Jump to content

శాన్ అంటోనియో

వికీపీడియా నుండి
శాన్ అంటోనియో, టెక్సస్
San Antonio, Texas
City of San Antonio
Nickname(s): 
River City, San Antone,
Alamo City, Military City USA, Countdown City
Location in Bexar County in the state of Texas
Location in Bexar County in the state of Texas
దేశం United States
రాష్ట్రంటెక్సస్
CountyBexar, Medina, Comal
Foundation1691
Government
 • TypeCouncil-Manager
 • City CouncilMayor Julian Castro[1]
Diego M. Bernal
Ivy R. Taylor
Jennifer V. Ramos
Rey Saldaña
David Medina, Jr.
Ray Lopez
Cris Medina
W. Reed Williams
Elisa Chan
Carlton Soules
 • City ManagerSheryl Sculley
విస్తీర్ణం
 • నగరం412.1 చ. మై (1,067.3 కి.మీ2)
 • Land407.6 చ. మై (1,055.7 కి.మీ2)
 • Water4.5 చ. మై (11.7 కి.మీ2)
Elevation
650 అ. (198 మీ)
జనాభా
 (2010)
 • నగరం13,27,407 (7th)
 • జనసాంద్రత3,400.9/చ. మై. (1,313.1/కి.మీ2)
 • Metro
21,94,927 (24th)
 • Demonym
San Antonian
Time zoneUTC–6 (CST)
 • Summer (DST)UTC–5 (CDT)
ప్రాంతపు కోడ్(లు)210(majority), 830(portions)
Websitewww.sanantonio.gov

అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని టెక్సస్ రాష్ట్రంలోని పెద్ద నగరాలలో శాన్ అంటోనియో ఒకటి. 1.3 మిలియన్ల ప్రజలు కలిగిన శాన్ అంటోనియో నగరం జనసాంద్రతలో సంయుక్త రాష్ట్రాలలో 7వ స్థానంలోనూ అలాగే టెక్సస్ రాష్ట్రంలో 2వ స్థానంలోనూ ఉంది[2]. ఈ నగరం 2000-2010 మధ్యకాలంలో సంయుక్త రాష్ట్రాలలో శీఘ్రగతిలో అభివృద్ధి చెందిన 10 పెద్ద నగరాలలో ఒకటి 1990-2000 మధ్య కాలంలో రెండవది. ఈ నగరం నైరుతి అమెరికాలో ఉపస్థితమై ఉంది. అలాగే టెక్సస్ దక్షిణ మధ్య భాగంలో, టెక్సస్ త్రికోణ ప్రదేశంలో నైరుతి శివార్లలో ఉంది. 2018 మే 1 న తన 300 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న రాష్ట్రంలోని పురాతన మునిసిపాలిటీ ఇది.[3][4].[5] శాన్ అంటోనియో బెస్టర్ కౌంటీ స్థానంగా సేవలు అందిస్తుంది. మిగిలిన జనసాంద్రత కలిగిన పశ్చిమ నగరాలలోలాగ పట్టణంలో అక్కడక్కడా జనసాంద్రత కలిగి శివారు ప్రాంతంలో తక్కువ జనసాంద్రత కలిగి ఉంటుంది. నగరం శాన్ అంటోనియో-న్యూ బ్రౌన్‍ ఫెల్ మహానగర ఆకర్షణీయమైన పురపాలకం. అలాగే ఈ నగర అతిపెద్ద శివారు ప్రాంత ప్రధాన నగరం న్యూ బ్రౌన్‍ ఫెల్. 2011 యు.ఎస్ గణాంకాలను అనుసరించి శాన్ అంటోనియో మహానగర జనసంఖ్య 2.2 మిలియన్లు. సంయుక్త రాష్ట్రాలలో 24వ పెద్ద మహానగర ప్రదేశం టెక్సస్‍లో 3వ పెద్ద మహానగర ప్రదేశంగా గుర్తించబడింది[6].

శాన్ అంటోనియో నగరానికి ఈ పేరును సెయింట్ ఆంథోనియా ఆఫ్ పాడువా గౌరవార్ధం పెట్టారు[7]. స్పానిష్ సాహస యాత్ర నిలిపి వేయబడిన 1691 జూన్ 13 ఆయన విందు రోజుగా కొనియాడబడుతుంది.[8] ఈ నగరం స్పానిష్ మిషనరీలకు పేరు పొందినది. నగరంలో ది ఆల్మో, రివర్ వాక్, ది టవర్ ఆఫ్ ది అమెరికన్స్, ది ఆల్మో బౌల్, మ్యారేజ్ ఐలాండ్ వంటి వినోదకేంద్రాలు ఉన్నాయి. నగరంలో ఉన్న సిక్స్ ఫ్లాగ్స్ ఫెస్టా టెక్సాస్ ధీం పార్క్స్, సీ వరల్డ్ వంటివి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. శాన్ ఆంటానియో కాన్‍వెన్‍షన్ విజిటర్స్ బ్యూరో నివేదికను అనుసరించి నగనికి సంవత్సరానికి సుమారు 26 మిలియన్ల పర్యాటకులు విచ్చేస్తున్నారని అంచనా. ఈ నగరం ఎన్‍బిఎ చాంపియన్ శాన్ అంటోనియో స్పర్స్ కు నాలుగు మార్లు ఆతిథ్యం ఇచ్చింది. అలాగే దేశంలో అతి పెద్దదైన శాన్ అంటోనియో స్టాక్ షో & రోడియోకు ఆతిధ్యం ఇచ్చింది.

శాన్ అంటోనియో నగరంలో శక్తివంతమైన సైనిక ఉనికి కలిగి ఉంటుంది. ఫోర్ట్ శాం హ్యూస్టన్, ల్ఖ్ లాండ్ ఎయిర్ ఫోర్స్ బేస్, రాండాల్ఫ్ ఎయిర్ ఫోర్స్ బేస్, బ్రూక్స్ సిటీ- బేస్ వంటి సైనిక స్థావరాలు కేంప్ బుల్లీస్, కేంప్ స్టాన్లీ లతో ఈ నగర లోశివార్లలో ఉన్నాయి. 2001 వరకు కెల్లీ ఎయిర్ ఫోర్స్ బేస్ లాక్ లాండ్ ఎ ఎఫ్ బికి బదిలీ చేయబడే వరకు శాన్ అంటోనియో వెలుపలి భాగంలో ఉన్నాయి. బేస్ లోని మిగిలిన భాగాలు పోర్ట్ శాన్ అంటోనియోగా పారిశ్రామిక వ్యాపార కూడలిగా మార్చబడింది. శాన్ అంటోనియో ఐదు ఫార్చ్యూన్ 500 సంస్థలలకు పుట్టిల్లు. దక్షిణ టెక్సస్ ప్రాంతంలో ఒకే ఒక మెడికల్ రీసెర్చ్ అండ్ కేర్ ప్రొవైడర్ సంస్థ అయిన టెక్సస్ మెడికల్ సెంటర్ కు కూడా ఇది స్వస్థలం.

చరిత్ర

[మార్చు]

వాస్తవంగా స్థానిక అమెరికన్లు శాన్ అంటోనియో నదీ లోయలోని శాన్ పెడ్రో స్ప్రింగ్స్ ప్రాంతం యనగ్యున సమీపంలో నివసిస్తూ వచ్చారు. 1691 జూన్ 13న స్పానిష్ సాహస యాత్రీకులు, మతబోధకుల బృందం నది మీద ప్రయాణిస్తూ స్థానిక అమెరికన్ల స్థావరానికి వచ్చారు. ఇదే సెయింట్ పాడువా ఫీస్ట్ డే[7]. వారు ఈ నదికి సెయింట్ గౌరవార్ధం ఈ ప్రదేశానికి శాన్ అంటోనియో అని నామకరణం చేసారు.

