ఇంకుడుగుంతలు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
గత కాలంలో భూగర్భ జలాలు అతి తక్కువ లోతులోనే లభ్యమయ్యేవి. వర్షాభావం వల్ల, అధికంగా భూగర్భ జలాలను వాడుకోవడం వలన భూగర్భ జల మట్టం రానురాను క్రిందికి పోతున్నది. పాతాళ జలం ప్రమాదకరస్థాయికి పడిపోయింది. వెయ్యి అడుగుల లోతున తవ్వితే కానీ బోర్లలో నీటి చుక్క జాడ కనిపించట్లేదు. 300-400 అడుగుల కన్నా లోతు నుంచి వచ్చే నీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే భారలోహాలు, రసాయనాలు ఉంటాయి. అవి తాగడానికి పనికిరావని నిపుణులు చెబుతున్నారు. దీని వలన పర్యావరణంలో మార్పులు చాల త్వరగా వచ్చే అవకాశమున్నది. ఈ భూగర్భ జల మట్టం ప్రమాద స్థాయికి చేరక ముందే మేల్కొని భూగార్భ జల మట్టాన్ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇందుకు ఇంకుడు గుంటలు ఒక మార్గం. ఈ కార్యక్రమాన్ని వ్వక్తి గతంగానే కాకుండా సామాజిక పరంగా కూడా భారీ ఎత్తున చేపట్ట గలిగితే సరైన ప్రతి ఫలము పొందగలరు.
ఇంకుడు గుంటలను నిర్మించడం ఎలా?
[మార్చు]ప్రధానంగా బోరు బావుల సమీపంలో ఈ ఇంకుడు గుంటలు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం కూడా సంకల్పించింది. ప్రతి బోరు బావి వద్ద సుమారు రెండు మీటర్లు పొడవు, ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు లోతు గల గుంటలను త్రవ్వాలి. ఆ గుంటలో పావు భాగము పెద్ద బండ రాళ్ళతో నింపాలి, ఆ తర్వాత రెండు పావు భాగాలు పెద్ద కంకరతో నింపాలి. గుంట లోపల కొంత భాగం ఖాళీగా వుంచి పైన మూత ఏర్పాటు చేయాలి. ఆ చుట్టు ప్రక్కల పడిన వర్షపు నీరు ఆ ఇంకుడు గుంట ల్లోకి చేరు విధంగా కాలువ/ పైపుల ద్వారా వచ్చే ఏర్పాటు చేయాలి. ఈ ఇంకుడు గుంటలు నేల స్వభావాన్ని బట్టి, పరిసరాలను బట్టి, నీటి లభ్యతను బట్టీ గుంటల పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లోను, పొలాల్లోనూ చాల పెద్ద ఇంకుడు గుంటలు నిర్మించవచ్చు. ఇలాంటి పెద్ద గుంట లకు పైన, కప్పు అవసరముండదు.
ఉపయోగములు
[మార్చు]వర్షపునీటిని వృధాగా పోనీయకుండా ఎక్కడికక్కడ ఆ జలాలను ఇంకుడు గుంటల లోనికి చేర్చగలిగితే భూగర్భ జల మట్టం పెరగడానికి ఎంతగానో దోహదపడతాయి. ఆరుబయట, ఇళ్ల ప్రహరీ లోపల, బోర్ల చుట్టు పక్కల ఇంకుడు గుంటల నిర్మాణం చేపడితే భూగర్భ జలం పెరుగుతుంది. ఏటేటా తగ్గిపోతున్న భూగర్భ జలమట్టం వృద్ధికి ఇంకుడు గుంటలే శరణ్యం. వీటి నిర్మాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. వీటిని నిర్మించి వృథా నీటిని వాటిలోకి పంపించడం ద్వారా ఆ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెంపొందించుకోవచ్చు. ఇంకుడు గుంటలు నిర్మించినందున ఆ చుట్టు ప్రక్కల పడిన వృధాగా పోయే వర్షపు నీరు ఆ గుంటలో చేరి భూగర్భ జల మట్టము పెరిగి ఇదివరకు ఎండిపోయిన గొట్టపు బావులు తిరిగి జలసిరితో నిండిన సందర్బాలు అనేకం ఉన్నాయి.
ఇంకుడు గుంటలు ఎక్కడ నిర్మించాలి
[మార్చు]ఇంకుడు గుంటలు పలాని చోట నిర్మించాలని ఏమి లేదు తమకు అనుకూలమైన ప్రతి చోట వాటిని నిర్మించుకోవచ్చు.
- ఇండ్లల్లో
- ముఖ్యంగా నగరాలలో అంతటా కాంక్రీటు మయం అయినందున, ఇండ్లు, రోడ్లు, మొదలైనవన్నీ కాంక్రీటు మయం. కనుక వర్షపు నీరు భూమిలోనికి ఇంకే అవకాశమేలేదు. నగరంలోని ప్రతి గృహస్థుడు తన ఇంటి ఆవరణంలో ఇంకుడు గుంటలను నిర్మించి తమ ఇంటి డాబా మీద పడిన వర్షపు నీటిని ఈ ఇంకుడు గుంటల లోనికి వెళ్ళేటట్లు మార్గాలను ఏర్పరచాలి. ఇంటి ఆవరణంలో బోరు బావి వుంటే దానికి అతి దగ్గరగా ఈ గుంటను ఏర్పా టు చేస్తే బోరు బావి ఎన్నటికి ఎండదు.
- పార్కులలో
- పార్కులు, ఇతర ఇతర విశాలమైన ఆవరణముగల ప్రదేశాలలో ఒక మూలగా పెద్ద ఇంకుడు గుంటను ఏర్పాటు చేయాలి, ఆ ప్రదేశంలో పడిని వర్షపు నీటిని ఆ గుంట ల్లోకి ప్రవహించే ఏర్పాటు చేసుకోవాలి.
- రోడ్ల ప్రక్కన
- రోడ్ల ప్రక్కన కూడా పెద్ద ఇంకుడు గుంటలను ఏర్పాటు చేసుకోవచ్చు.
- పొలాల్లో
- పలలెల్లోని పొలాలలో పెద్ద ఇంకుడు గుంటలను ఏర్పాటు చేయాలి. అందులో చేరిన నీటిని వర్షాకాలమంతా ఇతర వ్యవసాయ పనులకు వాడుకోవచ్చు. అంతే గాగ ఆ గుంట లో నీరు ఇంకి భూగర్భ జల మట్టము పెరుగు తుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]http://www.indg.in/india/rural-energy/technologies-under-rural-energy/c07c02c27c28-c35c28c30c41c32c28c41-c38c2ec30c4dc27c35c02c24-c09c2ac2fc4bc17c3fc02c1ac47-c38c3ec02c15c47c24c3fc15/[permanent dead link] http://namasthetelangaana.com/districts/RangaReddy/ZoneNews.asp?category=24&subCategory=8&ContentId=127419 Archived 2016-03-05 at the Wayback Machine