ఇంటర్నెట్‌లోని భాషలు
వరల్డ్ వైడ్ వెబ్ లో ప్రజలు అత్యధికంగా సందర్శించే వెబ్ సైట్లలో హోమ్ పేజీల్లో సగానికి పైగా ఇంగ్లీష్ భాషలో ఉన్నాయి, ఇతర భాషల్లో భాషలలో పరిశీలిస్తే రష్యన్, స్పానిష్, టర్కిష్, పర్షియన్, ఫ్రెంచ్, జర్మన్,జపనీస్ వంటివి ఉన్నాయి.[1] ఇప్పటికే ఉన్న 7,000 కు పైగా భాషలలో, వరల్డ్ వైడ్ వెబ్ లో వెబ్ పేజీల కోసం కొన్ని వందల సంఖ్యలో మాత్రమే ఉపయోగంలో ఉన్నట్లు గుర్తించబడ్డాయి.[2]
పరిచయం
[మార్చు]ఆంగ్ల భాష అంతర్జాలం (ఆన్ లైన్) లో అత్యంత సాధారణంగా ఉపయోగించే భాష, దీనిని 60.4% లేదా మొదటి 10 మిలియన్ వెబ్ సైట్ లలో సుమారు ఆరు మిలియన్లు మంది వాడుతున్నారు.ఆంగ్ల భాషకు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 1.13 బిలియన్ లకు పైగా మాట్లాడేవారు ఉన్నారు. దీనికి భిన్న౦గా, చైనీస్ ప్రప౦చ జనాభాలో 14.3% మ౦ది ఉంటే ,1.11 బిలియన్ల కన్నా ఎక్కువ మ౦ది మాట్లాడతారు, అయితే మొదట 10 మిలియన్ వెబ్ సైట్లలో 1.4% మాత్రమే ఉపయోగిస్తున్నారు. రష్యన్ భాషా కమ్యూనిటీ అయిన రూనెట్ ఇంటర్నెట్లో ఎక్కువమొత్తంలో ఆన్ లైన్ వాడకం కారణంగా రష్యన్ ర్యాంకింగ్ లో రెండవ స్థానాన్ని పొందింది. ఇంకా, ఇది గతంలో సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న బహుళ దేశాల అధికారిక భాష.[3]
వాడుకదారులు
[మార్చు]వినియోగదారుడు సైట్‌ని ఒకటి కంటే ఎక్కువ భాషల్లో వాడకం (యాక్సెస్) వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి విషయమును సులభతరం చేయడానికి, వెబ్‌సైట్‌లను అనువదించడానికి ఉపయోగించే భాషా అనువాద సాధనాలు ఉన్నాయి, వాటిని ఇంటర్నెట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్‌లో ఉపయోగించే భాషల, స్టాటిస్టా గణాంకాల వివరాలు 31-3-3020 వరకు ఉండే అగ్ర భాషలు పట్టికలో చూడవచ్చును.[4]
ర్యాంక్ | భాష | ఇంటర్నెట్ వాడుక దారుల సంఖ్య | శాతం |
---|---|---|---|
1 | ఆంగ్లం | 1,186,451,052 | 25.9% |
2 | చైనీస్ | 888,453,068 | 19.4% |
3 | స్పానిష్ | 363,684,593 | 7.9% |
4 | అరబిక్ | 237,418,349 | 5.2% |
5 | ఇండోనేషియన్/ / మలేషియన్ | 198,029,815 | 4.3% |
6 | పోర్చుగీస్ | 171,750,818 | 3.7% |
7 | ఫ్రెంచ్ | 151,733,611 | 3.3% |
8 | జపనీస్ | 118,626,672 | 2.6% |
9 | రష్యన్ | 116,353,942 | 2.5% |
10 | జర్మన్ | 92,525,427 | 2.0% |
11 | మొదటి పది భాషలు | 3,525,027,347 | 76.9% |
12 | ఇతరులు | 1,060,551,371 | 23.1% |
మొత్తం | 4,585,578,718 | 100% |
వికీమీడియా గణాంకాలు - భాషలలో వికీపీడియా ను సందర్శించిన వారిని పట్టికలో చూడవచ్చును.[5]
ర్యాంక్ | భాష | ప్రతిరోజు వికీపీడియా చేసినవారి సంఖ్య |
---|---|---|
1 | ఆంగ్లం | 257,705,129 |
2 | జపనీస్ | 37,286,466 |
3 | స్పానిష్ | 37,018,505 |
4 | జర్మన్ | 30,844,175 |
5 | రష్యన్ | 26,358,126 |
6 | ఫ్రెంచ్ | 24,392,611 |
7 | ఇటాలియన్ | 18,622,198 |
8 | చైనీస్ | 13,371,571 |
9 | పోర్చుగీస్ | 11,506,680 |
10 | పోలిష్ | 8,810,420 |
11 | అరబిక్ | 7,333,102 |
12 | పర్షియన్ | 5,672,829 |
13 | ఇండోనేషియన్ | 5,385,401 |
14 | డచ్ | 4,935,611 |
15 | టర్కిష్ | 3,382,454 |
ఇవి కూడ చూడండి
[మార్చు]- Global digital population as of January 2021- https://www.statista.com/statistics/617136/digital-population-worldwide
- Top Strategic Technology Trends for 2022- https://www.gartner.com/en/information-technology/insights/top-technology-trends
- Number of internet users in China from December 2008 to June 2021- https://www.statista.com/statistics/265140/number-of-internet-users-in-china/
- Most popular websites worldwide as of June 2021- https://www.statista.com/statistics/1201880/most-visited-websites-worldwide/
- By 2025, rural India will likely have more internet users than urban India- https://theprint.in/tech/by-2025-rural-india-will-likely-have-more-internet-users-than-urban-india/671024/
మూలాలు
[మార్చు]- ↑ "Usage Statistics and Market Share of Content Languages for Websites, February 2022". w3techs.com. Retrieved 2022-02-21.
- ↑ "Usage Statistics and Market Share of Content Languages for Websites, February 2022". w3techs.com. Retrieved 2022-02-21.
- ↑ Bhutada, Govind (2021-03-26). "Visualizing the Most Used Languages on the Internet". Visual Capitalist (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-02-21.
- ↑ "Top Ten Internet Languages in The World - Internet Statistics". www.internetworldstats.com. Archived from the original on 2019-09-07. Retrieved 2022-02-21.
- ↑ "List of Wikipedias/Table2 - Meta". meta.wikimedia.org (in ఇంగ్లీష్). Retrieved 2022-02-21.