ఇంక్స్కేప్
Appearance
(ఇంక్స్కేప్ నుండి దారిమార్పు చెందింది)
ఇంక్స్కేప్ | |
---|---|
ఇంక్స్కేప్ 0.91 | |
అభివృద్ధిచేసినవారు | ఇంక్స్కేప్ జట్టు |
సరికొత్త విడుదల | 0.91[1] / జనవరి 28, 2015 |
ప్రోగ్రామింగ్ భాష | C++ (using gtkmm) |
నిర్వహణ వ్యవస్థ | మైక్రోసాఫ్ట్ విండోస్, మ్యాక్ OS X , యునిక్స్-వంటి |
వేదిక | GTK+ |
భాషల లభ్యత | 40 భాషలు |
రకము | సదిశా రేఖాచిత్రాల కూర్పకం |
లైసెన్సు | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ |
ఇంక్స్కేప్ (లేదా ఇఙ్క్స్కేప్) ఎస్వీజీ బొమ్మలు తయారు చేసుకునేందుకు, వాటిని సరిదిద్దేందుకు ఉపయోగపడే స్వేచ్ఛా, బహిరంగాకర ఉపకరణం. ఈ ఉపకరణమును వాడి చేసిన బొమ్మలు పరిమాణానికి సంబంధం లేకుండా పెద్దగా చేసినా చిన్నగా చేసినా ఒకేలా, మసక అవకుండా కనిపిస్తాయి. ఇంక్స్కేప్ యూనిక్స్ వంటి నిర్వాహక వ్యవస్థల లోనూ, మైక్రోసాఫ్ట్ విండోస్ లోనూ, మాక్ ఓఎస్ Xలోనూ నడుస్తుంది.
ఎగుమతి/దిగుమతి
[మార్చు]ఇంక్స్కేప్ ఈ కింద తెలిపిన విధములలో బొమ్మలను దిగుమతి చేసుకోగలదు :
- ఎస్వీజీ
- ఎస్వీజీ (జెడ్)
- పీడీఎఫ్
- ఏఐ
- దాదాపు రేస్టర్ శైలి బొమ్మలన్నీ (జేపీజీ, పీఎన్జీ, గిఫ్ మొ॥)
కొన్ని పొడిగింతలు వాడి ఇంక్స్కేప్ ఈ కింది బొమ్మ శైలిలను దిగుమతి చేసుకోగలదు :
- పీఎస్ (ఘోష్ట్స్క్రిప్ట్ వాడి)
- ఈపీఎస్
- డయా
- ఎక్స్ఫిగ్
- స్కెచ్
- కోరెల్డ్రా (యూనికన్వర్టర్ వాడి)
- సీజీఎం
- ఎస్కేవన్
ఇంక్స్కేప్ ఈ శైలులలో బొమ్మలను ఎగుమతి చేయగలదు:
- ఎస్వీజీ
- ఎస్వీజీ (జెడ్)
- పీడీఎఫ్
- పీఎస్
- ఈపీఎస్
- ఈపీఎస్ఐ
- ఏఐ
- టెక్ (లేటెక్)
- పీఓవీ
- హెచ్పీజీఎల్
బయటి లంకెలు
[మార్చు]