శాన్ అంటోనియో స్పానిష్ ఆరంభ నివాసాలు మార్టిన్ డి అలర్కాన్ సాహసయాత్రతో మొదలైంది. అలాగే టెక్సస్ ప్రాంతంలో ల్యూసినియాలో ఉన్న ఫ్రెంచ్ కంటే ఆధిక్యతను పునరుద్ధరించే నిమిత్తం స్పానిష్ వారి చేత శాన్ ఆంటోనియో డి వలెరో మిషన్ (ప్రస్తుత ఆల్మో) స్థాపన జరిగింది. వైస్రాయి ఫాదర్ ఆంటోనియో డి శాన్ బ్యునవెంచురా వై ఆలివరెస్ ప్రోద్బలంతో తమకు ప్రధాన అడ్డంకిగా ఉన్న చట్ట విరోధమైన ల్యూసియానా వ్యాపారం అణిచివేసాడు. ఆయన టెక్సస్ లో ఫ్రాన్సిస్కాన్ మిషన్ కు సహకరిస్తానని వాగ్ధానం చేసాడు.

ఆరంభంలో 1709లో ఫాదర్ ఆలివరెస్ శాన్ అంటోనియో నదీని చూసే నిమిత్తం ఇక్కడికి వచ్చి ఒక మిషన్, నివాసాలు ఏర్పరచడానికి నిర్ణయం తీసుకున్నాడు. వైస్రాయి మిషన్ కు అనుమతి ఇచ్చాడు తరువాత 1709 లో నిదానంగా 1716 ప్రెసిడియోకు అనుమతి ఇచ్చి వారు స్థాపించిన మార్టిన్ డి అలర్కాన్ బాధ్యతకు, టెక్సాస్, కొహులియా లకు గవర్నర్ నియామకం కొరకు సంతకం చేసాడు. సందర్భవశంగా అలర్కాన్, ఆలివరెస్ మధ్య విబాధాల కారణంగా 1718 వరకు పనులలో జాప్యం జరిగింది[9].

ప్రెసిడియో, మిషన్ చుట్టూ కుటుంబాలు నివాసాలు ఏర్పరచుకోవండం మొదలైంది. విల్లా డి బెజార్ పేరుతో ఇవి స్పానిష్ టెక్సస్ ప్రధానాంశాలు అయ్యాయి. 1718 మే 1న గవర్నర్ శాన్ అంటోనియో నదీ తీరంలో మిషన్ శాన్ ఆంటోనియో డి వలెరో (తరువాత ఇది అల్మోగా ప్రసిద్ధి చెందింది) ను తరువత మే 5న ప్రెసిడియో శాన్ అంటోనియో నదీ పడమటి వైపు శాన్ ఆంటోనియో డి బెక్సర్ ను స్థాపించాడు .

1779 ఫెబ్రవరి 14న మార్క్విస్ ఆఫ్ శాన్ మిక్వెల్ డి అగ్యుయో టెక్సస్[10] లో ప్రజల సంఖ్యని పెంచే నిమిత్తం కేనరీ ఐలాండ్స్ (కానరీ ద్వీపాలు) నుండి 400 కుటుంబాలను గలీషియా లేక హవానాకు తరలించాలన్న ఒక నివేదికను స్పెయిన్ రాజుకు సమర్పించాడు. ఆయన ప్రణాళికకు అనుమతి లభించి కేనరీ ఐలాండ్స్ (కానరీ ద్వీపాలు) వాసులకు నీటిస్ జారీ చేసి 200 కుటుంబాలకు వసతులు కల్పించబడింది. ది కౌంసిల్ ఆఫ్ ఇండీస్ కేనరీల నుండి టెక్సస్ కు 400 కుటుంబాలను హవానా, వేరక్రుజ్ మార్గంలో పంపించవలసి ఉంటుందని సూచించింది. స్పెయిన్ నుండి ఈ చర్యను ఆపుతూ జారీ చేసిన ఆజ్ఞలు వచ్చి చేరే ముందుగా 1730 జూన్ నాటికి 25 కుటుంబాలు క్యూబా, 10 కుటుంబాలు వేరక్రుజ్ చేరుకున్నాయి[11].

1731 మార్చి 9 నాటికి జువాన్ లీల్ జార్జ్ నాయకత్వంలో ఈ బృందాలు నడుస్తూ ప్రెసిడియో శాన్ ఆంటోనియో డి బెక్సర్ ఎగువభూములకు చేరాయి. మార్గమధ్యంలో జరిగిన వివాహాల కారణంగా కుంటుంబాలు మొత్తం 56 మంది జనంతో 15 గా అభివృద్ధి చెందాయి. వారు సైనిక సమూహంలో చేరి 1778 వరకు తమ ఉనికి నిలుపుకున్నారు. వలసదారులు విల్లా ఆఫ్ శాన్ ఫెర్నాండో డి బెక్సర్ కేంద్రంగా ఉన్నారు. ఇది టెక్సస్ మొదటి క్రమనిర్వహణ కలిగిన ప్రజాప్రభుత్వంగా గుర్తించబడింది. శాన్ అంటోనియో ప్రదేశంలో ఉన్న పురాతన కుటుంబాలలో అనేకం కెనరీ ఐలాండ్ కాలనీ వాసుల సంతతి వారే. శాన్ అంటోనియోలో మొదట జన్మించిన కెనరీ ఐలాండ్ కాలనీ వాసుల వంశావళి సంతతి పేరు మరియా రోజా పార్డన్[11].

టెక్సస్ లోని బృహత్తర స్పానిష్ నివాసప్రదేశంగా శాన్ అంటోనియో అభివృద్ధి చెందింది. నగర చరిత్రకు అధికంగా స్పానిష్ కేంద్రంగా ఉండి తరువాత మెక్సికన్, తేజాస్ ఉంటుంది. శాన్ అంటోనియో నుండి కేమినో రియల్ వరకు (ప్రస్తుతం శాన్ అంటోనియో లోని నాకాగ్ డోచెస్ రోడ్) అమెరికన్ సరి హద్దులు ఉంటాయి. సరిహద్దులో ఉన్న నగరమే నాకాగ్ డోచెస్. మెక్సికోలో పలు రాష్ట్రాలలో హింస చెలరేగిన సమయంలో 1824 లో మెక్సికన్ రాజ్యాంగం ఆంటోనియో లోపెజ్ డి శాంటా అన్నాను కోల్పోయింది.

ఆధిపత్య పోరు

[మార్చు]

టెక్సికన్ సైన్యం వరుస యుద్ధాల అనంతరం శాన్ అంటోనియో తూర్పు భాగంలో ఉన్న నివాసిత ప్రాంతాల నుండి మెక్సికన్ యోధులను వెలుపలకు నెట్టడంలో విజయం సాధించారు. బెక్సర్ యుద్ధంలో బెన్ మిలాం నాయకత్వంలో 1835 డిసెంబరు తేదీన టెక్సన్ సైన్యాలు శాంటా అన్నాను బావ అయిన జనరల్ మార్టిన్ పర్ఫెక్టో డి కోస్ ఆధ్వర్యంలో ఉన్న సైన్యాల నుండి శాన్ అంటోనియోని వశపరచుకున్నారు.1836 వసంతకాలంలో శాంటా అన్నా శాన్ అంటోనియో మీద దండెత్తాడు. జేమ్స్ C. నీల్ ఆధ్వర్యంలో వాలంటీర్ సైన్యాలు నిర్జనంగా వదిలి వేయబడిన మిషన్ కైవశం చేసుకుని బలోపేతం చేసాడు[12].

