఉత్తీర్ణులై అస్టిన్ టెక్నాలజీ, రక్షణవ్యవస్థ పరిశ్రమల ఉద్యోగుల అవసరాలను భర్తీచేస్తున్నారు. 2010లో ఫోర్బ్స్ సంస్థ అధ్యయనాలు ఉద్యోగాల కల్పనలో మిగిలిన అన్ని పెద్ద నగరాలలో అస్టిన్ మొదటి స్థానంలో ఉందని తెలియజేస్తున్నాయి. అందుకు కారణం అస్టిన్ నగరం అతివేగంగా అభివృద్ధి చెందడమే. అస్టిన్ నగరంలో వ్యాపారావకశాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని డబల్యూ.ఎస్.జె అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. శాన్ ఫ్రాంసిస్కో బే ఏరియాలోని సిలికాన్ వ్యాలీ లోని నివాసగృలంక్ంటే అస్టిన్ మహానగరంలోని నివాసగృహాల ధరలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ టెక్సాస్ రాష్ట్ర గ్రామీణ ప్రాంత నివాసగృహాలకంటే అస్టిన్ లోని నివాసగృహాల ధరలు అధికంగా ఉంటాయి. అస్టిన్ ప్రాంతంలో హైటెక్ కంపనీలు అత్యధికంగా కేంద్రీకృతమైనందున 1990 నుండి డాట్-కాం సంస్థల అభివృద్ధి కొనసాగింది. అస్టిన్ నగరంలో అస్టిన్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్, దిసిటీ ఆఫ్ అస్టిన్, డెల్, ది యు.ఎస్, ఫెడరల్ గవర్నమెంట్, ఫ్రీ స్కేల్ సెమీ కండెక్టర్ (2004 నుండి మోటరోలా), ఐ.బి.ఎం, ఎస్.టి. డేవిడ్స్ హెల్త్‌కేర్ పార్టనర్‌షిప్, సెటాన్ ఫ్యామిలీ ఆఫ్ హాస్పిటల్స్, దిస్టేట్ ఆఫ్ టెక్సాస్, టెక్సాస్ స్టేట్ యూనివర్శిటీ, శాన్ మార్కోస్, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ మొదలైన సంస్థలు అత్యధికంగా ఉపాధికల్పన చేస్తునాయి. అదనంగా నగరంలో 3ఎం, ఆపిల్, హెలెట్-ప్యాకర్డ్, గూగుల్, ఎ.ఎం.డి, అప్లైడ్ మెటీరియల్స్, సైరస్ లాజిక్, ఎ.ఆర్.ఎం హోల్డింగ్స్, సిస్కో సిస్టంస్, ఎలెక్ట్రానిక్ ఆర్ట్స్, ఫ్లెక్స్ట్రానిక్స్, ఫేస్‌బుక్, ఈబే/పేపాల్, బయోవేర్, బిజ్జర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్, హూవర్స్, ఇంటెల్ కార్పొరేషన్, నేషనల్ ఇంస్ట్రుమెంట్స్, రాక్‌స్పేస్, రిటెయిల్‌మినాట్, శాంససంగ్ గ్రూప్, బఫెలో టెక్నాలజీ, సిలికాన్ లాబరేటరీస్, జెరాక్స్, ఒరాకిల్, హోస్ట్‌గేటర్, హోం అవే, యూనైటెడ్ డివైసెస్ మొదలైన హైటెక్ సంస్థలు కూడా తగినంతగా ఉపాధి కల్పన కలిగిస్తున్నాయి. 2010లో ఫేస్‌బుక్ కు సంస్థ డౌన్‌టౌన్‌లో కార్యాలయం ఏర్పాటు చేసుకోడానికి అనుమతి లభించింది. ఈ కార్యాలయం నుండి నగరవాసులకు అదనంగా 200 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ఈ ప్రాంతం " సిలికాన్ హిల్స్ " అనే మారుపేరును తీసుకువచ్చింది. టెక్నాలజీ సంస్థలు నగరాభివృద్ధి, విస్తరణకు కారణమయ్యయి.

ఆస్టిన్ నగరం ఔషధ తయారీ సంస్థలు, బయో టెక్నాలజీ సంస్థలకు కూడా కేంద్రంగా అభివృద్ధి చెందుతూ ఉంది. నగరం సుమారు 85 ఔషధ తయారీ సంస్థలు, బయో టెక్నాలజీ సంస్థలకు నిలయంగా ఉంది. హాస్పిరా, ఫార్మాస్యూటికల్, ఆర్ధో కేర్ సంస్థలు ఉన్నాయి. అంతర్జాతీయ గ్రోసరీ స్టోర్స్ తాజా వస్తువుల ప్యాకేజీకి పేరుపొంది ఉండి అనేక షాపుల ద్వారా ప్రాంతీయంగా సహజసిద్ధమైన ఆర్గానిక్ ఆహారాలను అందిస్తుంది. అదనంగా నేషనల్, గ్లోబల్ కాత్పొరేషన్, అస్టిన్ ప్రాంతీయంగా పలు వ్యవసాయ క్షేత్రాలు, వ్యవసాయ సంబంధిత సంస్థలను కలిగి ఉంది.

నగర వర్ణన[మార్చు]

అస్టిన్ ఆకాశసౌధావళి పరిమితమైన ఎత్తు కలిగి ఉన్నప్పటికీ వెడల్పుగా ఉంటాయి. టెక్సాస్ స్టేట్ కాపిటల్ బిల్డింగ్ దృశ్యాన్ని పలు కోణాలనుండి (కేపిటల్ వ్యూ కేరిడార్ అంటారు) చూడడానికి వీలుగా అస్టిన్ డౌన్‌టౌన్ లోని భవనాలకు పరిమితమైన ఎత్తును నిర్ణయించడం వలన భవనాలు పరిమితమైన ఎత్తులో నిర్మించబడ్డాయి. అయినప్పటికీ ప్రస్తుతం కొత్తగా ఎత్తైన భవనాలు నిర్మించబడ్డాయి. ప్రస్తుతం డౌన్‌టౌన్ ప్రాతంలో ఆకాశసౌధాలు అఫ్హికమై అత్యాధునికంగా కనిపిస్తున్నది. 2009 సెప్టెబర్‌లో ప్రారంభోత్సవం చేసుకున్న " ది అస్టోనియన్ భవనం " నగరంలో అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపు పొందింది. ఆస్టిన్ నగరంలో ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఆకాశనిర్మాణాలు చేపట్టనడ్డాయి. సమీపకాలంలో 563 అడుగుల ఎత్తైన 360 కండోమినంస్, స్ప్రింగ్ కండోమినంస్, 683 అడుగుల ఎత్తైన అస్టోనియన్, పలు ఇతర భవనాలు నివాసగృహాల కొరకు మాత్రమే నిర్మించబడ్డాయి. రాత్రివేళలో ఆస్టిన్ మూన్లైట్ భవన గోపురాల నుండి కృత్రిమంగా వెన్నెల వెలుగులు ప్రసరించబడుతుంటాయి. మూన్‌లైట్ గోపురం నగరానికి వెలుగులను ప్రసరింపజేయడానికి నగరం మధ్యలో నిర్మించబడింది.165 అడుగుల ఎత్తైన మూన్‌లైట్ టవర్స్ భవనం 19వశతాబ్దం చివరిలో నిర్మించబడింది. ప్రస్తుతం ఈ గోపురాలు నగరానికి చారిత్రక చిహ్నంగా మారింది. నగరంలోని 31 పురాతన గోపురాలలో ప్రస్తుతం 15 మాత్రమే మిగిలి ఉన్నాయి. మరే ఇతర నగరాలలో ఇలాంటి నిర్మాణాలు ఇలా నిలిచి ఉండలేదు. 1993 లో " డేజ్డ్ అండ్ కంఫ్యూజ్డ్ " చలనచిత్రం కొరకు ఈ టవర్లు చిత్రీకరించబడ్డాయి.

