Jump to content

ఇంజమామ్-ఉల్-హక్ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా

వికీపీడియా నుండి
A beard man wearing a green cricket cap and a white shirt with a bag on his back.
ఇంజమామ్-ఉల్-హక్ - 2014 వరకు పాకిస్థాన్ తరపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు అతనిదే [1]

ఇంజమామ్-ఉల్-హక్ విశ్రాంత పాకిస్థాన్ క్రికెటరు, పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. [2] అతను తన అంతర్జాతీయ కెరీర్‌లో టెస్ట్ మ్యాచ్‌లలో 25, వన్ డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌లలో 10 సెంచరీలు చేశాడు. [3] [4] ఇంజమామ్ పాకిస్థాన్ తరఫున 120 టెస్టు మ్యాచ్‌లు ఆడి 8,820 పరుగులు చేశాడు. అతను యూనిస్ ఖాన్, జావేద్ మియాందాద్ తర్వాత, టెస్ట్ క్రికెట్‌లో పాకిస్తాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన మూడవ ఆటగాడు. BBC అతనిని "క్రికెట్‌లో అత్యంత గుర్తించదగిన వ్యక్తులలో ఒకడు" అనీ, "ప్రస్తుత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు" అనీ వర్ణించింది, [5] "బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్ వలె ప్రతిభావంతుడు" అని మాజీ పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు.[6]

జూన్ 1992లో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌పై ఇంజమామ్ టెస్టుల్లోకి అడుగుపెట్టాడు.[7] ఒక సంవత్సరం తర్వాత వెస్టిండీస్‌తో ఆంటిగ్వా రిక్రియేషన్ గ్రౌండ్, సెయింట్ జాన్స్, ఆంటిగ్వాలో అతని మొదటి టెస్టు సెంచరీ చేసాడు. [8] 2002 మేలో లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై అతని స్కోరు 329, టెస్టు క్రికెట్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ చేసిన రెండవ అత్యధిక స్కోరు, మొత్తం మీద పదిహేనవ అత్యధిక స్కోరు. [9] [10] అతను తన 100వ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించి, అలా చేసిన ఐదవ ఆటగాడిగా నిలిచాడు. [11][note 1] ఇంజమామ్ 2005-06లో ఇంగ్లండ్ పాకిస్తాన్‌లో పర్యటించినపుడు రెండవ టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీ చేసి, మియాందాద్ రికార్డును బద్దలు కొట్టి 24 సెంచరీలతో పాకిస్తాన్ ప్రముఖ సెంచరీ మేకర్ అయ్యాడు. [12][note 2] 2006 జనవరిలో స్వదేశంలో జరిగిన రెండో టెస్టులో భారత్‌పై చేసిన 119 పరుగులతో, టెస్టు క్రికెట్‌లో 25 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన పదవ ఆటగాడిగా నిలిచాడు. [13] ఇంజమామ్ 18 క్రికెట్ గ్రౌండ్స్‌లో టెస్టు సెంచరీలు సాధించాడు, అందులో 13 పాకిస్తాన్ వెలుపలివి.[14] [15] 2019 జనవరి నాటికి అతను టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో ( విరాట్ కోహ్లితో కలిసి) ఉమ్మడిగా ఇరవయ్యోవాడు.[1]


నవంబరు 1991లో గడ్డాఫీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో రంగప్రవేశం చేసిన ఇంజమామ్, ఒక సంవత్సరం తర్వాత ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకపై తన మొదటి వన్‌డే సెంచరీ సాధించాడు. [16] వన్‌డే మ్యాచ్‌లలో, ఇంజమామ్ 378 మ్యాచ్‌ల నుండి 11,739 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌ల ఆల్-టైమ్ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు, [17] అయితే అతను ఆ జాబితాలోని టాప్ టెన్ ఆటగాళ్లలో అతి తక్కువ సెంచరీల సంఖ్య అతనిదే. [17] 1994లో షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో న్యూజిలాండ్‌పై అతని అత్యధిక వన్‌డే స్కోరు 137 నాటౌట్. [4] [18] రెండు జట్ల మధ్య 2006 సిరీస్ సందర్భంగా బ్రిస్టల్‌లోని కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంజమామ్ తన ఏకైక ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆడాడు. అతను ఫార్మాట్‌లో ఎప్పుడూ సెంచరీ చేయలేదు. [19] 2019 జనవరి నాటికి అతను అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో ఉమ్మడిగా ఇరవై-ఐదవ స్థానంలో ఉన్నాడు. [20][note 3]