ఆయన వెళ్ళిన తరువాత పాత మిషన్ విలియం బారెట్ ట్రావిస్, జేమ్స్ బౌవీ ల సమైక్య ఆధ్వర్యంలో కొనసాగింది. 1836 ఫిబ్రవరి 23 నుండి మార్చి 16 వరకు బాటిల్ ఆఫ్ ఆల్మో (అల్మో యుద్ధం) కొనసాగింది. ఆల్మో రక్షకులందరి మరణాలతో క్షీణించిన టెక్సికన్ సైన్యాలు చివరకు ఓడిపోయాయి. ఈ యోధుల మరణం టెక్సస్ స్వతంత్రానికి కారణం అయింది. చివరకు టెక్సికన్ సైన్యాలు శాంటా అన్నాను ఓడించి విజయం సాధించిన తరువాత రిమెంబర్ ఆఫ్ ఆల్మో (ఆల్మో జ్నాపకార్ధం) పేరుతో దుఃఖపూరిత ఊరేగింపు జరిగింది[12].

టెక్సస్ స్వతంత్రం కొరకు బాటిల్ ఆఫ్ ఆల్మో యుద్ధం, బాటిల్ ఆఫ్ కాంసెప్షన్, సైజ్ ఆఫ్ బెక్సర్, బాటిల్ ఆఫ్ శాన్ జసింటో యుద్ధాలలో మరణించిన కొరకు టెజానో దేశభక్తుల సంస్థ స్థాపించి నిర్వహించిన జువాన్ సెగ్విన్ శాన్ అంటోనియో ప్రథమ మేయర్ అయ్యాడు.1842లో రాజకీయంగా కొత్తగా వచ్చిన వారు, రాజకీయ శత్రువుల చేత ఆయన బలవంతంగా పదవి నుండి నెట్టి వేయబడ్డాడు. దాదాపు 150 సంవత్సరాల వరకు ఆయనే చివరి టెంజానియో మేయర్ అని గుర్తింపబడ్డాడు[13].

చివరకు 1845లో సంయుక్త రాష్ట్రాలు టెకాస్ ను సమైక్యం చేసి తన రాష్ట్రాలలో ఒకటిగా చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మెక్సికన్ అమెరికన్ యుద్ధానికి దారి తీసింది. శాన్ అంటోనియోను దాని చివరి భాగం వరకు నాశనానికి గురి చేస్తూ ఈ యుద్ధం మీద యు.ఎస్ విజయం సాధించింది. కేవలం 800 నివాలులతో నగర జనాభా మూడింట రెండు వంతులు క్షీణించింది.[14] 1860 నాటికి అంతర్యుద్ధం మొదలైన తరువాత నగర జనాభా 15,000 లకు చేరుకుంది.

అంతర్యుద్ధం తరువాత

[మార్చు]

అంతర్యుద్ధం తరువాత శాన్ అంటోనియో పశుపరిశ్రమ కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ సమయంలో ఇది సర్హద్దు నగరంగా ఉండిపోయింది. అయినప్పటికీ వైవిధ్యం కగిన నగర సంస్కృతి అలాగే మనోహరమైన సౌందర్యం కూడా దీనికి కీర్తి తెచ్చింది. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ అయిన రూపశిల్పి ఫ్రెడరిక్ లా ఒల్మ్స్టెడ్ ఒకసారి ఈ నగాన్ని " గందరగోళమైన జాతులు, భాషలు, భవనాలు " కలిగిన ఈ నగరం "వింతైన పురాతన విదేశీయత " అనే సరికొత్త నాణ్యతను సంతరించుకున్నది అని వర్ణించాడు[15][16]

1887 లో మొదటి రైలుమార్గం శాన్ అంటోనియో చేరుకున్న తరువాత నగరం చాలాకాలం సరిహద్దు నగరంగా మిగిలి పోలేదు. నగరంలోకి అమెరికన్ ప్రధాన ప్రజా వాహిని రావడం మొదలైంది. 20 వ శతాబ్ద ప్రారంభంలో డౌన్ టౌన్ వీధులు అనేక చారిత్రక భవనాలను ధ్వంసం చేస్తూ కార్లు, ఆధునిక వాహనాల రాక పోకలకు తగిన వసతి కల్పిస్తూ వెడల్పు చేయబడ్డాయి[17].

నైరుతి అమెరికన్ అనేక పురపాలక సంఘాల మాదిరి శాన్ అంటోనియో క్రమమైన జనసంఖ్య అభివృద్ధిని చవిచూసింది. 35 సంవత్సరాల కాలంలో నగర జనసంఖ్య రెండింతలు అయింది. 1970 లో 6,50,000 మాత్రమే ఉన్న జనసంఖ్య 2005నాటికి 1.2 మిలియన్లు ఉంటుందని అంచనా. క్రమమైన జసంఖ్య అభివృద్ధి, భూమిని కలుపుతూ పోవడం (గణనీయంగా అభివృద్ధి చేయబడిన నగర వైశాల్యం)1990 అధికారిక గణాంకాలు శాన్ అంటోనియో నగరంలో జనసంఖ్యలో హిస్పానికన్లు 55.6%, నల్లవారు 7%, హిస్పానికన్లు కాని శ్వేత జాతీయులు 36.2% ఉన్నట్లు సూచిస్తుంది[18].

భౌగోళిక స్వరూపం

[మార్చు]

శాన్ అంటోనియో తన పక్కన ఉన్న నగరం రాష్ట్ర రాజధాని అయిన ఆస్టిన్ నైరుతి దిశగా 75 మైళ్ళ దూరంలో ఉంది. ఈ నగరం హ్యూస్టన్ నగరానికి 190 మైళ్ళ దూరంలో అలాగే డల్లాస్ నగరానికి దక్షిణంగా 250 మైళ్ళ దూరంలో ఉంది. 2000 నాటికి సంయుక్త రాష్ట్రాల గణాంకాలు అనుసరించి నగర వైశాల్యం 412.07 చదరపు మైళ్ళు (1,067.3 చదరపు కిలోమీటర్లు) ఉంటుందని అంచనా. ఇందులో 407.56 చదరపు మైళ్ళు (1,055.6 చదరపు కిలోమీటర్లు ) (98.9%) భూప్రాంతం, 4.51చదరపు మైళ్ళు (11.7 చదరపు కిలోమీటర్లు ) (1.1%) జలప్రాంతం. నగరం ఏటవాలు భూములలో ఉపస్థితమై ఉంది. శాన్ అంటోనియో నగరం సముద్ర మట్టానికి 772 అడుగుల ఎత్తులో ఉంది.

నగరానికి ప్రధాన నీటి వనరు ఎడ్వర్డ్ అక్వైర్. 1962-1969 ల మధ్య స్వాధీనపరచుకొనబడింది. వరుసగా విక్టర్ బ్రౌనింగ్ లేక్, కలావర్స్ లేక్ లు దేశంలోనే మొదటిసారిగా వృధాజలాన్ని ఉపయోగించి రీసైక్లింగ్ విధానాల ద్వారా విద్యుత్తు చ్చక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించడానికి నిర్మించబడ్డాయి. భూజలాలను విద్యుదుత్పత్తికి వాడడాన్ని తగ్గించడానికి ఈ విధానం అవలంబించబడింది.

వాతావరణం

[మార్చు]

శాన్ అంటోనియో ఆర్ద్ర ఉపఉష్ణమండల వాతావరణ మండలం పడమటి తీరంలో ఉంది. దీని వాతావరణంలో వాయుమండలాన్ని అనుసరించి పొడిగా, తేమ మారి మారి వస్తుంటాయి[19][20].[21] ఇక్కడి వేసవిలో ఉష్ణం, శీతాకాలంలోని చలి ఉత్తర మండలంలో వాతావరణం మారడానికి కారణం ఔతుంది. వసంతకాలం, హేమంతంలో సౌకర్యవంతమైన వెచ్చదనం, వర్షపాతం ఉంటుంది.