డౌన్ టౌన్[మార్చు]

ది సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ రాష్ట్రంలో లోని పలు ఎత్తైన భవనాలకు నిలయం. 56 అంతస్తులున్న అస్టోనియన్ కండోస్, 44 అంతస్తులున్న 360 కండోస్ వీటిలో ప్రధానమైనవి.అస్టిన్ లోని 360 కండోస్, ఫోర్ సిజంస్ కండోస్ 2008 ఆరంభంలో నిర్మాణం పూర్తిచేసుకున్నాయి. గత మేయర్ " విల్ విన్ " 2015 నాటికి 25,000 మంది నివసించడానికి అవసరమైన భవన నిర్మాణాలు కావాలని లక్ష్యం నిర్ణయించాడు. నగర ప్రభుత్వం నగరం ప్రాంతంలో నివాసగృహాల నిర్మాణానికి అవసరమైన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహించింది. అందువలన అస్టిన్ డౌన్‌టౌన్ లో నివాసగృహ సముదాయాలు అధికమైయ్యాయి. ఆకాశసౌధావళి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నివాసగృహ నిర్మాణ వాణిజ్యం ఇంకా బలంగా నిలిచి ఉంది. డౌన్‌టౌన్ అభివృద్ధి లైవ్ మ్యూజిక్, నైట్ లైఫ్ దృశ్యాలు, మ్యూజియాలు, రెస్టారెంట్లు లేడీ బర్డ్ లేక్ వంటి పునరుత్సాహ కేంద్రాల స్థాపనకు సహరించింది. డౌన్‌టౌన్ వాయవ్య భాగంలో యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ కు చెందిన పలు విద్యార్థులకు ఆవాసమై ఉంది. ది 2 స్ట్రీట్ డిస్ట్రిక్ లో పలు నివాస గృహాలు, రెస్టారెంట్లు, కాఫీ షాపులు, రికార్డ్ స్టోర్స్, ఖరీదైన దుస్తుల షాపులు, మ్యూజియాలు, అస్టిన్ సిటీ హాల్ ఉన్నాయి. 2 స్ట్రీట్, అస్టిన్ సిటీ హాల్ మద్య వినోదం కొరకు ఏర్పాటు చేసిన టి.వి సెట్ ఆస్టిన్ సిటీ లిమిట్స్ లోని పి.బి.ఎస్ ప్రసారాలను అందిస్తూ ఉంది. ది న్యూ ఆసిటిన్ దిటీ లిమిట్స్ కూడా జాతీయ, ప్రాంతీయ టి.వి సంబంధించని సంగీత కార్యక్రమాలను ప్రత్యక్షప్రాసారాలుగా అందిస్తున్నది. ఆగ్నేయ డౌన్‌టౌన్ లోని 90 వేదికలలో 4 రోజులపాటు 2,000 కంటే అధికమైన సంగీత ప్రదర్శనలు ప్రాంతీయ సంగీత కళాకారులచే నిర్వహించబడ్డాయి. సంయుక్త రాష్ట్రాలలో బృత్తరమైన సంగీత ఉత్సవాలలో ఇది ఒకటి అని ప్రస్తావించబడింది. ఇది ఒక స్థాపన ఆధారిత కార్యక్రమం. ఎస్.ఎక్స్.ఎస్.డబల్యూ. మ్యూజిక్ లింక్స్ నిర్వహించిన అస్టిన్ మ్యూజిక్ అవార్డ్స్ షో సందర్భంగా ఈ సంగితోత్సవం నిర్వహించబడింది. ప్రాధాన్యత కలిగిన ప్రంతాలలో ఇది ఒకటి అని భావించబడుతుంది. అస్టిన్ నగరానికి ఈ ఉత్సవాల మూలంగా అత్యధికమైన ఆదాయం లభిస్తుంది.2010 లో ఈ ఉత్సవాల మూలంగా అస్టిన్ నగరానికి 167 మిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తుందని భావించారు.

జనసంఖ్య[మార్చు]

2000 గణాంకాలను అనుసరించి అస్టిన్ నగర జనసంఖ్య 6,56,562. నగరంలో నివాసగృహాల సంఖ్య 2,25,649. అగరంలో కుటుంబాల సంఖ్య 1,41,590. జనసాంద్రత చదరపు మైలుకు 2,610.నగరంలో చదరపు మైలుకు సరాసరిగా 1,100.7 నివాస గృహాలు ఉన్నాయి. 18 సంవత్సరాలకంటే తక్కువ వాసున్న వారి శాతం 26.8%. కలిసి నివసిస్తున్న వివాహిత జంటల శాతం 38.1%. ఒంటరిగా నివసిస్తున్న స్త్రీల శాతం 10.8%. అలాగే 46,7% కుటుంబాలకు చెందని వారు. ప్రత్యేకంగా నిర్మించబడిన గృహాల శాతం 32.8%. నగరంలో 65 సంవత్సరాలకు పైబడిన వయసులో ఒంటరిగా నివసిస్తున్న వారి సంఖ్య 4.6%. సరాసరి నివాసగృహ సభ్యుల శాతం 2.4%. సరాసరి కుటుంబ సభ్యుల సంఖ్య 3.4%.

నగరంలో 18 సంవత్సరాలకు లోపు వారి శాతం 22.5%, 18-24 మద్య వయస్కుల శాతం 16.6%. 24-44 మద్య వయస్కుల శాతం 37.1%. 44-64 మద్య వయస్కుల శాతం 17.1%. 65 సంవత్సరాలకు పైబడిన వారి శాతం 6.7%. సరాసరి వివాహ వయసు 30 సంవత్సరాలు. స్త్రీ పుషుల నిష్పత్తి 100:105.8%. సరాసరి నివాసగృహాల ఆదాయం 42,689 డాలర్లు, సరాసరి కుటుంబాల ఆదాయం 54,091. పురుషుల సరాసరి ఆదాయం 35,545 డాలర్లు. స్త్రీల సరాసరి ఆదాయం 30,046%. తలసరి సరాసరి ఆదాయం 24,163 డాలర్లు. స్త్రీలలో 9.1% అలాగే మొత్తం జనాభాలో 14.4% స్త్రీలు దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారు. వీరిలో 18 సంవత్సరాలకంటే తక్కువ అయసున్న వారు 16.5%, 65 సంవత్సరాల పైబడిన వారు 8.7%. 2009 లో నివాసగృహ ధర 1,85,906 డాలర్లు. 2004 నుండి నివాసగృహాల ఖరీదు అఫ్హికరిస్తూనే ఉంది. 2009 లో యు.ఎస్ గణాంకాలు నివేదిక అస్టిన్-రౌండ్ రాక్-శాన్ మార్కోలో 17,05,075 మంది నివసిస్తున్నట్లు తెలియజేస్తుంది.

కళలు సంస్కృతి[మార్చు]

ఆస్టిన్ నగరంలో " కీప్ ఆస్టిన్ వియర్డ్" అనే ప్రాంతీయ నినాదం ప్రజలలో నిరంతర ప్రేరణ కలిగించి నగరాభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ నినాదం బంపర్ స్ట్రిక్కర్లు, టీ-షర్ట్లు మీద దర్శనం ఇస్తుంది. అలాగే ఈ నినాదం ప్రాంతీయ వ్యాపారులకు మరికొంత శక్తిని ఇస్తున్నది. ఇది ఆస్టిన్ వాసులకు విచిత్రమనస్తత్వాన్ని, వైవిధ్యాన్ని ఇస్తున్నది. 2010 బుక్ ను అనుసరించి వియర్డ్ సిటీ అనే నినాదాన్ని ఆస్టిన్ కమ్యూనిటీ కాలేజ్ లైబ్రేరియన్ రెడ్ వాసీనిక్, ఆయనభార్య కరేన్ పవెల్కలు వెలువరించారని తెలుస్తుంది. ఆస్టిన్ నగర అతివేగవంతమైన అభివృద్ధి, పెరుగుతున్న వ్యాపారధోరిణికి వ్యతిరేకంగా ఈ నినాదం వెలువరించారు. ఈ నినాదం ఆరంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు అనేక విధాలుగా ఉపయోగించబడింది. ఆస్టిన్ నగర అతివేవంతమైన విస్తరణ, బాధ్యతా రహితమైన అభివృద్ధి కారణంగా ప్రకృతి, పరిసరాలు, సంస్కృతి మీద దుష్ప్రభావం చూపించగలదని భావించే వారు ఈ ననాదాన్ని తరచుగా వాడుకుంటారు. ఆస్టిన్ నగరంలో దీర్ఘకాలం నుండి పరిసరాలను కలుషితపరిచే అభివృద్ధి పధకాలకు వ్యతిరేకంగా తమగళం వినిపిస్తూనే ఉన్నారు.

