Jump to content

ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్

వికీపీడియా నుండి

ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ అనేది ఆస్ట్రేలియా క్రికెట్ సంస్ధ. ఆస్ట్రేలియా ప్రొఫెషనల్ ఫస్ట్-క్లాస్ క్రికెటర్లకు ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది.[1] ఇది అధికారికంగా నమోదు చేయబడిన ట్రేడ్ యూనియన్ కాదు, కానీ ఒక ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్.

ప్రస్తుత పరిపాలన

[మార్చు]

షేన్ వాట్సన్ దీనికి ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నాడు. ఛైర్మన్ గ్రెగ్ డయ్యర్ గా, డైరెక్టర్ల బోర్డులో మిగిలిన సభ్యులుగా అలిస్సా హీలీ, క్లీ స్మిత్, క్రిస్టెన్ బీమ్స్, ఆరోన్ ఫించ్, మోయిసెస్ హెన్రిక్స్, లిసా స్తాలేకర్, జానెట్ టోర్నీ, పాట్ కమ్మిన్స్ ఉన్నారు.[2]

చరిత్ర

[మార్చు]

2022లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, సిఏ మధ్య జరిగిన అవగాహన లేదా ఒప్పందం కారణంగా ఈ సంస్థ క్రికెట్ ఆస్ట్రేలియా పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీని ద్వారా మాజీ ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఐపిఎల్ జీతం నుండి సిఏకి 10% చెల్లిస్తారు. సిఏ, ఐపిఎల్ కాంట్రాక్టులపై సంతకం చేయకుండా తమ ఆటగాళ్లు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాల్ మార్ష్ తెలిపాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "About Us | Australian Cricketers' Association". auscricket.com.au. Retrieved 2021-04-12.
  2. "Board of Directors | Australian Cricketers' Association". auscricket.com.au. Retrieved 2021-04-12.
  3. "Australia stars in contract dispute after Cricket Australia makes IPL cash grab". Fox Sports. 7 September 2010. Retrieved 14 April 2023.

బాహ్య లింకులు

[మార్చు]