శాన్ అంటోనియో సుమారు ప్రతి సంవత్సరం 12 అర్ధ ఘనీభవ రాత్రులకు ఆతిథ్యం ఇస్తుంది. ప్రతిశీతాకాలంలో ఒక్క సారి హిమపాతం ఉంటుంది. అయినప్పటికీ కూడుకున్న మంచు సాధారణంగా ఉండదు. అనేక శీతాకాలాలు ఘనీభవ హిమపాతం లేకుండానే గడచి పోతుంటాయి. 122 సంవత్సరాల కాలంలో దాదాపు నాలు సంవత్సరాలకు ఒక సారి మాత్రమే 31 అంగుళాల హిమపాతం ఉన్నట్లు చెప్తున్నా ఈ హిమపాతాల మధ్య ఒక దశాబ్ధం కంటే అధికమైన కాలం గడచి పోతుంది. 1985 నగరంలో నమోదైన అధిక హిమపాతం 16 అంగుళాలు[22][23].

.

ఉత్తర అమెరికాలో అత్యంత వరద పీడిత ప్రదేశాలలో శాన్ అంటోనియో ఒకటి.[24] సంయుక్త రాష్ట్రాల చరిత్రలో 1998 అక్టోబరులో సంభవించిన టెక్సస్ వరద అత్యంత ఖరీదైదిగా భావించబడుతుంది. దీని ఫలితంగా 750 అమెరికన్ డాలర్ల నష్టం 32 మంది దుర్మణం పాలవడం వంటివి సంభవించాయి. 2002 లో జూన్30 నుండి జూలై 7 వరకు శాన్ అంటోనియో నగరంలో 35 అంగుళాల వర్షపాతం సంభవించింది. ఫలితంగా వరద విస్తరణ, 12 దురదృష్ట మరణాలు సంభవించాయి.[25]

2011 అక్టోబరులో నగర పరిమితులలో టొర్నాడో సంఘటనలు నమోదైనప్పటికీ అవి అరుదుగానే సంభవిస్తుంటాయి. ఎఫ్ 2 రక టొర్నాడోలు నగరానికి 50 మైళ్ళ పరిమితిలో సుమారు 5 సంవత్సరాలకు ఒక సారి మాత్రం సంభవిస్తుంటుంది. శాన్ అంటోనియో నగరానికి ఎఫ్ 4 రక టొర్నాడో అనుభమూ ఉంది. అందులో ఒకటి 1953 రెండవది 1973 లో సంభవించింది. 1953 టొర్నాడో సంఘటనలో ఇద్దరు మరణించారు. 15 గాయపడ్డారు.

శాన్ అంటోనియోలో జూలై, ఆగస్టు మాసాలలో అధిక ఉష్ణం ఉంటుంది. సరాసరి ఉష్ణోగ్రత 95° ఫారెన్ హీట్ (35°సెంటీ గ్రేడ్). ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 2000 సెప్టెంబరు 5న నమోదైన 111° ఫారెన్ హీట్ (44°సెంటీ గ్రేడ్) ల ఉష్ణోగ్రత[26]. సరాసరి అతిశీతల మాసం జనవరి. 1949 జనవరి 31న అతి తక్కువ ఉష్ణోగ్రతగా 0 °ఫారెన్ హీట్ (−18 °సెంటీ గ్రేడ్). మే, జూన్, అక్టోబరు లలో అతి స్వల్పంగా హిమపాతం ఉంటుంది.

జనభా

[మార్చు]

2010 గణాంకాలను అనుసరించి శాన్ అంటోనియో నగరంలోని జనసంఖ్య 1,327,407. 2000-2010 నుండి జభావృద్ధి శాతం 16.0% . 2010 యు.ఎస్ గణాంకాలను అనుసరించి జాతి వారిగా జనాభా వివరణ. క్రింద:

  • 72.6% శ్వేతజాతీయులు (హిస్పానిక్స్ కాని శ్వేతజాతీయులు: 26.6%)
  • 6.9% నల్ల జాతీయులు.
  • 0.9% స్థానిక అమెరికన్లు.
  • 2.4% ఆసియన్లు
  • 0.1% స్థానిక హవాలియన్ లేక పసిఫిక్ ద్వీప వాసులు
  • 3.4% రెండు లేక అధిక జాతికి చెందిన వారు
  • 13.7% ఇతరజాతులు
  • 63.2% హిస్పానిక్స్ లేక లాటిన్ వారు. (ఏజాతి వారైనా)

2010 యు.ఎస్ గణాంకాలను అనుసరించి సరైన జనసంఖ్య 1,144,646[27]. దేశంలో ఈ నగరం జనసంఖ్యలో 9వ స్థానంలో ఉంది. శాన్ అంటోనియో అల్ప జనసాంద్రత అలాగే గుర్తించ తగిన ప్రజలు మహానగర పరిమితికి వెలుపల నివసిస్తున్న కారణంగా మహానగర జనసంఖ్య యు.ఎస్ నగరాలలో 30వ స్థానంలో ఉంది.[28]

తరువాతి జనసంఖ్య గణాంకాలు నగరజనసంఖ్య అతివేగంగా అభివృద్ధ చెందుతున్నట్లు నమోదు చేసింది. 2010 నగ జనాభా 1,327,407. ఇది నగరాన్ని జనసంఖ్యలో సంయుక్త రాష్ట్ర నగరాలలో2వ స్థానానికి చేరుకునేలా చేసింది. 2011 యు.ఎస్ గణాంకాలు 8వ కౌంటీ అయిన శాన్ అంటోనియో-బ్రౌన్ ఫెల్స్ జనసంఖ్య 2,194,927 ఉంటుందని భావిస్తుంది. ఇది మహానగరా జనసంఖ్యని టెక్సస్ రాష్ట్రంలో అధిక జనసంఖ్య కలుగినదానిగా అలాగే యు.ఎస్ మహానగరాలలో 24వ స్థానంలో ఉండేలా చేసింది. మహానగర సరిహద్దులు ఆస్టిన్-రౌండ్ రాక్- శాన్ మార్కోస్ వరకు ఉన్నాయి.

శాన్ అంటోనియో నగరంలో 405,474 గృహాలు ఉన్నాయి. వీటిలో 280,993 కుటుంబాలు నివసితున్నాయి. ఒక చదరపు మైలుకు జనసాంద్రత 2,808.5. (1,084.4 చదరపు కిలోమీటర్). నగరంలో ఉన్న 433,122 నివాస గృహాలలో ఒక చదరపు మైలు సరాసరి గృహాలు 1,062.7. (410.3 చదరపు కిలోమీటర్).

నగరంలో 18 సంవత్సరాల లోపు వారు 28.5%, 19-24 వయసు కలిగిన వారు 18, 10.8%, 25-44 వయసు కలిగిన వారు 30.8%, 45 నుండి 64 వయసు కలిగిన వారు 19.4%. 65 పైబడిన వయసు కలిగిన వారు 10.4%. వివాహ వయసు 32 సంవత్సరాలు. శాన్ అంటోనియో నగరంలో పురుషుల శాతం 48% స్త్రీల శాతం 52% . స్త్రీ పురుష నిష్పత్తి 100:93.7, అలాగే 18 సంవత్సరాలు దాటిన స్త్రీపుష నిష్పత్తి 100:89.7.

నగరంలో కుటుంబ సరాసరి ఆదాయం $53,100 అమెరికన్ డాలర్లు. పురుషుల సరాసరి ఆదాయం $30,061 అమెరికన్ డాలర్లు. స్త్రీల సరాసరి ఆదాయం $24,444. సరాసరి తలసరి ఆదాయం $17,487 అమెరికన్ డాలర్లు. మొత్తం జనాభాలో 17.3% అలాగే కుటుంబాలలో 14.0% దారిద్యరేఖకు దిగువన ఉన్నారు. 18 సంవత్సరాల లోపు వారిలో 24.3% మంది, 65 పైబడిన వయసు కలిగిన వారిలో 13.5% మంది దారిద్యరేఖకు దిగువన ఉన్నారు[29].