నియోసెన్ కంపనీ అధ్యయనాలు ఇతర యు.ఎస్ మహానగరాలకంటే ఆస్టిన్ నగర యువకులు అధికంగా బ్లాగులలో భాగస్వామ్యం వహిస్తున్నారని తెలియజేస్తున్నాయి. టెక్సాస్ రాష్ట్రంలో అధికంగా అంతర్జాలం ఉపయోగించే వారు ఆస్టిన్ వాసులే అని అంచనా. 2006 లో మనీ మ్యాగజిన్ నివసించడనికి అనుకూలమైన ఉత్తమనగరాలలో ఆస్టిన్ రెండవ స్థానంలో ఉందని పేర్కొన్నది. 2009లో ఆస్టిన్ మూడవ స్థానంలో ఉందని అలాగే " గ్రీన్ సిటీ ఇన్ అమెరికా " ఎం.ఎస్.ఎన్ పేర్కొన్నది. ట్రావెల్ & లీషర్ మ్యాగజిన్ అధ్యయనాలు ప్రవర్తన, పద్ధతుల ఆధారంగా ఉత్తమ పౌరులు అధికంగా కలిగిన నగరాలలో ఆస్టిన్ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నది. విశ్రాంత ఉద్యోగులు నివసించడానికి అనుకూలమైన 10 నగరాలలో ఆస్టిన్ నగరం ఒకటి అని సి.బి.ఎస్ మనీ వాచ్ పత్రిక పేర్కొన్నది.

డౌన్ సౌత్ కాంగ్రెస్ అవెన్యూ పక్కన ఉన్న షాపింగ్ డిస్ట్రిక్ కాఫీ షాపులు, ఎసెంట్రిక్ షాపులు, రెస్టరెంట్లు, ఫుడ్ ట్రక్స్, ట్రైలర్స్, ఫెస్టివల్స్ లకు మూలస్థానంగా ఉంది. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి " కీపింగ్ ఆస్టిన్ వియర్డ్ " అనే నినాదాన్ని సగర్వంగా చాటుతుంది.

సంవత్సర సంస్కృతిక సంఘటనలు[మార్చు]

నగరంలో ది ఓ. హెన్రీ హౌస్ మ్యూజియం ఓ. హెన్రీ పన్-ఆఫ్ (శ్లేష సంభాషణ) పోటీ లకు ఆతిథ్యం ఇస్తుంది. ఇయోర్ బర్త్ డే పార్టీ, స్పామరమ, ది ఆస్టిన్ రీగై ఫెస్టివల్, ఏప్రిల్ మాసంలో ఆర్ట్ సిటీ ఆస్టిన్, నవంబరు మాసంలో ఈస్ట్ ఆసియన్ స్టూడియో టూర్, ఫిబ్రవరిలో కార్నవాల్ బ్రాసిలరో వంటి ఉత్సవాలు ప్రతిసంవత్సరం నిర్వహించబడుతుంటాయి. సిక్స్త్ స్ట్రీట్ సంవత్సర ఉత్సవాలు వరుసగా పెకన్ స్ట్రీట్ ఉత్సవం, హాలోవిన్ నైట్, జికర్ పార్క్‌లో 2002 నుండి ప్రతి సంవత్సరం నిర్వహించబడే ది త్రీడే ఆస్టిన్ సిటీ లిమిట్ మ్యూజిక్ ఫెస్టివల్, ప్రతి సంవత్సరం మార్చి చివర అరియు ఏప్రిల్ ఆరంభం వరకు నిర్వహించబడే " టెక్సాస్ రిలే వీకెండ్ " మొదలైనవి.

ప్రసారమాధ్యమం[మార్చు]

సంగీతం[మార్చు]

ఆస్టిన్ నగరానికి ప్రపంచ సంగీత రాధాని అని గుర్తింపు ఉంది. నగరంలో ఇతర యు.ఎస్ నగరాలకంటే అధికమైన సంగీత వేదికలున్నాయి. 6వ వీధిలో ఉన్న నైట్ క్లబ్స్, సంవత్సర చలచిత్ర సంగీతోత్సవాలలో ఆస్టిన్ సంగీతం ప్రతిధ్వనిస్తుంది. సౌత్ వెస్ట్ లో కేంద్రీకృతమై ఉన్న రెస్టారెంట్లు, బార్లు, సంగీత వేదికలలో ఆస్టింస్ లైవ్ మ్యూజిక్ ప్రదర్శనలు నిర్వహించబడుతుంటాయి. డౌన్‌టౌన్ ఎంటర్‌టౌన్మెంట్ డిస్ట్రిక్ అత్యధికమైన బార్లు లేక ఆల్కహాల్ వినియోగ సంస్థలు ఉన్నాయి. అమెరికన్ టెలివిజన్ దీర్ఘకాల కంసర్ట్ మ్యూజిక్ కార్యక్రమం నిర్వహిస్తున్నది, ఆస్టిన్ సిటీ లిమిట్స్ ది మూడీ దియేటర్ సమీపంలో ఎ.సి.ఎల్ లైవ్ సంగీత కార్యక్రమాన్ని రికార్డ్ చేసింది. ఆస్టిన్ సిటీ లిమిట్స్, సి3 ఆస్టిన్ సిటీ లిమిట్స్ సంగీత ఉత్సవాలను ప్రతిసంవత్సరం జికర్ పార్కులో నిర్వహిస్తుంది. ఇతర సంగీత ఉత్సవాలలో అర్బన్ మ్యూజిక్ ఫెస్టివల్, ఫన్ ఫన్ ఫన్ ఫీస్ట్, చోయాస్ ఇన్ తేజాస్,, ఓల్డ్ సెటిలర్స్ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రధానమైనవి. ఆస్టిన్ లిరిక్ ఒపేరా ప్రతి సంవత్సరం పలు ఒపేరా ప్రదర్శనలు అందిస్తుంది. ఆస్టిన్ సింఫోనీ ఆర్కెస్ట్రా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కండక్టర్ పీటర్ బే ఆధ్వర్యంలో అనేక క్లాసికల్, పాప్, కుటుంబ ప్రదర్శనలు నిర్వహిస్తుంది.

చలనచిత్రాలు[మార్చు]