సూచిక

[మార్చు]
చిహ్నం అర్థం
* నాటౌట్‌గా మిగిలాడు
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌
బంతులు ఎదుర్కొన్న బంతులు
స్థా బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థానం
ఇన్నిం మ్యాచ్ యొక్క ఇన్నింగ్స్
టెస్టు ఆ సీరీస్‌లో టెస్టు సంఖ్య
S/R ఇన్నింగ్స్ సమయంలో స్ట్రైక్ రేట్
H/A/N స్వదేశంలో, విదేశంలో, తటస్థం
తేదీ మ్యాచ్ ప్రారంభ రోజు
ఓడింది ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది
గెలిచింది ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించింది
డ్రా మ్యాచ్ డ్రా అయింది
టై టై అయింది

టెస్టు సెంచరీలు

[మార్చు]
టెస్టు శతకాల జాబితా
సం. స్కోరు బంతులు ప్రత్యర్థి స్థా ఇన్నిం స్ట్రైరే వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 123 225  వెస్ట్ ఇండీస్ 6 2 54.66 ఆంటిగ్వా రిక్రియేషన్ గ్రౌండ్, సెయింట్ జాన్స్, ఆంటిగ్వా విదేశం 1993 మే 1 డ్రా అయింది [8]
2 135* 195  న్యూజీలాండ్ 6 2 69.23 బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ విదేశం 1994 ఫిబ్రవరి 17 గెలిచింది [21]
3 100* 125  శ్రీలంక 7 2 80.00 అస్గిరియా స్టేడియం, క్యాండీ విదేశం 1994 ఆగస్టు 26 గెలిచింది [22]
4 101 168  జింబాబ్వే 6 1 60.11 హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే విదేశం 1995 ఫిబ్రవరి 15 గెలిచింది [23]
5 148 218  ఇంగ్లాండు 4 1 67.88 లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్ విదేశం 1996 జూలై 25 గెలిచింది [24]
6 177 320  వెస్ట్ ఇండీస్ 4 2 55.31 రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి స్వదేశం 1997 నవంబరు 29 గెలిచింది [25]
7 200* 397  శ్రీలంక 4 2 50.37 బంగబంధు నేషనల్ స్టేడియం, ఢాకా తటస్థ 1999 మార్చి 12 గెలిచింది [26]
8 118 191  ఆస్ట్రేలియా 5 3 61.78 బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ విదేశం 1999 నవంబరు 18 ఓడింది [27]
9 138 243  శ్రీలంక 4 3 56.79 నేషనల్ స్టేడియం, కరాచీ స్వదేశం 2000 మార్చి 12 గెలిచింది [28]
10 135 254  వెస్ట్ ఇండీస్ 4 1 53.14 బౌర్డా, జార్జ్‌టౌన్, గయానా విదేశం 2000 మే 5 డ్రా అయింది [29]
11 112 163  శ్రీలంక 5 2 68.71 గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే విదేశం 2000 జూన్ 21 గెలిచింది [30]
12 142 257  ఇంగ్లాండు 4 1 55.25 నేషనల్ స్టేడియం, కరాచీ స్వదేశం 2000 డిసెంబరు 7 ఓడింది [31]
13 130 241  న్యూజీలాండ్ 4 2 53.94 జేడ్ స్టేడియం, క్రైస్ట్‌చర్చ్ విదేశం 2001 మార్చి 15 డ్రా అయింది [32]
14 114 153  ఇంగ్లాండు 4 1 74.50 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ విదేశం 2001 మే 31 గెలిచింది [33]
15 105* 163  బంగ్లాదేశ్ 4 2 64.41 ముల్తాన్ క్రికెట్ స్టేడియం, ముల్తాన్ స్వదేశం 2001 ఆగస్టు 29 గెలిచింది [34]
16 329 436  న్యూజీలాండ్ 4 1 75.45 గడ్డాఫీ స్టేడియం, లాహోర్ స్వదేశం 2002 మే 1 గెలిచింది [9]
17 112 109  జింబాబ్వే 4 3 104.67 హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే విదేశం 2002 నవంబరు 9 గెలిచింది [35]
18 138* 232  బంగ్లాదేశ్ 4 4 59.48 ముల్తాన్ క్రికెట్ స్టేడియం, ముల్తాన్ స్వదేశం 2003 సెప్టెంబరు 3 గెలిచింది [36]
19 118 243  భారతదేశం 4 2 48.55 గడ్డాఫీ స్టేడియం, లాహోర్ స్వదేశం 2004 ఏప్రిల్ 5 గెలిచింది [37]
20 117 244  శ్రీలంక 4 2 47.95 నేషనల్ స్టేడియం, కరాచీ స్వదేశం 2004 అక్టోబరు 28 గెలిచింది [38]
21 184 264  భారతదేశం 4 1 69.69 M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు విదేశం 2005 మార్చి 24 గెలిచింది [39]
22 117* 194  వెస్ట్ ఇండీస్ 5 3 60.30 సబీనా పార్క్, కింగ్స్టన్, జమైకా విదేశం 2005 జూన్ 3 గెలిచింది [40]
23 109 † ‡ 200  ఇంగ్లాండు 5 1 54.50 ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్ స్వదేశం 2005 నవంబరు 20 డ్రా అయింది [12]
24 100* † ‡ 134  ఇంగ్లాండు 5 3 74.62 ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్ స్వదేశం 2005 నవంబరు 20 డ్రా అయింది [12]
25 119 193  భారతదేశం 5 1 61.65 ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్ స్వదేశం 2006 జనవరి 21 డ్రా అయింది [13]