2006-2008 యు.ఎస్ గణాంకాలను అనుసరించి జాతి వారిగా జనాభా వివరణ. క్రింద:

  • శ్వేతజాతీయులు: 68.9% (హిస్పానిక్స్ కాని శ్వేతజాతీయులు: 28.9%)
  • నల్ల జాతి ఆఫ్రికన్ అమెరికన్లు: 6.6%
  • అమెరుకన్ ఇండియన్లు: 0.6%
  • Asian: 2.0%
  • స్థానిక హవాలియన్ లేక పసిఫిక్ ద్వీప వాసులు : 0.1%
  • ఇతర జాతులు: 19.4%
  • రెండు లేక అధిక జాతులు: 2.4%
  • హిస్పానిక్స్ లేక లాటిన్ వారు (ఏజాతివారైనా) : 61.2%

ఆర్ధికం

[మార్చు]

శాన్ ఆంటోనియా నాలుగు ప్రధానాంశాలు కలిగిన వైవిధ్యత కలిగిన ఆర్థికరంగాన్ని కలిగి ఉంది. అవి వరుసగా ఆర్థిక సేవలు, ప్రభుత్వం, ఆరోగ్యసంరక్షణ, పర్యాటకం. నగరానికి నైరుతీ దిశలో డౌన్ టౌన్ కు 10 మైళ్ళ దూరంలో పలు ఆసుపత్రులను, క్లినిక్స్, పరిశోధన శాలలు, విద్యా సంస్థలు కలిగిన సౌత్ టెక్సస్ మెడికల్ సెంటర్ ఉంది.

సంయుక్త రాష్ట్రాలలో శాన్ ఆంటోనియా బృహత్తర సైనికస్థావరాలకు పుట్టిల్లు. శాన్ ఆంటోనియా రక్షణ పరిశ్రమ 89,000 మందికి ఉపాధి కల్పిస్తూ నగరానికి 5.25 బిలియన్ల ఆదాయాన్ని కలిగిస్తుంది.

ప్రతిసంవత్సరం శాన్ ఆంటోనియా నగరానికి దాని ఆకర్షణల కొరకు 20 మిలియన్ల పర్యాటకులు విచ్చేస్తున్నారు. పర్యాటకం నగరానికి తగినంత ఆదాయాన్ని ఇస్తుంది. ది హెన్రీ బి. గొంజాలెజ్ కన్వెన్షన్ సెంటర్ మాత్రమే సంవత్సరానికి 300 వేడుకలకు ఆతిథ్యం ఇస్తుంది. ఈ సమావేశాలకు సంవత్సరానికి 750,000 అంతర్జాతీయ ప్రతినిధులు హాజరు ఔతుంటారు.[30] పర్యాటకరంగం 94,000 మంది పౌరులకు ఉపాధి కల్పిస్తూ అలాగే నగరానికి 10.7 బిలియన్ల ఆదాయాన్ని కలిగిస్తుంది. ట్రినిటీ విశ్వవిద్యాలయం యొక్క పరిశోధక బృందం డాక్టర్ రిచర్డ్ బట్లర్, డా మేరీ స్టెఫీ కచ్చితమైన పర్యాటకరంగ ఆర్థిక అధ్యయనాన్ని విడుల చేస్తుంటారు . శాన్ ఆంటోనియా నగరానికి, ప్రభుత్వ సంస్థలకు హోటెల్, మోటెల్ ఇస్తున్న పన్నుల రూపంలో అలాగే సేవారంగ ఒప్పందాల ద్వారా తగినంత ఆదాయం కల్పిస్తుంది. 2004 నుండి క్రమంగా పన్నుల రూపంలో నగరానికి 160 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం కల్పిస్తుంది.

శాన్ ఆంటోనియాలో 140 ఫార్చ్యూన్ 500 సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలు కలిగి ఉన్నాయి. వలెరో ఎనర్జీ కార్పొరేషన్ 33, టెస్రో పెట్రోలియం కార్పొరేషన్ 317 అనే రెండు సంస్థకు శాన్ ఆంటోనియా నగరం స్వస్థలంగా ఉంది[31].

శాన్ ఆంటోనియా 5 ఫార్చ్యూన్ 500 సంస్థలకు, వలెరో ఎనర్జీ కార్పొరేషన్, టెస్రో, యు ఎ ఎ, క్లియర్ చానల్ కమ్యూనికేషన్స్, నస్టర్ ఎనర్జీ సంస్థలకు పుట్టిల్లు. సంయుక్త రాష్ట్రాలలో హెచ్-ఇ-బి సంస్థ పెద్ద ప్రైవేట్ సంస్థలలో 19వ స్థానంలో ఉంది. శాన్ ఆంటోనియాలో ఈ సంస్థ ప్రధానకార్యాలయం ఉంది. శాన్ ఆంటోనియా నగరంలో ప్రధాన కార్యాలయాలు ఉన్న ఇతర సంస్థలు కెనెటిక్ కాన్సెప్ట్స్, ఫ్రాస్ట్ నేషనల్ బ్యాంక్, హర్టే-హ్యాంక్స్, ఐకేర్ సెంటర్స్ ఆఫ్ అమెరికా, బిల్ మిల్లర్, బార్-బి-క్యూ ఎంటర్ ప్రైజెస్, టాకో కెనడా, వాటా బర్గర్, రాక్ స్పేస్, కార్నెట్ హెల్త్ కేర్ సర్వీసెస్.

శాన్ ఆంటోనియా నగరంలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్న ఇతర పెద్ద సంస్థలు నేషన్ వైడ్ ముచ్యుయల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఖోల్స్, ఆల్ స్టేట్స్, చేస్ బ్యాంక్, ఫిలిప్స్, వెల్స్ ఫార్గో, టయోటో, మెడ్రోనిక్, సిస్కో, కేటర్ పిల్లర్, ఐ ఎన్ సి, ఎటి&టి, వెస్ట్ కార్పొరేషన్, సిటీ గ్రూపు, బోయింగ్, క్యూ వి సి, లాక్ హీడ్ మార్టిన్.

1997 మార్చి 11 నుండి 1998 మధ్య కాలంలో శాన్ ఆంటోనియా పలు సంస్థల ప్రధాన కార్యాలయాలను కోల్పోయింది. 1997 టైటన్ హోల్డింగ్స్, యు ఎస్ ఎల్ డి కమ్యూనికేషన్స్ వారి నిర్వహణలను పెద్ద సంస్థలకు అమ్మి వేసాయి. లాస్ ఏంజిల్స్ కొనుగోలు ప్రత్యేక నిపుణులు బిల్డర్ల స్క్వేర్ ను కొనుగోలు చేసిన తరువాత ఈ సంస్థ శాన్ ఆంటోనియా విడిచి వెళ్ళింది.

ఆకర్షణలు

[మార్చు]

శాన్ ఆంటోనియా ప్రబల పర్యాటక కేంద్రం.[32] డౌన్‍టౌన్ ప్రాంతంగుండా మెలికలు తిరిగుతూ సాగే రివర్ వాక్ అనే పర్యాటాక కార్యక్రమం నగర ఆకర్షణలో ప్రబలమైనది. నగరంలో బృహత్తర భవన సముదాయలను పునరుద్ధరించిన నగరాలలో శాన్ ఆంటోనియా మొదటిది. రివర్ వాక్ లో అనేక షాపులు, బార్లు, భోజనశాలలు అలాగే ఆర్న్‍సన్ రివర్ దియేటర్ ఉన్నాయి. కొత్త సంవత్సరం, క్రిస్‍మస్ సందర్భంలో ఇక్కడ మనస్సును ప్రభావితం చేసేలా విదుద్దీపాలు, అలాగే వేసవిలో ప్రత్యేకంగా ఫెస్టా నోక్ డెల్ రియో ఉత్సవం సందర్భంలో గాలిలో వ్యాపించే ఫోల్క్‍ రోడ్, ఫామెన్‍కో జానపద నృత్యాల సంగీతం మరింత ప్రత్యేక ఆకర్షణ. టెక్సస్ లో ఉనికిలో ఉన్న విదేశీదేశ నేపథ్య చిత్రాలను ప్రదర్శిస్తున్న దియేటర్ రివర్ వాక్ తీరంలో కొత్తగా నిర్మించిన అజ్టెక్ మాత్రమే.