ఆస్టిన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఆస్టిన్ నగరం ఆతిథ్యం ఇస్తుంది. ఈ చనచిత్రోత్సవాలు నగరానికి ప్రపంచం నలుమూలల నుండి వైవిధ్యమైన చలనచిత్రాలను తీసుకు వస్తుంది. చలనచిత్రాల నిర్మాణం, లైవ్ షోలు నిర్వహణకు పేరుపొందిన అత్యున్నతమైన 10 నగరాలలో ఆస్టిన్ నగరానిది ప్రథమస్థానమని 2004 లో మూవీ మేకర్ మ్యాగజింపేర్కొన్నది. ఆస్టిన్ ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం లోని రేడియో-టెలివిజన్-సినిమా శాఖ ప్రభావం వల్ల ఆస్టిన అనేక చలన చిత్రాల చిత్రీకరణకు నగరం ప్రధాన వేదికగా నిలిచింది. ఆస్టిన్ లో నిర్మించబడిన చలనచిత్రాలు సినిమాలు టెక్సాస్ చెయిన్ సా మాసకర్ (1974), సాంగ్ రైటర్ (1984), మాన్ ఆఫ్ ది మ్యాచ్, సెకండ్ హ్యాండ్ లైంస్, హౌస్ ఆఫ్ ద మ్యాచ్, పాత లయన్స్, వేకింగ్ లైఫ్, స్పై కిడ్స్, డేజ్డ్ అండ్ కంఫ్యూజ్డ్, వైల్డ్ టెక్సాస్ విండ్, ఆఫీస్ స్పేస్, ది లైఫ్ ఆఫ్ డేవిడ్ గేల్, మిస్ కంజెనియాలిటీ, డౌటింగ్ థామస్, స్లేకర్, ఐడియాక్రసీ, ది న్యూ గై, హోప్ ఫ్లోట్స్, ది ఆల్మో, బ్లాంక్ చెక్, ది వెండాల్ బేకర్ స్టోరీ, స్కూల్ ఆఫ్ రాక్, ఎ స్లిప్పింగ్-డౌన్ లైఫ్, ఎ స్కేనర్ డార్క్‌లీ, సాటర్ డే మార్నింగ్ మాస్‌క్రీ, మోస్ట్ రీసెంట్లీ, ది సియోన్ బ్రదర్స్ ట్రూ గిర్ట్, గ్రైండ్ హౌస్, మచేటే, హౌటూ ఈట్ ఫ్రైడ్ వార్మ్‌స్ అండ్ బాండిజం మొదలైనవి. ఈ ప్రాంతానికి చలనచిత్ర నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నలో ది ఆస్టిన్ ఫిలిం సొసైటీ పలు విమానసర్వీసులను మునుపటి ముల్లర్ విమానాశ్రయం నుండి చలనచిత్రాల నిర్మాణ కేంద్రమైన ఆస్టిన్ స్టూడియోకు మళ్ళించారు. ఆస్టిన్ స్టూడియో సౌకర్యాలను ఉపయోగించుకుని ది ఫ్లేమింగ్ లిప్స్ మ్యూజిక్ ఆల్బం, 25త్ అవర్, సిన్‌సిటీ నిర్మించబడ్డాయి. 2005లో ఎం.టి.వి సీరీస్‌, ది రియల్ వరల్డ్ కు ఆతిథ్యం ఇచ్చింది. చలనచిత్ర సమీక్ష చేసే వెబ్‌సైట్స్ స్పిల్ కాం, ఎయింట్ ఇట్ కూల్ న్యూస్ స్వస్థానం ఆస్టిన్ నగరమే. రెడ్ వి.ఎస్ బ్లూ, ఇమ్మర్షన్ వంటి ప్రబల వెబ్ సిరీస్ లను నిర్మించిన " రూస్టర్ టీత్ ప్రడక్షన్ " స్వస్థానం ఆస్టిన్ నగరమే.

ప్రసారమాధ్యమం[మార్చు]

ఆస్టిన్ ప్రధాన వార్తా పత్రిక " ది ఆస్టిన్ అమెరికన్-స్టేట్స్ మన్ " . నగరంలో మరో ప్రత్యామ్నాయ పత్రిక " ది ఆస్టిన్ క్రోనికల్ " వారపత్రిక. ఆస్టిన్ లోని యూనివర్శిటీ విద్యార్థుల కొరకు " ది డైలీ టెక్సన్" పత్రిక వెలువడుతున్నది. ఆస్టిన్ వ్యాపార ప్రధాన పత్రిక ఆస్టింస్ బిజినెస్ న్యూస్ పేపర్ ". ఆస్టిన్ నగరంలో వివిధ సంప్రదాయ ప్రజల కొరకు ఓక్ హిల్ గజట్, వెస్ట్‌లేక్ పలు చిన్న చిన్న వార్తాపత్రికలు ప్రచురించబడుతున్నాయి. పికియూన్, హిల్ కంట్రీ న్యూస్, రౌండ్ రాక్ లీడర్, నోకొయా , ది విలేజర్ మొదలైనవి. ఆస్టిన్ నగరంలో ప్రధాన ప్రాంతీయ పత్రికలలో ఒకటి అయిన "టెక్సాస్ మంత్లీ" ప్రధాన కార్యాలయం ఉంది. రాజకీయాలు ప్రధానంగా వెలువడుతున్న పక్షపత్రిక " టెక్సాస్ అబ్జర్వర్ " ఆస్టిన్ నగరంలో ఐదు దశాబ్ధాలకు ముందు నుండి ప్రచురినబడుతుంది. జాన్ గారెట్ చేత " కమ్యూనిటీ ఇంపాక్ట్ న్యూస్‌ పేపర్ " పేరుతో వారపత్రిక వెలువరించబడుతుంది. " ది ఆస్టిన్ బిజినెస్ జర్నల్ " మునుపటి ప్రచురణ ఆధ్వర్యంలో కర్త ప్రస్తుతం 5 ప్రాంతీయ పత్రికలను వ్యాపార సంస్థల వివరాలతో ప్రచురించి ప్రతి ఇంటికీ వినియోగించబడుతున్నాయి. ఆస్టిన్ వార్తాప్రపంచంలో టెక్సాస్, ఆస్టిన్ రాజకీయాలు ప్రధానాంశంగా తీసుకుని కొత్తగా ప్రవేశించిన పత్రిక "ఆస్టిన్ ట్రిబ్యూన్ " .

వాణిజ్య రేడియో స్టేషనులలో కె.ఎ.ఎస్.ఇ-ఎఫ్.ఎం (కంట్రీ), కె.వి.టి (స్పోర్ట్స్), కె.వి.ఇ.టి-ఎఫ్.ఎం (కంట్రీ), కె.కె.ఎం.జె-ఎఫ్.ఎం (అడల్ట్ కాన్టెంపరరీ), కె.ఎల్.బి.జె (టాక్), కె.ఎల్.బి.జె -ఎఫ్.ఎం (క్లాసిక్ రాక్), కె.ఎల్.జి.ఒ (క్రిస్టియన్ తాక్), కె.ఒ.కె.ఇ -ఎఫ్.ఎం (ప్రోగ్రెసివ్ కంట్రీ), కె.పి.ఇ.జెడ్ (రిథమిక్ కాంటెంపరరీ) మొదలైనవి. ప్రభుత్వం టెక్సాస్ నుండి నిర్వహిస్తున్న కె.యు.టి ప్రధానమైనది. ఇది ప్రాంతీయ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. స్వయంసేవకుల నిర్వహణలో పనిచేస్తున్న కె.ఒ.ఒ.పి (ఎఫ్.ఎం ) ప్రాంతీయంగా తయారుచేయబడుతున్న 60 వైవిధ్యమైన కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నది. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ విద్యార్థులు నిర్వహిస్తున్న " కె.వి.ఆర్.ఎక్స్ " కాలేజ్ స్టేషను ఆస్టిన్ నుండి కమ్యూనిటీ కార్యక్రమాలు, ప్రాంతీయ సంగీత కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. ఇతర రేడియో స్టేషనులలో ప్రధానమైనవి కె.ఎ.జెడ్.ఐ (ఉర్బన్ కంటెంపరరీ), కె.ఎం.ఎ (క్లాసికల్).

ఆస్టిన్ లో కె.టి.బి.సి (ఫాక్స్), కె.వి.యు.ఇ (ఎ.బి.సి), కె.ఎక్స్.ఎ.ఎన్ (ఎన్.బి.సి), కె.ఇ.వై.ఇ (సి.బి.సి) కె.ఎల్.ఆర్.యు (పి.బి.ఎస్),కె.ఎన్.వి.ఎ (ది.డబ్ల్యూ), కె.బి.ఒ (మై నెట్‌వర్క్ టి.వి), కె.ఎ.కె.డబ్ల్యూ (యునివిషన్) మొదలైన టెలివిజన్ స్టేషన్లు ఉన్నాయి. "కె.ఎల్.ఆర్.యు" ఆస్టిన్ నగరపరిమితిలో జరిగే అవార్డ్ ప్రధాన కార్యక్రమాలు ప్రసరినబడుతుంటాయి. జర్నలిస్ట్, రేడియో షో హోస్ట్, చలనచిత్ర నిర్మాత అలెక్స్ జోన్ " ది అలెక్స్ జోంస్ షో ఇన్ ఆస్టిన్ " పేరుతో ఒక టాక్ షో కార్యక్రమం అందిస్తున్నాడు.

