Jump to content

ఇంజనీర్ రషీద్

వికీపీడియా నుండి
షేక్ అబ్దుల్ రషీద్
ఇంజనీర్ రషీద్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు మహ్మద్ అక్బర్ లోన్
నియోజకవర్గం బారాముల్లా

ఎమ్మెల్యే
పదవీ కాలం
25 డిసెంబర్ 2008 – 12 నవంబర్ 2018
ముందు షరీఫుద్దీన్ షరీక్
తరువాత ఖాళీ
నియోజకవర్గం లాంగటే

వ్యక్తిగత వివరాలు

జననం (1967-08-19) 1967 ఆగస్టు 19 (వయసు 57)
మావార్, లాంగటే
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ స్వతంత్ర
సంతానం అబ్రర్ రషీద్, అస్రార్ రషీద్
పూర్వ విద్యార్థి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సోపూర్

షేక్ అబ్దుల్ రషీద్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

రషీద్ 2008లో ఇంజనీరింగ్ వృత్తి నుండి రాజకీయాలలోకి వచ్చి 2008 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా లాంగేట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పీడీపీ అభ్యర్థి మహ్మద్ సుల్తాన్ పండిత్‌పోరిపై 210 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా లాంగేట్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పీడీపీ పార్టీఅభ్యర్థి గులాం నబీ గనైపై 2505 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రషీద్ జమ్మూ కాశ్మీర్ అవామీ ఇత్తెహాద్ పార్టీని స్థాపించాడు. ఆయన టెర్రర్ ఫండింగ్ కేసులో 2019లో అరెస్టై జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికలలో బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి తిరిగి 2024 లోక్‌సభ ఎన్నికలలో బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేకేఎన్‌సీ అభ్యర్థి ఒమర్ అబ్దుల్లాను 204142 ఓట్ల మెజారిటీతో ఓడించి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. BBC News తెలుగు (11 June 2024). "లోక్‌సభ ఎలక్షన్స్ 2024: బీజేపీ, కాంగ్రెస్‌లను తట్టుకుని నిలబడ్డ ఆ ఏడుగురు ఇండిపెండెంట్‌ ఎంపీలు ఎవరు?". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  2. CNBCTV18 (5 June 2024). "Meet Engineer Rashid, the jailed leader who won J&K's Baramulla Lok Sabha seat - CNBC TV18". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Wire (16 June 2024). "'Referendum Against Oppression': Jailed MP Engineer Rashid on His Win from Baramulla". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Baramulla". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  5. The Indian Express (5 June 2024). "'Tihar ka badla'… 'Vote se': Baramulla answers Engineer Rashid's call". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  6. The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.