1893లో జరిగిన కొలంబియన్ ప్రదర్శన సందర్భంలో శాన్ ఆంటోనియా చేత పంపబడిన శాన్ ఆంటోనియా చిలీ స్టాండ్ దేశానికి ఎండు మిరపకాయలను పరిచయం చేసింది. అప్పటి నుండి ఎండు మిరపకాయలు దేశమంతా లభిస్తున్నాయి. శాన్ ఆంటోనియాలో ఫ్రిటో (మొక్కజొన్న చిప్స్), చీటోస్ (చీజ్ ఆధారిత చిరుతిండి), డేవీడ్ పీస్ యొక్క పీస్ పికంటే సాస్ లకు పుట్టిల్లు.

ఆల్మో ఉన్న డౌన్ టౌన్ టెక్సస్ అత్యున్నత పర్యాటక ఆకర్షణ. మిషన్ కారణంగా శాన్ ఆంటోనియాను తరచుగా అల్మో సిటీ (అల్మో నగరం ) అని పిలుస్తుంటారు. పర్యాటకులను అధికంకా అకర్షిస్తున్న రివర్ వాక్ రెండవ స్థానంలో ఉంది. డైన్ టౌన్ కు 16 మైళ్ళ (26 కిలోమీటర్లు) దూరంలో పడమర దిశలో వెస్టోవర్ డిస్ట్రిక్ లో ఉన్న సీ వరల్డ్ ఆకర్షణలలో మూడవ స్థానంలో ఉంది. సిక్స్ ఫ్లాగ్స్ ఫెస్టా టెక్సస్ కూడా ఆకర్షణలలో ఒకటి. పిల్ల ఉల్లాసానికి మొరాగన్ వండర్ లాండ్ థీంపార్క్ ఒక ఆకర్షణ.

డౌన్ టౌన్ ప్రాంతంలో కాథడ్రెల్ ఆఫ్ శాన్ ఫెర్నాండో, ది మెజెస్టిక్ దియేటర్, హెమిస్ ఫైర్ పార్క్ (ఇక్కడ టవర్ ఆఫ్ అమెరికన్స్, యు టి ఎస్ ఎ ఇశ్టిట్యూట్ ఆఫ్ టెక్సన్ కల్చర్స్ ఉన్నాయి), లా విల్లా, ఎల్ మెర్ కాడో, స్పానిష్ గవర్నర్స్ ప్లేస్, హిస్టారిక్ మేనేజర్ హోటెల్ ఉన్నాయి. ఆల్మో కాంప్లెక్స్ ఉత్తర దిశలో ఎమిలీ మొరాగన్ హోటెల్ పక్కన ఉన్న అశ్విక మ్యూజియం ఉంది.

1906 లో నిర్మించిన ఫెయిర్ మౌంట్ హోటెల్, శాన్ ఆంటోనియో లోని రెండవ పురాతన హోటెల్ అన్న గుర్తింపు కలిగి ఉడడమే కాక గిన్ని బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా పేరు తెచ్చుకుంది. 1985లో ఈ భవనాన్ని మొత్తంగా కదిలించి ఆల్మోకు మూడు బ్లాక్స్ దూరంలో తిరిగి స్థాపించబడింది. ఇలా తరలించడానికి 650,000 అమెరికన్ డాలర్లు ఖర్చు చేయబడింది. కదిలించి తరలించబడిన అతి పెద్ద భవనాలలో ఇది మొదటిది.

టెక్సస్ లోనే ఆధునిక కళాప్రదర్శన కలిగిన మొదటి నగరం అన్న ఘనత శాన్ ఆంటానియోకు ఉంది. ఇతర ఆసక్తి కరమైన ప్రదేశాలు ది సౌత్ వెస్ట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, వుడ్ లాన్ థియేటర్, శాన్ ఆంటోనియో జూ, జపనీస్ టీ గార్డెన్స్, కుమామోటో, బ్రేకెన్ రిడ్జ్ పార్క్, శాన్ ఆంటోనియో మిషన్స్ నేషనల్ హిస్టారికల్ పార్క్ లక్ష్యాల్లో, మ్యూసెయో అలమేడా, ఆర్ట్ శాన్ ఆంటోనియో మ్యూజియం, విట్టే మ్యూజియం, టెక్సాస్ రేంజర్స్ మ్యూజియం, బక్‍హార్మ్ మ్యూజియం, ఆర్ట్‍ప్లేస్, బ్లూ స్టార్ కాంటెంపరరీ ఆర్ట్ సెంటర్, సీ వరల్డ్ శాన్ ఆంటోనియో, సిక్స్ ఫ్లాగ్స్ ఫియస్టా టెక్సస్, టెక్సాస్ రవాణా మ్యూజియం, స్పాల్ష్ టౌన్ శాన్ ఆంటోనియో. పర్య్టకులు సంవత్సరం పూర్తిగా కౌ బాయ్ అభుభూతిని పొందవచ్చు, నార్త్ మాల్ స్టాల్ వద్ద 40 అడుగుల కౌ బాయ్ షూలను కూడా చూడ వచ్చు.

శాన్ ఆంటోనియో ప్రదేశాల సందర్శన, శబ్దాలు వినడం నేపథ్యంలో పర్యాటకులు ప్రపంచ ప్రసిద్ధమైన టెక్-మెక్స్ పాకాలను నగరమంతా విస్తరించి ఉన్న ఆహారశాలలో రుచి చూడ వచ్చు. వాస్తవంగా నగరమంతా మెక్సికన్ రెస్టారెంట్లు విస్తారంగా నగరమంతా అందుబాటులో ఉన్నాయి అయినప్పటికీ వాటిలో అనేకం విలాసవంతమైనవి ఖరీదైనవి. ఉదాహరణగా జకాలాతో చేర్చి టెక్-మెక్స్ ఆహారశాల, నైరుతిలో ఉన్న వెస్ట్ అవెన్యూ, ఈశాన్యంలో ఉన్న లా హసీండా డి లాస్ బారియోస్ , డౌన్ టౌన్ వద్ద ఉన్న టామీస్ ఆన్ నైట్స్ , నగరానికి ఉత్తరంలో ఉన్న లాస్ బారియోస్ వాటిలో కొన్ని.