దియేటర్లు[మార్చు]

ఆస్టిన్ నగరంలో బలమౌన దియేటర్ సంప్రదాయం ఉంది. నగరంలో వైవిధ్యమైన కాత్యక్రమాలు అందిస్తున్న డజన్లకొద్దీ సంచార, స్థిర నాటకసంస్థలు ఉన్నాయి. నగరంలో జాక్రీ స్కాట్, దియేటర్ సెంటర్, వోర్టెక్స్ రిపర్టరీ కంపనీ, సాల్వేజ్ వ్యాన్‌గార్డ్ దియేటర్, రూడ్ మెకానికల్స్ ది ఆఫ్ సెంటర్, ఆస్టిన్ ప్లేహౌస్, స్కాటిష్ రైట్ చిల్డ్రెంస్ దియేటర్, హైడ్ పార్క్ దియేటర్, ది బ్లూ దియేటర్, ది హైడౌట్ దియేటర్, ఎస్తర్స్ ఫాలీస్ మొదలైన నాటకప్రదర్శనలు ప్రదర్శిస్తున్నదియేటర్లు ఉన్నాయి. నగరంలో ప్రబలమైన విక్టరీ గ్రిల్ చిట్లిన్ సర్క్యూట్ వద్ద ఉంది. పార్కులు, ప్రసిద్ధమైన వంతెనల మీద ప్రజల కళాప్రదర్శనలు నరగరలో ప్రజాదరణ కలిగి ఉన్నాయి. ప్రతి ఏప్రిల్ మాసంలో ఆస్టిన్ " ఫ్యూజ్ బాక్స్ ఫెస్టివల్ " ఆతుథ్యం ఇస్తుంది. ఈ ఉత్సవాలలో ప్రఖ్యాత నాటకనటుల ప్రదర్శనలు ప్రదర్శించబడుతుంటాయి. ఈ ఉత్సవాలు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

1915లో ది పేరమౌంట్ దియేటర్ ఆరంభించబడింది. ఇక్కడ నాట్కలాలు, చలనచిత్ర సంసృతి ప్రతిబింబించే చలనచిత్రాలు వేసవి అంతా ప్రదర్శినబడుతుంటాయి. అలాగే ఇక్కడ " మిస్ కాన్‌జెనియాలిటీ " నంటి ప్రాంతీయ చిత్రాల ప్రీమియర్ షోస్ ప్రదర్శినబడుతుంటాయి. జికర్ పార్కులో దీర్ఘకాలంగా " ది జికర్ పార్క్ సమ్మర్ మ్యూజికల్ " నిర్వహించబడుతుంది. దిలాంగ్ " సెంటర్ ఫర్ ది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ " దియేటర్లో 2,300 కుర్చుని ప్రదర్శనలు వీక్షించే అవకాశం ఉంది. 20 మంది సభ్యులు కలిగిన బ్యాలెట్ ఆస్టిన్ కంపనీ వైవిధ్యమైన పలు నృత్యదర్శకుల ఆధ్వర్యంలో పలు బ్యాలెట్ ప్రదర్శనలు నిర్వహిస్తుంది. వారిలో అంతర్జాతీయ అవార్డ్ గెలుచుకున్న నృత్యదర్శకులలో స్టిఫెన్ మిల్స్ ఒకరు. నగరలో అదనంగా ఆధునిక శైలి నృత్యప్రదర్శనలు ఇస్తున్న " ఈస్ట్ డాంస్ కంపనీ , విభిన్న రీతుకలో నృత్యప్రదర్శనలు ఇస్తున్న " టపస్ట్రీ డాంస్ కంపనీ " బ్యాలెట్ నృత్యాలు ప్రదర్శిస్తున్నాయి. ఆస్టిన్ నగరంల్.ఒ కోల్డ్‌టన్ దియేటర్, ది హైడౌట్ దియేటర్, ది న్యూ మూవ్మెంట్ దియేటర్ , సాల్వేజ్ వాంగార్డ్ దియేటర్ మొదలైన దియేటర్లలో హాస్య ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. ఆస్టిన్ నగరం ఆతిథ్యంలో నిర్వహించబడుతున్న " ది ఔటాఫ్ బౌండ్స్ " ఉత్సవం అన్ని తరహాలకు చెందిన వైధ్యమైన హాస్యకళాకారును నగరానికి ఆకర్షిస్తుంది.

పర్యాటకం[మార్చు]

ఆస్టిన్ నగరంలో టెక్సాస్ మెమోరియల్ మ్యూజియం , ది బ్లాటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (2006లో పునఃప్రారంభించబడింది), ది బాబ్ బుల్లాక్ టెక్సాస్ స్టేట్ హిస్టరీ మ్యూజియం (2000 లో ఆరంభించబడింది), ది ఆస్టిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (ఏ.ఎం.ఒ.ఎ) , హారీ రాంసం సెంటర్లో గ్యాలరీలు ఉన్నాయి. ది టెక్సాస్ స్టేట్ రాజధాని కూడా ప్రముఖ పర్యాటకప్రంతమే. 1886లో నిర్మించబడిన ది డ్రికిల్ హోటేల్ ఒకప్పుడు ఇది జార్జ్ లిటిల్ ఫీల్డు స్వంతమైన ఈ హోటెల్ బ్రాజో విధిలో ఉంది. ఈ హోటెల్ రాజధాని భవనం నిర్మించడానికి ముందుగా నిర్మాణం పూర్తిచేసుకుంది. 6 వ వీధి నగరానికి సంగీతకేంద్రంగా ప్రశంసించబడుతుంది.దక్షిణ ఆస్టిన్ నగరంలో పలు ఎకరాల బహిరంగ ప్రదేశంలో ఉన్న ది ఎంచాంటెడ్ ఫారెస్ట్ కళాప్రదర్శనలకు వేదికగా ఉన్నది. ఇక్కడ తరచుగా ఫైర్-డాంసింగ్ , సర్కస్ వంటి ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఆస్టిన్‌లో ది లిండన్ బెయింస్ జాంసన్ లైబ్రరీ , మ్యూజియం ఉన్నాయి. ఇక్కడ జాంసన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధిత దస్తావేజులు , కళాఖండాలు బధ్రపరచి ఉంటాయి. ఇక్కడ ఎల్.బి.జె లింసన్ , ఓవెల్ రిక్రియేషన్ ఆఫీస్ ఉన్నాయి.

సౌత్ ఆస్టిన్ మ్యూజియం ఆఫ్ పాపులర్ కల్చర్ మ్యూజియంలో ప్రాంతీయంగా కళాఖాండాలను భద్రపరచబడుతున్నాయి. 1983 లో లాటిన్ అమెరికాకు చెందిన " ది మేక్సీ-ఆర్ట్ మ్యూజియం " స్థాపినబడింది. అస్టిన్ నగరంలో 1893-1895 వరకు ఓ.హెంరీ నివసించిన భవనం ప్రస్తుతం మ్యూజియంగా మార్చబడింది. అస్టిన్ నగరంలో వ్యవసాయదారుల సంత (ఫార్మర్స్ మార్కెట్) నగరానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా భావించబడుతుంది. ఇక్కడ ప్రంతీయంగా పండించబడిన పండ్లు, కూరగాయలు, వ్యవసాయ ఆధారిత ఆహారాలు విక్రయించబడుతుంటాయి. వీటిలో ఆర్గానిక్ పంటలు కూడా విక్రయం ఒక ప్రత్యేకత.

ఆస్టిన్ నగరంలో స్టీవ్ రాయ్ వాఘన్ శిల్పం, ది విల్లే నెల్సన్ శిల్పం, టేకో క్సెరెస్ వద్ద ఉన్న ది మాంగియా డైనోసర్, ది లోకా మారినా లేడీ, ది హైడ్ పార్క్ జింస్ గైంట్ ఫిక్సెడ్ ఆర్ం, డేనియల్ జాంస్టన్ హై హౌఆర్‌యు ? ఫ్రాగ్ మురల్ వంటి అనేక విచిత్రమైన శిల్పాలు ఉన్నాయి.

