గిఫ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Graphics Interchange Format (గ్రాఫిక్ ఇంటర్చేంజ్ సంప్రకారం)
తెరపట్టు

Rotating earth (large).gif

పేరు Graphics Interchange Format (గ్రాఫిక్ ఇంటర్చేంజ్ సంప్రకారం)
పొడిగింపు .gif
అంతర్జాలమాధ్యమ రకం image/gif
మ్యాజిక్ GIF87a/GIF89a
యజమాని కంప్యూసర్వ్

గిఫ్ అన్నది ఆంగ్ల G,I,F పొడి అక్షరాల ద్వారా వచ్చిన పదం. Graphics Interchange Format కు సంక్షిప్త రూపం. గిఫ్ అనేది చిత్రాలకు సంబంధించిన ఒక సంప్రకారం. CompuServe ద్వారా 1987 లో క బిట్మ్యాప్ చిత్ర సంప్రకారం గా ఆవిష్కరించబడింది. ఈనాడు ఒక చలనం లో గల స్థిర చిత్రాన్ని చూపేందుకు ఇదే సంప్రకారాన్ని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నాము. ఈ సంప్రకారం లో ఒక్కో చిణువు(pixel) లో 8 బిట్లు అమర్చుకునే సౌలభ్యం ఉండటంవల్ల, 256 వేరు వేరు రంగుల్లో మనం చిత్రాన్ని చూపవచ్చు. RGB రంగు స్థానలను వాడి ఈ రంగులను కోడీకరిన్చవచ్చు.తక్కువ రంగులు ఉండటం కారణంగా ఈ సంప్రకారాన్ని కొద్దిపాటి చిత్రాలు, ముద్రిక, గ్రాఫిక్ చిత్రాలు వంటివి చెయ్యటానికి అనువుగా ఉంటుంది. పేటెంట్ హక్కుల వివాదాల వల్ల ఈ సంప్రకారం, PNG అనే కొత్త సంప్రకారానికి దారి తీసింది.

చరిత్ర[మార్చు]

1987 లో కంప్యూసర్వ్ సంస్థ గిఫ్ ఫార్మటు ను ప్రవేశపెట్టింది. వాళ్ళ కంపెనీ వెబ్సైటు లో ఉండే దిగుమతి లంకెల కొరకు పూర్వం ఉండే RLE ఫార్మటు కు బదులుగా దీన్ని ప్రవేశపెట్టారు. దీనికి కారణం RLE ఫార్మటు కేవలం నలుపు మరియు తెలుపు రంగులను వినియోగించడమే.

"https://te.wikipedia.org/w/index.php?title=గిఫ్&oldid=2027059" నుండి వెలికితీశారు