ప్రభుత్వం

[మార్చు]

శాన్ ఆంటోనియా నగరం కౌంసిల్-మేనేజర్ ప్రభుత్వ విధానంలో నిర్వహించబడుతుంది. నగరం పాలనా పరంగా సమాన జనసంఖ్య కలిగిన 10 డిస్ట్రిక్ విభాగాలుగా విభజించబడింది. ప్రతి ఒక్క డిస్ట్రిక్ ఒక ప్రతినిధిని ఎన్నుకొని తమ ప్రతినిధిగా కౌంసిల్‍కు పంపుతుంది. నగర ప్రజలంతా కలసి మేయర్‍ను ఎన్నుకుంటారు. మేయర్‍తో చేరి కౌన్సిల్స్ ప్రతినిధులందరూ అందరూ రెండు సంవత్సరాల కాలం పదవిలో కొనసాగుతారు. అయితే వారు నాలుగు మార్లు మాత్రమే ఈ పదవులకు పోటీ చేయగలుగుతారు. హ్యూస్టన్, లారెడో నగరాలు కూడా శాన్ ఆంటోనియా ఉన్న కాలపరిమితిని అనుసరిస్తారు. అన్ని పదవులు టెక్సస్ లా అనుసరించి నిష్పక్షపాత బ్యాలెట్ ఆధారంగా ఎన్నుకొనబడతారు. కౌంసిల్ మెంబర్లకు ఒక మీటింగుకు $45,722 అమెరికన్ డాలర్లు వేతనంగా చెల్లించబడుతుంది. మేయర్ ఒక సంవత్సరానికి $61,725 అమెరికన్ డాలర్లను వేతనంగా అందుకుంటాడు. కౌన్సిల్ మెంబర్లు అందరూ ఇతర ఆదాయం కొరకు పూర్తికాల ఉద్యోగాలను వెతుక్కుంటారు[33]. ప్రస్తుత మేయర్ జూలియన్ కాస్ట్రో.

కౌన్సిల్ దైనిందిక నిర్వహణ కొరకు సిటీ మేజరును నియమిస్తారు. కౌన్సిల్ నగర పాలక మడలంగా శక్తివంగా వ్యవహరిస్తారు. కౌన్సిల్ పాలనామండిలి ఆధ్వర్యంఅలో సిటీ మేనేజర్ ప్రధాన నిర్వహణాధికారిగా దైనిందిక నగర నిర్వహణకు బాధ్యత వహిస్తాడు. ప్రస్తుత సిటీ మేనేజర్ షెర్లీ స్కల్లీ.

  • నగరం తన స్వంత విద్యుత్, గ్యాస్ వినియోగ సేవలు.సి పి ఎస్ ఎనర్జీ.

అభివృద్ధి విధానాలు

[మార్చు]

మిగిలిన యు.ఎస్ నగరాల మాదిరిగా శాన్ ఆంటోనియా చుట్టూ శివార్లలో పూర్తిగా స్వతంత్ర నగరాలు లేవు. టెక్సస్ అనుసరించి శాన్ ఆంటోనియా న్యాయ పరిధిలో పరిపాలిత పరిధిలో లేని అధిక ప్రాంతం చేరి ఉంటుంది. ప్రధాన రహదారులతో చేర్చి ప్లాట్ చేయడం ఉప విభాగాలుగా చేయడం వంటివి చేయడం చట్టాన్ని అమలు చేయడం వటివి వీటిలో కొన్ని. ఇది ఉగ్రమైన సరిహద్దు విధానాలను అలాగే తన న్యాయ పరిమిత భూమిలో ఇతర నగపాలితాలు ఏర్పడ కుండా నిరోధించడం వంటి విధానాలను అనుసరిస్తుంది. నగరంలో నాల్గింట మూడు వంతుల భూమి 1960 నుండి నగరంతో అనుసంధానించబడి ఉంది[34].

2000 నాటికి నగరం ప్రధాన రహదారుల వెంట పలు ఇరుకైన కారిడార్లను కలిగిఉంది. వెలుపలి వైపు ఉన్న భూలు రహదార్ల నిరంతర అభివృద్ధికి బాగా ఉపకరిస్తుంది. 2009 నాటికి నగర నిర్వాహం అదనంగా దాదాపు 40 చదరపు మైళ్ళ ప్రాంతాన్ని నగరంతో కలపాలని ప్రణాళిక వేస్తుంది. 2010 మే 1 న శాన్ ఆంటోనియా తన న్యాయ పరిమితిలో 10వ ఇంటర్ స్టేట్ వెంట ఉన్న వేల ఎకరాల భూమిని విడుల చేయడానికి తమ అంగీకారాన్ని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా శాన్ ఆంటోనియా నగరం 3,486 ఎకరాల (14.11 చదరపు కిలోమీటర్లు) భూమిని విడుదల చేసింది. అసంకల్పితంగా కలపడం వలన నగరంతో కలపబడని బెక్సర్ కౌంటీకి కలిగిన అసౌకర్యం కారణంగా అభిప్రాయబేధాలు కలగడానికి కారణం అయింది.[35] తక్కువ పన్నులు, అందుబాటులో ఉన్న భూమి వెలల కారణంగా నగర వెలుపలి ప్రాంతాలు నగర నివాసులను ఆకర్షిస్తున్నాయి. ఆస్తిపన్నులను అధికరించడం కొరకు భూమిని అనుసంధించడం యాంత్రికంగా జరుగుతుంటుంది. పోలీస్, అగ్నిమాపక సేవల వంటి అభివృద్ధి పధకాలు అమలు పరచని ఈ అనుసంధాన విధానం నగర శ్రేయస్సుకు అవసరమైదని భావించబడుతుంది.

ప్రయాణ వసతులు

[మార్చు]

శాన్ అంటోనియా ఎగువ టౌన్ లో ఉన్న " ది శాన్ అంటోనియా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్" సుమారుగా శాన్ అంటోనియా డౌన్ టౌన్ కు 8 మైళ్ళ దూరంలో ఉంది. ఈ విమానాశ్రయానికి రెండు టెర్మినల్స్ ఉన్నాయి. ఇది 21 ఎయిర్ లైంస్ కు, ప్రయాణీకులను 44 గమ్యస్థానాలకు చేర్చి సేవలు అందిస్తుంది[36]. మెక్సికోకు ఇక్కడనుండి విమానసర్వీసులు ఉన్నాయి. సౌత్ డౌన్ టౌన్ కు సుమారు 6 మైళ్ళ దూరంలో ఉన్న స్టింసన్ ముంసిపల్ ఎయిర్ పోర్ట్ రిలీవర్ విమానాశ్రయంగా సేవలు అందిస్తుంది. రెండు రంవేలు కలిగిన ఈ విమానశ్రయంలో " టెక్సాస్ ఎయిర్ మ్యూజియం ఉంది " ఉంది.

మాస్ ట్రాంసిస్ట్

[మార్చు]

శాన్ అంటోనియా మెట్రోపాలిటన్ అధారిటీ నగరానికి బస్సు, రబ్బర్ టైర్ స్టీర్ కార్ వ్యవస్థను అందిస్తుంది. వి.ఐ.ఎ మెట్రోపాలిటన్ ట్రాంసిస్ట్ మాసంతటికీ ప్రయాణించతగిన పాసులను అతి చవక ధరకు అందిస్తున్నది. యు.ఎస్.ఎ లోనే అందుబాటు ధరలో ప్రయాణ వసతులు కలిగిస్తున్న అతిపెద్ద ట్రాంసిస్ట్ గా వి ఐ ఏకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2010 ఆగస్టు వి ఐ ఏ మెట్రో పాలిటన్ ట్రాంసిస్ట్ తరువాత ప్రణాళికగా డీసిల్ - ఎలెక్ట్రిక్ హైబ్రీడ్ టెక్నాలజీ బసులను విడుదల చేయసంకల్పించింది.

నగరమంతా వి ఐ ఏ మార్గాలలో ఈ తరహా 30 హైబ్రీడ్ బసులను నడిపించి తమ సేవలను మెరుగు పరచాలని వి ఐ ఏ సంస్థ భావిస్తుంది. వి ఐ ఏ సంస్థ 2010లో ఈ హైబ్రీడ్ బసులు సహజ వాయు సాయంతో నడిచే వాహనాలను పరిచయం చేసి మార్గదర్శకం చేసింది. 2010 ఫాల్ సీజన్లో ఆన్-బోర్డ్ బ్యాటరీల ద్వారా విద్యుత్ఛక్తిని తీసుకునే 3 బసులను డెలివరీ తీసుకునే ఏర్పాటు జరిగిది. ఈ బసులు డౌన్ టౌన్ కోర్ ప్రాంతంలో నడపడానికి ప్రణాళిక వేయబడింది[37].