ది అన్ డబల్యూ. రిచర్డ్స్ కాంగ్రెస్ అవెన్యూ బ్రిడ్జ్ ప్రపంచంలో అత్యధికమైన ఫ్రీ టెయిల్డ్ బ్యాట్స్ (తోక గబ్బిలాలు) స్థావరంగా మారింది. మార్చి ఆరంభంలో మిలియన్ల గబ్బిలాలు వంతెనలోని మరుగైన ప్రదేశాలలో నివసిస్తుంటాయి. వంతెన కింద ఉండే మరుగైన ప్రదేశాలు మిలియన్ల కొద్దీ గబ్బిలాలు పీల్లలను పెంచి పోషించడానికి అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయ వేళలలో పురుగులను వేటాడడానికి వంతన కింద నుండి వేలాది గబ్బిల్లలను వెలువడే దృశ్యం చూడడానికి ప్రజలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. ప్రాంతీయ పర్యాటకులకు కూడా ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ దృశ్యం చూడడానికి మాత్రమే ఒక సంవత్సరానికి 1,00,000 మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు. ప్రతి శీతాకాలంలో గబ్బిలాలు మెక్సికో దేశానికి వలస పోతుంటాయి. నగర సరిహద్దుల వెలుపల వెస్ట్రన్ ట్రావిస్ కౌంటీ వద్ద ఆస్టిన్ జూ ఉంది. ఇక్కడ నిర్లక్ష్యం చేయబడిన జంతువులకు ఆశ్రయం కల్పిస్తారు.

ఉద్యానవనాలు[మార్చు]

ది ఆస్టిన్ పార్కులు, రిక్రియేషన్ డిపార్ట్మెంటు 1999 లో ఎక్సెలెంస్ ఇన్ అక్వాటిక్స్ అవార్దును గెలుచుకుంది. అలాగే 2004లో ది నేషనల్ రిక్రియేషన్ అండ్ పార్క్ అసోసేషన్ నుండి గోల్డ్ మెడల్ అవార్డును గెలుచుకుంది. నగరంలో 50 కంటే అధికమైన పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. నగరంలో డీప్ ఎడ్డీ పూల్, టెక్సాస్ పురాతన మానవ నిర్మిత ఈతకొలను, దేశంలో నగరప్రాంతంలో ఉన్న అతి పెద్ద సహజ సిద్ధమైన స్విమ్మింగ్ పూల్ అని గుర్తింపు పొందిన బార్టన్ స్ప్రింగ్స్ పూల్ వంటి పలు ప్రబలమైన స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. లేక్ ట్రావిస్ సమీపంలో హిప్పీ హాలో పార్క్ ఉంది.

విద్య[మార్చు]

2008 సంవత్సరంలో ఆస్టిన్ నగరం అక్షరాస్యతలో సంయుక్త రాష్ట్రాలలో 16వ స్థానంలో ఉన్నదని సెంట్రల్ కనెక్టికట్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు భావిస్తున్నారు. ది ఆస్టిన్ పబ్లిక్ లైబ్రరీ జాన్ హెంరీ ఫాల్క్, పలు గ్రంథాలయ శాఖలను నిర్వహిస్తున్నారు. అదనంగా యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్ వద్ద నిర్వహిస్తున్న విద్యాసంబంధిత గ్రంథాలయం జాతీయ స్థాయిలో 7వ స్థానంలో ఉంది.

ఆస్టిన్ నగరానికి " అమెరికాస్ నంబర్.1 కాలేజ్ టౌన్ " అని ట్రావెల్ చానల్ అభిప్రాయపడింది. ఆస్టిన్ నగరంలోని 25 సంవత్సరాల వయస్కులలో 43% మంది బేచులర్ డిగ్రీని పొంది ఉన్నారు. అలాగే 16% పోస్ట్ గ్రాజ్యుయేట్ డిగ్రీ కలిగి ఉన్నారు. 2009 గణాంకాలను అనుసరించి పట్టభద్రులు అధికంగా ఉన్న అమెరికాలోని మహానగరాలలో ఆస్టిన్ 8వ స్థానంలో ఉన్నదని తెలియజేస్తున్నాయి. సంయుక్త రాష్ట్రాలలో 25 సంవత్సరాల వయస్కులలో పట్టభద్రుల శాతం 39%.

" యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ "ఆస్టిన్ నగరంలోనే ఉంది. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ అనుసంధానిత విద్యాసంస్థలలో 38,000 డిగ్రీకంటే తక్కువ స్థాయిలో ఉన్నారని 12,000 పట్టభద్రులు ఉన్నారు. 2010 లో జాతీయ యూనివర్శిటీలలో యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ 45వ స్థానంలో(ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో 13వ స్థానం) ఉందని " న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ తెలియజేస్తున్నది. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ రీసెర్చ్ వ్యయం 6,400 లక్షల డాలర్లు. అలాగే టెకాస్ లోని మిగిలిన యూనివర్శిటీలకంటే ఉన్నతశ్రేణిలో బిజొనెస్, ఇంజనీరింగ్, లా సంబంధిత విద్యను అందిస్తున్నారు.

ఆస్టిన్ నగరంలో అదనంగా ఎస్.టి ఎడ్వర్డ్ యూనివర్శిటీ, ఆస్టిన్ కమ్యూనిటీ కాలేజ్, కాంకోడియా యూనివర్శిటీ, హస్టన్ - టిల్లోట్సన్ యూనివర్శిటీ, ది సెమినరీ ఆఫ్ ది సౌత్‌వెస్ట్, ది ఏక్షన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఆస్టిన్ గ్రాజ్యుయేట్స్ స్కూల్ అఫ్ థియోలజీ సెమినరీ, వర్జీనియా కాలేజ్ ఆస్టిన్ కాలేజ్, ది ఆర్ట్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఆస్టిన్, ఆస్టిన్ కంసర్వేటరీ, పార్క్ యూనివర్శిటీ లోని ఒక శాఖ మొదలైనవి ఉన్నాయి.

ప్రాథమిక , మాధ్యమిక ప్రభుత్వ పాఠశాలలు[మార్చు]

అస్టిన్ నగరంలోని ఉన్నత శ్రేణి ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. వైవిధ్యమైన అవకాశాలను కల్పిస్తున్న 29 పబ్లిక్ స్కూల్ డ్రిస్టిక్స్, 17 సహాయనిధి పాఠశాలలు, 69 ప్రైవేట్ పాఠశాలలు ఆస్టిన్ వాసులను ఆనందింపచేస్తున్నాయి. నగరంలోని అధికభాగం నివాసితులకు ఆస్టిన్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ విద్యావకాశాలను అందిస్తున్నది. ఈ ద్కూల్ డిస్ట్రిక్‌లో మేగ్నెట్ లిబరల్ ఆర్ట్స్, సైన్సు అకాడమీ ఉన్నాయి. ఇవి జాతీయంగా మొదటి 30 పాఠశాలలోపు శ్రేణిలో ఉంటున్నాయి. అలాగే రిచర్డ్స్ స్కూల్ ఫర్ యంగ్ వుమన్ లీడర్స్ ఉన్నాయి. ఆస్టిన్ లోని మరి కొన్ని ప్రాంతాలలో రౌండ్ రాక్, పిఫ్లుజర్ విల్లే, లీండర్, మేనర్, డెల్ వాలే, లేక్ ట్రావిస్, హేస్, ఈనెస్ ఐ.ఎస్.డి.ఎస్ మొదలైన పాఠశాలలు ఉన్నాయి. మహానగరలో ఉన్న 4 ప్రధాన ప్రభుత్వ పాఠశాలలు నగరంలోని 54% విద్యార్థులకు అవకాశం కల్పిస్తుంది.