వన్డే సెంచరీలు

[మార్చు]
వన్‌డే శతకాల జాబితా
సం. స్కోరు బంతులు ప్రత్యర్థి స్థా ఇన్నిం స్ట్రైరే వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 101 121  శ్రీలంక 2 1 83.47 ముల్తాన్ క్రికెట్ స్టేడియం, ముల్తాన్ స్వదేశం 1992 జనవరి 17 ఓడింది [16]
2 117 103  శ్రీలంక 2 1 113.59 రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి స్వదేశం 1992 జనవరి 19 గెలిచింది [41]
3 137* 129  న్యూజీలాండ్ 3 1 106.20 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1994 ఏప్రిల్ 20 గెలిచింది [18]
4 116* 138  జింబాబ్వే 3 2 84.05 హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే విదేశం 1995 ఫిబ్రవరి 25 గెలిచింది [42]
5 116* 110  శ్రీలంక 4 2 105.45 కింబర్లీ కంట్రీ క్లబ్, కింబర్లీ తటస్థ 1998 ఏప్రిల్ 7 గెలిచింది [43]
6 107 115  భారతదేశం 4 1 93.04 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1999 ఏప్రిల్ 8 గెలిచింది [44]
7 121* 113  భారతదేశం 4 1 107.07 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 2000 మార్చి 26 గెలిచింది [45]
8 118* 124  శ్రీలంక 4 2 95.16 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 2001 నవంబరు 2 గెలిచింది [46]
9 122 † ‡ 102  భారతదేశం 4 2 119.60 నేషనల్ స్టేడియం, కరాచీ స్వదేశం 2004 మార్చి 13 ఓడింది [47]
10 123 † ‡ 121  భారతదేశం 4 1 101.65 గడ్డాఫీ స్టేడియం, లాహోర్ స్వదేశం 2004 మార్చి 21 ఓడింది [48]