వి ఐ ఎ సంస్థకు సాధారణ బసు మార్గాలు 84, డౌన్ స్టీర్ కార్ మార్హాలు 3 ఉన్నాయి. వి ఐ ఎ డైన్ టౌన్ నుండి పార్క వరకు, దక్షిణ ప్రాంతాలకు, పడమర, వాయవ్య, ఉత్తర మధ్య, ఆగ్నేయ ప్రాంతాలకు ఎక్స్‍ప్రెస్ సర్వీసులను నడుపుతుంది. నగరంలో పర్యాటక ఆకర్షణ లైన యు.టీ ఎస్ ఎ, సిక్స్ ఫ్లాగ్స్ ఫియస్టా టెక్సస్, సీ వరల్డ్ వరకు బసు సౌకర్యం కల్పిస్తుంది. వి ఐ ఏ ప్రత్యేక ఉత్సవాలైన స్పర్స్ గేంస్ సిటీ ఫేరడైస్ వటి ఉత్సవాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. అమెరికాలో లోకల్ ట్రాంసిస్ట్ మార్గాలలో పొడవైన వాటిలో ఒకటైన క్లాక్‍వైజ్ 550, కౌంటర్‍సెల్ క్లాక్‍వైజ్ 551 మార్గాలలో నగరమంటినీ కలిపే 48 మైళ్ళ పొడవైన మార్గం కలిగి ఉంది.[38]

యు.ఎస్ లో నగరాంతర రైల్ సౌకర్యం లేని పొడవైన నగరంగా శాన్ అంటానియా అయింది. 2008 లో రైలు మార్గం నిర్మించే వరకూ ఈ ప్రత్యేకత ఫీనిక్స్నగరానికి ఉండేది. వి ఐ ఎ నగరాన్ని ఆస్టిన్ నగరంతో అనుసంధానిస్తూ వి ఐ ఏ ప్రిమో పేరిట బసు రాపిడ్ ట్రాంసిస్ట్ లైన్ నిర్మాణానికి సన్నాహాలు చేసింది.

ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "GOVERNMENT Links on the San Antonio Community Portal". Sanantonio.gov. Retrieved 2010-06-30.
  2. Bureau, U. S. Census. "American FactFinder - Community Facts". factfinder.census.gov (in ఇంగ్లీష్). Archived from the original on 2017-09-14. Retrieved 2019-06-13.
  3. "San Fernando de Bexar Archived 2019-09-04 at the Wayback Machine". Chabot, Frederick Charles. Texas State Historical Association. Uploaded 15 June 2010. Retrieved 17 September 2017.
  4. "The First Civil Settlement in Texas Archived 2019-07-09 at the Wayback Machine". Guerra, Mary Ann Noonan. Excerpted from The San Antonio River (The Alamo Press, San Antonio: 1987). Retrieved 17 September 2017.
  5. 300, San Antonio. "SA300 Tricentennial - Celebrating San Antonio for 300 Years". sanantonio300.org (in ఇంగ్లీష్). Archived from the original on 2019-07-11. Retrieved 2019-07-11. {{cite web}}: |last= has numeric name (help)
  6. Bureau, U.S. Census. "American FactFinder - Results". factfinder.census.gov (in ఇంగ్లీష్). Archived from the original on 2016-10-19. Retrieved 2018-07-09.
  7. 7.0 7.1 "San Antonio: The City of St. Anthony". St. Anthony Messenger Magazine Online. Americancatholic.org. June 2004. Retrieved June 30, 2010.
  8. Mach, Andrew (July 5, 2015). "San Antonio Missions among new UNESCO World Heritage Sites". PBS. Retrieved October 29, 2016.
  9. [1] Spanish Texas, Texas State Historical Society: The Handbook of Texas Online
  10. [2] Archived 2019-09-04 at the Wayback Machine Martin de Alarcon, Texas State Historical Society: The Handbook of Texas Online
  11. 11.0 11.1 [3] Archived 2019-09-04 at the Wayback Machine The Canary Islanders, Texas State Historical Society: The Handbook of Texas Online
  12. 12.0 12.1 John H. Jenkins, ed., Papers of the Texas Revolution (10 vols.; Austin: Presidial Press, 973), p. 13
  13. Gonzalez, Juan. Harvest of Empire. Penguin, 2000.
  14. Fisher, Lewis F. (1996). Saving San Antonio: the precarious preservation of a heritage. Lubbock: Texas Tech University Press.
  15. A Journey Through Texas, by Frederick Olmsted ISBN 978-1-144-80380-1
  16. Frederick Law Olmsted, A Journey through Texas; or, A Saddle-trip on the South-western Frontier: with a statistical appendix (1859), on-line text at Internet Archive
  17. Saving San Antonio by Lewis F. Fisher ISBN 978-0-89672-372-6
  18. "Texas – Race and Hispanic Origin for Selected Cities and Other Places: Earliest Census to 1990". U.S. Census Bureau. Archived from the original on 2012-08-12. Retrieved 2019-10-02.
  19. "The Roles of Geography and Climate in Forecasting Weather in South Texas". Theweatherprediction.com. Retrieved March 6, 2013.
  20. [4] Archived డిసెంబరు 12, 2011 at the Wayback Machine
  21. "Climatemapusa2.PNG file- Wikimedia Commons". Commons.wikimedia.org. Retrieved March 6, 2013.
  22. "San Antonio Suffers Worst Snowfall". Schenectady, New York: Schenectady Gazette, via Google News. United Press International. January 12, 1985.
  23. "Record Snow Buries San Antonio". Associated Press. The Philadelphia Inquirer. p. A3.
  24. "San Antonio, Texas "One of the most flood-prone regions in North America"". Archived from the original on 2013-07-03. Retrieved 2019-10-02.
  25. "San Antonio Bexar County Texas Tornado History and Damage Risk Grade".
  26. "San Antonio Climate Summary" (PDF). National Weather Service. Retrieved August 19, 2010.
  27. Census 2000: Incorporated Places of 100,000 or More, Ranked by Population, U.S. Census Bureau.
  28. "San Antonio (city), Texas". State & County QuickFacts. U.S. Census Bureau. Retrieved August 5, 2017.
  29. American FactFinder, United States Census Bureau. "San Antonio city, Texas - ACS Demographic and Housing Estimates: 2006–2008". Factfinder.census.gov. Archived from the original on 2020-02-11. Retrieved June 30, 2010.
  30. "The Economic Impact of San Antonio's Hospitality Industry" (PDF). Sanantoniotourism.com. Archived from the original (PDF) on అక్టోబరు 11, 2017. Retrieved జూలై 12, 2018.
  31. Nowlin, Sanford. "Aquila bids for sale or merger." San Antonio Express-News. March 11, 1998. Business 1E. Published in: Polishuk, Paul. Utilities Telecommunications News. Information Gatekeepers Inc. 8-9. Retrieved from Google Books on July 21, 2010. ISSN 1079-2937.
  32. Popik, Barry (December 20, 2007). "Alamo City (San Antonio Nickname)". The Big Apple.
  33. [5] Archived జూన్ 14, 2017 at the Wayback Machine
  34. San Antonio Trends, Challenges, and Opportunities (PowerPoint), City of San Antonio Planning Department. Retrieved January 7, 2007.
  35. "San Antonio agrees to release ETJ to Schertz". Mysanantonio.com. May 6, 2010. Retrieved July 12, 2018.
  36. "Calendar Year 2014 Passenger Boardings at Commercial Service Airports" (PDF). Federal Aviation Administration. p. 1. Retrieved November 19, 2015.
  37. [6];
  38. "VIA Metropolitan Transit". Viainfo.net. Archived from the original on 2019-10-21. Retrieved 2019-10-02.

వెలుపలి లింకులు

[మార్చు]