ప్రైవేట్ పాఠశాలలు[మార్చు]

ప్రైవేట్, ప్రత్యామ్నాయ విద్యాసంస్థ్గలలో ప్రి స్కూల- 12వ గ్రేడు వరకు విద్యావకాశాలు కల్పిస్తున్న పాఠశాలలలో ఎ.సి.ఇ అకాడమీ, రీజెంట్స్ స్కూలు ఆఫ్ ఆస్టిన్, రిడీమర్ ల్యూథరన్ స్కూలు, గర్జా (పబ్లిక్), అస్టిన్ డిస్క్వరీ స్కూలు (పబ్లిక్ చార్టర్), అస్టిన్ జీవిష్ అకాడమీ, అస్టిన్ పీస్ అకాడమీ, ది అస్టిన్ వాల్‌డ్రాఫ్ స్కూల్, ది గ్రిఫిన్ స్కూల్, ది ఖబేలే స్కూల్, కాన్‌కార్డియా అకాడమీ, కిర్బీ హాల్ స్కూలు, ఎస్.టి ఇగ్నీషియస్ మార్టిర్ కాథలిక్ స్కూలు, హోలీ ఫ్యామిలీ కాథలిక్ స్కూల్,శాన్ జుయాన్ డియోగో కాథలిక్ హై స్కూలు, బ్రెంట్ వుడ్ క్రిస్టియన్ స్కూలు, రినైసెంస్ అకాడమీ, ఎస్.టి అస్టిన్ కాథలిక్ స్కూలు, ఎస్.టి స్టిఫెంస్ ఎపిస్కోపల్ స్కూలు, హోలీ ఫ్యామిలీ స్కూలు, ఎస్.టి మేరీస్, ఎస్.టి థెరసాస్, ఎస్.టి మైకేల్స్ కాథలిక్ అకాడమీ, ఎస్.టి గాబ్రియల్స్ కాథలిక్ స్కూలు, ఎస్.టి ఆన్‌డ్రూస్ ఎపిస్కోపల్ స్కూలు, ఎస్.టి ఫ్రాంసిస్ ఎపిస్కోపల్ స్కూల్, ఎస్.టి పౌల్ లూథరన్ స్కూలు, ట్రినిటీ ఎపిస్కోపల్ స్కూలు, హంటింగ్టన్- సర్వే, క్లీవ్యూ సబ్‌బ్యూరీ స్కూలు, ఇంసైడ్ ఔట్ సైడ్ స్కూలు, ఎ.సి.ఇ అకాడమీ, పారగన్ ప్రిపరేటరీ మిడిల్ స్కూలు, అస్టిన్ ఇంటర్నేషనల్ స్కూలు, ప్రోగ్రెస్ స్కూలు, బ్రోంజ్ డోర్స్ అకాడమీ, పలు మాంటెస్సరీ పాఠశాలలు ఉన్నాయి. ఇవే కాక అస్టిన్ నగరంలో " హోం స్కూలింగ్ ? అన్ స్కూలింగ్ " సమాజాలు, నగరంలో ప్రాథమిక పార్ట్-టైం విద్యాలయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం " హోల్ లైఫ్ లానింగ్ సెంటర్ , ఎ.హెచ్.బి కమ్యూనిటీ స్కూల్ నగరంలో ప్రధమిక విద్యను అందిస్తూ విద్యాభ్యాసానికి ప్రేరణ కలిగిస్తున్నాయి. అస్టిన్ నగరంలో పలు చైల్డ్ డెవలప్మెంటల్ ఇంస్టిట్యూషన్లలో " సెంటర్ ఫర్ అస్టిన్, రిలేటెడ్ డిసార్డర్స్, ది సెంట్రల్ టెక్సాస్ అస్టిన్ సెంటర్, జాంసన్ సెంటర్ ఫర్ చైల్డ్ హెల్త్ అండ్ డెవలెప్మెంట్ " వంటి పాఠశాలలు ఉన్నాయి.

ప్రయాణ వసతులు[మార్చు]

అస్టిన్ నగరం ఉత్తర - దక్షిణ రహదారుల మద్య ఉంది. తూర్పు చివరి వరకు ఇంటర్ స్టేట్ 35 , పడమరకు మోప్యాక్ ఎక్స్‌ప్రెస్‌వే (లూప్ 1), వాయవ్యం- ఆగ్నేయం మద్యలో యు.ఎస్ ఐవే 183 , నగర దక్షిణ ప్రాంతాలలో తూర్పు-పడమరలకు స్టేట్ హైవే 71 రహదారి మార్గాలున్నాయి. సంయుక్త రాస్ఃత్రాలలోని మహానగరాలలో ఒకేఒక ఇంటర్‌స్టేట్ రహదారి మార్గంఉన్న ఒకే ఒక నగరం ఆస్టిన్ మాత్రమే.

అస్టిన్ నగర తూర్పు నుండి యు.ఎస్ హైవే 290 నగరంలో ప్రవేశించి ఇంటర్‌స్టేట్ 35 లో కలుస్తుంది. ఈ రహదారి రూపకల్పన ఐ-35 వరకు పొడిగించబడి హైవే 71 లో కలుస్తూ పడర వరకు పొడిగించబడుతుంది. హైవే 290 హైవే 71 వద్ద చీలి ఆగ్నేయ దిశ వరకు సాగిపోతుంది. హైవే 71 బ్రాడీ, టెక్సాస్ వరకు పొడిగించబడింది, హైవే 290 పడమరలోని ఇంటర్‌సెక్ట్ ఇంటర్‌స్టేట్ 10 కూడలి వరకు పొడిగించబడి ఉంది, ఇంటర్‌స్టేట్ 35 దక్షిణదిశ వరకూ సాగుతూ శాన్ ఆంటానియా నుండి లరెడో మీదుగా టెక్సాస్-మెక్సికో సరిహద్దులకు చేరుకుంటుంది. ఇంటర్‌స్టేట్ 35 నగరాన్ని ఉత్తర టెక్సాస్ లోని హైవే లింక్ డలాస్-ఫోర్ట్ తో అనుసంధానం చేస్తుంది. నగరం నుండి హ్యూస్టన్ నగరానికి రెండు రహాదారి మార్గాలు ఉన్నాయి(హైవే 290 , స్టేట్ హైవే 290 /ఇంటర్‌స్టేట్ 10).హైవే 183 నగరాన్ని వాయవ్యంలోని లాంపాస్ తో అనుసంధానం చేస్తుంది.

1980లో లూప్ 360 మార్గం నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నది. అందమైన దృశ్యాల వెంట సాగిపోయే ఈ హైవే హిల్ కౌంటీని చుట్టేలా వంపు తిరిగి ఉంటుంది. ప్రసిద్ధమైన " పెన్నీ బ్యాకర్ " వంతెన (దీనిని " 360 బ్రిడ్జ్ అని కూడా అంటారు).

టోల్‌వేస్[మార్చు]

వాహనరద్దీని తగ్గించడానికి స్టేట్ ఐవే 130 నిర్మించబడింది. జార్జ్ టౌన్ ఉత్తరంగా ఇంటర్‌స్టేట్ 35 నుండి ఆరంభమై రౌండ్ రాక్‌, ఆస్టిన్, శాన్‌మార్కోస్, న్యూబ్రౌన్‌ఫెల్స్ ను చుట్టి తూర్పున ఉన్న ఇంటర్‌స్టేట్ 10 రహదారిలో కలుస్తుంది. ఇది ఆస్టిన్ ఆగ్నేయదిశలో ఉన్న బర్గ్‌స్ట్‌రోం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ స్టేట్ హైవే 71 వద్ద మొదటి భాగం 2006 లో ప్రారంభించబడిది. హైవే 45 లా ఫ్లూగర్ విల్లే ఉత్తరం నుండి ఆరంభమయ్యే హైవే 130 యు.ఎస్183 వరకు కొనసాగుతుంది. అక్కడ నుండి అది చీలి పడమర దిశగా సాగుతుంది. హైవే 130 నిర్మాణం పూర్తి చేసుకుని 2010 నవంబరు 1 న ప్రజల ఉపయోగార్ధం తెరవబడింది. రహదారి అంతా వాహనల వేగపరిమితి 80 మైళ్ళు. మత్సాంగ్ రిడ్జ్, సెగుయిన్ మద్య ఉన్న 41 మైళ్ళ పొడవైన టోల్ మార్గంలో వేగపరిమితి గటకు 85 మైళ్ళు. ఇది యు.ఎస్ లో ఉన్న వేగపమితిలో ఇదే అత్యనంత వేగమైనది.