గమనికలు

[మార్చు]
  1. The four previous players to achieve this feat were Colin Cowdrey, Miandad, Gordon Greenidge and Alec Stewart. This feat was also achieved later by Ricky Ponting and Graeme Smith.[11]
  2. Inzamam became one of the fifth Pakistani after Hanif Mohammad, Miandad, Wajahatullah Wasti and Yasir Hameed to score centuries in both innings of a Test match. This feat was also achieved later by two more Pakistanis, Mohammad Yousuf and Younus Khan.[12]
  3. Inzamam shares the position with Sunil Gavaskar, Viv Richards, Desmond Haynes, Steve Waugh, Herschelle Gibbs and David Warner.[20]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Records – Test matches – Batting records – Most hundreds in a career". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  2. "Inzamam-ul-Haq". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  3. "Inzamam-ul-Haq Test centuries". ESPNcricinfo. Archived from the original on 23 September 2012. Retrieved 18 June 2012.
  4. 4.0 4.1 "Inzamam-ul-Haq One Day International centuries". ESPNcricinfo. Archived from the original on 19 January 2013. Retrieved 18 June 2012.
  5. "Pakistan profiles: Inzamam-ul-Haq". BBC Sport. 14 October 2005. Retrieved 5 July 2012.
  6. Hashmi, Shahid (3 November 2005). "Funny man Inzamam". BBC Sport. Retrieved 5 July 2012.
  7. "Inzamam-ul-Haq Test centuries". ESPNcricinfo. Retrieved 11 June 2012.
  8. 8.0 8.1 "West Indies v Pakistan at St John's – 3rd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  9. 9.0 9.1 "Pakistan v New Zealand at Lahore – 1st Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  10. "Records – Test matches – Batting records – Most runs in an innings". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  11. 11.0 11.1 "Records – Test matches – Batting records – Hundred in hundredth match". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  12. 12.0 12.1 12.2 12.3 "England in Pakistan Test Series – 2nd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  13. 13.0 13.1 "India in Pakistan Test Series – 2nd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  14. "Inzamam-ul-Haq – Centuries at home venues". ESPNcricinfo. Archived from the original on 31 October 2013. Retrieved 12 June 2012.
  15. "Inzamam-ul-Haq – Centuries at venues outside Pakistan". ESPNcricinfo. Archived from the original on 31 October 2013. Retrieved 12 June 2012.
  16. 16.0 16.1 "Sri Lanka in Pakistan ODI Series – 4th ODI". ESPNcricinfo. Retrieved 19 June 2012.
  17. 17.0 17.1 "Records – One-Day Internationals – Batting records – Most runs in career". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  18. 18.0 18.1 "Pepsi Austral-Asia Cup – 2nd semi final". ESPNcricinfo. Retrieved 19 June 2012.
  19. "Pakistan in England T20I Match". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  20. 20.0 20.1 "Records – Combined Test, ODI and T20I records – Batting records – Most hundreds in career". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  21. "New Zealand v Pakistan at Wellington – 2nd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  22. "Sri Lanka v Pakistan at Kandy – 3rd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  23. "Zimbabwe v Pakistan at Harare – 3rd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  24. "England v Pakistan at Lord's – 1st Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  25. "Pakistan v West Indies at Rawalpindi – 2nd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  26. "Final: Pakistan v Sri Lanka at Dhaka – Asian Test Championship". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  27. "Australia v Pakistan at Hobart – 2nd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  28. "Pakistan v Sri Lanka at Karachi – 3rd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  29. "West Indies v Pakistan at Georgetown – 1st Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  30. "Sri Lanka v Pakistan at Galle – 2nd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  31. "Pakistan v England at Karachi – 3rd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  32. "New Zealand v Pakistan at Christchurch – 2nd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  33. "England v Pakistan at Manchester – 2nd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  34. "Pakistan v Bangladesh at Multan – 1st Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  35. "Pakistan in Zimbabwe Test Series – 1st Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  36. "Bangladesh in Pakistan Test Series – 3rd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  37. "India in Pakistan Test Series – 2nd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  38. "Sri Lanka in Pakistan Test Series – 2nd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  39. "Pakistan in India Test Series – 3rd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  40. "Pakistan in West Indies Test Series – 2nd Test". ESPNcricinfo. Retrieved 18 June 2012.
  41. "Sri Lanka in Pakistan ODI Series – 5th ODI". ESPNcricinfo. Retrieved 19 June 2012.
  42. "Pakistan in Zimbabwe ODI Series – 2nd ODI". ESPNcricinfo. Retrieved 19 June 2012.
  43. "Standard Bank International One-Day Series – 3rd match". ESPNcricinfo. Retrieved 19 June 2012.
  44. "Coca-Cola Cup – 2nd match". ESPNcricinfo. Retrieved 19 June 2012.
  45. "Coca-Cola Cup – 4th match". ESPNcricinfo. Retrieved 19 June 2012.
  46. "Khaleej Times Trophy – 6th match". ESPNcricinfo. Retrieved 19 June 2012.
  47. "India in Pakistan ODI Series – 1st ODI". ESPNcricinfo. Retrieved 19 June 2012.
  48. "India in Pakistan ODI Series – 4th ODI". ESPNcricinfo. Retrieved 19 June 2012.