హైవే 45 తూర్పు పడమరలుగా హైవే 183 దక్షిణదిశ నుండి సాగుతూ ఫ్లూజర్ విల్లే చేరుకుంటుంది. పొడుగించబడిన టోల్ మార్గం హైవే లూప్ 1 కూడా ఏర్పాటు చేయబడింది. హైవే 45 లో కొత్తగా ఆస్టిన్ దక్షిణదిశలో టీ.ఎక్స్-130 నుండి యు.స్ 183 వరకు సగ్గే సరికొత్త విభాగం ప్రస్తుతం నిర్మణాన్ని పూర్తిచేసుకున్నది. పడమరలో ఎఫ్.ఎం 1327/క్రీడ్‌మోర్ ఎగ్జిట్ వద్ద ఆస్టిన్, బుడా మద్యలో ఐ-35 రహదారి నిర్మించబడింది. 2007 మార్చి‌లో యు.ఎస్ 183కి ప్రత్యామ్నాయంగా లీండర్, సెడార్ పార్క్ మీదుగా 183 ఏ టోల్ రోడ్ తెరవబడింది. యు.ఎస్ 183 నుండి మేనర్ టౌన్ వరకు యు.ఎస్ 290 రహదారి నిర్మాణదశలో ఉంది. టోల్ రోడ్ ఆలోచనకు ప్రజలల వ్యతిరేకతను అధిగమిస్తూ మూడు టోల్ మార్గాలు రుసుమును వసూలు చేస్తూనే ఉన్నాయి.

విమానాశ్రయాలు[మార్చు]

ఆస్టిన్ నగరానికి దక్షిణంగా 5 మైళ్ళ దూరంలో " ఆస్టిన్- బర్గ్‌స్ట్‌రోం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " (ఎ.బి.ఐ.ఎ) (ఐ.ఎ.ఎ కోడ్ ఎ.యు.ఎస్) ఉంది. ఆస్టిన్- బర్గ్‌స్ట్‌రోం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ 1993లో మూసివేయబడిన " మునుపటి " బర్గ్‌స్ట్‌రోం ఎయిర్ ఫోర్స్‌బేస్ " కనుచూపుమేరలోనే ఉంది. అంతకు మునుపు రాబర్ట్ ముల్లర్ ముంసిపల్ ఎయిర్ పోర్ట్ ఆస్టిన్ వాణిజ్య పరమైన ఎయిర్ పోర్ట్‌గా ఉంటూ వచ్చింది.

ఇంటర్ సిటీ బస్ సర్వీస్[మార్చు]

గ్రేహౌండ్ లైంస్ 916 ఈస్ట్ కోయింగ్ లేన్ వద్ద " ఆస్టిన్ స్టేషను" ను నిర్వహిస్తున్నది. ఇది " ఎయిర్ పోర్ట్ బౌల్‌వర్డ్", ఆనుకుని ఉన్న హైలాండ్ మాల్ తూర్పున ఉంది. " టురిమెక్స్ ఇంటర్నేషనల్ " ఆస్టిన్ నుండి న్యూవో లెరొడో, మెక్సికో లోని పలు గమ్యాలకు వరకు బస్ సర్వీసులను నడుపుతుంది. టురిమెక్స్ స్టేషను 5012 ఈస్ట్ 7త్ స్ట్‌రీట్ " వద్ద షాబీ మార్గంలో ఉంది.

పబ్లిక్ ట్రన్ంపోర్టేషన్[మార్చు]

కేపిటల్ మెట్రోపాలిటన్ ట్రాంస్పోర్టేషన్ అధారిటీ కేపిటల్ మెట్రో నగరంలో బస్ సర్వీసులను నడుపుతుంది. కేపిటల్ మెట్రో నగరంలోని కొన్ని మార్గాలను " రాపిడ్ లైంస్ "గా మార్చాలని ప్రయత్నిస్తుంది. 60 అడుగుల వెడల్పైన ఈ మార్గాలలో ట్రెయిన్-లైక్, హై-టెక్ బసులను నడుపుతుంది. అదనపు మార్గాలు రద్దీని తగ్గిస్తాయని విశ్వసిస్తున్నారు. 2010 మార్చి22 లో ఉద్యోగుల కొరకు కేపిటల్ మెట్రో 32 మైళ్ళ రైలు మార్గం తెరవబడింది. ఈ రైలు మార్గం మునుపటి గూడ్స్ రైలు మార్గం మీద నిర్మించబడింది. ఈ మార్గం ద్వారా ఆస్టిన్ డౌన్ టౌన్, ఈస్ట్ ఆస్టిన్, నార్త్ సెంట్రల్ ఆస్టిన్, నార్త్ వెస్ట్ ఆస్టిన్ , లాండర్ వాసులకు ప్రయాణ వసతులు కల్పిస్తుంది. భవిస్యత్తులో మేనర్ అరియు రౌండ్ రాక్ మార్గాలు నిర్మించాలని ప్రణాళిక వేస్తున్నారు. కేపిటల్ మెట్రో డౌన్ టౌన్ చుట్టి సర్క్యులర్ విధానంలో స్ట్రీట్ కార్లను నడపాలని యోచిస్తుంది. ఈ మార్గంతో డౌన్ టౌన్ లోని అధిక భాగం, ఆస్టిన్ లోని ది యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్, , 700-ఎకరాల ముల్లర్ ఎయిర్ పోర్ట్ రీ డెవలప్మెంట్ ప్రాంతాలను అనుసంధానించాలని ప్రణాళిక వేస్తున్నారు. కొత్త స్ట్రీట్ కార్ల విధానం సెంట్రల్ ఆస్టిన్ లోని ప్రధాన ప్రాంతాలను రైలు మర్గాలతో అనుసంధానించాలని అనుకుంటున్నారు. ఆస్టిన్ డౌన్ టౌన్ పడమటి దిశలో ఆంట్రెక్ టెక్సాస్ ఈగిల్ స్టేషను ఒకటి ఉంది. ఆంట్రెక్ మార్గంలో ఆస్టిన్ , శాన్ ఆంటానియో మద్యలో ఇంటర్‌స్టేట్ 35 మార్గంలో రద్దీని తగ్గించడానికి పాసింజర్ రైళ్ళను నడపడానికి వ్యూహరచన చేస్తుంది. టెక్సాస్ రాష్ట్రంలోనే ఆస్టిన్ నగరం " బైక్-ఫ్రెండ్లీ " నగరంగా పేరుపొందింది. ఆస్టిన్ నగరంలో కార్ షేరింగ్ విధానం " కార్2గో " చాలా ప్రసిద్ధం. ఆస్టిన్ నగరాన్ని జర్మనీ కంపనీ " ది వెస్ట్రన్ హెమీస్ఫేర్ " మొట్టమొదటి వ్యాపార కేంద్రంగా ఎంచుకున్నది.

నడక మార్గాలు[మార్చు]

2011 అధ్యయనాలు నడకకు అనుకూలమైన యు.ఎస్ లోని 50 నగరాలలో ఆస్టిన్ 31వ స్థానంలో ఉంది.

వెలుపలి లింకులు[మార్చు]

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; motto అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 US Census Bureau State and County QuickFacts
  3. "American FactFinder". United States Census Bureau. Retrieved జనవరి 31, 2008.
  4. "US Board on Geographic Names". United States Geological Survey. 2007-10-25. Retrieved 2008-01-31. {{cite web}}: Check date values in: |date= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=ఆస్టిన్&oldid=3572326" నుండి వెలికితీశారు